కోర్టు ఆవరణలో వృద్ధుని ఆత్మహత్య | Old man committed suicide at the court premises | Sakshi
Sakshi News home page

కోర్టు ఆవరణలో వృద్ధుని ఆత్మహత్య

Published Mon, Oct 19 2015 12:57 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కోర్టు ఆవరణలో వృద్ధుని ఆత్మహత్య - Sakshi

కోర్టు ఆవరణలో వృద్ధుని ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని కోర్టు ఆవరణని మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 70 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వృద్ధుడు చెట్టుకు ఉరివేసుకున్నాడు.

తెల్ల చొక్కా. తెల్ల దోవతి, తెల్ల కండువా ధరించి ఉన్నాడు. అతని బ్యాగులో కర్ణాటకకు చెందిన బీడీల కట్ట ఉంది. బహుశా అతను కర్ణాటకకు చెందినవాడని భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement