onion price increase
-
ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ ఏడాది మే నెలలో ఆ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే అదే సమయంలో టన్ను ఉల్లి ఎగుమతికి 550 డాలర్లు(రూ.46 వేలు) కనీస ధరను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువకు ఉల్లిని విదేశాలకు అమ్మకూడదు. దాంతో ఎగుమతులు తగ్గి దేశీయంగా ధరలు పెరగకుండా కట్టడి చేయవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జూన్‌లో ఉల్లి ఎగుమతులు 50 శాతానికి పైగా పడిపోయాయి. 2024-25 ఏడాదికిగాను జులై 31, 2024 వరకు 2.60 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు. అదే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 17.17 లక్షల టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేశారు.ఇదీ చదవండి: వంద రోజుల్లో రూ.మూడు లక్షల కోట్ల పనులకు ఆమోదంమహారాష్ట్రలోని నాసిక్‌లో దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఉంది. ఏప్రిల్-జూన్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి స్థానికంగా ఓట్లు తగ్గిపోవడం కొంత ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్న ఉల్లి రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
మొహం చాటేస్తున్న ఉల్లి
సాక్షి, హైదరాబాద్: దేశీయంగా ఉల్లి ధర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా ఉన్న రోజు ధరలు దిగొస్తుండగా, సరఫరా తగ్గిన రోజు ధరలు పుంజుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల సరఫరాపైనే రాష్ట్రం పూర్తిగా ఆధారపడిన నేపథ్యంలో అక్కడినుంచి ఉల్లి రాక మొహం చాటేస్తుండటంతో ధరల్లో స్థిరత్వం ఉండటం లేదు. రెండ్రోజుల కిందటి వరకు ఉల్లి దిగుమతి ఎక్కువగా ఉండి కాస్త దిగొచ్చినట్లు కనిపించిన మళ్లీ సోమవారం అమాంతం పెరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి సరఫరా నిలిచిపోవడంతో రిటైల్ మార్కెట్లో రూ.130 వరకు పలుకుతోంది. మహారాష్ట్రలోనే హెచ్చుతగ్గులు.. రాష్ట్రానికి 50శాతానికి పైగా ఉల్లి మహారాష్ట్ర నుంచి వస్తుండగా, అక్కడే ధరల్లో ఏరోజుకారోజు ధరల నిర్ణయం జరుగుతోంది.అది కూడా డిమాండ్, దాని గ్రేడ్ ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు పుణే, షోలాపూర్‌లో ఉల్లి ధరలు క్వింటాల్‌కు రూ.80వేల నుంచి రూ.90వేలు పలుకగా, అది సోమవారం రూ.11వేల నుంచి రూ.12వేలకు చేరింది.ఉల్లికి మంచి ధర పలుకుతుండటం, అదే సమయంలో ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో రాష్ట్రానికి ఉల్లి సరఫరా తగ్గింది. దీంతో ప్రతిరోజూ మహారాష్ట్ర నుంచి 6వేలకు పైగా బస్తాలు వస్తూ ఉండగా, అది సోమవారం 4వేల బస్తాలకు తగ్గింది. దీంతో సోమవారం మలక్‌పేట మార్కెట్లో గ్రేడ్–1 రకం ఉల్లి కిలో రూ.110 పలికింది. ఇది రిటైల్ మార్కెట్‌కు వచ్చేసరికి రూ.130 నుంచి రూ.140 పలికింది. గ్రేడ్–2 ఉల్లి ధర కిలో రూ.70 నుంచి రూ.60 పలుకగా, అది రిటైల్‌లో రూ.80–90మధ్య పలుకుతోంది. ఇక కర్ణాటక నుంచి ఉల్లి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సోమవారం ఒక్క బస్తా కూడా రాలేదు. అక్కడే డిమాండ్ పెరిగిపోవడం, ధర కిలోకు రూ.110 వస్తుండటంతో ఇక్కడికి తీసుకురావడం లేదు. కర్నూలు నుంచి అదే పరిస్థితి ఎదురవుతోంది. అక్కడి ప్రభుత్వమే ఎంత ధరకైనా వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రాయితీపై ప్రజలకు విక్రయిస్తుండటంతో