older persons
-
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: వయోవృద్ధులు అంటే చిన్న పిల్లలతో సమానం. చిన్న పిల్లలను చూసుకున్నట్టే వారినీ చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలా మందికి తమ కుటుంబాల్లోని పెద్ద వయసువారిని చూసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఉన్నా.. అది ప్రాక్టికల్‌గా సాధ్యపడకపోవచ్చు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ వేరే ప్రాంతాలు, దేశాల్లో ఉండేవారు.. ఇంట్లోనే ఉన్నా పొద్దస్తమానం పనుల ఒత్తిడితోనే సతమతం అయ్యేవారు.. పెద్దవారి ఆరోగ్యం, ఆలనాపాలనా చూసుకోవడానికి ‘టెక్నాలజీ’సాయం చేస్తోంది.వృద్ధుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసే స్మార్ట్ వాచీలు, పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. రక్తపోటు, గుండె వేగం, షుగర్ లెవల్స్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు గమనించి.. ‘మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ల సాయంతో ఆరోగ్యాన్ని విశ్లేషించి హెచ్చరించే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే వెంటనే.. చికిత్స అందించేందుకు, పెద్దలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చేందుకు వీలు ఏర్పడుతోంది. పెద్దల కోసం ‘అన్వయ’!..: హైదరాబాద్ కేంద్రంగా ‘అన్వయ కిన్ కేర్ టెక్నాలజీ’వృద్ధులకు అవసరమైన సేవలు అందిస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వయోవృద్ధులను స్మార్ట్ వాచ్ సాయంతో గమనిస్తూ ఉండవచ్చు. అందులో ప్రత్యేక యాప్ పెద్దల ఆరోగ్యాన్ని గమనించడమే కాదు.. ఒకవేళ జారిపడినా, ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే పిల్లలకు అలర్ట్ పంపుతుంది.పిల్లలు గనుక దగ్గర లేకపోతే అన్వయ కేర్ సెంటర్ తమ సిబ్బందిని వెంటనే పంపి అవసరమైన సాయం అందిస్తుంది. అంతేకాదు.. వయోవృద్ధుల్లో చాలా మందికి ‘డిమెన్షియా (మతిమరుపు)’వ్యాధి వస్తుంటుంది. ఏం చేస్తున్నామో కూడా తెలియని, అర్థంకాని స్థితిలోకి వెళ్లిపోతుంటారు. అలాంటి వారికోసం కూడా ‘అన్వయ’లో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ వంటివాటితో పెద్దలను మానిటర్ చేస్తారు. నిర్ధారిత ప్రాంతం వదిలి పెద్దవారు బయటకి వెళ్తే.. వెంటనే పిల్లలకు మెసేజ్ వెళ్తుంది. ఎక్కడున్నారో ఆచూకీ చూపుతుంది. -
International Day for Older Persons: భారమవుతున్న పేగు బంధాలు..
పిల్లలు పుట్టింది మొదలు జీవితంలో స్థిరపడే వరకు వారి కోసమే అన్నట్లుగా కష్టపడుతుంటారు తల్లిదండ్రులు. వృద్ధాప్యంతో బాధపడుతున్నా.. పిల్లలు దూరంగా ఉంటున్నా.. వీరి మనసు మాత్రం బిడ్డల చుట్టే తిరుగుతుంది. ఎన్నో త్యాగాలు చేసి కూడబెట్టిన ఆస్తిపాస్తులను వారి బిడ్డల పేరున రాస్తున్నారు. అప్పటి వరకు బాగా ఉండే పిల్లలు ఆస్తి చేతిలో పడగానే మారిపోతున్నారు. కన్న వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. చట్టం ఏం చెబుతుందంటే? కేంద్రం తల్లిదండ్రులు, వయోవృద్ధులు పోషణ చట్టం– 2007 తీసుకొచ్చింది. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది. పిల్లల నుంచి పోషణ ఖర్చులు ఇప్పించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. బాధితులు రెవెన్యూ డివిజన్ స్థాయిలోని ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై ఆర్డీఓ విచారణ అనంతరం పోషణ ఖర్చులు ఇవ్వాలని ఆదేశిస్తారు. ఆదేశాలు అమలుకాకుంటే జిల్లా అప్పి లేట్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. పిల్లలకు రాసిచ్చిన ఆస్తులను స్వాధీనం చేసుకునే వీలు కల్పిస్తుంది. అయితే తొలుత గృహహింస కేసులు నమోదు చేయిస్తున్నా..ఆ తర్వాత తమ పిల్లలు ఇబ్బంది పడతారనే ఆలోచనతో వాటిని ఉపసంహరించుకుంటున్నారు. పింఛన్ డబ్బులూ లాగేసుకుంటుండ్రు ప్రాణం పోసిన అమ్మానాన్నలకు చివరకు ఛీత్కారాలే మిగులుతున్నాయి. కొందరైతే తల్లిదండ్రుల పింఛన్ డబ్బులను కూడా లాగేసుకుంటున్నారు. కన్నవారికి ఆసరాగా ఉండాల్సిన కుమారులే నరకం చూపిస్తున్నారు. ఇళ్లు, స్థలాలను లాగేసుకుని బయటికి వెళ్లగొడుతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. వయోభారంతో ఉన్న వారు కష్టాలను ఎవరికి చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం ప్రతినెలా వీరికి ఇస్తున్న పెన్షన్ డబ్బులను కూడా కొడుకులు, కో డళ్లు, మనవళ్లు బలవంతంగా వారి నుంచి లాక్కుంటున్నారు. బయటికి చెబితే పిల్లల పరువు పో తుందనే భయంతో వృద్ధులు మౌనంగా ఉంటున్నారు. 60 శాతం పెరిగిన వేధింపులు తల్లిదండ్రులపై వేధింపుల విషయంలో పేదా గోప్పా తేడా లేదు. అంతో ఇంతో ఆస్తిపాస్తులున్న సంపన్న కుటుంబాల్లోనే ఈ వేధింపులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. 