new salaries
-
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త వేతనాల చెల్లింపు మొదలైంది. 2017 నాటి వేతన సవరణకు సంబంధించి గత మార్చిలో ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటించటంతో, ఆ మేరకు కొత్త వేతనాలను జూన్ 1న చెల్లించారు. మే నెలకు సంబంధించి వేతనాలు తాజాగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నమోదయ్యాయి. 21 శాతం ఫిట్మెంట్ ప్రకారం కొత్త వేతనాలు అందుకోవటంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగుల్లో సంబరాలు నెలకొన్నాయి. ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపుతో.. 2017లో వేతన సవరణ జరగాల్సి ఉండగా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవటంతో ప్రభుత్వం ఫిట్‌మెంట్‌ను ప్రకటించలేదు. దీంతో కార్మిక సంఘాలు అప్పట్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. వాటితో చర్చించేందుకు నాటి ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. వేతన సవరణ చేయకుంటే సమ్మెను ఆపబోమని కారి్మక సంఘాలు తేల్చి చెప్పటంతో, మధ్యే మార్గంగా 16 శాతం ఇంటీరియమ్ రిలీఫ్‌కు కమిటీ ప్రతిపాదించింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఫిట్మెంట్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. దీనికి కార్మిక సంఘాలు సమ్మతించి సమ్మెను విరమించాయి. అప్పటినుంచి ఐఆరే కొనసాగుతూ వచ్చింది. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి మార్చిలో 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఇక అప్పటివరకు ఉన్న 82.6 శాతం కరువు భత్యంలోంచి, 2017 వేతన సవరణ గడువు నాటికి ఉన్న 31.1 శాతాన్ని ఉద్యోగుల మూలవేతనంలో చేర్చారు. మిగిలిన కరువు భత్యాన్ని 43.2 శాతానికి న్యూట్రలైజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ఆర్టీసీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను తగ్గించారు. మొత్తంగా కాస్త సంతృప్తికరంగానే ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. ఏడేళ్ల క్రితం నాటి వేతన పెంపు అమలులోకి రావటంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు మాత్రం ఉద్యోగ విరమణ సమయంలో చెల్లిస్తామనటంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ. 360 కోట్ల భారం ఈ వేతన సవరణతో ఆరీ్టసీపై సాలీనా రూ.360 కోట్ల భారం పడనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవటంతో, రోజువారీ ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు సంస్థ ప్రత్యేక కసరత్తు నిర్వహిస్తోంది. ఇది కొంతవరకు సత్ఫలితాలనిస్తోంది. -
ఆర్టీసీ కార్మికులకు భద్రత ఏది?: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేకుండా పోయిందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. ఎన్నికలలో గెలిచిన యూ నియన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తుండటంతో కార్మికుల ప్రయోజనాలకు రక్షణ లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆర్టీసీకి చెందిన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మల్లు రవి మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త వేతన సవరణ ప్రకటన ఇంతవరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీ సీని గట్టెక్కించేందుకు రూ.670 కోట్లు ఇస్తామని చెప్పి రూ.260 కోట్లే విడుదల చేశారన్నారు. ఏఐటీయూసీ నేత అబ్రహం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు అడగకుండానే జీతాలు పెంచుతామని సీఎం చెప్పారని, కానీ ఇంతవరకు అమలు కాలేదని, సకల జనుల సమ్మెకు సంబంధించి వేతనంతో కూడిన సెలవుల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు: నగేశ్ కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రకటన తర్వాత టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఈ యాత్రలో టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, బస్సు యాత్ర తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నగేశ్ వ్యాఖ్యానించారు. -
ఆగస్టులోనే కొత్త జీతాలు!
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఏడో వేతన కమిషన్ సూచనల ప్రకారం కేంద్రం ఆమోదించిన జీతాలు ఆగస్టు నుంచే అందుతాయి. ఈ మేరకు నోటిఫికేషన్‌ను ఈ వారాంతంలోపు విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ వస్తే.. 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లకు ఆగస్టు నుంచే కొత్త జీతాలు, పింఛన్లు అందుతాయి. ఏకే మాథుర్ అధ్యక్షతన నియమించిన ఏడో వేతన సంఘం సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం జూన్ 29న ఆమోదించిన విషయం తెలిసిందే. సాధారణంగా కేబినెట్ ఆమోదించిన తర్వాత 15-20 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆరోవేతన సంఘం విషయంలో కేబినెట్ ఆమోదించిన 16 రోజుల తర్వాత దాని అమలుకు నోటిఫికేషన్ విడుదలైంది. జీతాలు, అలవెన్సులు, పింఛన్లలో 23.55 శాతం పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది. దీంతో కేంద్ర ఖజానా మీద రూ. 1.02 లక్షల కోట్ల భారం పడుతుంది. ఇది మొత్తం జీడీపీలో 0.7 శాతానికి సమానం. వేతన సంఘం సూచనల ప్రకారం కనీస వేతనం రూ. 7వేల నుంచి రూ. 18 వేలకు పెరుగుతుంది. కేబినెట్ కార్యదర్శి స్థాయి అధికారులకు ప్రస్తుతం గరిష్ఠంగా రూ. 90 వేలు వస్తుండగా, దాన్ని రూ. 2.5 లక్షలకు పెంచారు. వార్షిక ఇంక్రిమెంటు రేటును మాత్రం యథాతథంగా 3 శాతం వద్ద ఉంచారు. -
ఉన్నతాధికారులకు కొత్త జీతాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఎనిమిది రోజులు సమ్మె చేసి 43 శాతం ఫిట్మెంట్ సాధించుకుంటే, ఆర్టీసీ అధికారుల అసోసియేషన్ కూడా అదే స్థాయిలో ఫిట్మెంట్ కలుపుకుని యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది. ఉన్నతాధికారులకు పెరగనున్న జీతాలు చూస్తే.. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లకు (ఈడీలు) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే అధిక జీతం లభించనుంది. రీజనల్ మేనేజర్లకు ఐఏఎస్, ఐపీఎస్‌ల కంటే జీతాలెక్కువ ఉండటం గమనార్హం. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున జీతాలు పెంచే పరిస్థితి లేదని నివేదికలిచ్చిన ఉన్నతాధికారులు ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఫిట్మెంట్ కలుపుకుని కొత్త వేతనాలు ఆమోదించుకోవడం ఎంతవరకు సబబని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కార్మికుల జీతాల పెంపు పట్టించుకోని ఉన్నతాధికారులు గ్రేడ్ పే, అలవెన్సులు కూడా వంద శాతం పెంచుకుంటున్నారని పలు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఆర్టీసీలో ఈడీలు, విభాగాధిపతులు (హెచ్ఓడీలు), డిప్యూటీ సీటీఎం, సీఎంఈ, సీఏవో, వర్క్ మేనేజర్లు, ఏవోలు, ఈఈలు, డిపో మేనేజర్లు, ఆర్టీసీ డాక్టర్లకు మొత్తం 675 మందికి జీతాలు పెరగనున్నాయి. ఈడీల కొత్త మూలవేతనం (బేసిక్ పే) రూ. 1.31 లక్షలు అవుతుందని, రూ. 95 వేలు మినిమమ్ బేసిక్ పేగా పెట్టి, మిగిలిన రూ. 35 వేలు కొత్త గ్రేడ్ పేగా పెట్టుకున్నారు. ఆర్టీసీ ఎండీ కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న ఈడీలు కూడా సంస్థలో ఉన్నారు. -
కొత్త వేతనాలు ఇంకా కలేనా..?
