విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం సాయంత్రం బలమైన ఈదురు గాలులు వీచాయి. నిడదవోలు రైల్వే స్టేషన్లో ఈదురు గాలుల ప్రభావానికి విద్యుత్ వైర్లు తెగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లైన్ కు మరమ్మత్తు పనులు చేయడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
అంతకుముందు నిడదవోలు దగ్గర కోణార్క్ ఎక్స్ప్రెస్ను ఆపివేశారు. విజయవాడ, రాజమండ్రి మధ్య రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. విజయవాడ, రాజమండ్రి మధ్య పలు రైల్వే స్టేషన్లలో రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేశారు. మరమ్మత్తులు చేశాక రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.