వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పాముల ఉమాదేవి
విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పాముల ఉమాదేవి ఆపార్టీకి సోమవారం రాజీనామా చేశారు. విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోనేరు ప్రసాద్ సమక్షంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోనేరు ప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.