nikaah
-
తార భర్త వద్ద నుంచి 36 సిమ్ కార్డులు స్వాధీనం
రాంచీ: జాతీయస్థాయి రైఫిల్ షూటర్ తారా సహదేవ్ భర్త రంజిత్ కోహ్లి అలియాస్ రాకిబుల్ హుసేన్కు చెందిన మూడిళల్లో జార్ఖండ్ పోలీసులు ఆదివారం సోదాలు జరిపి 36 సిమ్ కార్డులు, 15 మొబైల్ ఫోన్లు తదితర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మోసం, చిత్రహింసల ఆరోపణలపై అతన్నిపోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం సోదాలు తీవ్రతరం చేశారు. ఆయన ఇంటి నుంచి నాలుగు ప్రింటర్లు, పెన్డ్రై వ్లు, పెళ్లి సీడీ, వివాహ ఆహ్వాన పత్రికలు, కోర్టులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కోహ్లి ఇస్లాం మతంలోకి మారిన విషయాన్ని దాచి తనను పెళ్లి చేసుకున్నాడని, ఆ మతంలోకి మారాలని తనను చిత్రహింసలకు గురి చేశాడని తార ఆరోపించడం తెలిసిందే. తాను గతంలో పెళ్లి చేసుకున్న రంజిత్ కుమార్ తాజాగా మతం మార్చుకోవాలంటూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని అసలు పేరు రాకిబుల్ హసన్ ఖాన్ అని ఆమె స్పష్టం చేసింది. తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నతరువాత కొంతకాలం వరకూ కాపురం సజావుగానే ఉన్నా.. ప్రస్తుతం మతం మార్చుకోవాలంటూ భర్త వేధింపులకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేసింది. ఒక నెల నుంచి అతని వేధింపులు మరీ ఎక్కువైనట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. -
తారకు భర్త వేధింపులు!
రాంచీ: మతం మార్చుకోవాలంటూ తన భర్త వేధింపులకు పాల్పడుతున్నట్లు షూటర్ తారా సహదేవ్ నిరసన చేపట్టింది. తాను గతంలో పెళ్లి చేసుకున్న రంజిత్ కుమార్ తాజాగా మతం మార్చుకోవాలంటూ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని అసలు పేరు రకిబుల్ హసన్ ఖాన్ అని ఆ ఫిర్యాదు లో స్పష్టం చేసింది. తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నతరువాత కొంతకాలం వరకూ కాపురం సజావుగానే ఉన్నా.. ప్రస్తుతం మతం మార్చుకోవాలంటూ భర్త వేధింపులకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేసింది. ఒక నెల నుంచి అతని వేధింపులు మరీ ఎక్కువైనట్లు తెలిపింది. రకిబుల్ హసన్ ఖాన్ అనే అతను రంజిత్ కుమార్ గానే ఆమెకు పరిచయం అయ్యాడని, ఆ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని రాంచీ ఎస్పీ ప్రభాత్ కుమార్ మీడియాకు తెలిపాడు. ఇక్కడ స్థానికులకు కూడా అతను రంజిత్ కుమార్ గానే పరిచయం అయినట్లు తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఆగస్టు 22 వ తేదీన అతనిపై ఐపీసీ 295ఏ సెక్షన్ కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇప్పటికే అతనికి ఉన్న రెండు ఇళ్లతోపాటు ఆరు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించి విశ్వహిందూ పరిషత్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సోమవారం రాంచీ బంద్ కు పిలుపునివ్వడమే కాకుండా అతను మోసపూరితమైన పెళ్లిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి. 2011-12లో జాతీయ స్థాయిలో జరిగిన తూర్పు భారతీయ పోటీల్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది.