nidadhavolu
-
రూ.7 కోట్లతో ఉడాయించిన టీడీపీ నేత
నిడదవోలు రూరల్: కూతురు పెళ్లికని ఒకరు.. కుమారుడి ఉన్నత చదువుల కోసమని మరొకరు.. సొంతిల్లు కట్టుకోవాలని ఇంకొందరు చిట్టీలు కడితే టీడీపీ నాయకుడు, ఉప సర్పంచ్ వారిని మోసం చేసి రూ.7 కోట్లకు ఎగనామం పెట్టి పరారయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామ ఉప సర్పంచ్ తిరుమళ్ల రంజిత్‌కుమార్ ఎన్నో ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. దీంతోపాటు ప్రైవేటు ఫైనాన్స్ నడిపిస్తూ భారీగా నగదు వసూలు చేసినట్టు సమాచారం. నిడదవోలుతో పాటు అట్లపాడు, సమిశ్రగూడెం పరిసర గ్రామాలకు చెందిన ఎంతోమంది అతడి వద్ద చిట్టీలు వేసేవారు. ప్రజల నుంచి వసూలు చేసిన రూ.7 కోట్లకు పైగా సొమ్ముతో రంజిత్‌కుమార్ ఉడాయించినట్టు బాధితులు చెబుతున్నారు. అతడికి ఫోన్ చేస్తే వారం రోజులుగా స్విచ్ ఆఫ్ వస్తోందని, అతడి ఇంటికి వెళితే తాళం వేసి ఉందని బాధితులు చెప్పారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి సమిశ్రగూడెం పోలీసులను ఆశ్రయించారు. షేక్ ఇమామ్, మరికొందరు బాధితుల ఫిర్యాదు మేరకు రంజిత్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై షేక్ సుభానీ శనివారం తెలిపారు. గుంటూరు జిల్లాలోనూ చిట్టీల పేరుతో టోకరా ఫిరంగిపురం(తాడికొండ): ఎన్నో ఏళ్లుగా చిట్టీ పాటలు నిర్వహిస్తూ నమ్మకం మాటున తమను మోసం చేసి రూ.2 కోట్ల 5 లక్షలతో ఓ కుటుంబం పరారయ్యిందని ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వాసులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో నిడమానూరి భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ దంపతులు కిరాణ, బట్టల కొట్టు, మందుల షాపు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా చిట్టీపాటలు నిర్వహిస్తూ గ్రామంలో మంచి వారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలకు వివాహాలు కాగా అబ్బాయి శివప్రసాద్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల కిందట కరోనా ప్రభావంతో వర్క్‌ఫ్రం హోంలో భాగంగా శివప్రసాద్ ఇంటికి చేరాడు. గ్రామంలోని వారికి తన బ్యాంకు అకౌంట్ నంబర్‌ను ఇచ్చి వారిచేత తన అకౌంట్లో చిట్టీల డబ్బు వేయిస్తూ వస్తున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం శ్రీశైలం వెళుతున్నామంటూ చెప్పి ఇంటికి తాళాలు వేసి వెళ్లిన భీమేశ్వరరావు, సుబ్బాయమ్మ, కొడుకు శివప్రసాద్ ఫోన్లు, వాట్సాప్ నంబర్లతో సహా బ్లాక్‌లో పెట్టడంతో.. ఫోన్ చేసిన వారికి స్విచ్చాఫ్ అని వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే భీమేశ్వరరావు దంపతులు చిట్టీల పేరుతో డబ్బు వసూలు చేసి పరారయ్యారని భావించిన 48 మంది బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు రూ.2 కోట్ల 5 లక్షలతో పరారయ్యారని బాధితులు ఫిర్యాదు చేశారని, మరికొందరు బాధితులున్నట్లు సమాచారం ఉందని ఎస్ఐ అజయ్‌బాబు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పచ్చని కుటుంబాన్ని చిదిమేసిన బెట్టింగ్‌లు
సాక్షి, నిడదవోలు: వ్యసనాలకు బానిసైన భర్త వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నిడదవోలు మండలం సింగవరంలో చోటుచేసుకుంది. నిడదవోలు సీఐ కేఏ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. సింగవరం గ్రామానికి చెందిన ఆమర్తి సుబ్రహ్మణ్యం, నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మి (24)కు 2012లో వివాహమైంది. కొంతకాలం వీరి సంసారం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమారులు. నిడదవోలు హీరోహోండా షోరూంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం కొంతకాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. క్రికెట్ బెట్టింగుల్లో లక్షలు పోగొట్టుకున్నాడు. బెట్టింగులు, మద్యానికి బానిసై రూ.10 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. పుట్టింటి