
నిందితుల అరెస్టు వివరాలను తెలియజేస్తున్న కడప డీఎస్పీ బూడిద సునీల్
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప నగర పరిధిలోని పాతకడప చెరువు కట్టమీద ఈనెల 12న జరిగిన సందానిబాషా అనే యువకుడి హత్య కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ బూడిద సునీల్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 20 రోజుల క్రితం నగరంలోని కాగితాలపెంటలో జరిగిన ఓ వివాహంలో సందానిబాషా, ఖాజామొహిద్దీన్ అనే వ్యక్తికి మధ్య గొడవ జరిగిందన్నారు. అప్పటికే వారి మధ్య ఉన్న పాతకక్షలను, వివాహంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని సందాని బాషాను హత్య చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కేసులో కడపకు చెందిన షేక్ రియాజ్, పఠాన్ అతావుల్లా, షేక్ ఇబ్రహీం ఖలీలుల్లా, షేక్ వాజిద్, షేక్ బాబ్జి, షేక్ జిలానీబాషా, బద్వేలు షేక్ గౌస్‌బాషా, షేక్ ఖాజా మొహిద్దీన్, షేక్ మహమ్మద్ బాబా తాజుద్దీన్‌లను అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, మూడు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అమర్నాథరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు సుధాకర్, రామసుబ్బారెడ్డి, కానిస్టేబుళ్లు రాజే‹Ùకుమార్, శ్రీనివాసులు, జనార్దన్‌రెడ్డి, సుధాకర్ యాదవ్, ఎలీ్వప్రసాద్, శ్రీనివాసరావు, తిరుపతయ్య, శివప్రసాద్‌లను అభినందించారు. వారికి రివార్డు కోసం సిఫార్సు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment