old age couple
-
పెట్టుబడుల వరద.. ‘సీనియర్ సిటిజన్’ ఇళ్లకు గిరాకీ
వృద్ధుల నివాస విభాగంలో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నట్టు జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. వృద్ధ జనాభా దేశ జనాభాలో 2050 నాటికి 20 శాతానికి చేరుకుటుందన్న అంచనాలను ప్రస్తావించింది. ప్రస్తుతం భారత్‌లో వృద్ధుల జనాభా (60 ఏళ్లుపైన ఉన్నవారు) 10 కోట్లుగా ఉందని, వీరికి సంబంధించి నివాస విభాగంలో ప్రాజెక్టుల అభివృద్ధి, పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వెల్లడించింది. చిన్న కుటుంబాలు పెరుగుతుండడం, ఉద్యోగాల కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్సాల్సి వస్తుండడం.. పెద్దలకు ప్రత్యేక నివాసాల అవసరాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. 2050 నాటికి పెద్దలపై ఆధారపడిన పిల్లల సంఖ్యకు సమాంతరంగా, పిల్లలపై ఆధారపడే తల్లిదండ్రులూ ఉంటారని చెప్పింది. పెరిగే వృద్ధ జనాభాకు ప్రత్యేకమైన సంరక్షణ అవసరమవుతుందని వివరించింది. సాధారణ నివాసాలతో పోలిస్తే వృద్ధులకు సంబంధించి ఇళ్ల ధరలు 10–15 శాతం మేర భారత్‌లో అధికంగా ఉన్నట్టు పేర్కొంది. -
విలన్ రేంజ్లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...
పెద్ద ప్రమాదం కాకపోయినా... నానాబీభత్సం సృష్టించాడు ఒక వ్యక్తి. వృద్ధ దంపతులన్న కనికరం లేకుండా ఘోరంగా దాడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పోలీసులు పెద్ద ప్రమాదం కాదని తేల్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రోడ్డుపై అనుకోకుండా చిన్నప్రమాదం జరిగింది. వాస్తవానికి అది పెద్ద ప్రమాదం కాదు. ఒక వృద్ధ దంపుతులు ప్రయాణిస్తున్న కారు, వ్యాపారీ కారు ఒక దానికొకటి జస్ట్ రెప్పపాటులో రాసుకున్నాయి. అంతే సదరు వ్యాపారి రోడ్డుపై కారు ఆపేసి ఆ వృద్ధ దంపతులపై గొడవకు దిగాడు. ఆ దంపతుల్లో భర్త పిడీయాట్రిక్ వైద్యుడు కాగా, అతడి భార్య ఉపాధ్యాయురాలు. సదరు వ్యక్తి వ్యాపారి దంపతులపై దాడి చేయడం, మహిళను తన్నిడం వంటివి చేశాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ధర్మేంద్ర కుష్వాపై కేసు నమోదు చేశారు. సదరు వృద్ధ దంపతులు కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లు వాపోయారు. తమకు సాయం చేయడానికి ఎవరు రాలేదని ఆ దంపతులు వాపోయినట్లు పోలీసులు తెలిపారు. వాస్తవానికి అది ఏవిధంగానూ పెద్ద ప్రమాదం కాదని, అతడు కావాలనే వారిపై దాడికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. INDORE ROAD RAGE Viral | मिनी मुंबई Indore में Road Rage, मामूली टक्कर के बाद डॉक्टर और शिक्षिका को पीटा | Indore |MP Oh My God Oh My God Part 1.1 pic.twitter.com/3MQQm8KoTk — Adil INC ( Being Human) (@Adil_INC_) December 6, 2022 (చదవండి: శిక్ష పడుతుందన్న భయంతో.. విచారణ ఖైదీ ఆత్మహత్య) -
అత్యంత వృద్ధ జంట...వాళ్లుకు ఇది ఎన్నో వివాహ వార్షికోత్సవమో తెలుసా!