నుంచి సొమ్ములు తీసుకురావాలంటూ భార్యపై వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో సింగవరంలోని సొంతింటిని కూడా అమ్మేశాడు. అనాథలుగా మారిన చిన్నారులు అట్లపాడులో నాగలక్ష్మి పేరున ఉన్న ఇంటి స్థలాన్ని కూడా అమ్మాలంటూ ఇటీవల ఒత్తిడి పెంచాడు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు తాళలేక నాగలక్ష్మి సింగవరంలోని తన ఇంట్లోని స్టోర్ రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై పెట్రోట్ పోసుకుని నిప్పంటించుకుని మృతిచెందింది. ఘటనా స్థలాన్ని సీఐ కేఏ స్వామి, ఎస్సై కె.ప్రసాద్ పరిశీలించారు. విచారణ అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైన పెట్రోల్ పోసి హతమార్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తెను కావాలనే హతమార్చారని మృతురాలి తల్లి గోళ్ల దానమ్మ కన్నీరుమున్నీరయ్యింది. దానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అప్పుడు కిలిమంజారో... ఇప్పుడు ఎల్బ్రూస్
సాక్షి, పశ్చిమగోదావరి(నిడదవోలు) : రష్యాలోని అతిపెద్ద ఎల్బ్రూస్ పర్వతాన్ని నిడదవోలుకు చెందిన పర్వతారోహకుడు కంచడపు లక్ష్మణ్ బుధవారం అధిరోహించాడు. రష్యాలో ఈనెల 6న 5,642 మీటర్లు ఎత్తు ఉన్న ఎల్బ్రూస్ పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించగా బుధవారం నాటికి అధిరోహించి అరుదైన ఘనతను సాధించాడు. 2018 సెప్టెంబర్‌లో ఆఫ్రికా ఖండంలోనే 5,886 మీటర్లు ఉన్న అతి పెద్దదైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన లక్ష్మణ్ ఇప్పుడు ఎల్బ్రూస్ పర్వతం అధిరోహించి.. అక్కడ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటాన్ని ప్రదర్శించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్నప్పటి నుంచి లక్ష్మణ్‌కు వైఎస్సార్ కుటుంబం అంటే ఎనలేని అభిమానం. వైసీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు పర్వతారోహణకు అవసరమైన ఆర్థిక సహకారం అందించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు రూ.లక్ష, నిడదవోలు ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో నిడదవోలు రోటరీక్లబ్ అధ్యక్షుడు అయినీడి పల్లారావు రూ. 50 వేల సాయం అందించారు. మాజీ రోటరీక్లబ్ అధ్యక్షులు కారింకి సాయిబాబు రూ.10 వేలు అందించారు. -
బాలికపై లైంగికదాడి
సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన వివాహితుడు ఆమెపై రెండు రోజులపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికను నమ్మిం చేందుకు ఆమె మెడలో తాళికట్టి లొంగదీసుకున్నాడు. పట్టణ ఎస్సై కె.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చర్చిపేటకు చెందిన ఓ బాలిక (17)పై మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన ముప్పిడి రాజశేఖర్ అనే వివాహితుడు రెండు రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చర్చిపేటలో నివాసముంటున్న కోప పాప అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆమె మూడో కుమార్తె కోయ లక్ష్మి ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉండగా తన కుమార్తె (మైనర్ బాలిక)ను కోయ పాప వద్ద ఉంచింది. ప్రస్తుతం ఈ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈనేపథ్యంలో ఈనెల 21న రాత్రి 1 గంట సమయంలో బాలిక కనిపించకపోవడంతో బంధువులు ఊరంతా గాలించినా ఫలితం లేకపోవడంతో అమ్మమ్మ కోయ పాప 23న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కె.ప్రసాద్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక బంధువులను విచారించగా గోపవరం గ్రామానికి చెందిన ముప్పిడి రాజశేఖర్‌పై అనుమానం వచ్చి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నట్టు నిర్ధారణకు వచ్చారు. కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. ఈనెల 21న రాత్రి రాజశేఖర్ చర్చిపేట వచ్చి బాలికను రాజమండ్రి తీసుకువెళ్లాడని, మార్గమధ్యలో ఓ ఆలయం వద్ద ఆమె మెడలో పసుపు తాడు కట్టాడని నిర్ధారించుకున్నారు. నిందితుడు రాజ మండ్రిలో ఓ లాడ్జికి తీసుకువెళ్లి బాలికపై రెండు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడినట్టు తెలుసుకున్నారు. బాలిక ఆచూకీ తెలుసుకుని ఆమెను వైద్య పరీక్షల కోసం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌చేశారు. అతడికి భార్య, బిడ్డ ఉన్నారు. -
