Occupation of land
-
TS: 48 ఎకరాల భూములపై కన్నేసి.. 24 ఎకరాలు మింగేసి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భూ సమస్యలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు, జాప్యానికి తావు లేకుండా.. పారదర్శకంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే అధికారుల అండతో దీనికీ తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు.. వివాదాల్లో ఉన్న వక్ఫ్ భూముల్ని మింగేస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్న భూ బాగోతం ఇందుకు ఓ ఉదాహరణగా నిలుస్తోంది. కోర్టులో కేసులుండి వివాదాస్పదంగా మారిన వక్ఫ్ బోర్డుకు చెందిన ఇనాం (కిద్మత్) భూములపై ఎప్పటినుంచో నజర్ వేసిన కొందరు ‘పెద్దలు’చాకచక్యంగా వాటిని కొట్టేశారు. టెనెంట్‌దారులు (సాగుదారులు), ఇనాందారుల మధ్య రాజీ కుదర్చడంతో పాటు నకిలీ దస్తావేజులు సృష్టించి, రిజి్రస్టేషన్ చేయించి కోట్లాది రూపాయలు దండుకున్నారు. నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు పరిధిలో కిద్మత్ ఇనాం కింద ఇచి్చన భూముల క్రయవిక్రయాలకు హక్కులు ఉండవు. ఎవరైతే ఇనాం పొందుతారో వారితో పాటు తర్వాతి తరాలు సాగు చేసుకునేందుకు మాత్రమే హక్కులు ఉంటాయి. కానీ.. కొంతకాలం క్రితం బదిలీపై వెళ్లిన ఓ జిల్లా స్థాయి అధికారి, ఓ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి కుమ్మక్కై చక్రం తిప్పారనే ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం రూ.5 కోట్లతో ఒప్పందం చేసుకున్నారని, తహసీల్దార్‌కు సమాచారం లేకుండానే రిజి్రస్టేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. వారసులతో ఒప్పందం కుదుర్చుకుని.. ముక్తిపాడ్ గ్రామ పంచాయతీ పరిధిలో 19, 20, 50, 51 సర్వే నంబర్లలో 48 ఎకరాల భూమి ఉంది. దీన్ని మూడు తరాలుగా చెన్నారం గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాల వారు సాగు చేసుకుంటూ టెనెంట్దారులుగా ఉన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇది కిద్మత్ కింద ఇనాం భూమిగా.. హుస్సేని ఆలం ఇనాందారుగా ఉన్నారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత ఆలం ఆ భూముల పట్టాదారుగా ఆన్లై¯న్లో నమోదైంది. విషయం తెలిసిన టెనెంట్ దారులు తాము అనేక ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, తమ పేరు మీద పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సదరు ఇనాందారుకు చెందిన వారసులు (మూడో తరం) కూడా తమకే హక్కు కలి్పంచాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇలా ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతుండగా ఈ భూములపై కన్నేసిన పెద్దలు.. ఇనాందారుడి వారసులతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. మీ పేరిట పట్టాదారు పాసుబుక్కులు తెచ్చే బాధ్యత తమదని..ఆ తర్వాత ఆ భూమిని తమకే అమ్మాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇనాందారుడి వారసులను కుటుంబసభ్యులుగా చేర్చి ఫ్యామిలీ సరి్టఫికెట్‌తో సంబంధిత 48 ఎకరాల కిద్మత్ ఇనాం భూమిని అధికారుల అండదండలతోవారి పేరిట మార్చి పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ఇలా వెలుగులోకి.. ఇనాందారుల పేరిట మొత్తం 48 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరైన విషయం తెలుసుకున్న టెనెంట్ దారులు మూకుమ్మడిగా కోస్గిలోని తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచి్చంది. అయితే తన ప్రమేయం లేకుండానే పాసు బుక్కులు వచ్చాయని.. తనకు కనీస సమాచారం లేదని తహసీల్దార్ లిఖిత పూర్వకంగా ధ్రువీకరణ ఇచ్చారు. అసలు విషయం బట్టబయలు కావడంతో పాసు బుక్కులు రద్దు చేస్తున్నామని జిల్లా అధికారులు ప్రకటించి తాత్కాలికంగా గొడవను సద్దుమణిగించారు. కానీ అక్రమార్కులు ఇంతటితో ఆగలేదు. భూముల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని పథకం వేశారు. ఓ అధికారి కీలకపాత్ర! నారాయణపేట జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఓ అధికారి ఈ భూ బాగోతంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి సమాచారం చేరవేసి తతంగం నడిపించినట్లు సమాచారం. కోర్టు కేసులకు సంబంధించి ఇరువర్గాల అడ్వకేట్లు సహా ఇటు టెనెంట్‌దారులు, అటు వారసుల మధ్య రాజీ కుదిర్చాడు. ఇరువర్గాలు 48 ఎకరాల భూములను సమానంగా పంచుకుని.. హైదారాబాద్ చెందిన ఓ రియల్టర్ల గ్రూప్‌నకు అమ్మేలా ఒప్పందం చేయించాడు. ఉన్నతాధికారి సహకారంతో ఇరువర్గాలకు (టెనెంట్, ఇనాందారులకు) సమానంగా 24 ఎకరాల చొప్పున రిజి్రస్టేషన్ చేయించాడు. గుట్టుచప్పుడు కాకుండా సాగిన రిజి్రస్టేష¯న్ వెనుక రూ.5 కోట్ల డీల్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ రియల్టర్లు ప్రజాప్రతినిధి బినామీలేనట.. ఒప్పందం ప్రకారం ఇనాందారులకు సంబంధించిన 24 ఎకరాల భూములను హైదరాబాద్‌కు చెందిన రియల్టర్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే వీరందరూ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీలేనని తెలిసింది. కాగా సదరు ప్రజాప్రతినిధి ముందస్తు ఒప్పందం ప్రకారం వారసులకు తూతూ మంత్రంగా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇటీవలే 11 ఎకరాలను కోస్గి పట్టణానికి చెందిన ఇద్దరు బడావ్యాపార వేత్తలకు ఏకంగా రూ.6.5 కోట్లకు విక్రయించి తిరిగి వారి పేరిట రిజి్రస్టేషన్ చేయించారు. ఈ భూభాగోతంపై వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్‌ను సంప్రదించగా.. ‘నేను ఇటీవలే బదిలీపై వచ్చా. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి వక్ఫ్ బోర్డు సీఈఓకు నివేదిక అందజేస్తా’అని సమాధానమిచ్చారు. ఇది కూడా చదవండి: మూడు రాష్ట్రాల సరిహద్దులో ‘మావో’ల భేటీ? -
మా గడ్డపై రష్యా ఆటలు సాగవ్
కీవ్: తమ భూభాగంలో రష్యా ఆటలు సాగవని ఉక్రెయిన్ సైన్యం తేల్చిచెప్పింది. ఉక్రెయిన్ దక్షిణాదిన రష్యా ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను తాము మళ్లీ స్వాధీనం చేసుకున్నామని గురువారం ప్రకటించింది. తూర్పు ప్రాంతంలోనూ పుతిన్ సేనల దాడులను సమర్థంగా తిప్పికొట్టామంది. రష్యా సరిహద్దుల్లో ఉన్న ఖేర్సన్, మైకోలైవ్‌లో పలు ప్రాంతాలు తమ అధీనంలోకి వచ్చాయని, డొనెట్స్క్, లుహాన్స్క్లో రష్యా దాడులను తిప్పికొట్టామని వెల్లడించింది. మరోవైపు మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌లో ఇరువర్గాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే, అజోవ్‌స్టల్ ఉక్కు కర్మాగారంలోప్రతిఘటన ఎదురుకావడం లేదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించి ఏడు వారాలు దాటినా కీలకమైన పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌పై రష్యాకు పూర్తిగా పట్టుచిక్కలేదు. పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలు, సామగ్రి ఉక్రెయిన్ను రాకుండా నిరోధించడానికి రైలు, రోడ్డు మార్గాలను రష్యా ధ్వంసం చేస్తోంది. అత్యాధునిక రష్యా యుద్ధట్యాంకు టి–90ఎంను ఉక్రెయిన్ దళాలు పేల్చివేశాయి. ఈ ట్యాంకు విలువ రూ.37కోట్ల్లని అంచనా. రష్యాకు చెందిన థర్మోబారిక్ మల్టిపుల్ రాకెట్ సిస్టమ్‌ను కూడా ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌కు విరాళాల వెల్లువ ఉక్రెయిన్ కోసం వార్సాలో గురువారం ఇంటర్నేషనల్ డోనర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6.5 బిలియన్ డాలర్ల(రూ.49 వేల కోట్లు) మేర విరాళాలు అందినట్లు పోలండ్ ప్రధాని మొరావీకీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు గూగుల్ వంటి ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్ హాజరై భారీగా విరాళాలు ప్రకటించారని చెప్పారు ‘యునైటెడ్24’ పేరిట నిధుల సేకరణను ప్రారంభిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఇక ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్’ ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తూనే ఉంది. డోన్బాస్ ప్రాంతంలోని నగరాలు, పట్టణాల్లో గత 24 గంటల్లో రష్యా దాడుల్లో ఐదుగురు మరణించారని, మరో 25 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్ శివార్లతోపాటు చెర్కాసీ, జాపొరిజాజియాలో బాంబు మోతలు వినిపించాయి. డినిప్రోలో రష్యా దాడుల్లో రైల్వే స్టేషన్ దెబ్బతింది. పశ్చిమ దేశాలు చేరుకోవడానికి ముఖద్వారం లాంటి లెవివ్లోనూ దాడులు కొనసాగాయి. మరోవైపు ఈ నెల 9న ‘విక్టరీ డే’ జరుపుకొనేందుకు రష్యా బలగాలు సిద్ధమవుతున్నాయి. నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా ఏటా ఈ వేడుక నిర్వహిస్తుంటారు. 9న రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ను పూర్తిగా లొంగదీసుకోవడానికి ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్’కు పిలుపునిచ్చే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. బెలారస్ సైనిక విన్యాసాలు ప్రారంభం ఉక్రెయిన్‌లో రష్యా సేనలు తీవ్రంగా చెమటోడుస్తున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదని వాషింగ్టన్కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్’ ప్రకటించింది. రష్యా మిత్రదేశమైన బెలారస్ సైనిక విన్యాసాలు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, వీటితో ఉక్రెయిన్‌కు ముప్పు ఉంటుందనుకోవడం లేదని బ్రిటన్ వివరించింది. ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సాయం! ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో రష్యా సైనిక జనరల్స్ అంతం కావడంలో అమెరికా హస్తం ఉందా? అమెరికా అందించిన కీలక నిఘా సమాచారంతోనే ఉక్రెయిన్ సైన్యం రష్యా జనరల్స్‌ను మట్టుబెట్టిందా? అవుననే అంటోంది న్యూయార్క్ టైమ్స్ పత్రిక. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఓ కథనం ప్రచురించింది. రష్యా సైనికాధికారులపై దాడిచేయడంలో ఉక్రెయిన్‌కు నిఘా సమాచారం చేరవేయడం వాస్తవమేనని సదరు అధికారులు అంగీకరించారు. అమెరికాతోపాటు బ్రిటన్, ఇతర నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సహకరిస్తున్న సంగతి బహిరంగ రహస్యమేనని రష్యా ఉద్ఘాటించింది. ఎవరు ఎన్ని విధాలుగా అండగా నిలిచినా తమ లక్ష్యం సాధించితీరుతామని పేర్కొంది. యుద్ధరంగంలో 12 మంది రష్యా జనరల్స్‌ను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం
సాక్షి, అనంతపురం: ప్రభుత్వ భూములు ఆక్రమించిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సర్కారు భూములు ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులకు సంబంధించి గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మంత్రులు శంకర నారాయణ, శ్రీ రంగనాథరాజుతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ ఆడిటింగ్ నిర్వహిస్తామని, భూ క్రయవిక్రయాలు సరళతరం చేస్తామని చెప్పారు. 1983 తర్వాత భూ ప్రక్షాళన జరగలేదని.. భూ సంస్కరణల చట్టాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిందన్నారు. భూ యాజమానుల హక్కులను కాపాడతామని, భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తామని వెల్లడించారు. అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇళ్ల నిర్మాణం, బిల్లుల మంజూరుపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తామన్నారు. రీవెరిఫికేషన్ ద్వారా నకిలీ దరఖాస్తులు గుర్తిస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉందని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
కబ్జాకు రహదారి
► స్టీల్‌ప్లాంట్ భూముల ఆక్రమణ ► రిటైర్డ్ ఉన్నతాధికారి, ఓ వ్యాపారి నిర్వాకం ► చోద్యం చూస్తున్న ప్లాంట్ యంత్రాంగం ఒకరు రిటైర్డ్ స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారి. సర్వోన్నత స్థానంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు... ఆయన పట్ల అధికారులకు ఇప్పటికీ స్వామిభక్తే!మరొకరు స్టీల్ ఉత్పత్తుల వ్యాపారి. భారీ స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తుంటారు... తమకు కమీషన్లు ముట్టజెప్పే ఆయన పట్ల అధికారులకు కృతజ్ఞత!ఆ స్వామిభక్తి, కృతజ్ఞత కలగలిపి ఎంతగా ఉందంటే...