వివాహలు స్వర్గంలో నిర్ణయించడబడతాయని, అప్పుడే ఆ జంట ఈ భూమ్మీద ఒకట అవుతారని పెద్దలు చెబుతుంటారు. ఇంది ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఇటీవల పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటలాగా అయిపోతున్నాయి. అలాంటి ఈ ఆధునిక కాలంలో ఈ వృద్ధ జంట వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరచడమే కాక ఆదర్శంగా నిలిచారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) వివరాల్లోకెళ్తే...చైనాకి చెందిన వృద్ధ జంట 90వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇంతకి వారు వయుసు ఎంతో తెలసుసా...అతని వయసు 109 ఏళ్లు, ఆ వృద్ధ మహిళ వయసు 108 ఏళ్లు. పైగా ఇద్దరు మంచి పెళ్లి దుస్తులు ధరించి తమ గతం తాలుకు జ్ఞాపకాలకు వెళ్లిపోయారేమో అన్నట్లుగా ఉన్నారు. అంతేకాదు ఇన్నేళ్ల తమ దాపత్యంలోని మధురానుభూతులు నెమరు వేసుకుంటూ కెమరా ముందు చక్కగా ఫోజులిచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఆశ్చర్యం: మనిషి నాలుకపై వెంట్రుకలు.. ఎందుకలా!) -
ప్రపంచంలోనే వృద్ధ కవలలు వీరే.. ఎక్కడున్నారంటే!
టోక్కో: ఈ కాలంలో 60,70 ఏళ్లు బతికితే చాలు అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ 90 ఏళ్లు బతికితే ఇక జీవితానికి అదే మహాభాగ్యం. కానీ జపాన్‌కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు సెంచరీ దాటేసి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వృద్ధ కవలల విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. వారే ఉమెనో సుమియామా, కోమే కొడామా. ప్రస్తుతం వీరి వయస్సు 107 ఏళ్ల 320 రోజులు. జీవిస్తున్న వారిలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కవలలుగా(మహిళలు) ఈ ఘనత సాధించినట్లు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు వెల్లడించారు. ఇంతకు ముందు కూడా ఈ రికార్డు జపాన్ కవలల పేరిటే ఉంది. అయితే వారి వయసు 107 సంవత్సరాల 175 రోజులే కావడంతో ఇప్పుడు ఆ రికార్డు ఉమెనో సుమియామా, కోమే కొడామాలకు దక్కింది. వీరు 1913 వవంబర్ 5న వీరు జన్మించారు. తమ కుటుంబంలో మొత్తం 11 మంది పిల్లలు జన్మించగా.. తమ తల్లికి మూడో కాన్పులో ఈ కవలలు జన్మించారు. జంటగా పుట్టినా వీరిద్దరు ఒకేచోట పెరగలేదు. స్కూల్ చదివేరోజుల్లో కౌమే పనిచేయడానికి వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పుట్టిన ప్రాంతాన్ని వదిలి కుటుంబానికి దూరంగా పెరిగారు. అలాగే వివాహం కూడా ఉమెనో షాడో ద్వీపానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకుని అక్కడే ఉండిపోగా కౌమే మాత్రం తల్లిదండ్రులతో ఉంటూ అక్కడి ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ కవల అక్కచెల్లెళ్లు ఇద్దరు రెండు ప్రపంచ యుద్ధాల్ని చూశారు. ఇద్దరు 300 కి.మీ దూరంలో ఉండేవారు. దీంతో వారు కలుసుకోవటం కూడా చాలా తక్కువగా జరిగేది. బంధువుల పెళ్లిళ్లు, అంత్యక్రియల సమయాల్లో మాత్రమే కలుసుకునేవారు. ఒకరినొకరు చూసుకునేవారు. కానీ వారికి 70 సంవత్సరాల వయస్సు వచ్చాక ఇద్దరు కలిసి సమయం గడపాలని అనుకున్నారు. అలా వారిద్దరు బౌద్ధ తీర్థయాత్రల కలిసి ప్రయాణించారు. ఇక 125 మిలియన్ల జనాభా కలిగిన జపాన్‌లో 29శాతం మంది 65 సంవత్సరాలు పైబడిన వారే ఉన్నారు. ఇందులో 86,510 మంది వందేళ్లు పూర్తి చేసుకున్నవారే. -
వృద్ధ దంపతులకు అండగా కన్నడ హీరో కిచ్చ సుదీప్
బెంగళూరు: కన్న కొడుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనాథలను చేసినా కన్నడ హీరో కిచ్చ సుదీప్ తానున్నానంటూ వృద్ధ దంపతులకు ఆసరాగా నిలిచిన సంఘటన దొడ్డ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలో నివసిస్తున్న శ్రీనివాస్ (78), కమలమ్మ(70) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు దివ్యాంగుడు. మరో కుమారుడు తనపాలిట తల్లితండ్రులు లేరనుకుని మైసూరులో స్థిరపడిపోయాడు. దీంతో బెంగళూరులో నివసిస్తున్న వీరు ఉన్న కాస్త ఆస్తి అమ్ముకుని బెంగళూరు నుండి దొడ్డ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. కమలమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరి గురించి తెలుసుకున్న సుదీప్ కమలమ్మకు బెంగళూరులోని జైన్ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించడంతోపాటు వారి పూర్తి బాధ్యత తీసుకున్నారు. -
పట్టెడన్నం పెట్టేవారు లేక.. వృద్ధ దంపతుల ఆకలిచావు?
