old factions
-
మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ.. పట్టపగలే దారుణం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): మరో దారుణ హత్యతో విశాఖ నగరం ఉలిక్కిపడింది. గత కొన్ని రోజులుగా నగరంలో వరుస హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. పెందుర్తి ప్రాంతంలో హల్చల్ సృష్టించిన సైకో కిల్లర్ ఉదంతం మరువకముందే ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్ పరిధి ఆదర్శనగర్‌లోని అనుపమ బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట బుధవారం సాయంత్రం 4 గంటలకు మరో హత్య జరగడం చర్చనీయాంశమైంది. చదవండి: మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు ఈ ఘటనలో బొడ్డు అనీల్‌కుమార్ (35) అనే రౌడీషీటర్ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిగా మద్యం తాగించి మత్తులోకి జారుకున్నాక ప్రణాళిక ప్రకారం హతమార్చినట్లు గుర్తించారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ద్వారకా జోన్ ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. వాసుపల్లి శ్యామ్ ప్రకాష్ (34) అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అనీల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలి నుంచీ నేర చరిత్రే... బొడ్డు అనీల్‌కుమార్ తన కుటుంబంతో కలిసి అప్పుఘర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు సంతానం. భార్య ఎంవీపీ కాలనీలోని ఓ ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. అయితే అనీల్‌కు తొలి నుంచి నేరచర్రిత ఉంది. దొంగతనాలు, పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడు. చాలా కాలం భార్యభర్తలు కాకినాడలో నివాసమున్నారు. ఆ సమయంలో అనీల్‌పై కాకినాడ పోలీసులు రౌడీషిట్ కూడా తెరిచారు. దీంతోపాటు అక్కడ పలు గొడవల్లో అనీల్ నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొంతకాలం క్రితం అనీల్ విశాఖకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బరంపురంలోని ఓ సంస్థలో ప్రస్తుతం డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చిన అనీల్‌కుమార్ బుధవారం హత్యకు గురవ్వడం పట్ల వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. గతంలో హత్యాయత్నం అనీల్‌తోపాటు ఈ హత్య కేసులో నిందితుడైన బాక్సర్ శ్యామ్‌కూ (శ్యామ్ ప్రకాష్) తొలి నుంచి నేరచరిత్ర ఉంది. శ్యామ్‌పై కూడా రౌడీïÙట్ ఉన్నట్లు సమాచారం. పోలీసులు నిర్ధారించ లేదు. అయితే వీళ్లు ఇద్దరికీ తొలి నుంచి మనస్పర్థలు ఉన్నాయి. లోకల్ గ్యాంగ్ వార్‌తోపాటు ఒకరిపై ఒకరు హత్యా బెదిరింపులకు పాల్పడేవారు. ఈ క్రమంలో ఓసారి బాక్సర్ శ్యామ్ ఆదర్శనగర్ ప్రాంతంలోనే అనీల్‌పై దాడికి పాల్పడ్డాడు. అనీల్ కళ్లల్లో కారం కొట్టి హతమార్చేందుకు యత్నించాడు. ఆ సమయంలో అనీల్ ఎదురు దాడికి దిగడంతోపాటు స్థానిక యువకులు అడ్డుకోవడంతో అనీల్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత శ్యామ్‌ను చంపేస్తానని పలుసార్లు అనీల్ బెదిరించేవాడు. దీంతో ఇరువురి మధ్య పరిస్థితి గ్యాంగ్ వార్‌గా మారడంతో స్థానిక యువకులు ఇద్దరినీ కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేశారు. ఒకే ప్రాంతానికి చెందిన వారి మధ్య గొడవలు ఎందుకని సర్ది చెప్పారు. దీంతో ఇద్దరూ అయిష్టంగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవద్దంటూ ఒప్పందం చేసుకున్నారు. హత్యకు పక్కా ప్రణాళిక ఇరువురి ఒప్పందం నేపథ్యంలో అనీల్, శ్యామ్ మధ్య కక్షలు కొన్ని రోజులుగా సద్దుమనిగాయి. అయితే అవకాశం కోసం ఎదురు చూసిన బాక్సర్ శ్యామ్‌కు బుధవారం మధ్యాహ్నం అనీల్ ఆదర్శనగర్‌లో ఓ వేడుక సందర్భంగా మద్యం సేవిస్తూ కనిపించాడు. దీన్ని అవకాశంగా వినియోగించుకోవాలని భావించిన బాక్సర్ శ్యామ్ అతని దగ్గరుకు వెళ్లి ‘‘మామా... నాకు ఏమైనా ఉందా..’’ అని అడగడంతో ఇద్దరూ కొంతసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో శ్యామ్ కోసం అనీల్ బీరు కూడా తెప్పించాడు. ఆ బీరు తాగిన అనంతరం అనీల్ కోసం ఆఫ్ బాటిల్ మద్యం తెప్పిస్తానని చెప్పిన శ్యామ్... వేరే యువకుడికి డబ్బులు ఫోన్ పే చేసి బాటిల్ తెప్పించాడు. పథకం ప్రకారం అది కూడా పూర్తిగా అనీల్‌తో తాగించాడు. అది పూర్తయిన అనంతరం మళ్లీ ఇరువురు చేరో క్వార్టర్ మద్యం తాగుదామంటూ బాక్స్ర్ శ్యామ్æ కోరడంతో అనీల్ సరేనన్నాడు. దీంతో ఇరువురు దగ్గరలోని అనుపమ బార్ అండ్ రెస్టారెంట్‌కు వచ్చారు. ఇద్దరూ చెరో క్వార్టర్ తాగి బయటకొచ్చారు. ఈ క్రమంలో అదును కోసం ఎదురుచూస్తున్న బాక్సర్ శ్యామ్ ఒక్కసారిగా అనీల్‌పై దాడికి పాల్పడ్డాడు. బీరు బాటిల్‌తో తలపై బలంగా కొట్టాడు. మద్యం మత్తలో ఉన్న అనీల్ తేరుకునే లోపే మరోసారి దాడికి పాల్పడ్డాడు. దీంతో అనీల్ కుప్పకూలిపోగా శ్యామ్ అతడిపైకి ఎక్కి తనతోపాటు తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా చాతీతోపాటు పలు చోట్ల పొడిచాడు. దీంతో అనీల్ శరీరంపై పదుల సంఖ్యలో కత్తిపోట్లు పడ్డాయి. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. స్థానికులంతా భయాందోళనకు గురై పారిపోయారు. అనీల్ అక్కడికక్కడే మృతి చెందగా వెంటనే బాక్సర్ శ్యామ్ అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి నిందితుడు శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
హత్య కేసులో తొమ్మిది మంది అరెస్టు
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప నగర పరిధిలోని పాతకడప చెరువు కట్టమీద ఈనెల 12న జరిగిన సందానిబాషా అనే యువకుడి హత్య కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ బూడిద సునీల్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 20 రోజుల క్రితం నగరంలోని కాగితాలపెంటలో జరిగిన ఓ వివాహంలో సందానిబాషా, ఖాజామొహిద్దీన్ అనే వ్యక్తికి మధ్య గొడవ జరిగిందన్నారు. అప్పటికే వారి మధ్య ఉన్న పాతకక్షలను, వివాహంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని సందాని బాషాను హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో కడపకు చెందిన షేక్ రియాజ్, పఠాన్ అతావుల్లా, షేక్ ఇబ్రహీం ఖలీలుల్లా, షేక్ వాజిద్, షేక్ బాబ్జి, షేక్ జిలానీబాషా, బద్వేలు షేక్ గౌస్‌బాషా, షేక్ ఖాజా మొహిద్దీన్, షేక్ మహమ్మద్ బాబా తాజుద్దీన్‌లను అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, మూడు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐ అమర్నాథరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు సుధాకర్, రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు రాజే‹Ùకుమార్, శ్రీనివాసులు, జనార్దన్‌రెడ్డి, సుధాకర్ యాదవ్, ఎలీ్వప్రసాద్, శ్రీనివాసరావు, తిరుపతయ్య, శివప్రసాద్‌లను అభినందించారు. వారికి రివార్డు కోసం సిఫార్సు చేస్తామన్నారు. -
ఇరువర్గాల మధ్య కొట్లాట.. ఇద్దరి మృతి మరో..