ఏపీలోనే డిమాండ్ అధికమైపోయింది. దీంతో తెలంగాణకు సరఫరా తగ్గి ధరలు పెరుగుతున్నాయి. ఇక ఈజిప్టు నుంచి ఉల్లి రావాల్సి ఉన్నా అది ఇంత వరకూ రాలేదు. ఈ ఉల్లి ముంబాయి పోర్టుకు వచ్చాక అక్కడి నుంచి రాష్ట్రానికి లారీల్లో తెచ్చేందుకు మరో రెండు, మూడు రోజులు పట్టొచ్చని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఉల్లిపాయ 250 గ్రాములు చాదర్‌ఘాట్: పై ఫొటోలోని ఉల్లిని చూశారా? ఇది ఈజిప్ట్ ఉల్లి. ఒక ఉల్లిపాయే 250 గ్రాముల బరువుంది. మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఈజిప్టు ఉల్లిని మలక్‌పేట మార్కెట్లో అమ్మాడు. క్వింటాల్ రూ.11 వేలకు కొన్నామని, రిటైల్‌లో కిలో రూ.150 వరకూ అమ్మినట్లు తెలిపాడు. -
ఘాటెక్కిన ఉల్లి
మండపేట : ఉల్లి ధర ఘాటెక్కింది. ఏడాది కాలంలో ఎన్నడూ లేనివిధంగా కిలో రూ.35కు చేరి సామాన్యులకు కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతుండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడం, వర్షాభావ పరిస్థితులు.. ఉల్లి ధరను పెంచేశాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జిల్లాలో రోజుకు వంద టన్నులకు పైగా ఉల్లిపాయల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడంతో మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్, శ్రీరాంపురం, పుణె తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటుంటారు. వర్షాభావ పరిస్థితులతో మహారాష్ట్రలో 20 నుంచి 25 శాతం మేర దిగుబడులు పడిపోయినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి దళారులు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలపై ప్రభావం చూపుతోందని వారంటున్నారు. గోదాముల్లో ముందుగానే నిల్వలు చేసుకున్న దళారులు.. సరుకు లేదంటూ అరకొరగా అందజేస్తుండటం ధరలపై ప్రభావం చూపుతోందంటున్నారు. స్థానిక అవసరాలతో పాటు, ఒడిశాకు ఎగుమతి చేసేందుకు జిల్లాలోని హోల్‌సేల్ వ్యాపారులు రోజుకు సుమారు 200 టన్నుల వరకు ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంటే, ప్రస్తుతం ఆ మేరకు అక్కడి నుంచి సరుకు అందడం లేదంటున్నారు. జూన్ నెలాఖరుకు రూ.16 నుంచి రూ.20 వరకున్న ధర, జూలై ప్రారంభంలో రూ.25కు చేరింది. క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం రూ.35 పలుకుతోంది. మరికొంత కాలం ఇదే పరిస్థితి కొనసాగనుండటంతో ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అక్కడ అధిక ధరకు కొనుగోలు చేయడంతో పాటు రవాణా చార్జీలు కూడా ఎక్కువై మార్కెట్‌కు చేరేసరికి ధర రెట్టింపవుతోంది. మరో రెండు నెలలు! ఇలాఉండగా మరో రెండు నెలల్లో కర్నూలు ఉల్లిపాయలు మార్కెట్లోకి వస్తే ధరలు అదుపులోకి వస్తాయంటున్నారు. జిల్లాలోని గొల్లప్రోలు ప్రాంతంలో పండించే ఉల్లిపాయలు డిసెంబర్, జనవరి నెలల్లో మార్కెట్లోకి వస్తే పూర్తిస్థాయిలో ధరలు అదుపులోకి వచ్చి, సాధారణ స్థాయికి చేరుకుంటాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోగా, ఉల్లిపాయల ధర ఘాటెక్కడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉల్లిపాయలు తప్పనిసరి కావడంతో అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో కిలో రూ.10 మాత్రమే ఉండగా, ఈ ఏడాది మూడింతలు పెరగడంపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో హోటళ్లు, ఇళ్లలోను కొంత మేర వినియోగం తగ్గిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.