సాక్షి, మంచిర్యాల: అందరూ ఉన్నా.. మలి సంధ్యలో తినడానికి తిండి లేక పది రోజులపాటు ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి చెందారు. ఈ∙సంఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం లో శనివారం జరిగింది. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బియ్యాల రాజయ్య (70), మల్లక్క(63) దంపతులకు ఇద్దరు కుమారులు మల్లేశ్, రవి ఉన్నారు. ఇద్దరికీ వివాహం అయింది. ఆస్తి పంపకాలు కూడా జరిగాయి. రాజయ్యకు ఆరేళ్ల క్రితం పక్షవాతం రావడంతో మంచానికే పరిమితయ్యాడు. భార్య మల్లక్క కూడా నెల క్రితం మంచాన పడింది. తల్లిదండ్రులను చూసుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పెద్దమనుషులు పంచాయితీలు నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ కూడా వెళ్లారు. ఈ క్రమంలో గొడవల కారణంగా ఏప్రిల్ 30న చిన్న కుమారుడు రవి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఆత్మహత్యతో పెరిగిన గొడవలు రవి ఆత్మహత్య తర్వాత కుటుంబంలో గొడవలు మరింత పెరిగాయి. రవి భార్య స్వప్న స్థానిక పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుతో అప్పటి ఎస్సై దత్తాత్రితోపాటు సర్పంచ్ రాజేశం, మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత ఇంట్లో జరుగుతున్న గొడవల కారణంగా పెద్ద కొడుకు మల్లేశ్ గ్రామం నుంచి వెళ్లిపోయి రంగపేటలో ఉంటున్నాడు. దీంతో వృద్ధుల బాగోగులు చూసుకునేవారు కరువయ్యా రు. కొద్దిరోజుల క్రితం మల్లేశ్ వచ్చి తల్లిదండ్రులకు స్నానం చేయించి ఆహారం పెట్టాలని ఇంటిపక్కన సమీప బంధువుకు చెప్పి వెళ్లాడు. అయితే, ఆ బంధువుకు జ్వరం రావడంతో ఆయన వృద్ధుల వద్దకు వెళ్లలేదు. ఈ క్రమంలో ఆకలికి అలమటించి శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఎస్సై చంద్రశేఖర్, ఏఎస్సై రాజేందర్ పరిశీలించారు. బాధ్యులపై చర్య తీసుకోవాలి.. తన తల్లిదండ్రులను కొంతమంది వ్యక్తులు చంపినట్లు అనుమానం ఉందని, మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దకొడుకు మల్లేశ్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. -
భర్త శవాన్ని చూస్తూ కుప్పకూలిన భార్య