28.6 శాతం మంది వయోవృద్ధులు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురైతే.. కోవిడ్ తర్వాత ఈ సంఖ్య 60 శాతం పెరిగినట్లు అంచనా. కోవిడ్ సమయంలో తుమ్మినా, దగ్గినా ఛీ త్కారాలు తప్పలేదు. కొంతమందైతే ఏకంగా వా ళ్లను గదుల్లో బంధించిన దాఖలాలు లేకపోలేదు. ఇదీ పరిస్థితీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌జిల్లాల నుంచి పో షణ వేధింపులకు సంబంధించి ప్రతి నెలా 35 నుంచి 40 ఫిర్యాదులు అందుతున్నాయంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2020–21లో ప్రభుత్వ వయో వృద్ధుల సహాయ కేంద్రం కాల్ సెంటర్ 14567 నంబర్‌కి 2020–21లో రాష్ట్ర వ్యాప్తంగా 46,771 ఫిర్యాదులు అందగా.. 2021–2022లో 14,567 ఫిర్యాదులు అందాయి. వీ టిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 2868 (37శాతం), మేడ్చల్‌లో 1404(18 శాతం) రంగారెడ్డిలో 1093(14 శాతం) ఫిర్యాదులు అందడం గమనార్హం. -
చరమాంకంలో చక్కని ‘కేర్’
సాక్షి, హైదరాబాద్: వయోవృద్ధులు జీవిత చరమాంకంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వైద్యసేవల కార్యక్రమానికి ప్రజల్లో మంచిస్పందన కనిపించడంతో.. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తుదిశ్వాస వరకూ నొప్పి, బాధ తెలియకుండా సంతోషంగా గడిపేందుకు అవసరమైన సపర్యలు చేయడాన్ని వైద్య పరిభాషలో ‘పాలియేటివ్ కేర్’గా పిలుస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటినుంచో ఇది అమలవుతోంది. ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో ఈ సేవలను పొందడం అందరికీ సాధ్యం కాదు. దీంతో చాలామంది అంతిమ దశలో బాధను, వ్యథను అనుభవిస్తూ తనువుచాలిస్తారు. ఆసుపత్రికి వెళ్లలేక. అవసరమైన కనీస సేవలందక నొప్పితోనే చనిపోతుంటారు. ఇలాంటి వారికి అవసరమైన వైద్య సేవలు, మందులు అందించగలిగితే వారి జీవిత కాలాన్ని పొడిగించడంతోపాటు, నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించొచ్చు. ఈ ఉద్దేశంతోనే కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమం కింద దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మంచాన పడ్డవారికి వారి ఇంటికే వెళ్లి సేవలందించాలని నిర్ణయించారు. హెల్త్ రికార్డుల నమోదులో ఆశ వర్కర్లు కేరళలో ఈ తరహా సేవలు కొనసాగుతుండగా, మన రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా మన రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఈ సేవలను ఇప్పటికే ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తూ వివరాలను నమోదు చేస్తున్నారు. అలాగే ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? మంచాన పడ్డవారు, తమ పనులు తాము చేసుకోలేనివారు ఎవరైనా ఉన్నారా అని కూడా ఆశ వర్కర్లు ఆరా తీస్తున్నారు. అలాంటి వారి వివరాలు తీసుకుని ఏఎన్ఎంలకు సమాచారమిస్తారు. ఏఎన్ఎంలు రోగి ఇంటికి వెళ్లి ‘పాలియేటివ్ కేర్’అవసరమా? లేదా? అవసరమైతే ఎలాంటి సేవలు అవసరమన్న సమాచారం సేకరించి మెడికల్ ఆఫీసర్‌కు నివేదిస్తారు. డాక్టర్ వెళ్లి ఆ రోగికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడంతోపాటు సదరు రోగికి ఎలా వైద్యం చేయాలన్న దానిపై కుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తారు. అవసరాన్ని బట్టి వారానికి ఒకట్రెండు సార్లు.. లేదా రెండ్రోజులకోసారి రోగి ఇంటికి వైద్య బృందం (డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, నర్సు) వెళ్లి సపర్యలు చేస్తుంది. నొప్పి నివారణ, రోగ నియంత్రణ మందులు ఇస్తారు. రోగి మానసిక ఉల్లాసానికి అవసరమైన కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తారు. ఇంట్లో సేవలు అందించలేని పరిస్థితి ఉంటే సమీప ప్రభుత్వ దవాఖానలో ‘పాలియేటివ్ కేర్’వార్డుల్లో ఉంచి సపర్యలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రమంతటా విస్తరణ ఆదిలాబాద్, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్ (రూరల్), జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాల్లో ప్రస్తుతం పాలియేటివ్ సేవలు ప్రారంభించారు. జిల్లాకు ప్రత్యేక వైద్య బృందాన్ని, ఓ వాహనాన్ని కేటాయించారు. వైద్య బృందం, రోజూ కనీసం 12 మంది రోగుల ఇంటికి వెళ్లి సేవలు చేయాల్సి ఉంటుంది. ఈ 8 జిల్లాల్లో ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటివరకూ 1,860 మంది రోగులను గుర్తించారు. వీరుకాకుండా మరో 981 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకుని పాలియేటివ్ సేవలందిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. స్టాఫ్ నర్సులు, ఫిజియోథెరపిస్టులకు ఇప్పటికే అవసరమైన శిక్షణ కూడా ఇచ్చారు. చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు ఉన్నట్టుగానే, త్వరలోనే జిల్లా ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేయనున్నారు. నిమ్స్‌లోనూ వృద్ధుల కోసం (జెరియాట్రిక్) ప్రత్యేక వార్డు సిద్ధం చేస్తున్నారు. -
చట్టమున్నా.. చట్టుబండలే!
