ntu
-
ఎన్టీయూ అధ్యక్షుడిగా సుబ్రా సురేష్
సింగపూర్ : ప్రెసిడెంట్, ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లతో కూడిన నూతన పాలక వర్గాన్ని సింగపూర్‌లోని నన్యాంగ్ టెక్నోలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ) బోర్డు ఎంపిక చేసింది. బోర్డు ఛైర్మన్ కో బూన్ హీ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశంలో ఎన్టీయూ అధ్యక్షుడిగా భారతసంతతికి చెందిన సుబ్రా సురేష్(61)ని ఏకగ్రీవంగా ఎంపికచేశారు. కార్నెగీ మెలాన్ వర్సిటీ 9వ అధ్యక్షుడిగా సుబ్రా సురేష్ సేవలందించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ శ్రీ అవార్డును 2011లో సురేష్ అందుకున్నారు. ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. లొవా స్టేట్ యూనివర్సిటీ, ఎంఐటీలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 2018 జనవరి 1న ప్రెసిడెంట్, ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ బెర్టిల్ ఆండర్సన్ పదవీవిరమణ అనంతరం ఎన్టీయూ నాలుగో ప్రెసిడెంట్‌గా సుబ్రా సురేష్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్టీయూకు ఎంపికైన ముగ్గురు వైస్ ప్రెసిడెంట్లు వైఎస్ ప్రెసిడెంట్ ఫర్ అకాడమిక్స్ : ప్రొఫెసర్ లింగ్ సన్(53) వైస్ ప్రెసిడెంట్ ఫర్ రీసెర్చ్ : లామ్ కిన్ యోంగ్(61) వైస్ ప్రెసిడెంట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ : థాన్ ఎయిక్ నా(47) -
జేఎన్టీయూకే వీసీతో ఎన్టీయూ డైరెక్టర్ భేటీ
బాలాజీచెరువు (కాకినాడ) : సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ( ఎన్టీయూ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి మంగళవారం జేఎన్టీయూకే ఉపకులపతి వీఎస్ఎస్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఎన్టీయూ అందిస్తున్న కోర్సులు, ఉపకార వేతనాలు, పరిశోధనలు తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జేఎన్‌టీయూకేతో కలిసి కొన్ని కోర్సులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. డాక్టరేట్ పొందిన ప్రొఫెసర్లతోనే తమ పాఠ్యప్రణాళిక రూపొందించి తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో రెక్టార్ ప్రభాకరరావు, రిజిస్ట్రార్ సాయిబాబు, ఓఎస్డీ ప్రసాద్‌రాజు పాల్గొన్నారు.