Palamuru works
-
120 టీఎంసీలు తరలించేలా ‘పాలమూరు’ పనులు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తాగునీటి అవసరాలకు కేవలం 7.15 టీఎంసీలు అవసరం కాగా, శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీలు చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల తరలింపునకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణ పనులు కొనసాగిస్తోందని కృష్ణా బోర్డు సుప్రీంకోర్టుకు నివేదించింది. శ్రీశైలం నుంచి తరలించుకోవడానికి ప్రతిపాదించిన నీటి పరిమాణంతో పోల్చితే తాగునీటి అవసరాలు చాలా స్వల్పమేనని పేర్కొంది. 7.15 టీఎంసీల తాగునీటిని తరలించుకోవాలనుకున్నా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన అన్ని జలాశయాల్లోకి కలిపి 67.97 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉంటుందని పేర్కొంది. వాస్తవ తాగునీటి అవసరాల కంటే తరలించే జలాలు ఎక్కువ అని తెలియజేసింది. ఈ మేరకు తనతో పాటు కేంద్ర జలశక్తి శాఖ తరఫున కృష్ణా బోర్డు తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. 3.4 టీఎంసీలకే 65 టీఎంసీలు నింపాలి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మొత్తం 6 రిజర్వాయర్లను ప్రతిపాదించగా, చివరి కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులను ఇంకా ప్రారంభించలేదు. తొలి 5 రిజర్వాయర్లలో పూర్తి నిల్వ సామర్థ్యం మేరకు మొత్తం 65.17 టీఎంసీలను నింపిన తర్వాతే, ఈ ఐదింటి కింద తాగునీటి అవసరాలకు ప్రతిపాదించిన మొత్తం 3.4 టీఎంసీలను (కేపీ లక్ష్మీదేవిపల్లి కింద తాగునీటి అవసరాలు 4.11 టీఎంసీలు) తరలించుకోవడానికి వీలు కలిగే రీతిలో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని సుప్రీంకోర్టుకు బోర్డు తెలిపింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అఫిడవిట్‌లోని ప్రధానాంశాలు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. దీని కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మీదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను ప్రతిపాదించింది. ఈ ఎత్తిపోతల ద్వారా తరలించే 120 టీఎంసీల్లో తాగునీటికి కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్ కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా పనులు చేపట్టలేదు. ఇప్పటిదాకా పూర్తయిన ఐదు రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామంటూ తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌ను సమరి్పంచింది. కానీ ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులపై బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు డీపీఆర్‌ను మదింపు చేయలేమని గతంలోనే తిప్పి పంపాం. పనులు ఆపాలని గతంలో బోర్డు సమావేశాల సందర్భంగా తెలంగాణను కోరాం. కేసు నేపథ్యం ఇదీ...: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పనులను ఆపాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశించింది. అయినా ప్రభుత్వం పనులు ఆపకపోవడంతో ఎన్టీటీ రూ.920.85 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించగా ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అలాగే తాగునీటి కోసం 7.15 టీఎంసీలను తరలించేలా పాలమూరు ఎత్తిపోతల పనులకు 2023 ఫిబ్రవరి 17న అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో ఎత్తిపోతలను తమ అనుమతి ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో లేదో చెప్పాలని కేంద్రాన్ని, కృష్ణా బోర్డును ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, బోర్డు అఫిడవిట్ దాఖలు చేశాయి. వాస్తవానికి ఈ నెల 4న కేసు విచారణ జరగాల్సి ఉండగా అక్టోబర్ 6కి వాయిదా పడింది. -
పంట కాల్వ మూసివేత సరికాదు
కొల్లాపూర్/కొల్లాపూర్ రూరల్: పాలమూరు ప్రాజెక్టు ప్రధానకాల్వ అనుసంధానం కోసం కేఎల్ఐ డీ–5 పంటకాల్వను మూసివేయడం సరికాదని, వెంటనే దానిని పునరుద్ధరించాలని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మండలం సున్నపుతండా సమీపంలోని కేఎల్ఐ డీ–5 పంటకాల్వను పూడ్చివేశారని తెలియడంతో గురువారం భారీ అనుచరగణంతో ఆయన కొల్లాపూర్ నుంచి పంటకాల్వ వరకు పాదయాత్ర నిర్వహించారు. అధి కారులపై ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ఒత్తిడి తెచ్చి దొంగచాటుగా అర్ధరాత్రి కాల్వ మూసివేయించారని, గతంలోనూ కోర్టులో కేసు వేసి ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ కాల్వను ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో అదే కాల్వను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్కడే కాసేపు బైఠాయించారు. అనంతరం కొల్లాపూర్‌లో జూపల్లి మాట్లాడుతూ ఈ కాల్వ కింద 2,900 ఎకరాల భూములు ఉన్నాయని, గతేడాది కృష్ణానదిలో నీళ్లున్నా రైతులకు అందించలేకపోయారని, ఈ ఏడాది నీళ్లు అందే అవకాశం ఉన్నా పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. -
