One lakh jobs
-
ఫైబర్ టెక్‌లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ సెగ్మెంట్లలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు. 2024లో దేశీయంగా టెలికం మార్కెట్ 48.61 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం పూర్తయిందని, డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు. అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి 5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్ టెక్నీషియన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా. ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంజనీర్లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్లు, ఇన్స్టాలేషన్.. రిపేరు, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్‌సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు. -
లక్ష ఉద్యోగాలు ఇచ్చేవరకు పోరాటం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన అందని ద్రాక్షగా మారిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మాటలతో కాలం గడుపుతున్నారని, ఆయన ఉద్యోగాల కల్పనను పట్టించుకోవడం లేదన్నారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. లక్ష ఉద్యోగాల వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వెంటనే ఆమేరకు ఉద్యోగాలు కల్పించాలని నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ ఉద్యోగాల కోసం పోరాడాల్సిన దౌర్భాగ్యం నెలకొందన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లలోనూ ఇబ్బడిముబ్బడిగా తప్పులు దొర్లుతుండడం, నిర్దిష్ట నియమ నిబంధనలను పేర్కొనకపోవడాన్ని చూస్తే నియామకాలపై సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోందని చెప్పారు. వీటి కారణంగానే 2016 నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–2, గతేడాది చేపట్టిన గురుకుల పరీక్షల ఫలితాలు విడుదల చేయడం లేదని ఆయన ఉదహరించారు. టీఎస్ పీఎస్సీ తప్పిదాల వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాల భర్తీ ఎలా సాధ్యమని నిరుద్యోగులను అవహేళన చూస్తూ మాట్లాడడం సీఎం కేసీఆర్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కేవలం 12 వేల మందికే ఉద్యోగాలు వచ్చాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేదాకా తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిలో మార్పురాకుండా దశల వారీగా తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఇన్‌ఛార్జి డీఆర్ఓ స్వర్ణలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్య గౌడ్, యూత్ విభాగం అధ్యక్షుడు శీలం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పత్తి సంతోష్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ ఇబ్రహీం, జిల్లా యూత్ కార్యదర్శి తాళ్ల అఖిలేష్గౌడ్, నాయకులు అంజిబాడు, రాంరెడ్డి, వంశీరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, వెంకటేష్ గైడ్, నరేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
మరో మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలు
హైదరాబాద్: వస్తువుల, సేవల పన్ను (జిఎస్టి) అమలుకారణంగా భారీగా ఉద్యోగాలు లభించనున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బందరు దత్తాత్రేయ చెప్పారు. జీఎస్టీ వల్ల కేవలం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే లాభం చేకూరదని భారీగా ఉద్యోగాలను సృష్టించనుందని ఆయన చెప్పారు. తదుపరి మూడు నెలల్లో లక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని శనివారం మీడియాకు తెలిపారు. ప్రధానంగా అకౌంటెన్సీ రంగంలో దాదాపు 60వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలున్నాయని మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ప్రకటించారు. జీఎస్టీ అమలే ఒక చారిత్రక అధ్యాయమని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా బోర్డర్ చెక్ పోస్టులను రద్దు చేయడంతో, వస్తువుల అంతర్ రాష్ట్ర రవాణా ఆలస్యం కాదని పేర్కొన్నారు. జీడీపీ 7 నుంచి 9 శాతానికి పెరగనుందనీ, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని చెప్పారు. జీఎస్టీ కొత్త పన్నుల విధానం అమలు నేపథ్యంలో వివిధ సంస్థలతో అనుబంధంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన జీఎస్టీ వర్క్‌షాపు నిర్వహించినట్టు చెప్పారు. గత ఆరు నెలల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపారులు, సాధారణ ప్రజలకు 1,118 వర్క్ షాప్‌లను నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో జిఎస్టీ ప్రయోగ కార్యక్రమానికి హాజరు కాని కాంగ్రెస్, వామపక్ష పార్టీలపై దత్తాత్రేయ మండిపడ్డారు. -
2019నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం
-
దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు
మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ నాయుడుపేట: దక్షణ భారతదేశంలోనే అత్యంత పెద్దదైన దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు. నాయుడుపేట ఆర్అండ్బి అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుగరాజపట్నం ఓడరేవును తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. వాకాడు, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, చిట్టమూరు ప్రాంతాలు దుగరాజపట్నం ఓడరేవుతో ఎంతో అభివృద్ధి చెందనుందని అభిప్రాయపడ్డారు. ఓడరేవుకు అనుబంధంగా వంద పరిశ్రమలు వచ్చే అవకాశ ఉందని తద్వారా లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందడంతో పాటు లక్షమంది రైతులు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రైవేటు పోర్టుల నుంచి హెలికాప్టర్లను వినియోగించుకుంటూ వారికి వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటుకు అమ్ముడు పోతున్న జిల్లా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిని చూస్తుంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, వెంకటయ్య, సుబ్బయ్య ఉన్నారు. -
ఈ ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీ: కడియం
గజ్వేల్: ఈ ఏడాది లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. విద్యాశాఖతోపాటు ఇతర శాఖల్లో ఉన్న సుమారు లక్షకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన మెదక్‌జిల్లా గజ్వేల్‌లో బుధవారం ఆయన పర్యటించారు. నగరపంచాయతీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎడ్యుకేషన్ హబ్‌కు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కడియం విలేకరులతో మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. బడ్జెట్లో ఇప్పటికే రూ.11 వేల కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. గురుకుల విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేయనున్నట్టు చెప్పారు.