భర్త శవాన్ని చూస్తూ కుప్పకూలిన భార్య | 64 Year Old Woman Died 1 Day After Her Husband Death In Chittoor | Sakshi
Sakshi News home page

నీతోడు ఎన్నడూ విడిచిపోను!

Published Thu, Dec 31 2020 8:22 AM | Last Updated on Thu, Dec 31 2020 8:22 AM

64 Year Old Woman Died 1 Day After Her Husband Death In Chittoor - Sakshi

చంద్రయ్యనాయుడు, కుప్పమ్మ (ఫైల్‌)

సాక్షి, పుత్తూరు రూరల్‌: ధర్మార్థ కామములోన ఏనాడూ నీతోడు ఎన్నడూ నేవిడిచిపోను అని భార్యాభర్తల బంధం గురించి ఓ సినీకవి రాసిన మాటలు యాధృచ్ఛికంగా నిజమయ్యాయి.. వేదమంత్రాల సాక్షిగా ఒకరినొకరు చివరివరకు తోడుంటామని చేసుకున్న ప్రమాణాలను ఆ దంపతులు నిజం చేశారు. కడవరకు ఒకరినొకరు తోడూనీడగా నిలిచి చివరికి ఆ వృద్ధ దంపతులు మృత్యువులోనూ ఒక్కటయ్యారు. భర్త మృతి చెందడంతో చివరిచూపు చూస్తూ ఆమె కూడా ప్రాణాలొదిలిన సంఘటన పుత్తూరులో చోటు చేసుకుంది. (చదవండి: భార్య కాళ్లు పట్టుకుంది.. ప్రియుడు పీకనొక్కాడు)

వివరాలు.. పుత్తూరు మున్సిపల్‌ పరిధి  గోవిందపాళెంకు చెందిన ఎం.చంద్రయ్యనాయుడు (68) గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలకు తరలించే సమయంలో కడసారిగా భర్త మృతదేహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భార్య ఎం.కుప్పమ్మ (64) కుప్ప కూలి మృతి చెందింది. దీంతో ఇద్దరికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రు. చంద్రయ్య నాయుడు మేస్త్రీ  పనిచేస్తూ జీవనం సాగించేవారు. (చదవండి: వామ్మో! ఉన్నట్టుండి తల చీల్చేసింది..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement