open court
-
మీరేం డిబేట్‌కు రాలేదు.. సోమేష్ కుమార్‌పై జస్టిస్ పీపీ ఘోష్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆలస్యంగా లోపలికి రావడంతో పాటు ఆయన సమాధానాలిచ్చిన తీరుపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం అవకతకవలకు సంబంధించిన అభియోగాలపై ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌తో పాటు సోమేష్ కుమార్‌ను, మరికొందరిని ఇవాళ విచారించారు. అయితే విచారణ నిమిత్తం పీసీ ఘోష్.. కోర్టు హాల్లోకి సోమేష్‌ను పిలిచారు.అయినా కూడా చాలాసేపు దాకా ఆయన లోపలికి వెళ్లలేదు. దీంతో.. ఆయన కోసం ఎంతసేపు ఎదురు చూడాలని పీసీ ఘోష్ ఆగ్రహం ప్రదర్శించారు. విషయం తెలిసి సోమేష్ హడావిడిగా లోపలికి వెళ్లినట్లు సమాచారం.సూటిగా సమాధానాలివ్వండికమిషన్ ముందర చాలా సమాధానాలకు ‘గుర్తు లేదు’ అనే మాజీ సీఎస్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ‘‘మీరేం డిబేట్‌కు రాలేదు.. స్ట్రయిట్‌గా ఆనర్సివ్వండి’’ అని చెప్పారాయన. అదే సమయంలో.. విచారణకు హాజరైన మరో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సైతం ఇదే రీతిలో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. దీంతో.. సూటిగా సమాధానాలివ్వని ఈ ఇద్దరిపైనా పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నాకేం తెలీదు.. గుర్తు లేదు: స్మితా సబర్వాల్
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అందులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా.. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కమిషన్ ఇవాళ విచారణ జరిపింది.హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఓపెన్ కోర్టులో ‘‘అన్నీ నిజాలే చెప్తా..’’ అని కమిషన్ చీఫ్ జస్టిస్ పీసీ చంద్రఘోష్, స్మితా సబర్వాల్‌తో ప్రమాణం చేయించారు. ఆపై ప్రశ్నలు గుప్పించారు.కమిషన్: క్యాబినెట్ ఆమోదం లేకుండానే మూడు బ్యారేజీలకు చెందిన పరిపాలన అనుమతుల జీవోలు తెలియజేశారా?స్మితా సబర్వాల్: అది నా దృష్టిలో లేదుకమిషన్: కొన్ని ఫైల్స్ సీఎంఓ కి రాకుండానే క్యాబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలన అనుమతులు పొందాయా?స్మితా సబర్వాల్: కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు నాకు సమాధానం తెలీదు.. అవగాహన కూడా లేదుకమిషన్: క్యాబినెట్ పొందకుండానే మూడు బ్యారేజీల నిర్మాణ పనులు ప్రారంభించారా? స్మితా సబర్వాల్: నాకు తెలీదుకమిషన్: దాచడానికి ఏమీ లేదు నిజాలు మాత్రమే చెప్పాలిస్మితా సబర్వాల్: సీఎంఓకి వచ్చేటువంటి ప్రతి ఫైల్ సీఎం అప్రూవల్ ఉంటుంది2014 నుంచి పదేళ్లపాటు గత ప్రభుత్వం సీఎంవోలో సెక్రటరీగా పని చేశాసీఎంవోలో ఏడు శాఖలను పర్యవేక్షించా మై రోల్ ఈజ్ లిమిటెడ్.. జనరల్ కోఆర్డినేషన్ మాత్రమే కమిషన్: మూడు బ్యారేజీలకు సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి నోట్స్ సీఎంవోకి వచ్చాయా?స్మితా సబర్వాల్: నా దృష్టిలో లేదు... నాకు ప్రస్తుతం గుర్తుకు లేదుఇదిలా ఉంటే.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సైతం ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో.. ఉన్నత అధికారులందరినీ కమిషన్ విచారిస్తోంది. ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ ఛైర్మన్ పినాకి చంద్రఘోష్, మాజీ అధికారులపై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్నారు. నిన్న (బుధవారం) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులు ఎస్కే జోషి, రజత్ కుమార్‌ను కమిషన్ విచారించింది.ఇదీ చదవండి: కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే! -
'ఆత్మ గౌరవంతో రాజీ పడలేను..' హైకోర్టు జడ్జీ అర్ధాంతరంగా రాజీనామా..