సాఫ్ట్వేర్ సమస్యతో మంజూరు కాని పరిస్థితి 1,320 మంది ఉపాధ్యాయులకు సమస్య మంచిర్యాల సిటీ : పదో వేతన సవరణ ద్వారా మే నెలకు సంబంధించిన కొత్త వేతనం తీసుకుంటామని ఆశ పడిన 2001 డీఎస్సీ ఉపాధ్యాయులకు నిరాశే మిగిలింది. సాఫ్ట్వేర్ సమస్య కారణంతో నూతన వేతనాలు మంజూరు కావడం లేదు. సుమారు 1,320 మంది జిల్లాలోని ఉపాధ్యాయులకు ఈ సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో 220 తెలుగు భాషా పండిత ఉపాధ్యాయులతో పాటు 1100 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు కొత్త వేతనాలకు నోచుకోవడం లేదు. కొత్త వేతనాలు మంజూరు కు నోచుకోని ఉపాధ్యాయులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వీరంతా తాము పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుల చుట్టూ తిరిగినా ఫలితం కానరావడంలేదు. సమస్య పరిష్కారం రాష్ట్రస్థాయిలోనే జరగాలి. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం ప్రధాన కారణం కావడంతో అక్కడే సరిదిద్దాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లా ఖజానా శాఖకు ప్రధానోపాధ్యాయులు సమస్యను తీసుకెళ్లడంతో పది రోజుల కిందటే రాష్ట్ర ఖజానా అధికారులకు విషయాన్ని చేరవేసినా ఫలితం లేదు. అసలేం జరిగింది! 2001 డీఎస్సీ ద్వారా అదే సంవత్సరం అక్టోబర్17న ఎస్జీటీగా 1100 మంది ఉపాధ్యాయులు నియామకమయ్యూరు. భాషా పండిత నియామకంలో కొందరు కోర్టుకు వెళ్లడంతో అదే డీఎస్సీ ద్వారా 220 తెలుగు భాషా పండితులు గ్రేడ్-2 వారు ఆలస్యంగా 2002 ఏప్రిల్ 3న ఆరునెలలు ఆలస్యంగా నియామకమయ్యూరు. ఆరు నెలలు ఆలస్యంగా నియామకం కావడంలో తమ తప్పేమీ లేదు కాబట్టి తమకు కూడా ఎస్జీటీలతో సమానంగా అక్టోబర్‌లోనే ఇంక్రిమెంటు ఇవ్వాలని పండిత ఉపాధ్యాయులు 2002లోనే ఇంక్రిమెంటు తీసుకున్నారు. ఇదిలా ఉండగా పదోన్నతికి సంబంధించిన 12 ఏళ్ల ఇంక్రిమెంటును 2014 ఏప్రిల్ 3న భాషా పండితులకు మంజూరైంది. 12 ఏళ్ల పదోన్నతి ఇంక్రిమెంటుకు, మొదట పొందిన ఇంక్రిమెంటుకు ఆన్లైన్లో తేడాలు ఏర్పడ్డాయి. అక్టోబర్‌లోనే ఇంక్రిమెంటు తీసుకున్నారని ఆన్లైన్లో నమోదైంది. కొత్త పీఆర్సీ వేతన స్థిరీకరణ ప్రకారం ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో 12 ఏళ్ల ఇంక్రిమెంటు పొందిన ఏప్రిల్ 3ను సూచించ డం లేదు. అక్టోబర్‌లో తీసుకున్న ఇంక్రిమెంటును తెలుపుతోంది. దీంతో జిల్లాలోని 1320 ఉపాధ్యాయులకు కొత్త వేతనం మంజూరు కావడం లేదు. ఏం చేయాలి : కొత్త వేతనం మంజూరు కావాలంటే రాష్ట్ర ఖజానా శాఖ అధికారులు సాప్ట్వేర్ వెబ్‌సైట్‌ను సవరించాలి. దీనికి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం కావాలి. దీంతోపాటు వేతన స్థిరీకరణ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన అధికారులు స్పందించాలి. లేదంటే ఉపాధ్యాయులు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పొం దిన ఇంక్రిమెంటును రాష్ట్ర ఖజానాకు చెల్లించాలి. అప్పటి వరకు కొత్త వేతనం రాదు. పాత వేతనంతోనే తృప్తి పడాల్సి ఉంటుంది. సమస్యను జిల్లా ఖజానా దృష్టికి ఉపాధ్యాయ సంఘాలు తీసుకెళ్లడంతో వారు రాష్ట్ర ఖజానా అధికారులకు వివరించారు. అయినా సమస్య నేటికీ పరిష్కారం కావడం లేదు. వేతనం : కొత్త పీఆర్సీ ప్రకారం మార్చి నుంచి ఏప్రిల్ వరకు ప్రతీ ఉపాధ్యాయులు మూడు నెలల ఏరియర్స్ సాంకేతిక లోపం వలన పొందలేకపోతున్నారు. ప్రతీ నెల ఏరియర్స్ రూ.