‘ఓపీ’క పట్టాల్సిందే
సాక్షి, నిడదవోలు (పశ్చిమగోదావరి) : నిడదవోలు పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఎండమావిగానే మిగిలిపోయింది. సరైన వసతులు లేక వైద్యం కోసం రోగులు క్యూలైన్లలో అవస్థలు పడాల్సివస్తోంది. భవనం పైఅంతస్తులో నాలుగు వార్డుల్లో ఇన్‌పేషెంట్లకు 30 పడకలు ఏర్పాటు చేశారు. కింద భాగంలోని 15 గదులను వివిధ విభాగాల సేవలకు కేటాయించారు. కింద భాగంలో వైద్యులు ఓపీ చూసేందుకు అవసరమైన గదులు నిర్మించకపోవడంతో రోగులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఆసుపత్రి స్థాయి పెంచినా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు లేకపోవడంతో పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. 1987లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని స్థాపించారు. అప్పటి వైద్యశాఖ మంత్రి 8 పడకల ఆసుపత్రిగా దీనిని ప్రారంభించారు. 30 పడకల ఆసుపత్రి మంజూరుకావడంతో 2016లో రూ.2.97 కోట్లతో రెండంతస్తుల పక్కా భవనాన్ని నిర్మించారు. అడ్డదిడ్డంగా భవనాన్ని నిర్మించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిడదవోలు పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న 46 గ్రామాల నుంచి రోజూ 150 నుంచి 200 మంది రోగులు వస్తుంటారు. ప్రతీ మంగళవారం గర్బిణీ స్త్రీలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. నిడదవోలు చట్టు పక్కల గ్రామాల నుంచి∙అధిక సంఖ్యలో పేద వర్గాలు వైద్య పరీక్షలకు ఇక్కడికే వస్తుంటారు. ప్రతీ నెల సుమారు 10 పాము కాటు కేసులు వస్తున్నాయి. అత్యవసర కేసులు, పురుగుమందు తాగిన కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు 30 పడకల ఆసుపత్రి భవనాన్ని తప్ప ఓపీ కోసం వచ్చిన వారితో పాటు ఆసుపత్రి సిబ్బందికి మరుదొడ్లు నిర్మించడం మరిచిపోయారు. ఆసుపత్రి ఫ్లాన్లో మరుగుదొడ్లు లేకపోవడంతో వైద్యులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సంబందిత కాంట్రాక్టర్, ఆసుపత్రి కమిటీ వారు పట్టించుకోకపోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు కనీసం మూత్రవిసర్జనకు ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో ఆసుపత్రి బయట రాయలవారి చెరువు వద్దకు వెళ్ళి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇంత పెద్ద భవనం కట్టి మరుగుదొడ్డి నిర్మించకపోవడంతో ఇదేక్కడి చోద్యమని ప్రజలు నిట్టూరుస్తున్నారు. వెంటాడుతున్న వైద్యులు, సిబ్బంది కొరత టీడీపీ ప్రభుత్వంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించారే తప్ప, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఆస్పత్రిని ప్రస్తుతం వైద్యులు, సిబ్బంది కొరత వెంటాడుతుంది. దీంతో పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందడం లేదు. నిబంధనల ప్రకారం 30 పడకల ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్, నాలుగు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డెంటల్ వైద్యుడు, చిన్నపిల్లల వైద్యుడు, హెడ్ నర్సు, ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, రేడియో గ్రాఫర్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ రూం టెక్నీషియన్, డార్క్‌రూం అసిస్టెంట్, పోస్టుమార్టమ్ గది అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, నలుగురు నర్సులు ఉండాలి. వాటిలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టు, రెండు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తణుకు, రాజమండ్రి ఆస్పత్రులకు.