సాక్షి, పుత్తూరు రూరల్: ధర్మార్థ కామములోన ఏనాడూ నీతోడు ఎన్నడూ నేవిడిచిపోను అని భార్యాభర్తల బంధం గురించి ఓ సినీకవి రాసిన మాటలు యాధృచ్ఛికంగా నిజమయ్యాయి.. వేదమంత్రాల సాక్షిగా ఒకరినొకరు చివరివరకు తోడుంటామని చేసుకున్న ప్రమాణాలను ఆ దంపతులు నిజం చేశారు. కడవరకు ఒకరినొకరు తోడూనీడగా నిలిచి చివరికి ఆ వృద్ధ దంపతులు మృత్యువులోనూ ఒక్కటయ్యారు. భర్త మృతి చెందడంతో చివరిచూపు చూస్తూ ఆమె కూడా ప్రాణాలొదిలిన సంఘటన పుత్తూరులో చోటు చేసుకుంది. (చదవండి: భార్య కాళ్లు పట్టుకుంది.. ప్రియుడు పీకనొక్కాడు) వివరాలు.. పుత్తూరు మున్సిపల్ పరిధి గోవిందపాళెంకు చెందిన ఎం.చంద్రయ్యనాయుడు (68) గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలకు తరలించే సమయంలో కడసారిగా భర్త మృతదేహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భార్య ఎం.కుప్పమ్మ (64) కుప్ప కూలి మృతి చెందింది. దీంతో ఇద్దరికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రు. చంద్రయ్య నాయుడు మేస్త్రీ పనిచేస్తూ జీవనం సాగించేవారు. (చదవండి: వామ్మో! ఉన్నట్టుండి తల చీల్చేసింది..) -
సాయం చేసిన అతనిపైనే ఫిర్యాదు!
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉంటున్న ఒక వృద్ధ జంట కరోనా టైంలో తమ ధాబా బిజినెస్ సరిగా జరగడం లేదంటూ కంటతడి పెట్టుకున్న వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు సైతం‘బాబా కా ధాబా కు వెళ్లి తినండి అంటూ ట్వీట్లు చేశారు. దీంతో ఆ ధాబా పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. చాలా మంది అక్కడి వెళ్లి రోటి, కూర్మ కూర రుచి చూసి వచ్చారు. దీంతో పాటు ఆ ధాబా నడుపుతున్న వృద్ధ జంట కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి ఆవేదన చూసి చలించిపోయిన చాలా మంది నెటిజన్లు వారికి ఆర్ధిక సాయం కూడా చేశారు. ఈ వీడియోను ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతనే వీరి కోసం విరాళాలు సేకరించాడు. అయితే సాయం చేసిన అతనిపైనే ఇప్పుడు కాంతా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు సాయం చేయడం కోసం చాలా మంది పంపిన డబ్బును వాసన్ తప్పుదోవ పట్టించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు కేవలం రూ. 2.3 లక్షలు మాత్రమే ఇచ్చాడని మిగిలిన డబ్బును అతనే తీసుకున్నాడని ఆరోపించాడు. వాసన్ విరాళాలు సేకరించడానికి తన బ్యాంక్ ఖాతాలతో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు కూడా ఇచ్చాడని కాంతా ప్రసాద్ తెలిపారు. వచ్చిన విరాళాలు మొత్తాన్ని తమకు అందించకుండానే.. ‘ఇచ్చాను అంటూ’ అబద్ధాలు చెబుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసన్ మాత్రం తనకు వచ్చిన ఫండ్స్ అన్నింటిని కాంతా ప్రసాద్‌కు ఇచ్చానని బ్యాంక్ స్టేట్మెంట్లు చూపిస్తూ మరో వీడియో విడుదల చేశాడు. చదవండి: కొన్ని లైకులు... కాస్త వెలుతురు -
కరోనా వైరస్: ఇదే చివరిసారి కలుసుకోవడం!