సాక్షి, హైదరాబాద్: వృద్ధులపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నవారేకాక, పదవీ విరమణ తర్వాత ఇంటి పట్టునే ఉంటున్న వృద్ధులు పలు రకాల మోసాలు, దాడులకు గురవుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిఘటించే శక్తిలేక నిస్సహాయ స్థితిలో ఉండే పండుటాకులు సులభంగా దాడులకు గురవుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ‘క్రైమ్ ఇన్ ఇండి యా’ నివేదికలో సీనియర్ సిటిజన్స్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను పొందుపరిచింది. ఏటా వృద్ధులపై దాడులు పెరుగుతున్నాయని తెలిపింది. రాష్ట్రంలోనూ మూడేళ్లుగా వృద్ధులపై జరిగిన దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న దాడులు.. రాష్ట్రంలో 2014 సంవత్సరానికి సంబంధించి సీనియర్ సిటిజన్స్పై జరిగిన దాడులు, మోసాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడిన ఘటనలపై 422 కేసులు నమోదయ్యాయి. 2015లో ఈ కేసుల సంఖ్య 1,519కి చేరింది. అంటే దాదాపు 200 శాతం దాటిపోయింది. 2016 సంవత్సరంలో 1,382 కేసులు నమోదయినట్టు నివేదికలో తెలిపింది. 2011లో ప్రత్యేక చట్టం.. సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2011లోనే అప్పటి ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజన్ యాక్ట్ (2011) కింద ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎంత మంది సీనియర్ సిటిజన్లున్నారు? వారు నివసిస్తున్న ప్రాంతం, వారికి సహాయకులుగా ఉంటున్న వారెవరు? తదితర వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో పొందుపరచాలి. అలాగే స్థానిక కాలనీల అసోసియేషన్ల ఆధ్వర్యంలో యువకుల సహాయంతో వాలంటీర్ కమిటీని ఏర్పాటుచేసి సీనియర్ సిటిజన్లకు సహాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఈ కమిటీలో ఒక ప్రభుత్వ అధికారి, యూనిఫాం సర్వీస్‌లో పనిచేసి రిటైర్ అయిన అధికారి ఉండేలా చర్యలు చేపట్టాలి. సీనియర్ సిటిజన్స్ ఎలాంటి ఫిర్యాదుచేసినా వారి ఇంటికి వెళ్లి వివరాలు తీసుకొని న్యాయం చేసేందుకు కృషిచేయాలని ఆ చట్టంలో పొందుపరిచారు. అసలు ఈ చట్ట ప్రకారం ఎన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఇలాంటి చర్యలు తీసుకున్నారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. అసలు ఇలాంటి చట్టం ఉందన్న విషయం కూడా చాలా మంది తెలియదని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు ఇటీవల డీజీపీని కలసి తమ ఆందోళనను తెలిపాయి. పోలీసు శాఖతోపాటు, వివిధ ప్రభుత్వ విభాగాలు తమ సమస్యలపై తక్షణం స్పందించేలా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ల ప్రతినిధులు కోరుతున్నారు. పెండింగ్‌లో 2,012 కేసులు.. మూడేళ్లుగా సీనియర్ సిటిజన్స్పై జరిగిన దాడులు, మోసాలు, తదితర కేసుల్లో పోలీస్ శాఖ పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ మూడేళ్లలో 2,012 కేసులు ఇంకా దర్యాప్తు దశలోనే ఉండటం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. వృద్ధులకు మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడే వారిని గుర్తించి కూడా అరెస్ట్ చేయని సంఘటనలు చాలా ఉన్నాయని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అలాగే హత్య వంటి తీవ్రమైన కేసుల్లోనూ తాము డీజీపీ, హోంశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగి కేసులు వేస్తే తప్ప న్యాయం జరగడం లేదని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తంచేశాయి. జీవితంలో చివరి మజిలీలో ఉన్న తమ రక్షణకు ప్రత్యేకమైన చట్టం ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఆయా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
నాలుగు నెలలుగా గోస!
కందుకూరు: పింఛన్ డబ్బులతోనే బతుకులీడ్చే దీనులను అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇచ్చే అరకొర డబ్బులకు లబ్ధిదారుల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. మండలంలో నాలుగు నెలలుగా పింఛన్లు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గోస పడుతున్నారు. అధికారులు మాత్రం ఈ నెల వచ్చే నెల ఒకేసారి మొత్తం వస్తుందని చెప్పి పంపుతున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే దయనీయ పరిస్థితి నెలకొంది. పింఛన్లు అందని వారు దాదాపు ప్రతి గ్రామంలో పది, పదిహేను, ముప్పై మంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మండలంలోని వృద్ధాప్య, వితంతు, అభయహస్తం, వికలాంగ పింఛన్ లబ్ధిదారులు 6,737 మంది ఉన్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతి నెలా రూ.200, వికలాంగులకు, అభయహస్తం కింద మహిళలకు రూ.500 చొప్పున పింఛన్లు అందాల్సి ఉంది. వీటిని ప్రభుత్వం మణిపాల్ ఏజెన్సీ ద్వారా సీఎస్పీలకు అందించి వారి నుంచి లబ్ధిదారులకు ప్రతి నెలా 1 నుంచి 5 లేదా పదో తేదీ లోపు అందజేయాలి. కాగా ఏప్రిల్, మే, జూన్, జులై నెలల పింఛన్లు లబ్ధిదారుల్లో చాలా మందికి అందలేదు. పింఛన్ల పంపిణీ కోసం కొత్త స్మార్ట్ కార్డులు అందించే ప్రక్రియలో భాగంగా ఫొటో తీసుకుని ఎన్రోల్మెంట్ చే సిన లబ్ధిదారులకు నాలుగు నెలలుగా పింఛన్ పంపిణీ కాలేదు. ఇదేమని అధికారుల్ని ప్రశ్నిస్తే ప్రాసెస్ అవుతోంది, మీ డబ్బు ఎక్కడికి పోదూ.. వచ్చే నెల మొత్తం ఒకేసారి అందుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో డబ్బులు అందుతాయో లేదోననే సందిగ్ధంలో పడ్డారు లబ్ధిదారులు. కనిపించిన అధికారినల్లా అడుగుతూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కనిపించిన వారందరికీ గోడు చెప్పుకొంటున్న.. నాలుగు నెలల నుంచి పింఛన్ రావడంలేదు. గ్రామంలో ఎప్పుడూ పింఛన్ డబ్బు ఇచ్చేవారిని అడిగితే పై నుంచి రాలేదు. అధికారుల్ని అడగండి అని అంటున్నారు. ఏం చేయాలో తెలియక కనిపించిన వారందరికీ గోడు చెప్పుకొంటున్నా. - సత్తెమ్మ, జైత్వారం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.. నాలుగు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. నడవటం చేతగాకపోయినా ఏదోలా కష్టాలకోర్చి పింఛన్ డబ్బు కోసం తిరగాల్సి వస్తోంది. నెలనెలా వచ్చే ఆ డబ్బే మాకు ఆధారం. ఇప్పుడు అదీ బంద్ అయింది. - సాయిలు, జైత్వారం -