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందడం లేదు. అత్యవసర వైద్య సేవలు అందక కొన్ని సందర్భాల్లో మార్గ మధ్యంలో ప్రాణాలు గాలిలో కలసిపోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కొన్నింటిని తణుకు, రాజమండ్రి ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్‌రే మిషన్ లేకపోవడంతో ప్రమాదాలకు గురైన క్షతగాత్రులకు ఎటాంటి వైద్యం అందించాలో తెలియక వైద్యులు అయోమయానికి గురువుతున్నారు. ఎక్స్‌రే మిషన్ లేకపోవడంతో ప్రతి చిన్నదానికి బయటకువెళ్లి ఎక్స్‌రే తీయించుకుంటున్నారు. దీంతో సీరియస్ కేసులను తణుకు, రాజమండ్రి తరలిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో సరైన సామగ్రి లేకపోవడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. గైనకాలజిస్ట్, మత్తు వైద్యురాలు ఉండడంతో పురిటి కేసులను చూస్తున్నారు. పురుడు పోసే సమయంలో అత్యవసర వైద్య సేవలు చేసేందుకు పూర్తిస్థాయిలో ఎక్విప్మెంట్, హెడ్ నర్సు లేకపోవడంతో తణుకుకు రిఫర్ చేస్తున్నారు. జనరేటర్ పనిచేయకపోవడంతో కరెంట్ లేని సమయంలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిడదవోలు ఆసుపత్రిలో ప్రధానంగా 108 సేవలు అందుబాటులో లేకపోవడంతో కానూరు, తణుకు వాహనాలు వస్తున్నాయి. ప్రతీ మూడు నెలలకు 280 పాము, కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. రేబీస్ వ్యాక్సిన్ కొరతగా ఉంది. పాముకాటు కేసులకు సరైన చికిత్స అందడం లేదు. గదుల కొరత ఆసుపత్రుని గదులు కొరత వెంటాడుతోంది, ప్రస్తుతం ఇద్దరు రెగ్యులర్ వైద్యులు, ఇద్దరు అవుట్సోర్సింగ్ వైద్యులు ఉన్నారు. ఇంకా రెండు పోస్టులు భర్తీ చేస్తే వారికి గదులు లేక ఇబ్బందిపడాలి. పురుగు మందు కక్కించడానికి గది లేకపోవడంతో ఆసుపత్రి బయటనే ఆ పని చేయిస్తున్నారు. క్షత్రగాత్రలకు సిమెంట్ కట్టు వేయడానికి, డ్రస్సింగ్ చేయడానికి, కుట్లు వేయడానికి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మందులు భద్రపర్చడానికి కూడా సరైన సదుపాయాలు లేవు. పార్కింగ్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. వీటిన్నింటికి తక్షణం పరిష్కారం చూపాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
నిడదవోలు ప్రస్థానం..పదేళ్ల ప్రహసనం
సాక్షి, నిడదవోలు : 2009 పునర్విభజనలో ఏర్పడిన కొత్త నియోజకవర్గం ఇది. డెల్టా ముఖద్వారం నిడదవోలు పట్టణం గతంలో కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. దీనిని కేంద్రంగా చేసుకుని పెనుగొండ నియోజకవర్గంలోని పెరవలి, తణుకు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆవిర్భవించి పదేళ్లయినా ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంది. పదేళ్లపాటు ఇక్కడ అధికారం చెలాయించిన టీడీపీ నేతలు ఈ ప్రాంత పురోగతికి చేసింది శూన్యమనే చెప్పాలి. ఘన చరిత్ర పురాతన పట్టణం నిడదవోలు. నిరవజ్జపురం, నిరవజ్జప్రోలు అనే పేర్లతో పూర్వం ఇది ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణాన్ని మొదట చాళుక్యులు పాలించారు. అనంతరం వీరు కాకతీయులతో వియ్యం అందుకోవడంతో వారు కొంతకాలం పాలించారు. వీరి కాలంలో శిల్ప కళ అభివృద్ధి చెందింది. గతంలో తవ్వకాలలో బయటపడిన సుందర విగ్రహాలు కాకతీయ చరిత్రకు నిదర్శనం. ఆధ్యాత్మిక శోభ ఈ పట్టణం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. చినకాశిరేవులో సుమారు 30 ఆలయాలు ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం కోట సత్తెమ్మ ఆలయం ఇక్కడే కొలువైంది. రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తారు. ఏడాదికి రూ.