బీజింగ్: కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దెబ్బతో చైనాలోని పలు ప్రాంతాల్లో జనాలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇక వైరస్ సోకిన వ్యక్తులు పిట్టల్లా రాలిపోతుండటం అందరినీ కలిచివేస్తోంది. దీంతో కరోనా వ్యాధిగ్రస్తులు తాము బతుకుతామో లేదో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకిన ఓ వృద్ధ దంపతుల (80 సంవత్సరాల వయస్సున్న జంట) వీడియో వైరల్‌గా మారింది. ప్రాణాల మీద ఆశున్నా, బతుకుతామన్న నమ్మకం లేదన్న నిరాశ వారి కళ్లల్లో గోచరిస్తోంది. ప్రతిక్షణం ఒక యుగంలా బతుకు వెళ్లదీస్తున్న ఈ దంపతులు ఆసుపత్రిలో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. చేయి పట్టుకుని చివరిసారిగా భారంగా మాట్లాడుకున్నారు. (కరోనా బారిన తండ్రి.. దివ్యాంగుడి దుర్మరణం!) ‘వారు కలుసుకోవడం ఇదే చివరిసారేమో’ అంటూ ఓ వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ హృదయ విదారక వీడియో నెటిజన్లు మనసును కలిచివేస్తోంది. ‘వాళ్ల పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’, ‘ఇది ఎంతో విషాదకరమైన వీడియో. కానీ జీవితపు చివరి క్షణాల్లోనూ వారి మధ్య ఉన్న ప్రగాఢ ప్రేమను ఎంతో హృద్యంగా ఆవిష్కరించింది’, ‘వాళ్ల బాధను మనం ఊహించలేము, తిరిగి కోలుకుంటే బాగుండు’ అని పలురకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా కరోనా వైరస్ వల్ల చైనాలో ఇప్పటివరకు 490 మంది మరణించారు. What does a couple mean? Two elderly patients of #coronavirus in their 80s said goodbye in ICU, this could be the last time to meet and greet 😭😭😭 pic.twitter.com/GBBC2etvV9 — 姜伟 Jiang Wei (@juliojiangwei) February 2, 2020 చదవండి: కరోనా కేసులు 20,522 -
నూరేళ్లు కలిసి జీవించారు.. కానీ గంట వ్యవధిలో..!!
చెన్నై : పుట్టిన ప్రతి జీవికీ తప్పనిసరిగా వచ్చేది మరణం. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరిని ఎలా మృత్యురూపంలో కబళిస్తుందో చెప్పడం కష్టం. నూరేళ్ల నిండిన వారి అనుబంధం గంట వ్యవధిలో ముగిసిపోయంది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులో శతాధిక వృద్ధ దంపతులు ఒకే రోజు తనువు చాలించారు. భర్త మరణం తట్టుకోలేని భార్య మృతదేహం వద్దే ఏడుస్తూ ప్రాణాలు విడిచింది. దీంతో వారి నిండు నూరేళ్ల బంధం, 75 సంవత్సరాల వైవాహిక బంధం ముగిసిపోయాయి. తమిళనాడు రాష్ట్రంలోని పుడుక్కొట్టాయ్ జిల్లాలో కుప్పకూడి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కుప్పకూడి గ్రామంలో వెట్రివేల్ (104), పిచాయ్ (100) అనే శతాధిక దంపతులు ఉన్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరందరికీ వివాహాలు అయిపోయాయి. ఫలితంగా ఈ వృద్ధ జంటకు 23 మంది మనవళ్లు, మనవరాండ్లు, మునిమనువళ్లు ఉన్నారు. వీరంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. వీరిద్దరు మంచి ఆరోగ్యవంతులు. వారి వందేళ్ల జీవిత పయనంలో జబ్బు పడ్డ సందర్భాలు కూడా చాలా తక్కువ. ఇదే విషయాన్ని అనేకసార్లు కుటుంబ సభ్యలతో ప్రస్తావించేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వెట్రివేల్‌కు ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు. తర్వాత వెట్రివేల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. భర్త శవం పక్కనే కూర్చోని ఏడుస్తు భార్య పిచాయి మూర్ఛపోయింది. దీంతో వైద్యులను పిలిపించి పరీక్షించగా, ఆమె కూడా ప్రాణాలు వదిలినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో 75 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిపోయింది. ఈ శతాధిక వృద్ధులు చనిపోవడంతో వారి ఇంట్లోనే కాకుండా గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. -
అదును చూసి డబ్బులు కొట్టేసిన ఆటో డ్రైవర్..?
