Noida plant
-
నోయిడాలో శామ్సంగ్ రూ. 5,000 కోట్ల పెట్టుబడి
లక్నో, సాక్షి: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ నోయిడాలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుపై మరిన్ని పెట్టుబడులను వెచ్చించనుంది. స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే తయారీకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న యూనిట్ విస్తరణ కోసం రూ. 5,0000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు శామ్సంగ్ వెల్లడించింది. ఎగుమతుల ఆధారిత ఈ యూనిట్ ఏర్పాటుకు ఇప్పటికే రూ. 1,500 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఈ ప్లాంటు 2021 ఫిబ్రవరికల్లా సిద్ధంకాగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా ఏప్రిల్‌కల్లా వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభంకాగలదని అభిప్రాయపడింది. మూడో దేశం నోయిడాలో శామ్సంగ్ తయారీ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభమైతే భారత్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని యూపీ పారిశ్రామికాభివృద్ధి మంత్రి సతీష్ మహానా పేర్కొన్నారు. ప్రపంచంలో శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే తయారీ యూనిట్లు కలిగిన మూడో దేశంగా భారత్ నిలవనున్నట్లు చెప్పారు. కంపెనీ ఇప్పటికే ఈ యూనిట్‌పై రూ. 1,500 కోట్లు వెచ్చించినట్లు తెలియజేశారు. చైనాలో కోవిడ్-19 తలెత్తాక దేశానికి తరలివచ్చిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఇది ఒకటని వివరించారు. ఈ ప్రాజెక్టు కారణంగా 1,500 మందికి ఉపాధి లభించే వీలున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ అన్ని పరిమాణాల డిస్ప్లేల తయారీ కోసం ఏర్పాటవుతున్నట్లు తెలియజేశారు. ఈ యూనిట్ తయారీ, అసెంబ్లింగ్, ప్రాసెసింగ్ తదితర కార్యకలాపాలను నిర్వహించనున్నట్లు వివరించారు. -
వచ్చే నెల్లో మార్కెట్లోకి ‘హోండా సివిక్’
హైదరాబాద్: కారు ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 10వ తరం ‘హోండా సివిక్’ను మార్చి 7న మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో ఈ కారు ఉత్పత్తి జరుగుతుందని వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఈ కొత్త సివిక్ అందుబాటులోకి రానుంది. 1.8 లీటర్ ఐ–వీటీఈసీ పెట్రోల్ ఇంజిన్, 1.6 లీటర్ ఐ–డీటీఈసీ డీజిల్ ఇంజిన్లతో నూతన కారు విడుదల కానుండగా.. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, లీటరుకు 26.8 కిలోమీటర్ల మైలేజీ ఈ కారు ప్రత్యేకతలుగా వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ మాట్లాడుతూ.. ‘ప్రీ–లాంచ్ దశలోనే ఈ కారుకు ఊహించని స్పందన లభిస్తోంది. అంచనాల కంటే అధిక స్థాయిలో ప్రీ–బుకింగ్స్ జరిగాయి. వచ్చే నెల 7న కారును మార్కెట్లో విడుదల చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు. -
అతిపెద్ద శాంసంగ్ ప్లాంట్‌ను ఆవిష్కరించిన మోదీ
నోయిడా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేతో కలిసి శాంసంగ్ నూతన మొబైల్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం ఇరు దేశాల అధ్యక్షులు మెట్రో రైలులో ఢిల్లీ నుంచి నోయిడా చేరుకున్నారు. దీని కంటే ముందు మహాత్మాగాంధీ స్మృతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన కచేరిలో మహాత్మనికి ఇష్టమైన భజనలను విన్నారు. ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా మోదీ ‘ఒక్క కొరియన్ ఉత్పత్తి అయినా లేని మధ్యతరగతి కుటుంబాలు మన దేశంలో చాలా అరుదు. అంతగా ఈ ఉత్పత్తులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం మన ప్రభుత్వం గవర్నమెంట్ ఈ-మార్కెట్(జీఈఎమ్) విధానాన్ని అవలంభిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వమే నేరుగా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. అందువల్ల వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు లాభం కలగడమే కాక పారదర్శకత కూడా పెరుగుతుందని’ అన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా హాజరయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కీలక అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటన గురించి మూన్ జే.. ‘భారత ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలని భావిస్తుంది. ఆ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు మేము ఉత్సాహాంగా ఉన్నాం’ అని తెలిపారు. భారత్‌ను ఓ స్నేహదేశంగా గుర్తిస్తామని, తమకు అవసరమైనప్పుడల్లా భారత్ సాయం చేసిందన్నారు. తమ దేశం సదరన్ పాలసీని చేపట్టిందని, దానిలో భాగంగా భారత్‌తో మరింత బలమైన బంధాన్ని ఏర్పర్చుకోవాలని భావిస్తున్నట్లు మూన్ జే తెలిపారు. శాంసంగ్ ప్లాంట్... దక్షిణ కొరియా బేస్డ్ స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ శాంసంగ్ ప్రపంచంలోకెల్ల అతి పెద్ద మొబైల్ తయారీ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేసింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో మొబైల్ ఫోన్స్ మాత్రమే కాక టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి ఎలాక్ట్రానిక్ వస్తువులను కూడా తయారు చేస్తున్నట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు... 35 ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 81లో ఏర్పాటు చేశారు. అయితే నోయిడా ప్లాంట్‌కు 1996లోనే శంకుస్థాపన చేశారు. 1997 నుంచి తొలిసారి ఇక్కడ టెలివిజన్లను తయారుచేయడం ప్రారంభించారు. 2003 నాటికి రిఫ్రిజిరేటర్లను కూడా తయారు చేయడం ప్రారంభించారు. 2007 నుంచి ఇక్కడ మొబైల్ ఫోన్లను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం శాంసంగ్ మొబైల్, ఎలాక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిని రెండు రెట్లు పెంచడం కోసం ఈ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను సార్క్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో శాంసంగ్ తయారీ యూనిట్లు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి నోయిడాలో ఉండగా మరొకటి తమిళనాడులోని శ్రీపెరంబ్దూర్లో ఉంది. ఇవే కాక 5 ఆర్ అండ్ డీ సెంటర్లతో పాటు నోయిడాలో ఒక డిజైన్ సెంటర్ కూడా ఉంది. వీటిన్నింటి ద్వారా దాదాపు 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇవేకాక శాంసంగ్ ఔట్లెట్ల ద్వారా మరో 1.50లక్షల మందికి కంపెనీ ఉపాధి కల్పిస్తోంది. -
శాంసంగ్ భారీ విస్తరణ
♦ రూ.4,915 కోట్లతో నోయిడా ప్లాంట్ విస్తరణ ♦ స్మార్ట్ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీ సామర్థ్యం రెట్టింపు న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దేశీయంగా స్మార్ట్ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంట్ ఆవరణ పక్కనే ఉన్న 35 ఎకరాల విస్తీర్ణంలో కొత్ల ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనిపై రూ.4,915 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. బుధవారం ప్రతిపాదిత నిర్మాణ స్థలంలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ హాజరయ్యారు. ఈ విస్తరణ ప్రాజెక్టు వచ్చే రెండేళ్లలో పూర్తి కానుంది. ప్రస్తుతం వార్షికంగా 50 లక్షల స్మార్ట్ఫోన్ల తయారీ సామర్థ్యం కాస్తా 1.2 కోట్లకు విస్తరిస్తుంది. రిఫ్రిజిరేటర్ల సామర్థ్యం ప్రస్తుతమున్న 15 లక్షల నుంచి 30 లక్షలకు పెరుగుతుంది. టీవీ ప్యానెళ్ల ఉత్పత్తి 13 లక్షల నుంచి 26 లక్షలు అవుతుంది. తాజా విస్తరణతో నోయిడా తమకు అతిపెద్ద తయారీ కేంద్రం అవుతుందని, కొత్తగా 5,000 ఉద్యోగాలు వస్తాయని శాంసంగ్ తెలిపింది. భారత్‌లో తయారీ, భారత్ కోసం తయారీకి శాంసంగ్ కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని ఓ ప్రకటనలో పేర్కొంది.