‘పాలమూరు’ ప్రాజెక్టుల కథేంటి?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి పెట్టారు. ముఖ్యంగా పదిహేనేళ్ల కింద చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు ఇంతవరకు వందశాతం పూర్తికాలేదు. దీనికిగల కారణాలపై ఒకట్రెండు రోజుల్లో ప్రాజెక్టు ఇంజనీర్లు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సీఎంఓ కార్యాలయం సమాచారం అందించింది. ఈ పథకాల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలున్నా, ఎందుకు జాప్యం జరుగుతోందన్న దానిపై సమీక్షించి సీఎం మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. నిధుల్లేక నీరసం జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కల్వకుర్తి ద్వారా సుమారు 5 లక్షలు, భీమా, నెట్టెంపాడుల ద్వారా చెరో 2 లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. వీటికింద సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పటికే 6.50 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వచ్చింది. భూసేకరణ, పిల్ల కాల్వల నిర్మాణం పూర్తి చేస్తే ప్రాజెక్టులు వందశాతం పూర్తవుతాయి. అయితే నిధుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,500 కోట్లు నిధులు కేటాయించాలని ఇంజనీర్లు ప్రతిపాదించారు. అప్పుడు పెండింగ్ బిల్లులతో పాటు పూర్తిస్థాయిలో పనులు చేయొచ్చని పేర్కొన్నారు. అయినప్పటికీ అరకొరగా నిధుల కేటాయింపు జరిగింది. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.75 కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి దీనికింద రూ.80 కోట్లు పెండింగ్ బిల్లులు ఉండగా, భూసేకరణకు సంబంధించి మరో రూ.29 కోట్లు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులు పెండింగ్‌కే సరిపోతాయి. కాల్వ పనులు పూర్తిచేస్తే.. ముఖ్యంగా ప్యాకేజీ–29లో కాల్వ పనులు పూర్తి చేస్తే 57 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భూసేకరణకు సం బంధించి రూ.18 కోట్ల నిధులు ఏడాదిగా ఇవ్వ డం లేదు. పెండింగ్ బిల్లులు మరో రూ.40 కోట్లు ఉన్నాయి. దీంతో పనులు ముందుకే కదలట్లేదు. దీనిపై గత సమీక్షల్లో జిల్లా మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటే పాలమూరు–కల్వకుర్తికి అనుసంధానం చేసే అంశం కొలిక్కి రావాల్సి ఉంది. ఇక నెట్టెంపాడు పరి«ధిలోని మరో 50 వేల ఎకరాలకు నీరందడం లేదు. ప్రాజెక్టుకు రూ.192 కోట్ల మేర కేటాయించినా, ఇక్కడ పెండింగ్ బిల్లులు రూ.25 కోట్లు ఉన్నాయి. భీమాలోనూ ఇదే పరిస్థితి. దీంతోపాటే పాలమూరులోని కర్వెన రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని తీసుకెళ్లే ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. గట్టు ఎత్తిపోతలను ఫైనల్ చేయాల్సి ఉంది. వీటన్నింటిపై సమగ్ర వివరాలతో రావాలని సీఎం ఆదేశించడంతో ఇంజనీర్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. చదవండి: టర్కీ డిజైన్‌లో సచివాలయం మసీదులు -
వరదే.. వరమయ్యింది
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్లో పదేళ్ల అనం తరం విస్తారంగా కురిసిన వర్షాలతో పోటెత్తిన వరదలు రాష్ట్రానికి కొత్త ఊపిరిలూదాయి. ఆగస్టు తొలివారం నుంచి విరామం లేకుండా కొనసాగిన వరదలు ప్రాజెక్టుల కింది తాగు, సాగు అవసరాలకు వరంగా మారాయి. బేసిన్లో కురుస్తున్న వర్షాలతో పెరిగిన ప్రవాహాల మాదిరే, రాష్ట్ర వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఆగస్టు నుంచి మూడు నెలల వ్యవధిలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద 100 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన 340 టీఎంసీల లభ్యత జలాలుండగా, ప్రాజెక్టుల్లో స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతుం డటం రాష్ట్రానికి వరంగా మారింది. ‘పాలమూరు’కు ప్రాణం.. జూరాల, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు ఆగస్టు నుంచి ఉధృతంగా కొనసాగుతూ వచ్చాయి. 2009– 10 తర్వాత ఆ స్థాయిలో వరదలు కొనసాగడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు 6 సార్లు, సాగర్ గేట్లు 7 సార్లు ఎత్తాల్సి వచ్చింది. ఇప్పటివరకు జూరాలకు 1,348 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 1,650 టీఎంసీలు రాగా, సాగర్‌కు 1,145 టీఎంసీల వరద వచ్చింది. ఇందులో తెలంగాణలో 100 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. గత కొన్నేళ్లతో పోలిస్తే గరిష్ట నీటి వినియో గం జరిగింది. పాలమూరు జిల్లాలో జూరాలపై ఆధారపడ్డ నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమాలతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద గతంలో ఎన్నడూలేని రీతిలో 53 టీఎంసీల మేర నీటి విని యోగం జరిగింది. నెట్టెంపాడు కిందే 16 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. వీటి ద్వారా 952 చెరువులను నింపారు. గతేడాది ఇదే సమయానికి ఈ పథకాలు, జూరాల కింద వినియోగం 20 టీఎంసీలను దాటలేదు. గత ఏడాదంతా కలిపి అన్ని ప్రాజెక్టుల కింద వినియోగం 75 టీఎంసీలు మాత్రమే ఉంది. ప్రస్తుతం జూరాలకు 1.38 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండటంతో దానిపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాలకు నీటి వినియోగం జరుగుతూనే ఉంది. మరో పది రోజులపాటు వరద ఇదే రీతిన కొనసాగే అవకాశాల నేపథ్యంలో మరిన్ని చెరువులు నింపనున్నారు. సాగర్ ఎడమ కాల్వ కింద తాగు, సాగునీటి అవసరాలకు ఇప్పటికే 24 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ఏఎంఆర్పీ కింద 13 టీఎంసీలు, జలమండలి కింది 7 టీఎంసీల మేర వినియోగం జరిగింది. కనీస నీటి మట్టం 834 అడుగుల కు ఎగువన శ్రీశైలంలో 160 టీఎంసీలు, సాగర్‌లో 510 అడుగులకు పైన 180 టీఎంసీలు కలిపి 340 టీఎంసీల లభ్యత ఉంది. ఈ వినియోగం వచ్చే ఏడాది జూన్ వరకు జరిగినా, గతేడాది మొత్తం జరిగిన వినియోగం 207 టీఎంసీల మార్కును దాటనుంది. బాబ్లీ గేట్ల మూసివేత బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 14 గేట్లను మూసి వేశారు. కాగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టడంతో మంగళవారం ఎస్సారెస్పీ వరద గేట్లను మూసి వేశారు. -
ఏడాదిలోపు పాలమూరు ప్రాజెక్ట్ పూర్తవుతుంది
-
పాలమూరు పరిశీలనకు సీఎం రాక
సాక్షి,మహబూబ్‌నగర్: ఎట్టకేలకు.. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారైంది. ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులను పరుగులు పెట్టించడంతో పాటు ఇతర ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఇన్నాళ్లూ కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టిసారించిన సీఎం.. అది పూర్తవడంతో ఇప్పుడు తన దృష్టంతా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు రాష్ట్ర, జిల్లా అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించిన కేసీఆర్ పనుల పురోగతిని పరిశీలించేందుకు జిల్లాలో పర్యటించనున్నారు. సాగుకు నీరులేక కరువుతో అల్లాడిన పాలమూరును పచ్చబర్చాలనే లక్ష్యంతో నేడు ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ప్రాజెక్టు బాట పడుతున్నారు. ఉదయం 9.40గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సుమారు 8 గంటల పాటు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సర్కిల్–1 పరిధిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల వద్ద పనులను ఆయన పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీల వారీగా పనుల పురోగతి.. అడ్డంకులు.. సమస్యలను తెలుసుకునేందుకు ఆయన రోజంతా ఉమ్మడి జిల్లాలో గడపనున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని పది లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంతో జీవం నిధులు లేక పడకేసిన ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు ఇటీవల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.10వేల కోట్ల రుణం జీవం పోసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం 2015 జూన్‌లో ప్రతిష్టాత్మకంగా రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో సీఎం కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ వద్ద కరివెనా రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తర్వాత కాంట్రాక్టర్లతో ఒప్పందం కోసం పది నెలల సమయం పట్టింది. చివరకు 2016 మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 2018 ఆఖరులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు పనులు వేగంగా చేసేందుకు సరిపడా నిధులు లేకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. పనుల పురోగతికి సంబంధించిన నిధులు.. నిర్వాసితులకు పరిహారం పంపిణీలో జాప్యం కావడంతో పనులు ముందుకు సాగలేదు. తాజాగా పవర్ కార్పొరేషన్ మంజూరు చేసిన రూ.10వేల కోట్లతో పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ల పనులు 30 శాతం నుంచి 90శాతం వరకు పూర్తయ్యాయి.కాల్వల విషయానికొస్తే నార్లాపూర్ నుంచి ఏదుల వరకు 8.375 కిలో మీటర్ల కాల్వను 2,3 ప్యాకేజీలుగా విభజించి ఇప్పటి వరకు 50శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల నుంచి వట్టెం వరకు 6.4 కిలో మీటర్ల కాల్వలను 6,7ప్యాకేజీలుగా విభజించి 81శాతం పనులు పూర్తి చేశారు. ఇక వట్టెం నుంచి కరివెన వరకు 12కిలో మీటర్ల కాల్వలను 12వ ప్యాకేజీగా విభజించి 72శాతం కాలువ పనులను పూర్తి చేశారు. రెండు హెలిక్యాప్టర్లు.. పది హెలీప్యాడ్లు సీఎం కేసీఆర్ పర్యటన అంతా రెండు హెలిక్యాప్టర్లలో జరగనుంది. ఓ హెలీక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు మరో హెలీక్యాప్టర్‌లో సీఎం కార్యదర్శితో పాటు ఈఎన్సీ మురళీ, పాలమూరు– రంగారెడ్డి సీఈ రమేశ్, ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. దీంతో అధికారులు సీఎం పర్యటించనున్న భూత్పూర్ మండలం బట్టుపల్లి (కరివెన), బిజినేపల్లి మండలం వట్టెం, గోపాల్పేట మండలం ఏదుల వద్ద రెండు చొప్పున హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. కాగా నార్లాపూర్ వద్ద రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో, టన్నెల్ పనుల వద్ద రెండు చొప్పున నాలుగు హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా ఎస్పీలు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులపైనా.. పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పురోగతి పైనా సీఎం కేసీఆర్ ఆరా తీయనున్నారు. ఈ మేరకు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుల వద్ద క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటల నుంచి 5:30గంటల వరకు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటి వరకు విడుదలైన నిధులు.. అయిన ఖర్చు, బిల్లుల పెండింగ్ అంశాలను సమీక్షలో చర్చకొచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల అధికారులందరూ సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఇలా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు. 9:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 9:40 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం బట్టుపల్లి వద్ద కొనసాగుతున్న కరివెన రిజర్వాయర్‌కు చేరుకుంటారు. 10:15 గంటలకు కరివెన రిజర్వాయర్ నుంచి బయల్దేరుతారు. 10:40 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వద్ద కొనసాగుతున్న వట్టెం రిజర్వాయర్కుచేరుకుంటారు. 11:00 గంటలకు వట్టెం నుంచి బయల్దేరుతారు. 11:20 నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపూర్ రిజర్వాయర్‌కు చేరుకుంటారు. 11:50 నార్లపూర్ నుంచి బయల్దేరుతారు. 12:10గంటలకు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుల రిజర్వాయర్‌కు చేరుకుంటారు. అక్కడే భోజనం చేస్తారు. అనంతరం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆన్‌గోయింగ్ ప్రాజెక్టు పురోగతిపై జిల్లా మంత్రులు, సంబంధిత రాష్ట్ర, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు -
‘పాలమూరు’ పనుల్లో వేగం పెంచండి
మహబూబ్‌నగర్ జిల్లా అధికారులకు హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం మొత్తం 96,485 ఎకరాలను సేకరించాల్సి ఉండగా 86,956 ఎకరాలను సేకరించినట్లు పాలమూరు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ వనజాదేవి తెలిపారు. మరో 600 ఎకరాలను సేకరిస్తే ప్రభుత్వ లక్ష్యం ప్రకారం నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని వివరించారు. ప్రాజెక్టులను నిర్ణీత గడువు లోపలే పూర్తి చేయాలని చీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌రావుకు సూచించారు.