no values
-
ఇండిపెండెంట్ డైరెక్టర్లకు స్వేచ్ఛ లేదు
న్యూఢిల్లీ: కంపెనీల్లోని ఇండిపెండెంట్ డైరెక్టర్లకు స్వేచ్ఛ లేదని, ప్రమోటర్ల ప్రయోజనాలకే ఉపయోగపడుతున్నారని పలువురు ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫార్మ్, లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన కార్పొరేట్ గవర్నెన్స్ సర్వే 2020లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో ఉన్న వివిధ కేటగిరీల వాటాదారులపై నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలు.... ► సర్వేలో పాల్గొన్న వారిలో 79 శాతం మంది ఇండిపెండెంట్ డైరెక్టర్ల స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేశారు. ► మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇండిపెండెంట్ డైరెక్టర్లు పనిచేస్తున్న దాఖలాలు లేవని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► పలువురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు తమ బాధ్యతలను నిర్వర్తించడం లేదు. అకౌంటింగ్ మోసాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, వాటాదారులకు తెలియకుండానే కంపెనీ ఆస్తుల విక్రయానికి సహకరిస్తున్నారని, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని ఇండిపెండెంట్ డైరెక్టర్లపై అభియోగాలున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించగలిగితే మరింత మంది షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. ► భారత కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగుపడితే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా పెరుగుతాయి. -
పేరుకే మంత్రి..ప్రాధాన్యత కరువు!!
-
ప్రభుత్వానికి విలువల్లేకుండా పోయాయి...
న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ మాజీ కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కేఎన్ గోవిందాచార్య ఎన్డీయే ప్రభుత్వంపై మరోసారి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతిపరులైన మంత్రులను వెనకేసుకు రావడం ద్వారా విలువలకు తిలోదకాలు ఇచ్చేసిందని మండిపడ్డారు. అధికార వ్యామోహం తప్ప ప్రజల మీద మమకారం లేదని వ్యాఖ్యానించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వసుంధర రాజేపై వేటువేస్తే పార్టీకి నష్టం కలుగుతుందనే వాదనలను ఆయన ఖండించారు. ఇలాంటి క్లిష్టసమయాల్లో పార్టీని తన భుజస్కంధాలపై మోసుకొని నడిపించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందని అభిప్రాయపడ్డారు. మరింత విజ్ఞతతో వ్యవహరించి వ్యక్తిగత గౌరవాన్ని, పార్టీ ప్రతిష్ఠను కాపాడాలని మోదీని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ - ఆర్ఎస్ఎస్ సాన్నిహిత్యంపై మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పాలనపై ఆర్ఎస్ఎస్ విశ్వాసం మరింత క్షీణించిందని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లో ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని గోవిందాచార్య తప్పుబట్టారు.