గూగుల్ షాపింగ్ సందర్శకులు 20 లక్షలు
న్యూఢిల్లీ: గూగుల్ ఆన్లైన్ షాఫింగ్ ఫెస్టివల్(జీఓఎస్ఎఫ్) 20 లక్షల మంది విజిటర్స్‌ను ఆకర్షించింది. గతేడాదే ప్రారంభమైన ఈ జీఓఎస్ఎఫ్కు ఈ ఏడాది రెట్టింపు సంఖ్యలో విజిటర్స్ సందర్శించారని గూగుల్ ఇండియా డెరైక్టర్ (ఈ కామర్స్-లోకల్ అండ్ మీడియా) నితిన్ బవన్కులే తెలిపారు. 20 లక్షల మంది విజిటర్స్ల్లో సగం మంది మహిళలేనని పేర్కొన్నారు. మొత్తం విజిటర్స్ల్లో 62 శాతం మంది 18-34 ఏళ్ల వయస్కులేనని తెలిపారు.
ఈ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ జరిగినన్ని రోజులు ఈ ఫెస్టివల్లో పాల్గొన్న 200కు పైగా ఈ కామర్స్ వెబ్సైట్ల (స్నాప్‌డీల్, ఈబే) రోజువారీ అమ్మకాలు 3 నుంచి 4 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులే కాకుండా ఫ్లాట్లు, కార్లు కూడా ఈ ఫెస్టివల్లో అమ్ముడయ్యాయని వివరించారు. టాటా హౌసింగ్ సంస్థ రూ.25 కోట్ల విలువైన 55 ఫ్లాట్లను విక్రయించిందని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ పెద్ద హిట్ అని, భారత్‌లో ఆన్లైన్ షాపింగ్‌కు జోరునిచ్చిందని వివరించారు.