one time settelement
-
ఓటీఎస్‌కు మంచి స్పందన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)కు మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందడానికి అర్హులు వడివడిగా ముందుకొస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు, వీటిపై వడ్డీని ఓటీఎస్ కింద మాఫీ చేసి.. నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఇళ్లపై సంపూర్ణ యాజమాన్య హక్కులను ప్రభుత్వం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటీఎస్ వినియోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా 9,18,216 మంది ఇళ్లపై హక్కులు పొందారు. వీరిలో 2,47,355 మంది తమ పేర్లపై రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1.26 లక్షల మంది.. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.11 లక్షల మంది ఓటీఎస్ వినియోగించుకున్నారు. ఓటీఎస్ రూపంలో ప్రభుత్వం రూ.10 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది. అంతేకాకుండా పేదలపై తలకు మించిన భారం మోపకుండా తక్కువ మొత్తం నిర్దేశించి.. వాటిని చెల్లించినవారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. పేదలపై ఎటువంటి రుసుములు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6 వేల కోట్ల లబ్ధి చేకూరుస్తోంది. ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం పేదలకు మేలు చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలు రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టుకునే అవకాశం కల్పించింది. ఉగాదికి తొలి వాయిదా, దీపావళికి రెండో వాయిదా చెల్లించేలా వెసులుబాటు ఇచ్చింది. స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.. ఓటీఎస్‌కు స్పందన బాగుంది. ఓటీఎస్ వినియోగించుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల యంత్రాంగం అర్హుల ఇళ్లకు వెళ్లి ఓటీఎస్ ప్రయోజనాలను వివరిస్తున్నారు. దీంతో అర్హులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సోమవారం ఒక్కరోజే నెల్లూరు జిల్లాలో 3,761 మంది ఓటీఎస్ వినియోగించుకోవడానికి సుముఖత తెలిపారు. – నారాయణ భరత్ గుప్తా, ఎండీ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ -
పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్న నవరత్నాలు
-
వన్ టైం సెటిల్మెంట్ చర్చలకు సిద్ధం..!
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగవేసిన విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ఎట్టకేలకు దిగి వస్తున్నట్టే కనిపిస్తోంది. మాల్యాను విదేశాలనుంచి వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, తాజాగా సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా స్పందించడంతో బ్యాంకులతో వన్ టైం సెటిల్ మెంట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని శుక్రవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మేరకు బ్యాంకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. పబ్లిక్ రంగ బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ విధానాన్ని పాటిస్తూ ఉంటాయని, ఇలా వందల మంది రుణగ్రహీతలు తమ లోన్లను సెటిల్ చేసుకున్నారన్నారు. మరి తనకు ఎందుకు నిరాకరిస్తున్న మాల్యా ప్రశ్నించారు. గౌరవనీయ సుప్రీంకోర్టులో గణనీయమైన తమ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులు తిరస్కరించాయని ఆరోపించారు. స్వచ్ఛందంగా ఈ వివాద పరిష్కారంపై మాట్లాడటానికి, న్యాయబద్ధంగా సెటిల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ట్వీట్ లో చెప్పారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఎలాంటి విచారణ లేకుండా ప్రభుత్వం తనపై ఆరోపణలుగుప్పించినప్పటికీ, ప్రతీ ఒక్క కోర్టు ఆర్డర్ ను ఎలాంటి మినహాయింపు లేకుండా అంగీకరించానంటూ పాత పల్లవే మళ్ల అందుకున్నారు. సుప్రీం కోర్టులో అటార్నీ జనరల్ తనపై చేసిన ఆరోపణల్నీ తనకు వ్యతిరేకంగా ప్రభుత్వం వైఖరికి నిదర్శన మన్నారు. కాగా ఉద్దేశపూర్వక రుణ ఎగవేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసు నమోదుచేయాలని అలాగే డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్ డాలర్లను డిపాజిట్ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై తీర్పును అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు రిజర్వ్ చేసంది. వడ్డీసహా దాదాపు రూ.9,000 కోట్ల రుణాల బకాయిల కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ పిటిషన్లను దాఖలు చేసింది. గురువారం జరిగిన ఈ కేసు విచారణ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆస్తుల గురించి సరైన వివరాలనే అందించారా అంటూ జస్టిస్ ఆదర్స్ కుమార్ గోయెల్, యూకే లలిత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మాల్యాను ప్రశ్నించింది. అటు బ్యాంకులపైనా కీలక ప్రశ్నల్ని సంధించిన సుప్రీం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.