ఎరువుల దుకాణాలపై దాడులు
అనంతపురం సెంట్రల్ : జిల్లా వ్యాప్తంగా ఎరువులు, మందుల దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. బుధవారం తాడిపత్రిలోని మహాలక్ష్మి ఆగ్రో ఏజెన్సీస్పై దాడులు చేసి 50 బస్తాల స్వాల్ కంపెనీ ఎరువులను సీజ్ చేసినట్లు సీఐ శంకర్ తెలిపారు. కంపెనీ పేరు, కస్టమర్ కర్ తదితర వివరాలేవీ లేకపోవడం సీజ్ చేసినట్లు వివరించారు.
మాతాశ్రీ గార్మెంట్ షాపుపై దాడులు చేసి నిబంధనలకు విరుద్దంగా విక్రయిస్తున్న దుస్తులను సీజ్ చేసినట్లు తెలిపారు. వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.