కలెక్టర్కు బంగారు నిక్షేపాల సమాచారం
అనంతపురం: ఓ వృద్ధుడు తన ఇంట్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్కు సమాచారం ఇచ్చారు. పుట్లూరు మండలం ఎన్.తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకట కొండయ్య అనే వృద్ధుడు ఈ విషయమై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు.
తన ఇంట్లో ఉన్న నిధులను వెలికితీసి ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో, పోలీసులు ఆ వృద్ధుడి ఇంటిని పరిశీలించారు.