వారిద్దరూ దర్జాగా స్టీల్‌ప్లాంట్ భూములను కబ్జా చేసి రోడ్డు వేసేసినా చూసీచూడనంత. దాదాపు రూ.5 కోట్ల విలువైన స్టీల్‌ప్లాంట్ భూమి అన్యాక్రాంతమైపోతున్నా పట్టించుకోనంత. ఆభూబాగోతం ఏమిటో మీరే చూడండి... సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గాజువాకకు చెందిన కణితి గ్రామంలో సర్వే నంబర్లు 321, 322లతో స్టీల్‌ప్లాంట్ భూములున్నాయి. ఇవి కొత్త గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే బాలచెరువు గేటుకు సమీపంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో మార్కెట్ ధర ఎకరా రూ.10 కోట్ల వరకు ఉంది. ఆ భూముల వెనుకే స్టీల్‌ప్లాంట్ రిటైర్డ్ ఉన్నతాధికారికి, నగరంలో ఓ బడా స్టీల్ వ్యాపారికి చెందిన భూములున్నాయి. కానీ వారిద్దరి భూములకు రోడ్డు కనెక్టివిటీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రైవేటు భూములుగా చూపిస్తున్నప్పటికీ వాటిపై గతంలో వివాదం ఉండేది. దాంతో ఆ ఇద్దరి భూములకు ఆశించినంత ధర రావడం లేదు. మరోవైపు ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో తమ భూముల పక్కనే ఉన్న స్టీల్‌ప్లాంట్ భూములపై వారిద్దరి కన్ను పడింది. ఎంతైనా గతంలో తాను చక్రం తిప్పిన స్టీల్‌ప్లాంటే కదా అని ఆ రిటైర్డ్ ఉన్నతాధికారి భావించారు. ఇప్పటికీ తాను ఆడిందే ఆటగా సాగుతోంది కదా అని ప్రైవేటు వ్యాపారి ధీమా కనబరిచారు. అదే ధైర్యంతో స్టీల్‌ప్లాంట్ భూముల గుండా తమ భూములకు రోడ్డు వేయాలని భావించారు. అదే తడవుగా మూడు రోజుల క్రితం అనుకున్నంతా చేసేశారు. స్టీల్‌ప్లాంట్ భూముల గుండా తమ భూములకు రోడ్డు వేసేశారు. దాదాపు ముప్పావు ఎకరా భూమిని కబ్జా చేసేసి రోడ్డు నిర్మించారు. మార్కెట్ ధర ప్రకారం కబ్జా చేసిన భూమి విలువ దాదాపు రూ.5 కోట్ల వరకు ఉంటుంది. చోద్యం చూస్తున్న స్టీల్‌ప్లాంట్ యంత్రాంగం : స్టీల్‌ప్లాంట్ భూముల గుండా ప్రైవేటు వ్యక్తులు అడ్డంగా రోడ్డు నిర్మించినప్పటికీ ప్లాంట్ అధికారులు స్పందించనే లేదు. ఈ విషయం ప్లాంట్ ఉన్నతాధికారుల దృష్టికి రాలేదా అంటే అదీ కాదు. రెండు రోజుల క్రితం ‘ల్యాండ్ -ఎస్టేట్’ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు ఆ భూములను పరిశీలించారు. కానీ ఇంతవరకు ఉన్నతాధికారులు ఆ రోడ్డును తొలగించడానికి ప్రయత్నించనే లేదు. నిబంధనల ప్రకారం అక్రమంగా రోడ్డు నిర్మించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టాలి. కానీ స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారులు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు. పరోక్షంగా తమ మాజీ బాస్‌కు సహకరిస్తున్నారు. తమకు కమీషన్లు ముట్టజెప్పే వ్యాపారినీ సంతోషపెడుతున్నారు. అదండీ సంగతి. -
పోరంబోకుల దందా 1200 కాదు... 1350 ఎకరాలు
* తేల్చిన రెవెన్యూ అధికారులు * పోరంబోకుల దందా కథనానికి స్పందన * కదిలిన రెవెన్యూ యంత్రాంగం * ఆక్రమణదారులపై కేసులు పెడతాం: తహశీల్దార్ తర్లుపాడు : పోరంబోకు భూమి ఆక్రమణ 1200 కాదు 1350 ఎకరాలంటూ రెవెన్యూ అధికారులే సర్వే చేసి లెక్క తేల్చారు. మండలంలోని గానుగపెంట గ్రామంలో పశువుల మేత పోరంబోకు భూములను ఆక్రమించుకున్న వైనాన్ని ‘సాక్షి’ ఒంగోలు జిల్లా ఎడిషన్ మొదటి పేజీలో ‘పోరంబోకుల దందా’ శీర్షికతో గురువారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. గురువారం గ్రామాల్లో ఆక్రమిత ప్రాంతాలను ఆర్.ఐ. బి.శ్రీనివాస్, వీఆర్వో నాగేశ్వరరావులు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. సుమారు 1350 ఎకరాలకుపైగా కబ్జాకు గురైనట్లు గుర్తించారు. కబ్జాదారులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తహశీల్దార్ కేవీఆర్వీ ప్రసాదరావు తెలిపారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప తామేమీ చేయలేమని తహశీల్దార్ ముందు వీఆర్వో చేతులెత్తేశారు. పోలీసు రక్షణతో వెళ్తే తప్ప ఆక్రమణలను తొలగించలేమని స్థానిక అధికారులు చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయక తప్పదనే నిర్ణయానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. ఆక్రమించిన భూముల ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రసాదరావు తెలిపారు.