ప్రకాశం భగభగ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా మండుతోంది. జూన్ మూడో వారానికి వర్షాలు పడి చల్లబడాల్సిన భానుడు చెలరేగిపోతున్నాడు. ఉదయం ఆరు గంటల నుంచే నిప్పులవాన కురిపిస్తున్నాడు. రోహిణీకార్తె వెళ్లిపోయిన తర్వాత ముదిరిన ఎండలు రోళ్లను పగలగొడుతున్నాయి. రోజురోజుకీ ఎండ వేడి పెరిగిపోతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. = ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు మందగిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అత్యంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. = మే నెల ఎండలు మృగశిర కార్తెలో కనిపించడం విశేషం. కార్తె ప్రారంభమై వారం రోజులు అయినా వర్షాలు కురవకపోవడంతో పాటు వడగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమవుతున్న ఎండ సాయంత్రం ఆరు గంటలు దాటుతున్నా తగ్గడంలేదు. = ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల సమయంలో రోడ్డు మీద వెళుతుంటే నిప్పుల కొలిమిలోంచి వెళ్లినట్లే ఉంటోంది. రాత్రి పదిగంటలు అయినా ఉక్కపోత తగ్గడం లేదు. వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. = దీంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 12 నుంచి మొదలైన వడగాడ్పులకు సోమవారం వరకూ 48 మంది మృతి చెందారు. మంగళవారం 18 మంది మృత్యువాత పడ్డారు. = విద్యుత్ వాడకం పెరుగుతుండటంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు పలుమార్లు అంతరాయం కలిగింది. మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ సర ఫరా నిలిపేస్తున్నారు. = అస్తవ్యస్త విద్యుత్ సరఫరా వల్ల రైతులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రకటించిన సమయానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో పొలాల్లోనే వేచి చూడాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. = విద్యుత్ కోతల పట్ల ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఉలవపాడు మండల పరిధి అలగాయపాలెం సబ్‌స్టేషన్‌ను మంగళవారం స్థానిక ప్రజలు ముట్టడించారు. విద్యుత్ ఉద్యోగులను లోపలే ఉంచి బయట గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకుని వచ్చిన ఏఈ హరికృష్ణను కూడా లోపలే ఉంచి గేటు బయట తాళం వేశారు. = ఎండవేడిమికి మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎండకు తోడు వేడిగాలులు, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకెళితే మండుతున్న ఎండ, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
తొలగింపులపై తిరుగుబావుటా
ఎమ్మిగనూరు రూరల్: స్మార్ట్ కార్డు లేదనే సాకుతో పింఛన్లను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తమపై రుద్దడం భావ్యం కాదని వారు వాపోతున్నారు. ప్రతి నెలా లబ్ధిదారుల్లో కోత పెట్టడం ఆందోళనకు కారణమవుతోంది. ఎమ్మిగనూరు మండలంలో ఒక్క జూన్ నెలలోనే 410 పింఛన్లను తొలగించడంతో బాధితులు రోడ్డెక్కారు. సోమవారం గుడేకల్ గ్రామానికి చెందిన 170 మంది లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు సోమప్ప సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. పింఛన్లను పునరుద్ధరించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు. వీరికి వివిధ ప్రజా సంఘాల నేతలు రాముడు, జబ్బార్ మద్దతు పలికారు. మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వకపోగా.. ఏకంగా తొలగించడం పట్ల వృద్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పట్టణ, రూరల్ ఎస్ఐలు ఇంతియాజ్‌బాషా, నల్లప్పలు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరినా వారు ససేమిరా అన్నారు. ఎంపీడీఓ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎంపీడీఓ పద్మజ అక్కడికి చేరుకుని పింఛన్లను పునరుద్ధరించే విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం జరిగేలా కృషి చేస్తానని చెప్పడంతో బాధితులు శాంతించారు. -
వయో భారం...పింఛన్ దూరం