కొరాపుట్: జిల్లాలోని దశమంతపూర్ సమితిలో ఉన్న దంబాగుడ గ్రామపంచాయతీ, హతిముండా గ్రామంలో రెండు వర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ధనపతి జాని(35), సహదేవ్ జాని(45) ఉండగా, గాయాలపాలైన వారిలో ధనేశ్వర్ జాని, సేనాపతి జాని, దిబా పొరిజ, రొజు జాని, మనోహర్ జాని, అంగరా జాని, చెండియా జాని ఉన్నారు. అయితే క్షతగాత్రుల్లో సేనాపతి జాని, ధనేశ్వర్ జానిల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యసేవల కోసం కొరాపుట్ సహిద్ లక్ష్మణ్ నాయక్ హాస్పిటల్‌కి తరలించారు. కాగా, విషయం తెలుసుకున్న కొరాపుట్ డీఎస్పీ నిరంజన్ బెహరా గ్రామానికి చేరుకుని, గొడవకు గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పాతకక్షల కారణంగా కొట్టుకున్నట్లు కొంతమంది.. ఆస్తి తగాదాలని మరికొంతమంది.. ఇరువర్గాల్లో ఓ వర్గం వారు చేతబడి చేస్తున్నారన్న కారణంతో ఘర్షణకు దిగినట్లు మరికొంతమంది చెప్పారు. ప్రస్తుతం ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా బలగాలను మోహరింపజేసినట్లు సమాచారం. ఇంతవరకు ఈ దుర్ఘటనకు సంబంధించి, నిందితులుగా పేర్కొంటూ ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని, పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాతే చర్యలు చేపడతామని ఐఐసీ అధికారి బిజయ్‌రాజ్ మజ్జి తెలిపారు. -
యల్లనూరులో భగ్గుమన్న పాత కక్షలు, ఇద్దరి దారుణ హత్య
సాక్షి, అనంతపురం: యల్లనూరులో పాత కక్షలు భగ్గుమన్నాయి. వ్యాసాపురం వద్ద ప్రత్యర్థులు.. ఇద్దరిని నరికి చంపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే నారాయణ, రాజగోపాల్ అనే వ్యక్తులు మృతి చెందారు. యల్లనూరు నుంచి అరవేటి గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. భూ తగాదాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. చదవండి: భయపెట్టి.. బెదిరించి.. బాలికపై లైంగికదాడి దారుణం: భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో.. -
బెడ్రూంలోకి వచ్చి నరికిన ప్రత్యర్థులు..
తిరువళ్లూరు: పాతకక్షల కారణంగా బెడ్రూంలో నిద్రిస్తున్న వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపిన సంఘటనతో తిరువళ్లూరు జిల్లా మేల్‌మణంబేడు గ్రామం ఉలిక్కిపడింది. ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తతకు దారి తీసింది. తిరువళ్లూరు జిల్లా మేల్‌మణంబేడు గ్రామానికి చెందిన మాజీ అధ్యక్షుడు తంగరాజన్. ఇతను 2016, అక్టోబర్ 14న వాకింగ్‌కు వెళుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తంగరాజన్ తమ్ముడు వెంకట్రామన్ (47) ఇంట్లో నిద్రిస్తుండగా రెండు బైక్‌లు, ఇండికా కారులో ముసుగుతో వచ్చిన ఆరుగురు వెంకట్రామన్ బెడ్రూంకు వెళ్లి నిద్రిస్తున్న అతన్ని దారుణంగా నరికి పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న వెంకట్రామన్‌ను బంధువులు తిరువళ్లూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. దీనిపై మృతుడి తరఫు వర్గం వారు వెళ్లవేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ గంగాధరన్ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో 17ఏళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన మనోహరన్‌ను తంగరాజ్ మద్దతుదారులు హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మనోహరన్ కుటుంబానికి, తంగరాజ్ కుటుంబానికి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే రెండేళ్ల కిందట తంగరాజన్ను, బుధవారం ఉదయం అతని తమ్ముడు వెంకట్రామన్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్తత.. వెంకట్రామన్ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. హత్య విషయం తెలసుకున్న వెంకట్రామన్ మద్దతుదారులు ఆగ్రహంతో గ్రామంలో బీభత్సం సృష్టించారు. మనోహరన్ మద్దతుదారులైన నలుగురి ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. శవపరీక్ష నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి రాస్తారోకో నిర్వహించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని సముదాయించి పరిస్థితిని అదుపుచేశారు. -
జంట హత్యలకు పాతకక్షలే కారణం
పాతకక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మాచవరం మండలం వేమవరంలో గురువారం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. మృతులు షేక్ జమాల్(45), షేక్ జిలాని(35) ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పోశం శ్రీనివాసరావు హత్య కేసులో నిందితులు. జంట హత్యల నేపథ్యంలో పల్నాడు ప్రాంతం వణికిపోతోంది. మాచవరం: గోటికి పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు. ఒకే పార్టీలో ఉండే రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. ఇదే గతంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, తాజాగా షేక్ జమాల్, జిలానీ ప్రాణాలు కోల్పోయేలా చేసింది. వాటర్ ప్లాంట్ వివాదమే హత్యలకు కారణం గత ఎన్నికల్లో వేమవరం సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పోశం శ్రీనివాసరావు పోటీ చేశారు. టీడీపీ శ్రీనివాసరావుకు మద్దతు ప్రకటించింది. వైఎస్సార్ సీపీ తరఫున చంద్రశేఖర్ పోటీ చేశారు. ఎన్నికల్లో శ్రీనివాసరావు గెలుపొందారు. గ్రామంలో ముస్లిం వర్గం ఎక్కువ. కొంత కాలం తర్వాత గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ముస్లిం వర్గానికి చెందిన షేక్ జమాల్, జిలానీ పంచాయతీ తీర్మానం అడిగారు. నిరాకరించిన సర్పంచ్ శ్రీనివాసరావు స్వయంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో వారి మధ్య వివాదం రేగింది. కొన్నాళ్ల తర్వాత వాటర్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. అదే సమయంలో జమాల్, జిలానీ తమకు విక్రయించాలని పెద్దల ద్వారా చెప్పించారు. అందుకు శ్రీనివాసరావు అంగీకరించకపోవడంతో వారి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధికి పార్టీ శ్రేణులు తీసుకెళ్లినా సమస్య పరి ష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు. తాజాగా షేక్ జమాల్, జిలానీ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పకడ్బందీ వ్యూహంతోనే హత్య మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు హత్యకు ప్రతీకారంగానే ప్రస్తుత జంట హత్యలు జరిగినట్లు సమాచారం. శ్రీనివాసరావు హత్య కేసులో షేక్ జమాల్, జిలానీ ప్రధాన నిందితులు. శ్రీనివాసరావు హత్య తర్వాత గ్రామం ఏడాదిపాటుగా ప్రశాంతంగా ఉంది. గురువారం సాయంత్రం జమాల్‌ను హత్య చేశారు. అర్ధ రాత్రి 11 గంటల వరకు గాలించగా వేమవరం, తురకపాలెం రోడ్డులో జిలాని మృతదేహాన్ని గుర్తించారు. -
నదిచాగిలో దారుణ హత్య
కౌతాళం : మండల పరిధిలోని నదిచాగి గ్రామంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు హతమయ్యారు. నల్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..డీలరు ఈరన్న, ఈడిగ శివల మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో వివాదం నెలకొని ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. కత్తులు, ఆయుధాలతో ముకుమ్మడిగా దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో డీలరు ఈరన్న(55) అక్కడిక్కడే మృతి చెందాడు. ఈరన్న పెద్ద కుమారుడు పక్కీరయ్య, చిన్న కుమారుడు ఉసేని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడుల్లో చెన్నప్ప, టపల్ పక్కీరయ్యలకు రక్త గాయాలయ్యాయి. దాడిలో గాయపడ్డ వారిని 108 అంబులెన్స్ ద్వారా ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ నాగరాజురావు, ఎస్ఐ శ్రీనివాసులు పరిశీలించారు. కేసు నమోదు చేయలేదని, అయితే ఈ ఘటనపై అన్ని కోణాల్లోను విచారణ జరుపుతున్నామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో రెండు రోజుల క్రితం ఈదురుగాలులకు స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. రాత్రి ఏడు గంటల సమయంలో ఇరువర్గాల ఘర్షణతో ఏమిజరుగుతుందో అర్థంకాక గ్రామస్తులు భయాందోళన చెందారు. -
హలిగేరిలో ఇద్దరి దారుణ హత్య
ఆస్పరి: మండల పరిధిలోని హలిగేరి గ్రామంలో పాతకక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. తలారి వర్గీయులు.. బంగి వర్గానికి చెందిన బంగి శ్రీనివాసులు(50), బంగి మల్లయ్య(40)లను దారుణంగా హత్య చేశారు. ఘటనలో రామాంజినేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జంట హత్యలతో గ్రామం వణికిపోతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బంగి, తలారి వర్గీయుల మధ్య 2011 సంవత్సరం నుంచి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. మంగళవారం బంగి శ్రీనివాసులు, బంగి మల్లయ్యలు ఎరువులు తీసుకొచ్చేందుకు రామాంజినేయులు ఆటోలో ఆదోనికి బయలుదేరారు. సాయంత్రం హలిగేరికి తిరిగొస్తుండగా శివారులో తలారి వర్గానికి చెందిన అంజినయ్య, మరికొందరు రాళ్లతో దాడి చేయడంతో డ్రైవర్ ఆటోను ఓ పక్కన నిలిపేశాడు. ఆ వెంటనే ఆటోలోని బంగి శ్రీనివాసులు, బంగి మల్లయ్యలను కత్తులు, వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. డ్రైవర్ భయంతో పరుగు తీయగా వెంబడించి నరికి పరారయ్యారు. గాయపడిన రామాంజనేయులును బంధువులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన వెంటనే ఆస్పరి ఎస్ఐలు లక్ష్మీనారాయణ, కిరణ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, ఆలూరు సీఐ శంకరయ్యలు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హత్యలకు కారణాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత హత్యోదంతాలకు పాత కక్షలే కారణమని తెలిపారు. గ్రామంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.