కోటి పైనే ఆదాయం వస్తుంది. చర్చిపేటలో వందేళ్ల చరిత్ర గల కృపాధార లూథరన్ దేవాలయం, కురేషియా పెద మసీదులు ఇక్కడి ప్రజల మతసామరస్యానికి ప్రతీకలు. భౌగోళిక స్వరూపం నియోజకవర్గం 282.92 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. తూర్పున∙గోదావరి, పడమట గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం, ఉత్తరాన కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం, దక్షిణాన తాడేపల్లిగూడెం మండలం ఉన్నాయి. నిడదవోలు పురపాలక సంఘం ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. వ్యవసాయ ఆధారితం డెల్టా ముఖద్వారం కావడంతో ఇక్కడ వ్యవసాయమే ప్రధాన ఆధారం. ప్రస్తుతం 36,500 ఎకరాల్లో వరి, 1500 ఎకరాల్లో అరటి, కంది, పసుపు, జామ, కోకో, ఆకుకూరలు, పూల తోటలు సాగవుతున్నాయి. టీడీపీని గెలిపించినా.. నియోజకవర్గం ఏర్పడ్డాక రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో బూరుగుపల్లి శేషారావు టీడీపీ తరఫున, జి.శ్రీనివాసనాయుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. స్వల్ప ఆధిక్యంతో శేషారావు గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ బూరుగుపల్లి శేషారావు వైపే ప్రజలు మొగ్గుచూపారు. పదేళ్లపాటు ఇక్కడ ప్రజాప్రతినిధిగా కొనసాగిన శేషారావు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. పైగా అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పునర్విభజనకు ముందు.. పునర్విభజనకు ముందు నిడదవోలు మండలం, పట్టణం కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేవి. 1999లో జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండేవి. ఆ సయమంలో 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యాయి. ఈ సమయంలో కొవ్వూరు నియోజవర్గం నుంచి పోటీ చేసిన ప్రస్తుత వైఎస్సార్ సీపీ రాష్ట్ర సలహామండలి సభ్యులు జీఎస్ రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రాజకీయాల్లో జీఎస్ రావు నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో బలమైన నాయకుడిగా ఉన్నారు. వైఎస్సార్ సీపీని విజయ తీరాల వైపు నడిపిస్తున్నారు. ప్రధాన సమస్యలు . పట్టణంలో తాడేపల్లిగూడెం వెళ్లే రోడ్డులోని రైల్వే గేటు ప్రధాన సమస్య. ఆర్వోబీ లేకపోవడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఆర్వోబీ నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. . పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై బ్రిటిష్ హయాంలో నిర్మించిన పురాతన వంతెన గతేడాది కుప్పకూలింది. ఫలితంగా చిన కాశిరేవు, కైలాసభూమికి వెళ్లడానికి భక్తుల అవస్థలు వర్ణనాతీతం. . సమిశ్రగూడెం పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై బ్రిటిష్ హయాంలో నిర్మించిన పురాతన వంతెనకు కాలం చెల్లింది. మరో బ్రిడ్జి నిర్మాణానికి పంపిన ప్రతిపాదనలు అటకెక్కాయి. . పట్టణ ప్రజలకు గోదావరి నీళ్లు తాగే అదృష్టం లేకపోయింది. కళ్ళ ముందు గోదావరి జలాలు వెళుతున్నా.. పాలకుల తీరు వల్లే ఈ దుస్థితి నెలకొంది. ∙ పట్టణంలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి నెరవేర్చలేదు. ∙ పెరవలి మండలంలో గత ఎన్నికల్లో టీడీపీ నేతలు ఇచ్చిన బస్టాండ్ నిర్మాణం హామీ కూడా అటకెక్కింది. బలమైన శక్తిగా వైఎస్సార్ సీపీ ప్రస్తుతం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలమైన శక్తిగా ఎదిగింది. జనాదరణ పొందుతూ ముందుకు దూసుకుపోతోంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి.శ్రీనివాసనాయుడు పార్టీ కార్యక్రమాలతో ఇప్పటికే ప్రజలతో మమేకమయ్యారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ బలమైన క్యాడర్‌తో ప్రచారంలో ముందున్నారు. శ్రీనివాసనాయుడు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వైఎస్సార్‌కు అత్యంత ఆప్తులైన జీఎస్‌రావు తనయుడు కావడంతో ప్రజల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సారి విజయావకాశాలు ఆయనకే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ ప్రతిష్ట మసకబారింది. ఆ పార్టీని అంతర్గత విభేదాలు వేధిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుపై అవినీతి ఆరోపణలు రావడం, ఆయన గత రెండుసార్లు నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మండలాలు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి జనాభా : 2,60,928 పురుషులు 1,30,602 స్త్రీలు 1,30,326 ఓటర్లు : 1,94,270 పురుషులు 95,983 స్త్రీలు 98,270 ఇతరులు 17 -
సినీ ఫక్కీలో సిద్ధాంతి కిడ్నాప్
సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి) : ఇంటిలిజెన్స్ ఆఫీసర్ తీసుకురమ్మంటున్నారని సివిల్ డ్రెస్‌లో వచ్చిన నలుగురు ప్రముఖ సిద్ధాంతిని కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. నిడదవోలుకు చెందిన ప్రముఖ సిద్ధాంతి వీరభద్ర శాస్త్రిని గుర్తు తెలియని నలుగురు ఉదయం 8గంటల సమయంలో విజయవాడ నుంచి ఇంటిలిజెన్స్ ఆఫీసర్ తీసుకురమ్మంటున్నారని చెప్పి కిడ్నాప్ చేశారు. ముందుగా సిద్ధాంతి చేతిలోని సెల్ ఫోన్ లాక్కున్న కిడ్నాపర్లు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు అతని భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియక ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యింది. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. -
విద్యుత్ వైర్లు తెగిపడి.. రైళ్లకు అంతరాయం
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం సాయంత్రం బలమైన ఈదురు గాలులు వీచాయి. నిడదవోలు రైల్వే స్టేషన్లో ఈదురు గాలుల ప్రభావానికి విద్యుత్ వైర్లు తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లైన్ కు మరమ్మత్తు పనులు చేయడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అంతకుముందు నిడదవోలు దగ్గర కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేశారు. విజయవాడ, రాజమండ్రి మధ్య రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. విజయవాడ, రాజమండ్రి మధ్య పలు రైల్వే స్టేషన్లలో రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేశారు. మరమ్మత్తులు చేశాక రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. -
విద్యుత్ వైర్లు తెగిపడి.. రైళ్లకు అంతరాయం
-
ఆరంభం అదిరింది
నిడదవోలులో జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ ప్రారంభం దేశం నలుమూలల నుంచి 300 మంది క్రీడాకారుల హాజరు నిడదవోలు, న్యూస్‌లైన్ : యంగ్ మెన్స్ క్రిష్టియన్ ఆర్గనైజేషన్ (వైఎంసీఏ) ఆధ్వర్యంలో జాతీ యస్థాయి ఇంటర్ వాలీబాల్ టోర్నమెం ట్ నిడదవోలు సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ క్రీడామైదానంలో గురువారం ప్రారంభమైంది. టోర్నీని వైఎస్సార్ సీపీ రాజ మండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణతో కలసి ప్రారంభిం చారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీకి దేశం నలుమూలల నుంచి 300 మంది క్రీడాకారులు తరలివచ్చారు. తొలిరోజు 20 జట్లు తలపడ్డాయి. 50 మంది పీఈటీలు, అంపైర్లు పనిచేస్తున్నారు. పోటీల ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మ న్ ఎంఎల్ దేవసహాయం అధ్యక్షతన జరి గిన సభలో బీవీఆర్ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డెరైక్టర్ బయ్యే వెంకట్రావు, వైఎంసీఏ రీజినల్ ఛైర్మన్, హెన్రీ డొమెనిక్ కాళతూటి, వైఎంసీఏ వైస్ చైర్మన్ పీడీ రత్నరాజు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు తొలిరోజు ఫలితాలను గురువారం రాత్రి ప్రకటించారు. పూల్-ఎలో ముంబై జ ట్టుపై కడప, కరీంనగర్ జట్టుపై విశాఖ, కరీంనగర్‌పై ముంబై జయకేతనం ఎగు రవేశాయి. పూల్-బిలో కేరళపై విజయనగరం, చిలకలూరు పేటపై మద్రాస్ ఫిజికల్ కళాశాల, చిలకలూరిపేటపై హిందూపూర్, పూల్-సి లో కాకినాడపై చెన్నై, వరంగల్‌పై కాకినాడ, వరంగల్‌పై చందోల్ జట్లు గెలుపొందాయి. పూల్ డిలో భీమిలిపై రాజమండ్రి, కరీంనగర్‌పై భీమిలి, కరీంనగర్‌పై రాజమండ్రి జట్లు విజయకేతనం ఎగురవేశాయి.