వీరఘట్టం, న్యూస్‌లైన్: పండుటాకులకు పింఛను కష్టాలు ప్రతినెలా వేధిస్తున్నాయి. సామాజిక భద్రత అంటూ ప్రభుత్వం బొటనవేలి పరీక్ష పెట్టి పండుటాకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వయస్సు మీద పడి వంట్లో సత్తువ పోయి లేని వృద్ధులకు స్మార్ట్‌కార్డు విధానం అమలు చేయడం వల్ల ప్రతినెలా వచ్చే రూ.200 పింఛను కూడా రాకుండాపోతోంది. జీవిత చరమాంక దశలో శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధులు ప్రభుత్వం పెట్టిన విషమ పరీక్షలతో పస్తులుంటున్నారు. పింఛను కోసం నిత్యం పోస్టాఫీస్‌లు, మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో పింఛనుదారుల అవస్థలు వర్ణనాతీతం. పింఛను రాక, ఆసరా లేక కాలం వెల్లదీస్తున్నారు. సుమారు మొత్తం 2.90 లక్షలు మంది వృద్దాప్య, వికలాంగ, వితంతు పింఛను దారులున్నారు. వీరిలో వేలిముద్రలు సరిపోవడం లేదని దాదాపు 15 వేల మందికి ప్రభుత్వం పింఛను నిలిపివేసింది. ఏం జరిగిందో, పింఛను ఎందుకు రావడం లేదో తెలియక వృద్ధులు స్థానిక మండల కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడుతున్నారు. వీరిపై కనీసం దయగల వారు కరువయ్యారు. పింఛను పంపిణీలో అడ్డుకట్టలు వేసేందుకంటూ స్మార్ట్‌కార్డు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తె చ్చింది. పింఛనుదారుల బొటనవేలి ముద్రలు సేకరించి నమోదు చేశారు. ప్రతి నెలా పింఛనుదారుల బొటనవేలి ముద్రలను స్మార్ట్‌కార్డు తెరమీద తెలుసుకొని పాత వాటితో సరిపోతేనే ఆ నెల పింఛను ఇస్తారు. ఇలా నమోదు చేసిన వేలిముద్రలు మూడు నెలల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిపోతున్నాయి. ఆ తర్వాత నెల నుంచే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. వృద్దుల్లో రక్తం లేక, నరాల బలహీనత వస్తుంది. సత్తువ లేకపోవడం, వణుకుతూ బలహీనంగా వేలు అద్దుతుండడంతో స్మార్ట్‌కార్డు మిషను వారి వేలిముద్రలను గుర్తించలేకపోతుంది. దీంతో వేలిముద్రలు సరిపోవడం లేదంటూ అధికారులు ఏకంగా పింఛన్లు నిలిపివేస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో జిల్లాలో దాదాపు 15 వేల మంది వృద్ధులకు పింఛన్లు నిలిపివేసినట్టు నివేధికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా వృద్ధులకు వేలిముద్రల కష్టాలు తొలగించి సకాలంలో పింఛన్లు అందేలా చూడాలని పలువురు అధికారులను కోరుతున్నారు. వేలి ముద్రల కష్టాలను తొలగిస్తాం వృద్దాప్య పింఛన్లలో వేలిముద్రలు సరిపోకపోతే ఆ వ్యక్తి సరైన వ్యక్తా కాదానని నిర్ధారిస్తాం. సరైన వ్యక్తి అయితే ఆ వ్యక్తికే నేరుగా పింఛను ఇవ్వాలని మండల కో-ఆర్డినేటర్లకు సూచించినట్టు డీఆర్డీఏ పీడీ ఎస్.తనూజారాణి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అలాగే మంచం దిగలేని, వేలిముద్రలు పడలేని కుష్టురోగుల బంధువుల వస్తే వారి దగ్గర నుంచి అగ్రిమెంట్ ఇస్తే పింఛను పంపిణీ చేయాలని కో-ఆర్డినేటర్లకు ఆదేశించామని ఆమె తెలిపారు. -
‘ఆసరా’తో ఆటలు
1,756 పింఛన్ల తొలగింపు.. 514 మంజూరు ఎన్నికల వేళ మార్పులుచేర్పులు 3,30,660 పింఛన్లకు బడ్జెట్ విడుదల కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వృద్ధులు.. వికలాంగులు.. వితంతువులకు ‘ఆసరా’ దూరమవుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనూ మార్పులు చేర్పులు చేపడుతుండటం విమర్శలకు తావిస్తోంది. మార్చి నెలకు సంబంధించి సామాజిక భద్రత పింఛన్లలో మరికొంత కోత పెట్టారు. ఫిబ్రవరి నెలలో 3,32,017 పింఛన్లు ఉండగా.. మార్చిలో 813 డెత్ కేసులు, 943 శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లిన వారిని తొలగించారు. అయితే కొత్తగా 514 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కోడ్ అమలులో ఉండగా కొత్త పింఛన్ల మంజూరు విదాస్పదమవుతోంది. తొలగింపులు పోను.. కొత్త పింఛన్లతో కలిపి మార్చి నెలలో 3,30,660 పింఛన్లకు రూ.7,50,29,100 మొత్తాన్ని బుధవారం సాయంత్రం ఆన్లైన్లో విడుదల చేశారు. తొలగించిన పింఛన్లు తక్కువే అయినా బడ్జెట్లో భారీగా కోతపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఫిబ్రవరి నెల 13,100.. మార్చి నెలలో 1,756 పింఛన్లను తొలగించారు. ఇదిలాఉండగా మార్చి 29, 30 తేదీల్లో విడుదల కావాల్సిన బడ్జెట్ నాలుగు రోజులు ఆలస్యం కావడంతో పింఛన్ల పంపిణీ కూడా జాప్యం కానుంది. -
పింఛన్ల కోసం లబ్ధిదారుల పాట్లు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రతినెలా ఇచ్చే అరకొర పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నానా అగచాట్లు పడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటి, రెండు తేదీల్లోనే తలుపు తట్టి మరీ పింఛన్లు అందించేవారు. ప్రస్తుతం పోస్టాఫీసులకు అప్పగించడం, వాటికి తోడు ఆధార్ అనుసంధానం, పీఓటీడీ (పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డివైస్) పరికరాలు పెట్టి వేలిముద్రలు సరిచూస్తుండటంతో లబ్ధిదారుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. అన్ని గ్రామాల్లో పోస్టాఫీసులు లేకపోవడంతో పింఛన్ల కోసం 5 నుంచి పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులు, వికలాంగులకు అది మరింత భారంగా మారుతోంది. జిల్లాలో మొత్తం 3,13,569 మంది పెన్షన్ అర్హులున్నారు. వీరిలో 33,269 మంది వికలాంగులు, 127 మంది కల్లుగీత కార్మికులు, 1,72,671 మంది వృద్ధులు, 6,722 మంది చేనేత కార్మికులు, 82,958 మంది వితంతువులు, 17,764 మంది అభయహస్తం పెన్షన్‌దారులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సబ్పోస్టుమాస్టర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఒంగోలు నగరం, కందుకూరు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా మణిపాల్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ పెన్షన్లను పంపిణీ చేస్తోంది. వీరికి రూ 10,17,60,200లను ప్రతి నెలా చెల్లిస్తున్నారు. వీరిలో 65 వేల మందికి పైగా వృద్ధులకు, వితంతువులకు ఆధార్ కార్డులు లేవు. దీంతో జనవరి నుంచి వీరికి పెన్షన్లు అందవు. గతంలో ఐకేపీ డీపీఎం సంతకం చేస్తే ఆధార్ కార్డు లేకపోయినా పెన్షన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చీరాల నియోజకవర్గ పరిధిలో దేశాయిపేట పంచాయతీలో ఒకటో వార్డు పింఛన్‌దారులు పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అదేవిధంగా పాతరెడ్డిపాలెం, ఊటుకూరు సుబ్బయ్యపాలెం, బొచ్చులవారిపాలెం, కొత్తపాలెం గ్రామాలకు చెందిన పింఛన్‌దారులు రామన్నపేట, వేటపాలెం పోస్టాఫీసులకు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో పెద్దదోర్నాల మండలంలో వృద్ధుల వేలిముద్రలను పీఓటీడీ యంత్రాలు అంగీకరించకపోవడంతో మండల ఏపీ ఆన్లైన్ కోఆర్డినేటర్ సమక్షంలో పింఛన్లు తీసుకోవాల్సి వస్తోంది. నెట్‌వర్క్‌లో సైతం తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. త్రిపురాంతకంలో విద్యుత్ కోత, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సర్వర్లు పనిచేయక పింఛన్ల కోసం లబ్ధిదారులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దర్శి నియోజకవర్గంలో 22514 మంది పింఛన్‌దారులుండగా వారిలో 5622 మందికి ఆధార్ కార్డులు లేక రెండు నెలలుగా పింఛన్లు పొందలేకపోతున్నారు. ముండ్లమూరు మండలంలో వేములబండ, రమణారెడ్డిపాలెం, అయోధ్యనగర్, రాజగోపాలరెడ్డి నగర్, పలుకురాళ్ల తండా, నందమూరి నగర్, బసవాపురం, జగత్నగర్, శ్రీనివాసా నగర్, తమ్మలూరు, సుంకరవారిపాలెం గ్రామాల పింఛన్‌దారులు నాలుగు కిలోమీటర్లు కాలినడకన పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. గిద్దలూరు పోస్టాఫీసులో పింఛన్లు తీసుకునేందుకు గురువారం వచ్చిన వృద్ధులు పలువురు జాబితాలో పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో రోజుకు నలుగురైదుగురికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి తరువాత రండి అంటూ రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. కొండపి నియోజకవర్గం టంగుటూరు పంచాయతీ పరిధిలోని 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రావివారిపాలెం, బాపూజీ కాలనీ, వెంకటాయపాలెం వారు టంగుటూరు పోస్టాఫీసుకు రావాల్సిందే. కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలంలో కొత్తగా 615 మంది దరఖాస్తు చేసుకున్నా..వారికి ఇంకా మంజూరు కాలేదు. పీఓటీడీ మిషన్లకు సిగ్నల్ అందక అవస్థలు పడుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలంలో కొందరికి ఆగస్టు నెల పింఛన్లు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు. యద్దనపూడి మండలంలో పోస్టాఫీసుల వద్ద పీఓటీడీ మిషన్లకు సిగ్నల్స్ సరిగా అందక లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. కరెంటు కోతల కారణంగా చార్జింగ్ లేదనే సాకుతో లబ్ధిదారులను ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండేలా చేస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒంగోలు నగరంలో పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వ స్తోంది. ప్రతినెలా 7వ తేదీలోపు పింఛన్లు అందించాల్సి ఉన్నా..15వ తేదీ వరకూ ఇస్తున్నారు. నగర పరిధిలో ఆధార్ కార్డులు లేక వెయ్యి మంది జనవరి నుంచి పింఛన్లు కోల్పోయారు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తిలో పింఛన్‌దారులు ఎక్కడ పింఛన్లిస్తారో స్పష్టత లేక పోస్టాఫీసులు, మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉన్న పనితోనే సతమతమవుతుంటే పింఛన్ల పంపిణీ పేరుతో తమపై అదనపు భారం మోపుతున్నారని గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇచ్చే జీతం తక్కువ..పనిభారం ఐదు రెట్లు పెంచి తమ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వివరం: వివేకపు మూటలు.. (అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం)
మనం బతకబోయే బతుకు వాళ్లు. మనం నడవబోయే దారి వాళ్లు. ఇప్పటి సమాజాన్ని మనకంటే ముందు స్వప్నించినవాళ్లు. దీని నిర్మాణానికి మనకంటే ముందు రాళ్లెత్తిన వాళ్లు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షులు వాళ్లు. వాళ్లు... మనవాళ్లు. మన పెద్దలు. వయోవృద్ధులు. ప్రతి అంశంలోనూ వాళ్లకు ఒక అనుభవం ఉంటుంది; ఆలోచన ఉంటుంది; తమదైన దృష్టికోణం ఉంటుంది. గతాన్ని భవిష్యత్తుతో ముడివేస్తూ వర్తమానంతో జరిపే సంభాషణ వాళ్ల జీవితసారం. అయినప్పటికీ చరిత్రలో వయోధికులకు అందాల్సినంత ఆదరణ అందిందా? వర్తమానం సంగతేమిటి? అక్టోబర్ 1 ‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. ప్రాచీన కాలంలో రోమ్‌లో ఒక సామెత వాడుకలో ఉండేదట: అరవై దాటిన వాళ్లను వంతెన మీంచి కిందికి తోసేయాలి. రేపు మన జీవితం ఏమిటో గుర్తెరగనివ్వని యవ్వనపు మిడిసిపాటులోంచే ఇలాంటి క్రూరమైన సామెత పుట్టివుంటుంది. నిజంగా కూడా చరిత్రలో వృద్ధుల పట్ల ఇలాంటి ఘోరాపచారాలు జరిగివుంటాయా? డిజ్-ఆనర్ కిల్లింగ్ ‘ఎనభై దాటిన తరువాత అంతకుముందు చాలా సులభంగా కనబడే చాలా పనులు చాలా కష్టమైపోతాయి,’ అంటారు యాన్ మిర్డాల్. స్నానం చేయడం కష్టం, గట్టి మూత తీయడం కష్టం, మెట్లు ఎక్కడం కష్టం, అసలు నడకే కష్టం; ఒక్కోసారి సొంతంగా పూర్తి పక్కకు తిరిగి పడుకోవడం కూడా కష్టం కావొచ్చు. అలాంటి వయసులో మిర్డాల్ తన ‘భారత్‌పై అరుణతార’ రచన కోసం స్వీడన్ నుంచి వచ్చారు. చెట్టు, పుట్ట దాటుతూ దండకారణ్యం తిరిగారు. వృద్ధాప్యాన్ని గౌరవించి, తన దేహ ధర్మాల విషయంలో సహకరించిన కామ్రేడ్స్‌ను ప్రశంసిస్తూ, దేశాల మధ్య ఉండే సాంస్కృతిక తేడాల గురించి ప్రస్తావించారు. స్వీడన్లో అందరికందరూ విశ్వసించే నమ్మకం ఒకటుంది. గతంలో వృద్ధులను వారి కుటుంబ సభ్యులు ఒక కొండమీదిదాకా నడిపించుకుంటూ వెళ్లేవారట. కొండ అంచు నుంచి ఆ వృద్ధులు వారైనా దూకేసేవారట, లేదా, కుటుంబ సభ్యులైనా తోసేసేవారట. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ పని చేసేవారు గనుక, ఏ ఒక్కరికీ వ్యక్తిగత అపరాధ భావన ఉండేది కాదట.’ అలాగే, ఇంట్లో వృద్ధుడో, వృద్ధురాలో పనిచేయలేని వయసుకు చేరితే, కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పొడవాటి కర్ర ఉన్న గదలాంటి దానితో మోది తల పగలగొట్టేవాళ్లట! ఇలాంటి దురాచారమే జపాన్‌లోనూ ఉండేదట. వయసు మళ్లినవాళ్లను సుదూర ప్రాంతంలోని ఏ కొండమీదకో తీసుకెళ్లి, వారిని అక్కడే వదిలేసి వచ్చేవాళ్లట. పొరుగున ఉన్న దురాచార పురుగు స్వీడన్లో ఉన్న ఒళ్లు జలదరింపజేసే దుస్సంప్రదాయం మన పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ ఉండటం దారుణం. ఆయిల్ బాత్ చేసిన రోజున కొబ్బరినీళ్లు తాగొద్దని అక్కడి పిల్లలకు పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే విచిత్రంగా ఇదే మరో రీతిలో అమలవుతూ ఉంటుంది. ఉదయాన్నే వయసు ఉడిగిన పెద్దవారి ఒంటికి బాగా నూనె మర్దించి స్నానం చేయిస్తారు. ఇక ఆ రోజంతా చల్లటి కొబ్బరినీళ్లు తాగిస్తూ ఉంటారు. దీనివల్ల మూత్రపిండాలు పనిచేయవు, శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది, ఫిట్స్ రావొచ్చు, ఒకట్రెండు రోజుల్లో విపరీతమైన జ్వరం వచ్చి దుర్బల శరీరమున్న ముసలివాళ్లు కాలం చేస్తారు. ‘తలైకూతల్’ అని పిలిచే ఈ సంప్రదాయ హత్యాకాండ దక్షిణ తమిళనాడులో కొనసాగుతోందంటూ, 2010లో ప్రసార మాధ్యమాల్లో గగ్గోలు జరిగింది. అక్కడి ముసలివాళ్లు కూడా ఇంతకంటే మరో దారి లేదన్నట్టుగా ఆ సంప్రదాయానికి అంగీకరించడం పేదరికం తెచ్చిపెట్టిన దుర్మార్గం తప్ప మరొకటి కాదు. పిల్లలే వాళ్ల జీవితాలకోసం పోరాడుతుంటే మేమెందుకు వారికి బరువు కావడం, అని అక్కడి ముసలమ్మలు చెప్పడం కలిచివేసే విషయం. కులానికో మతానికో సంబంధమైనదిగా కాకుండా, నేరానికీ పేదరికానికీ మధ్య ఉన్న సన్నటి రేఖగా అక్కడి వారు ఆ దురాచారాన్ని పరిగణించడం గమనార్హం. ఉత్పత్తి వర్సెస్ వివేకం బలవంతంగా వృద్ధుల మరణాన్ని ప్రోత్సహించే ‘సెనిసైడ్’ ప్రపంచంలో ఏదో మూల ఏదో రూపంలో కొనసాగింది. దానికి ముఖ్యం కారణం వారిని అన్ప్రొడక్టివ్గా భావించడమే! అనారోగ్యం తలెత్తే వయసులో, ఎముకలు పటుత్వం కోల్పోయే వయసులో ఇది పీడ మీద పీడ. కోతికీ, ఏనుగుకూ ఒకే పరీక్ష పెట్టే సమాజంలో వాళ్లు చెట్లు ఎక్కకపోవచ్చు. కానీ శారీరక శక్తికి మించిన ఎన్నోరెట్ల వివేకాన్ని పంచగలరని ఈ కథ చెబుతుంది.ప్రాచీన కాలంలో ఒక రాజు ఇలాగే ముసలివాళ్లందరూ ఎందుకూ కొరగాని వాళ్లని తలచి, అందరినీ నిర్మూలించడానికి ఆదేశాలు ఇచ్చాడు. దేశంలో ముసలివాళ్లంటూ లేకుండాపోయారు. అయితే, ఒక మనవడికి మాత్రం వాళ్ల తాతంటే ప్రాణం. సైనికుల కంటబడితే ఎక్కడ చంపుతారోనని తాతను అటక మీద దాచాడు. ఇరుగు పొరుగు వారు గమనించకుండా అన్నం నీళ్లు అందిచ్చేవాడు. కొంత కాలం గడిచాక రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఆహార నిల్వలు అడుగంటాయి. ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు. పంట వేద్దామన్నా గుప్పెడు ధాన్యపు గింజలు లేని కరువు. ఇదే సంగతి యువకుడు తాతకు చెప్పాడు. ఆ తాత ఆలోచించి ఒక సలహా ఇచ్చాడు. ఇంటి పైకప్పుగా వేసిన గడ్డికట్టలు మొత్తం కిందికి దించి దులిపి చూడు; ఎక్కడైనా ఒక తప్పుడు గింజ ఉండకపోదు, అన్నాడు. మనవడు అలాగే చేశాడు. గింజలు రాలిపడ్డాయి. వాటిని పొలంలో జల్లాడు. తెల్లారే సరికల్లా అవి పెరిగాయి, తర్వాత కంకులు వేశాయి. రాజుకు విషయం తెలిసి ముందు సంతోషించినా, చట్ట ధిక్కారానికి వివరణ అడిగాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు మనవడు. వాళ్ల ప్రేమకు, అది చేయించిన సాహసానికి, వృద్ధుడు కనబరిచిన వివేకానికి ఆశ్చర్యపోయి, తన తప్పు తెలుసుకొని, బతికినంత కాలం మనుషుల్ని బతకనిచ్చేలా చట్టానికి సవరణ చేశాడు. వృద్ధ విజేతలు ఉత్పత్తి అనగానే, ఏ కర్మాగారంలోనో చెమటలు కక్కుతూ పనిచేయడం అనుకుంటాం. అది ఉత్పత్తే అయినా, అది మాత్రమే ఉత్పత్తి కాదు. ప్రపంచ ప్రసిద్ధ చాలా ‘ఉత్పత్తులు’ వయసు తెచ్చిన అనుభవసారంలోంచి పుట్టాయి. సోఫోక్లిస్ తన ప్రసిద్ధ నాటకం ‘ఈడిపస్ ఎట్ కొలొనస్’ రాసినప్పుడు ఆయనకు 89 ఏళ్లు. ‘వెన్ వి డీడ్ అవేకెన్’ సృజించినప్పుడు హెన్రిక్ ఇబ్సెన్ ఏడు పదులు దాటాడు. హైడ్రోఫాయిల్ బోట్‌కు సంబంధించిన పేటెంట్ అందుకునేప్పటికి గ్రాహంబెల్ 75లో పడ్డాడు. ‘వై షి వుడ్ నాట్’ నాటకాన్ని తన 94వ ఏట లిఖించాడు జార్జ్ బెర్నార్డ్ షా. ‘ఇన్ ద క్లియరింగ్’ కవితా సంకలనం అచ్చు వేసినప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ 88 ఏళ్ల వృద్ధుడు. జాన్ మిల్టన్ తన 63వ ఏట ‘ప్యారడైజ్ రీగెయిన్డ్’ రాశాడు. నో వెబ్‌స్టర్ తన సుప్రసిద్ధ డిక్షనరీని సంకలనం చేసింది ఏడు పదుల వయసులోనే. అంతెందుకు, ప్రపంచ ప్రసిద్ధ రచన ‘డాన్ కిహోటి’ రాసినప్పుడు సెర్వాంటెజ్ వయసు 70. ప్రపంచ రాజకీయాల్ని, పరిణామాల్ని శాసించేది కూడా వృద్ధులు కాక మరెవరు! వృద్ధ హిత సమాజం కావాలి! మనదేశంలో 7.7 కోట్ల వృద్ధులు ఉన్నారని ఒక లెక్క. 2025 నాటికి ఇది 17.7 కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో 90 శాతం మంది అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్నారు. 40 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. 75 శాతం గ్రామీణులు. 55 శాతం మహిళలు భర్తను కోల్పోయిన ఒంటరులు. వ్యవసాయ కూలీలు, రిక్షా నడిపేవాళ్లు, కూరగాయలు మోసుకుంటూ వచ్చేవాళ్లు, దుకాణాల్లో గుమస్తాలు; వెంట్రుకల్లో నలుపు మాయమైనట్టుగానే ఎముకల్లో పటుత్వం పోయినా, చివరి రక్తపు బొట్టు వరకు వీరంతా రెక్కలు ముక్కలు చేసుకోవాల్సి రావడం హృదయం ద్రవించే విషయం. వృద్ధుల హిత విధాన నిర్ణయాలతో పాటు, సమాజం వారి పట్ల మరింత సున్నితం కావడం అవసరం. రెండో బాల్యం పేదరికం ఒక సమస్య అయితే, ఉన్నట్టుండి జీవితం చేజారిపోయినట్టవడం, కాలం ఎలా గడపాలో తెలియకపోవడం మరో రకమైన బాధలు! చేతిలోంచి అధికారం జారిపోవడం, డబ్బులు వచ్చే మార్గం ఆగిపోవడం, రోజూ అలవాటుపడిన ఆఫీసు, పనిస్థలం ఒక్కసారిగా పరాయిది కావడం పెద్దవారికి మింగుడుపడని అంశాలు. ఇలాంటి సందర్భంలో ఇంట్లోవాళ్లు మరింత ఎక్కువ శ్రద్ధ కనబరచాలి లేదూ మామూలుగా ఉన్నా నయమే. ఏ యోగా క్లాసుకో వెళ్తూనో, ఏ లాఫింగ్ క్లబ్బులోనో పొట్ట పట్టుకుంటూనో, ఏ అమర్నాథ్కో ప్రయాణం కడుతూనో రిటైర్డ్ ఉద్యోగులు కనబడతారు. కాని ఎన్నాళ్లు? ఉదయాన వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రాణం ఏమీతోచక పిచ్చెక్కిపోతోందనుకోవడం వింటూ ఉంటాం. ఎంతసేపటికీ పాడైన మిక్సీ రిపేర్ చేయించడంతోనో, కరివేపాకు ఎవరు తెంపుకెళ్లారో ఆలోచించడంతోనే సరిపోతుంది. బహుశా అందుకే పాతకాలం నుంచీ వానప్రస్థం ద్వారా కుటుంబంతో డిటాచ్మెంట్ పెంచి, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశపెట్టడం నాణ్యతతో కూడిన పొద్దుపుచ్చడం కోసమేనేమో! చిత్రకారిణి నానమ్మ శారీరకంగా వృద్ధాప్యంలో ప్రతికూలతలు ఉండొచ్చుగాక; నిజమైన జీవితాన్ని ఆనందించే వయసు కూడా ఇదేనేమో! బాదరబందీలు అన్నీ తీరిపోయి, తమ ఆలోచనల పట్ల తాము దృష్టి కేంద్రీకరించగలిగే వయసు, తీరిక ఒక వయసు దాటాకే లభిస్తుంది. అందుకే లోపలి కొత్త శక్తులను రాబట్టుకోవడానికి మలిదశ జీవితాన్ని ఉపయోగించుకోవడం విలువైన వ్యాపకం కాగలదు. అనా మేరీ రాబర్ట్సన్ మోజెస్ తన 76వ ఏటగానీ కుంచె పట్టుకోలేదు. ఈ అమెరికా బామ్మ యౌవన కాలమంతా పొలాల్లో పనిచేసింది. పెద్దగా చదువుకోలేదు. కళల్లో ప్రవేశం లేదు. అలాంటిది ఒకరోజు పెయింటింగ్ మీదకు ఆసక్తి మళ్లింది. పాతికేళ్లల్లో వెయ్యి చిత్రాలు గీసింది. బాల్యం, పంటపొలాలు, మంచు కురియడం లాంటివి ఆమె థీమ్స్. ఆమె చిత్రకళ క్రమంగా గుర్తింపుపొందింది. మ్యూజియమ్ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ప్రదర్శితమైంది. 101 ఏళ్ల వయసులో ఆమె మరణించినప్పుడు జాన్ ఎఫ్ కెన్నెడీ నివాళి ప్రకటించారు. బీజం అంటూ లోపల ఉండాలేగానీ, అది మొక్కవడానికి వయసు అడ్డంకి కాదు! సీసీ టు ఫాదర్ బహుశా వయసు మళ్లాక మాత్రమే అర్థమయ్యే విషయం, వినేవాళ్లను కోరుకోవడం. పెద్దలు చెప్పేది మనస్ఫూర్తిగా వినడం వారి కడుపు నింపుతుంది. వాళ్ల మీదుగా వ్యవహారాన్ని నడపడం, మెయిల్లో ‘సీసీ’ పెట్టినట్టు ప్రతి కీలక విషయాన్ని వారికి తెలియజేస్తుండటం, వయసు మాత్రమే తేగలిగే అనుభవసారంతో వాళ్లు ఇచ్చే సలహాలను స్వీకరించడం వారి గౌరవాన్ని నిలబెట్టినట్టు అవుతుంది. పాత బియ్యం ఎక్కువ సాగుతాయి. వృద్ధులు మరింత రుచికరమైన జీవితానుభవాలతో పండిపోయివుంటారు. యువతరానికి వాళ్లు అందివ్వగలిగేది ఈ ఆలోచనానిధే! ఎంత తవ్వుకుంటే అంత ఉపయోగం. ‘నేను ఎంతకాలం బతుకుతూ ఉంటే, జీవితం అంత అందంగా తయారవుతూ ఉంది’ అన్నాడు ఫ్రాంక్ లాయిడ్ రైట్. పెద్దవాళ్లు ఎంతకాలం ఉంటే, అంతకాలం మన జీవితం ఆనందమయం అవుతూ ఉంటుంది.76వ యేట నుంచి పెయింటింగ్ ప్రాక్టీస్ చేసి కీర్తిని గడించిన అనా మేరీ రాబర్ట్సన్ వయసెరుగని విన్యాసాలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినవారిలోకెల్లా వయసులో పెద్దవారు కత్సుసుకె యనాగిసావా (జపాన్). 1936లో జన్మించిన యునాగిసావా ఉపాధ్యాయులు. 2007 మేలో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు ఆయన సంకల్పానికి తలవంచింది. అప్పుడు యునాగిసావా వయసు 71 ఏళ్లు. ప్యారాచూట్ జంప్ చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది ఎస్ట్రిడ్ గీర్ట్సన్(డెన్మార్క్) అనే బామ్మ. 1904 లో పుట్టిన గీర్ట్సన్ వందవ ఏట 2004లో నాలుగు కిలోమీటర్ల ఎత్తులో గాలిలో ఈ విన్యాసం చేశారు. ఫిలిప్ రాబినోవిట్జ్ను ఫ్లైయింగ్ ఫిల్ అంటారు. ఈ దక్షిణాఫ్రికా వృద్ధుడు తన 100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగుపందాన్ని 30.86 సెకన్లలో పూర్తిచేశారు. ఇది ఆ వయసులో వరల్డ్ రికార్డ్. ప్రస్తుత ప్రపంచ పరుగు వీరుడు జమైకాకు చెందిన 23 ఏళ్ల ఉసేన్ బోల్ట్ ఈ దూరాన్ని పరుగెత్తిన కాలం 9.58 సెకన్లు. కానీ ఇది 23, అది 100! భాగ్ ఫౌజా భాగ్ శతాధిక వృద్ధుడిగా ఒక మారథాన్‌ను పూర్తిచేసిన ఘనత ఫౌజా సింగ్‌కు దక్కింది. బ్రిటన్‌లో స్థిరపడిన ఈ పంజాబీ సర్దార్ ఈ అంశంలో వరల్డ్ రికార్డ్ స్థాపించాడు. 2003లో జరిగిన లండన్ మారథాన్‌ను 6 గంటల్లో పూర్తిచేశాడు. 2004లో అడిడాస్ షూ కంపెనీకి డేవిడ్ బెక్‌హమ్, మహమ్మద్ అలీ లాంటివాళ్లతో కలిసి మోడల్‌గా చేశాడు. 1911లో జన్మించిన ఫౌజా 2011లో టోరంటో వాటర్‌ఫ్రంట్ మారథాన్‌ను పూర్తిచేసిన కాలం 8గం. 25ని. 18సె. అన్నట్టూ, మారథాన్‌లో పరుగెత్తాల్సిన దూరం 42 కిలోమీటర్లు. ఆసక్తికర విషయం ఏమిటంటే, చిన్నతనంలో పరుగుపందెపు అనుభవమున్నా ఫౌజా దాన్ని సీరియస్‌గా సాధన మొదలుపెట్టింది తన 83వ ఏటే!