ముంబయి: బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ రోహిత్ డియో అర్దాంతరంగా రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు కోర్టు హాల్లోనే ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నాగ్‌పూర్‌లోని కోర్టు హాల్లో ఈ మేరకు ప్రకటించారు. ఆత్మగౌరవంలో రాజీపడలేనని ఆయన చెప్పినట్లు హాల్లో ఉన్న ఓ లాయర్ ఈ విషయాన్ని తెలిపారు. 'కోర్టులో ఉన్నవారందరికీ క్షమించమని కోరుతున్నా. మెరుగుపడాలనే మిమ్మల్ని అప్పడప్పుడు తిట్టాను. నేను కూడా మెరుగుపడాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు ఉండదు. ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులే. చెప్పడానికి చింతిస్తున్నా.. నా రాజీనామాను ఇచ్చేశాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పనిచేయలేను. మీరంతా కష్టజీవులు' అని జడ్జి చెప్పినట్లు ప్రత్యక్షంగా ఉన్న ఓ లాయర్ చెప్పారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే క్రమంలో మాత్రం తన వ్యక్తిగత కారణాలతోనే దేశ అధ్యక్షురాలికి రాజీనామా ఇచ్చినట్లు జస్టిస్ రోహిత్ డియో చెప్పారు. కీలక తీర్పులు.. అయితే.. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సాయిబాబాను 2022లో జస్టిస్ రోహిత్ డియో నిర్దోషిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జీవత ఖైదు శిక్షను పక్కకు పెట్టారు. ఉపా చట్టం కింద చెల్లుబాటు అయ్యే అవకాశం లేనప్పుడు విచారణ అనేదే శూన్యం అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు నిలుపదల ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కేసును మళ్లీ నూతనంగా విచారణ చేపట్టాలని నాగపూర్‌కు చెందిన హైకోర్టు బెంచ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జస్టిస్ రోహిత్ డియో నాగపూర్‌కు చెందిన హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సభ్యునిగా ఉన్నారు. ఇదే కాకుండా నాగపూర్-ముంబయి సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేలో మైనర్ ఖనిజాల తవ్వకాల అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా జస్టిస్ రోహిత్ డియో స్టే విధించారు. 2017లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ రోహిత్ డియో 2025 డిసెంబర్ వరకు కొనసాగనుండగా.. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్‌గా కూడా జస్టిస్ రోహిత్ డియో పనిచేశారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి ముస్లిం కమిటీకి సుప్రీంలో చుక్కెదురు.. ASI సర్వేకు గ్రీన్ సిగ్నల్.. ఇటు పురావస్తు శాఖకు ఆదేశాలు -
22న కేసీఆర్ రాక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 22న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని నాలుగు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, ముథోల్‌లలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు జరుగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాష్ట్ర మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రచార సభల షెడ్యూల్ వివరించారు. నాలుగు చోట్ల బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు సమాచారం. రెండు జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల ప్రజలకు అనువుగా ఉండేలా నాలుగు చోట్ల ప్రచార సభలను ఏర్పాటు చేయడం విశేషం. మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లో మలివిడతలో కేసీఆర్ ప్రచార సభలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 19వ తేదీతో నామినేషన్ల ఘట్టం ముగుస్తుండగా, 22వ తేదీ నాటికి ఉపసంహరణల గడువు కూడా పూర్తికానుంది. పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల ముందు కేసీఆర్ ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలతో నియోజకవర్గాల్లో కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు. -
సభా ప్రాంగణం పరిశీలన
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో ఈనెల 19న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరవుతారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలివస్తారని పేర్కొన్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనంతరం ప్రాంగణంలో తిరుగుతూ సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
భారీ భద్రత నడుమ ఓపెన్ కోర్టుకు...
-
ఓపెన్ కోర్టు ముందుకు 346మంది స్మగ్లర్లు
తిరుపతి : ఎర్ర చందనం స్మగ్లర్లను తిరుపతి పోలీసులు మంగళవారం ఓపెన్ కోర్టులో హాజరు పరిచారు. తిరుపతి తారకరామా స్టేడియంలో విచారణ నిమిత్తం 346 మందిని భారీ బందోబస్తు మధ్య బహిరంగ న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. 2013 డిసెంబర్ 15న శేషాచలం అడవుల్లో ఇద్దరు అటవీ శాఖ అధికారులను హతమార్చిన కేసులో వీరు నిందితులు. నిందితులు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన స్మగ్లర్లు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖర బాబు మాట్లాడుతూ అటవీ అధికారుల హత్య కేసులో 27రోజుల్లోనే ఛార్జ్‌షీటు దాఖలు చేసామని, అందువల్ల నిందితులకు ఇప్పటివరకూ బెయిల్ లభించలేదన్నారు. ఈ కేసులో నిందితులు ఇప్పటివరకూ జైల్లోనే ఉన్నారని ఆయన చెప్పారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లర్లు లేకుండా చేయటమే తమ లక్ష్యమన్నారు.