ఇండిపెండెంట్‌ డైరెక్టర్లకు స్వేచ్ఛ లేదు | Independent directors not really independent | Sakshi
Sakshi News home page

ఇండిపెండెంట్‌ డైరెక్టర్లకు స్వేచ్ఛ లేదు

Published Mon, Dec 28 2020 1:41 AM | Last Updated on Mon, Dec 28 2020 2:03 AM

Independent directors not really independent - Sakshi

న్యూఢిల్లీ: కంపెనీల్లోని ఇండిపెండెంట్‌ డైరెక్టర్లకు స్వేచ్ఛ లేదని, ప్రమోటర్ల ప్రయోజనాలకే ఉపయోగపడుతున్నారని పలువురు ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫార్మ్, లోకల్‌సర్కిల్స్‌ నిర్వహించిన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సర్వే 2020లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో ఉన్న వివిధ కేటగిరీల వాటాదారులపై నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలు....
 

► సర్వేలో పాల్గొన్న వారిలో 79 శాతం మంది ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేశారు.  

► మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు పనిచేస్తున్న దాఖలాలు లేవని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు.   

► పలువురు ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు తమ బాధ్యతలను నిర్వర్తించడం లేదు. అకౌంటింగ్‌ మోసాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, వాటాదారులకు తెలియకుండానే కంపెనీ ఆస్తుల విక్రయానికి సహకరిస్తున్నారని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని ఇండిపెండెంట్‌ డైరెక్టర్లపై అభియోగాలున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించగలిగితే మరింత మంది షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడానికి ముందుకు వస్తారు.  

► భారత కంపెనీల్లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ మెరుగుపడితే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా పెరుగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement