an old man
-
బ్యాంకు వద్ద వృద్ధుడికి టోకరా
జీలుగుమిల్లి : మండలంలోని దర్భగూడెంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో బుధవారం ఓ వృద్ధుడి నుంచి రూ.14వేల 500లను ఓ అగంతకుడు చోరీ చేశాడు. ఈ చోరీపై హెడ్‌కానిస్టేబుల్ ఇరపం భాస్కర్ కథనం ప్రకారం.. దర్బగూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సయ్యద్ నన్నా సాహెబ్ తన పింఛన్ డబ్బు తీసుకోవాడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా దర్బగూడెం శాఖకు బుధవారం ఉదయం వెళ్లాడు. బ్యాంకులో రూ.14.500లు సొమ్ము డ్రాచేసుకుని బయటకు వస్తుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి మిమ్మలి క్యాషియర్ పిలుస్తున్నారని చెప్పాడు. వృద్ధుడు వెనుకకు తిరిగి కౌంటర్ వైపు వెళ్తుండగా సంచిలో ఉన్న సొమ్మును పట్టుకుని ఉడాయించాడు. ఈ విషయంపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
మద్యం దొరకక ఆత్మహత్య
రాజేంద్రనగర్(రంగారెడ్డి): కల్తీ కల్లు లభించకపోవడం.. ఇంట్లో కుటుంబ సభ్యులు మద్యాన్ని మానాలని ఒత్తిడి తేవడంతో మనస్తాపం చెందిన ఓ వృద్ధుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్వాడ ప్రాంతానికి చెందిన సత్తయ్య(75) కల్తీకల్లుకు అలవాటు పడ్డాడు. అయితే, కొన్ని రోజులుగా కల్తీకల్లు దొరకడం లేదు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు కల్లు తాగవద్దంటూ ఒత్తిడి తెస్తున్నారు. అటు కల్లు దొరకకపోవడంతోపాటు కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో రెండు, మూడు రోజులుగా ఒత్తిడికి లోనయ్యాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టు ఆవరణలో వృద్ధుని ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని కోర్టు ఆవరణని మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 70 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వృద్ధుడు చెట్టుకు ఉరివేసుకున్నాడు. తెల్ల చొక్కా. తెల్ల దోవతి, తెల్ల కండువా ధరించి ఉన్నాడు. అతని బ్యాగులో కర్ణాటకకు చెందిన బీడీల కట్ట ఉంది. బహుశా అతను కర్ణాటకకు చెందినవాడని భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛను కోసం వెళ్లి మరలిరాని లోకాలకు..
అనంతపురం: పింఛను కోసం ఓ వృద్ధుడు మూడు కిలోమీటర్ల పాటు కాలినడకన వెళ్లి... అలసి చివరికి తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో గురువారం జరిగింది. బుదిలివాండ్ల పల్లి గ్రామానికి చెందిన వెంకట శివారెడ్డి (70) వృద్ధాప్య పింఛను కోసం గురువారం మూడు కిలోమీటర్ల దూరంలోని జెక్కసముద్రం వెళ్లాడు. పింఛను తీసుకున్న తర్వాత ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు శివారెడ్డిని పైకిలేపి ఆయన స్వగ్రామం వెళ్లేందుకు ఆటో ఎక్కించారు. ఇంటికి చేరుకున్న తర్వాత వెంకటశివారెడ్డి పడుకుని మళ్లీ లేవలేదు. ఆయన గుండె ఆగి మరణించినట్లు సమాచారం. శివారెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. (గోరంట్ల)