october 22
-
'22న సీమవాసులకు చీకటి దినం'
-
'22న సీమవాసులకు చీకటి దినం'
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొన్ని దశాబ్ధాలుగా అన్ని అంశాల్లో రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని, మరోసారి దీనిని చంద్రబాబు కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని, లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన అనుయాయులు వేల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు అబ్బసొత్తైనట్టు రాజధాని నిర్మాణానికి రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అమరావతికి ఖర్చు చేస్తున్న రూ. వందలకోట్ల దుర్వినియోగంపై హైకోర్టులో 'పిల్' వేస్తామని తెలిపారు. అమరావతి శంకుస్థాపనకు ముహుర్తమైన 22వ తేదీని రాయలసీమ వాసులకు చీకటిదినంగా ఆయన అభివర్ణించారు. -
అక్టోబర్ 22న రాజధాని శంకుస్ధాపన
-
అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన
హైదరాబాద్: అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సోమవారం ప్రభుత్వానికి రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అందుతుందని చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం సీఎం చంద్రబాబునాయుడికి ఆ ప్లాన్ అందజేస్తుందని చెప్పారు. ఆ ప్లాన్ వచ్చాక క్యాపిటల్ పనులు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు. -
'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు'
-
'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు'
హైదరాబాద్ : నూతన రాజధాని నిర్మాణానికి అక్టోబర్ 22 న శంకుస్థాపన చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి ఇప్పటివరకూ 21,500 ఎకరాలకు అగ్రిమెంట్లు కుదిరాయని ఆయన చెప్పారు. ఏ గ్రామంలో రైతులకు అదే గ్రామంలో అభివృద్ధి చెందిన భూములు ఇస్తామన్నారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చిందని ఆయన అన్నారు. ఈ తీర్పు ఆధారంగా భూ సమీకరణ మరింత సులభంగా సాగుతుందని మంత్రి పేర్కాన్నారు. ఒకవేళ భూములివ్వని రైతుల నుంచి..పంటలు పూర్తయ్యాక భూ సేకరణ చేపట్టనున్నట్లు నారాయణ వివరించారు.