Note 7
-
రణవీర్ సింగ్‌తో షావోమి భాగస్వామ్య ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ : చైనా మొబైల్ మేకర్ షావోమి భారత మార్కెట్లో తన దూకుడును మరింత పెంచేంది. తన స్మార్ట్ ఫోన్ ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్‌ను ఎంచుకుంది. ఈ మేరకు రణ్వీర్తో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ను రణ్వీర్ నటించిన ఒక వెబ్ ఫిల్మ్‌లో ప్రదర్శించనున్నారని కంపెనీ పేర్కొంది. ‘షావోమి ఇండియా కుటుంబంలో రణవీర్ చేరుకున్నారు. ఇకపై షావోమి ఉత్పత్తులు ఆయనే వినియోగదారులకు సిఫార్సు చేస్తారు. రణ్వీర్ నటించిన ‘ఐ మాయ్ సెక్సీ అండ్ ఐనో ఇట్’ వెబ్ సిరిస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ను ప్రదర్శిస్తారు’ అని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మమజైన్ వెల్లడించారు. ఈ విషయంపై రణవీర్ మాట్లాడుతూ.. షియోమి అనేది షావోమి అనేది నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్. దేశీయ మర్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సంచలనాలను సృష్టిస్తోంది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు మేమిద్దరం కలిసి కృషి చేస్తాం. మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు రెడ్మీ నోట్ 7 తో పాటు మరిన్ని స్మార్ట్ ఫోన్లు ముందుకు వస్తున్నాయి’ అని పేర్కొన్నారు. -
రెడ్మి నోట్ 7 లాంచింగ్ ఈ నెలలోనే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7 భారత్ లో విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పటినుంచో స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవవరి 28న ఆవిష్కరించన్నుట్టు అధికారిక ట్విటర్లో షావోమి ప్రకటించింది. ఇప్పటికే చైనా మార్కెట్లో మిలియన్ అమ్మకాలతో దూసుకుపోతోంది. రెడ్ మి నోట్ 7 లో 48 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న భారీ కెమెరాను అమర్చగా మూడు వేరియంట్లలో బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. 3 జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.10,390 ధరకు లభ్యం కానుంని తెలుస్తోంది. 4జీబీ/64జీబీ స్టోరేజ్ ధర రూ. 12,460, 6జీబీ/64జీబీ స్టోరేజ్ ధర రూ.14,540లుగా ఉండనుందని అంచనా. రెడ్మీ నోట్ 7 ఫీచర్లు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 660 సాక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 48+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0. Your answer to when is #RedmiNote7 launching is finally here! Unleashing the #ǝɟᴉ7ƃnɥʇ on 28th Feb 2019. Register to buy the ticket for the launch event: https://t.co/ulSUeJlVgI. Limited seats! pic.twitter.com/GwfWwVMBvh — Mi India (@XiaomiIndia) February 14, 2019 -
ఆ ఫోన్ నుంచి టన్నుల కొద్దీ బంగారం!
సాంకేతిక లోపాలతో గతేడాది అత్యధికంగా వార్తల్లో నిలిచిన శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ నుంచి టన్నల కొద్దీ బంగారం రానుందట. ఈ విషయాన్ని స్వయంగా శాంసంగే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన శాంసంగ్ నోట్ 7 ఫోన్లు అన్నింటిని వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రపంచదేశాల నుంచి తిరిగి సేకరించిన గెలాక్సీ నోట్7 ఫోన్లను రీ-సైకిల్ చేయనుంది. గెలాక్సీ నోట్7 ఫోన్లను రీ-సైకిల్ చేయడం ద్వారా 157 టన్నుల బంగారం, వెండి, కోబాల్ట్, రాగి వంటి విలువైన లోహాలను సేకరించనునట్లు తెలిపింది. ఈ నెల చివర్లోగా ఈ ప్రక్రియను శాంసంగ్ ఆరంభించే అవకాశం ఉంది. అయితే, ఫోన్లోని కొన్ని ముఖ్యభాగాలను మాత్రం విడగొట్టి భద్రపరచనుంది శాంసంగ్. ఎమోఎల్ఈడీ డిస్ప్లే, మెమొరీ సెమీ కండక్టర్లు, కెమేరా మాడ్యూల్స్‌ను విడిగా భద్రపరుస్తుంది. రీ-సైకిల్ ప్రక్రియ మొత్తం ఎకో-ఫ్రెండ్లీ పద్ధతుల్లోనే చేయనున్నట్లు తెలిసింది. కొన్ని విడి భాగాలను నోట్ ఎఫ్ఈ సర్వీస్ మెటీరియల్‌గా వినియోగించనుంది. అయితే, ఎవరికీ విక్రయించని నోట్7 ఫోన్లకు సరికొత్త టెక్నాలజీతో తీర్చిదిద్దిన 3,200 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చి నోట్ ఎఫ్ఈ పేరుతో విపణిలోకి తీసుకొచ్చింది. -
జేబులో పేలిన శాంసంగ్ ఫోన్
న్యూయార్క్: దక్షిణ కొరియా కు చెందిన మొబైల్ మేకర్ శాంసంగ్ ను పేలుడు కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. చార్జింగ్ పెడుతున్న సమయంలో గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుడుతున్న ఘటనలతో ఆందోళనలో పడ్డ సంస్థకు ఇపుడు మరో వివాదం చుట్టుకుంది. వరుస ఘటనలు, రీకాల్ సంక్షోభానికి తోడు న్యాయపరమైన చర్యల్ని కూడా ఎదుర్కొంటోంది. జరిగిన జాప్యానికి, నష్టానికి, నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫ్లోరిడాలోని పామ బీచ్ గార్డెన్స్ లో జోనాథన్ స్ట్రోబెల్ అనే వినియోగదారుని జేబులోనే గెలాక్సీనోట్ 7 పేలిపోయింది. పనిలో ఉండగానే అకస్మాత్తుగా ఈ పేలుడు సంభవించడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సెకండ్ డిగ్రీ గాయాలతో ఉన్నాడని పాం బీచ్ పోస్ట్.కామ్ సోమవారం రిపోర్టు చేసింది. ఈ లోపం గురించి స్పష్టంగా ముందే తెలిసి వున్నా నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ సుమారు కోటి రూపాయలు(15,000 డాలర్లు) నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దావా వేశాడు. శాంసంగ్ లాంటి కార్పొరేట్ సంస్థ తగిన చర్యలు చేపట్టడంలో విఫలమైందని జొనాధన్ లాయర్ వాదించారు. మరోవైపు ప్రమాదం తర్వాత జోనాథన్ కు ఫోన్ ను అప్పగించాల్సిందిగా శాంసంగ్ సంస్థనుంచి ఈమెయిల్ అందుకున్నాడు. కాగా ప్రపంచ వ్యాప్తంగా గెలాక్సీ నోట్ 7 పేలుడు ప్రమాదాలను ధృవీకరించిన శాంసంగ్ , ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. పేలుడు ఘటనలతో వినియోగాదారులను అప్రమత్తం చేస్తూ ఈమెయిల్స్ పంపుతోంది. దీంతోపాటు వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.