వె య్యి నుంచి రూ.1,200 వరకు వస్తుంది. ఏరియర్స్‌తో పాటు మే నెల కొత్త వేతనం కూడా రాకుండాపోయింది. 1320 మం ది ఉపాధ్యాయులు మే నెలలో పాతవేతనాన్ని తీసుకున్నారు. సమస్య పరిష్కరిస్తాం 2001 డీఎస్సీ ద్వారా నియామకమై కొత్త వేతనం మంజూరు కాని ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తాం. సమస్యను సంఘం రాష్ట్ర కమిటీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఖజానా అధికారులతో చర్చిస్తున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. - పర్వతి సత్యనారాయణ, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఈ ఆనందం అందరికీ పంచుదాం
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరు స్తోంది. పదో పీఆర్సీ సిఫారసుల అమలు కోసం పలు పోరాటాలు చేసిన తర్వాత, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అందిన ఆనందమిది. ప్రభుత్వ ఖజానాపై పడే ఈ భారాన్ని భర్తీ చేయడం కోసం వారి కుటుంబాలే కాక, ఇంకా రెండు కోట్ల కుటుంబాలు పన్నుల భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఆ బరువును మోస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు చేరే సామాన్యుల పనులను బాధ్యతతో, సంతోషంగా చేయడానికి కొత్త జీతాలు ప్రేరణ కాగలవని ఆశిద్దాం. బతుకుపోరు నిత్య సంఘర్షణలో మునిగి ఉండేవారు బాధైనైనా, సంతోషా న్నయినా తమకు తాము అనుభవించాల్సిందే తప్ప ఇతరులతో పంచుకునే తీరిక, తెగువ వారికి ఉండవు. కానీ, ఇతరులతో పంచుకుంటే బాధ తగ్గుతుం దని, సంతోషం రెట్టింపవుతుందనీ పెద్దల మాట. కొందరి బాధల్ని, మరి కొందరి సంతోషాల్ని చర్చకు పెట్టడం ద్వారా అటు బాధను తగ్గించి, ఇటు సంతోషాన్ని పెంచాలనే ఈ చిరు ప్రయత్నం. సందర్భం... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో వెల్లివిరుస్తున్న సంతోషం. మారుతున్న కాలమాన పరిస్థితులు, పెరిగిన జీవన వ్యయం, చట్టబద్ధంగా పెరగాల్సిన జీతభత్యాల లెక్కల ఆధారంగా వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చేసిన సిఫారసుల అమలుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన ఫలితమది. పదో పీఆర్సీ సిఫారసుల అమలు కోసం పలు ఉద్యమాలు, పోరా టాలు చేసిన తర్వాత, ఉద్యోగులు, వారి కుటుంబాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అంది వచ్చిన ఆనందమది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర ఉపశ మనంతో కలుపుకొని మూలవేతనాలు దాదాపు రెట్టింపవుతున్నాయి. ఇది అందరికీ సంతోషదాయకమే. ఎవరికీ ఈర్ష్యాసూయలు లేవు. ఏ అభ్యంత రాలూ లేవు. కాకపోతే, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, టీఎన్జీవో నేత దేవీప్రసాద్, ఏపీ ఉద్యోగుల సంఘ నాయకుడు అశోక్‌బాబు సహా చాలా మంది భావిసు ్తన్నట్టు... ఉద్యోగస్తులు ఇంకా బాగా పనిచేయాలి. సామాన్యపౌరుల అవస రాల్ని దృష్టిలో పెట్టుకొని తమ సేవల్ని విస్తరించాలి. సామాజిక సృహతో మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో విధు లను నిర్వహించాలి. ఉద్యోగస్తుల జీత, భత్యాలను చెల్లించే ప్రభుత్వ ఖజా నాకు పన్నుల రూపంలో పైసా పైసా జమచేస్తున్నది తెలుగు ప్రజలే. వారిలో సుమారు రెండు కోట్ల కుటుంబాలకు ఆ ఖజానాలు నేరుగా ఎలాంటి ఉపాధి భద్రతను కల్పించడం లేదు. నిజాయితీగా, ఆత్మపరిశీలనతో సేవలందించి వారి రుణం తీర్చు కోవాలి. అప్పుడే అందరి సంతోషం ద్విగుణీకృతం అవుతుంది. ఎవరు ఎవరికి భారం-భాగ్యం! 2011 జనాభా లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల జనాభా దాదాపు తొమ్మిది కోట్లు. అంటే సుమారు 2.10 కోట్ల కుటుంబాలు. వాటిలో ప్రభుత్వో ద్యోగుల కుటుంబాలు 8.5 లక్షలు. ప్రభుత్వోద్యోగులతోపాటూ, 5.5 లక్షల మంది పెన్షనర్ల పెన్షన్ కూడా పెరుగుతుంది. మరో 6 నుంచి 7 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వోద్యోగు లకు అమలు చేసే కనీస వేతనాన్ని వారికి కూడా అమలు చేయాలని పీఆర్సీ సూచించింది. కాబట్టి వారి జీతాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అంటే, ఈ పెంపుదల వర్తించే కుటుంబాల మొత్తం సంఖ్య సుమారు 20 లక్షలు. ఇవి పోను దాదాపు 2 కోట్ల కుటుంబాలు వ్యవస్థీకృతంగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు పొందనివి. వారిలో ప్రైవేటు ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, వృత్తి పనుల వారు, వివిధ సేవా కార్మికులు, రోజు కూలీ చేసుకునే అసం ఘటిత రంగ కుటుంబాలూ ఉంటాయి. జీతాల పెరుగుదలకు సంతోషిస్తున్న ఉద్యోగుల కుటుంబాలేకాక దాదాపు రెండు కోట్ల ఇతర కుటుంబాలు పీఆర్సీ వల్ల పడే అధిక పన్నుల భారాన్ని మోయాల్సి ఉంటుంది. మాడు పగిలే పన్నుల మోతను తట్టుకుని, బతుకు బండి లాక్కుంటూ బక్కచిక్కిన సామా న్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి అడిగిన పనిని బాధ్యతగానే గాక సంతోషంగా చేయడానికి కొత్త జీతాలు ప్రేరణ కాగలవని ఆశించడంలో తప్పులేదు. మన ఖజానా శేష, విశేష భాగాలివీ రెండు తెలుగు ప్రభుత్వాలు లక్ష కోట్ల రూపాయలకు తగ్గని వార్షిక బడ్జెట్లను రూపొందిస్తున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, అప్పుల ద్వారా ఈ బడ్జెట్లకు వనరుల్ని సమీకరిస్తారు. ప్రణాళికా పద్దుల కన్నా, ప్రణాళికేతర పద్దులకే పెద్ద పీట లభిస్తుంది. ఉదాహరణకు, గత ఏడా ది ఏపీ ప్రభుత్వం రూ. 26,673 కోట్లు ప్రణాళికా వ్యయంగా, రూ.85,151 కోట్లు ప్రణాళికేతర పద్దుగా చూపింది (మొత్తం వ్యయం రూ 1,11,823 కోట్లు). ప్రణాళికేతర వ్యయంలో దాదాపు మూడో వంతు (రూ. 30 వేల కోట్లు) ఉద్యోగుల జీతాలకు వెచ్చిస్తున్నారు. పీఆర్సీ అదనపు భారం తోడవు తుంది. ఇక భత్యాలు, ఇతర నిర్వహణ వ్యయాలు, ఉద్యోగులకిచ్చే పరోక్ష ప్రయోజనాలు, రాయితీలు వేరే! తెలంగాణ బడ్జెట్లో రూ 48,648 కోట్లు ప్రణాళికా పద్దుల కింద, రూ 51,989 కోట్లు ప్రణాళికేతర పద్దుల కింద (మొత్తం రూ 1,00,637 కోట్లు) చూపించారు. ప్రణాళికేతర వ్యయంలో మూడో వంతుకుపైగా (రూ.18,437 కోట్లు) ఉద్యోగుల జీతాలు. పీఆర్సీ పెరుగుదల అదనం. ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరగాల్సిందే. కానీ, వ్యవస్థీకృత ఉద్యోగ-ఉపాధి చట్రంలోకి రాని నిరుద్యోగులు, అల్పాదాయ, బడుగు, బలహీన వర్గాల పరిస్థితేంటి? వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరే దెలా? నిర్దాక్షిణ్యంగా వాటిని అణచివేస్తే, రాజకీయ, ఉద్యోగ, కార్పొరేట్ శక్తులు మాటల గారడీతో తొక్కిపెడితే.... ఎగదన్నే లావాలా విరుచుకు పడతాయి, నిన్నటి ఢిల్లీవాలాలా రాజకీయ సునామీలను సృష్టిస్తాయి. జీతాలు పెరిగితే అవినీతి తగ్గుతుందా? చేతినిండా జీతాలుంటే అవినీతికి పాల్పడరనే ఆలోచనా స్రవంతి ఒకటుంది. నిజంగా అలా జరుగుతుందా? అంటే, కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ తగ్గే ఆస్కారమైతే ఉంది. అది వ్యక్తుల నిజాయితీ, ప్రవృత్తి, ఆలోచనా సరళిని బట్టి ఉంటుంది. ప్రజా ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్నాం. ఇతరు లకు ఉన్నా, లేకున్నా మన నెల జీతం మనకు ఠంచనుగా వస్తోంది. కాబట్టి వారి పట్ల మనం బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలన్న స్పృహ ఉద్యోగుల్లో ఉంటే అవినీతి కచ్చితంగా తగ్గుతుంది. నిజాయితీగా ఉండాలనిఎవరికి వారు వ్యక్తిగతంగా దీక్ష పూనితే తప్ప ఈ జాడ్యం పోదు. ‘నేను లంచాలు తీసుకోను, నిబంధనలకి విరుద్ధంగా వెళ్లను, పలుకుబడికి, సంపదల ప్రలోభాలకు లొంగి ప్రాథమ్యాలను మార్చను’ అనే సంకల్పానికి ప్రతి ఉద్యోగి కట్టుబడితే అవినీతి తొలగిపోతుంది. రాజకీయ నేతల, సంప న్నుల, పలుకుబడి గలవారల ఫైళ్లు కదిలినట్టే, పనులు జరిగినట్టే.... సామా న్యుల ఫైళ్లు కదిలితే, పనులు జరిగితే వ్యవస్థ దానంతట అదే బాగుపడు తుంది. అంతరాలు తగ్గుతాయి. ప్రభుత్వంలోని ఒక శాఖ ఉద్యోగులు జీవితంలోని పలు అవసరాలకు ఇతర శాఖలపై ఆధారపడాల్సి వస్తుంది. అక్కడ అమలు కావాలనుకునే నీతి, నిజాయితీ, సుపరిపాలన తన శాఖలో, తన సీటులో కూడా అమలుకావాలని ఎవరికి వారు కోరుకుంటే అది చాలు. అతీంద్రియ శక్తులు అవసరం లేదు రెండు రాష్ట్రాల్లోనూ పల్లెల నుంచి పట్టణాలకు వలసపోతున్న మధ్య తరగతి కుటుంబాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఉపాధి వేట ఓ కారణమైతే, పిల్లల చదువుల కోసమే వెళ్తున్న కుటుంబాలు కోకొల్లలు. సర్కారు బడుల్లో నాణ్యమై న విద్య దొరకకపోవడమే దీనికి కారణం. కేజీ నుంచి పీజీ వరకు విద్య మీద రెండు రాష్ట్రాలు ఏటా దాదాపు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని సర్కారు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య అధికారికంగా 97 లక్షలు. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న వారు మరో 50 లక్షలని అంచనా. ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 10 వేలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న పిల్లలకు నాలుగు అక్షరాలు నేర్పి ప్రయోజకులను చేసే బాధ్యతను 3.5 లక్షల మంది ఉపాధ్యాయులు తీసుకోవాలి. వైద్య వ్యవస్థ స్థితి కూడా తెలుగు నేలంతటా కడు దయనీయంగా ఉంది. ఏటా అయిదారు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నా గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాలు, నగరాలు, చివరకు రాజధాను ల్లో కూడా పరిస్థితేమీ బాగోలేదు. ప్రజాసుపత్రులు మృత్యు కుహరాలుగా మారాయి. ప్రజారోగ్య వ్యవస్థలోనే కీలక మైన పీహెచ్‌సీల్లోనే సదుపాయాలు శూన్యం. అన్ని స్థాయిల వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తే తప్ప సగటు మనిషికి సాంత్వన చేకూరని స్థితి. ఇక సామాన్యుని రోజువారీ జీవితా న్ని శాసించే పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర విభాగాల సిబ్బంది మరింత మానవీయకోణంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. సిబ్బంది కొరత, సదు పాయాల లేమి వంటి వ్యవస్థాగత లోపాలకు తోడు సిబ్బంది అమానవీయ ప్రవర్తన వల్ల ప్రభుత్వాలపై పౌరులకు సదభిప్రాయం కొరవడుతోంది. జనజీవితంతో సజీవ సత్సంబంధాలలో ఉండాల్సిన శాంతిభద్రతల వ్యవస్థ ఇంకా బ్రిటిష్ కాలపు పద్ధతుల్లో, నిందితుల్ని, బాధితుల్ని ఒకే గాటనకట్టి చూసే దృష్టితో పనిచేస్తోంది. పోలీసు వ్యవస్థ భద్రతకు భరోసాగా పరివర్తిన చెందితే తప్ప పౌరుల మన్నన పొందలేదు. మునిసిపల్ సేవలు సక్రమంగా అందకుంటే పట్టణాలు, నగరాల్లో మనిషి జీవితం దుర్భరం. మౌలికంగా పాలనను నిర్దేశించేవి ప్రభుత్వ విధాన నిర్ణయాలు, రాజకీయ వ్యవస్థ పనితీరులే. అయితే తుది ఫలితాలు అధికార వ్యవస్థ పని తీరు, వ్యవహారశైలిని బట్టే ఉంటాయి. అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది ఈ సూక్ష్మాన్ని గ్రహించి మసలుకుంటేనే సగటు జీవికి న్యాయం జరిగేది. జాతిపిత గాంధీజీయే అందుకు తగు మార్గం సూచించారు. స్వాతంత్య్రానం తరం తాను ఎలాంటి ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించబోనని బాపూజీ స్పష్టం చేయడంతో... అనునిత్యం మహాత్ముని మార్గదర్శకత్వం తనకిక ఉండబోదనే ఊహే జవహర్లాల్ నెహ్రూకు మింగుడు పడలేదు. ‘‘బాపూ! నాకేదో భయం గా ఉంది, మీ మార్గదర్శకత్వం లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకోవాలని ఆం దోళనగా ఉంది’’ అన్నారు. అప్పుడు గాంధీజీ బక్కచిక్కిన ఒక సామాన్యుడి ఫొటో ఒకటి తీసి నెహ్రూకిస్తూ, ‘‘ఇది నీ టేబుల్‌పై పెట్టుకో, విధాన నిర్ణయా లకు సంబంధించి సంతకం పెట్టాల్సి వచ్చిన ప్రతిసారీ ఈ ఫొటో వంక చూడు. తీసుకోబోయే నిర్ణయం ఈ సామాన్యుడికి ఏ మాత్రం ఉపయోగపడు తుందని భావించినా నిస్సంకోచంగా సంతకం చెయ్యి. లేదనిపిస్తే చెయ్యకు’’ అని చెప్పారు. ఆ మాట నెహ్రూని ఎంతగానో ప్రభావితం చేసింది. తెలుగు రాష్ట్రాల సగటు స్వరూపమైన సామాన్యులతో వ్యవహరించే శైలికి సంబం దించి ప్రతి ఉద్యోగికీ బాపూజీ మాటలు స్పూర్తి కావాలి. ఈమెయిల్: dileepreddy@sakshi.com