సాక్షి, పేరేచర్ల (గుంటూరు): భార్యకు క్యాన్సర్ సోకడంతో ఆమెను చికిత్స కోసం తీసుకెళ్తున్న వృద్ధుడికి చేదు అనుభవం ఎదురైంది. భాగస్వామి ఆరోగ్యం నయం చేసేందుకు అప్పులు చేసి తెచ్చుకొన్న నగదు మాయమైంది. ఈ ఘటనతో బోరున విలపిస్తూ వృద్ధ దంపతులు మంగళవారం మేడికొండూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. నూజెండ్ల మండలం జెడ్డావారి పాలెం గ్రామానికి చెందిన గొట్టిపాటి వెంకటేశ్వర్లు, కోటమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నాళ్ల నుంచి పెదకంచర్లలోని కూతరు ఇంట్లో నివాసం ఉంటున్నారు. భార్య కోటమ్మకు క్యాన్సర్ సోకటంతో రోజు గుంటూరు వెళ్లి వైద్యం చేయించు కోవాలంటే వారికి వయస్సు సహకరించని పరిస్థితి. ఈ క్రమంలో నెల కిందట పేరేచర్లలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి రోజు వెంకటేశ్వర్లు తన భార్యను గుంటూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లి.. తీసుకొస్తున్నాడు. సోమవారం కూడా యథావిధిగా ఆస్పత్రికి వెళ్లి గుంటూరు నుంచి పేరేచర్లకు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో వారు ఆర్టీసీ బస్సు దిగటంతో అక్కడే ఉన్న ఆటో వాలా గ్రామంలోకి వెళుతున్నాను.. వస్తారా అని ఎక్కించుకొన్నాడు. కోటమ్మను వెనుక సీటులో కూర్చోమని చెప్పి వెంకటేశ్వర్లను ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. అప్పటికే ఆటోలో మరో వ్యక్తి ఉన్నాడు. ఆటోను గ్రామంలోకి పోనివ్వకుండా బైపాస్ రోడ్డులోకి తిప్పాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వెంకటేశ్వర్లు ఇటెందుకు వెళ్తున్నావని ప్రశ్నించగా తిరిగి బైపాస్‌లోనే వదిలేసి వెళ్లాడు. వృద్ధ దంపతులు నడుచుకొంటూ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. అయితే వెంకటేశ్వర్లు టిఫిన్ తెచ్చుకునే క్రమంలో జేబులో డబ్బులు చూసుకోగా రూ.70 వేలు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఆటోడ్రైవర్ డబ్బులు కూడా తీసుకోలేదని, కావాలనే వేరే వ్యక్తిని ఆటోలో కూర్చోబెట్టి చేతులు పలు మార్లు మార్చి మార్చి పట్టుకోమని చెప్పాడని, ఇదంతా అతని పనేనంటూ వెంకటేశ్వర్లు ఆవేదన చెందారు. -
వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు
లండన్: లేటు వయసులో పెళ్లి చేసుకున్న ఓ జంట గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. లేటు అంటే మామూలు లేటు కాదు.. వరుడికి 103 ఏళ్లు, వధువుకి 91 ఏళ్లు. ఇంత ముదిమి వయసులో వీరు 50 మంది కుటుంబ సభ్యులు, ఓ గిన్నిస్ ప్రతినిధి సమక్షంలో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వరుడు జార్జ్ కిర్బీ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ వివాహం జరిగింది. వీల్‌చైర్‌పై ఉన్న వరుణ్ని తోసుకుంటూ వచ్చిన వధువు డోరీన్ లక్కీ.. అతని వేలికి ఉంగరాన్ని తొడిగింది. వీరిద్దరూ 1988లో కలుసుకున్నారు. అప్పటికి కిర్బీ వైవాహిక బంధం విఫలమవ్వగా, లక్కీ తన భర్తను కోల్పోయి మూడేళ్లయింది. వీరికి ఏడుగురు బిడ్డలు, 15 మంది మనుమలు, ఏడుగురు మునిమనుమలు ఉన్నారు.