సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 భారత్ లో విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పటినుంచో స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవవరి 28న ఆవిష్కరించన్నుట్టు అధికారిక ట్విటర్లో షావోమి ప్రకటించింది. ఇప్పటికే చైనా మార్కెట్లో మిలియన్ అమ్మకాలతో దూసుకుపోతోంది.
రెడ్ మి నోట్ 7 లో 48 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న భారీ కెమెరాను అమర్చగా మూడు వేరియంట్లలో బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. 3 జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.10,390 ధరకు లభ్యం కానుంని తెలుస్తోంది. 4జీబీ/64జీబీ స్టోరేజ్ ధర రూ. 12,460, 6జీబీ/64జీబీ స్టోరేజ్ ధర రూ.14,540లుగా ఉండనుందని అంచనా.
రెడ్‌మీ నోట్ 7 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 660 సాక్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9.0 పై
3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్,
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
48+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.
Your answer to when is #RedmiNote7 launching is finally here! Unleashing the #ǝɟᴉ7ƃnɥʇ on 28th Feb 2019.
— Mi India (@XiaomiIndia) February 14, 2019
Register to buy the ticket for the launch event: https://t.co/ulSUeJlVgI. Limited seats! pic.twitter.com/GwfWwVMBvh
Comments
Please login to add a commentAdd a comment