Partnership Conference
-
సంస్కరణలు పెద్ద ఎత్తున చేపట్టాలి
న్యూఢిల్లీ: భారత్‌కు మరిన్ని సంస్కరణలు అవసరమని, అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలను చేపట్టాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. సీఐఐ పార్ట్నర్షిప్ సదస్సు 2021ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎగుమతులు గణనీయంగా పెరిగిన సందర్భాల్లోనే భారత్ వృద్ధి సాధించినట్టు గుర్తు చేశారు. భారత్ పోటీనిచ్చేలా ఉండాలని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం.. తదుపరి మరిన్ని సంస్కరణలు చేపట్టే విషయంలో ప్రభుత్వం తీరుపై ప్రభావం చూపిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘సంపద సృష్టి ప్రైవేటు రంగం ద్వారానే సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. వారికి (పారిశ్రామికవేత్తలకు) పరిస్థితులు అనుకూలంగా ఉండేలా చూడడమే ప్రభుత్వం చేయాల్సిన పని. ఉత్ప్రేరకంగా, సదుపాయ కల్పనదారుగానే ప్రభుత్వం వ్యవహరించాలి. సంస్కరణలను ఈ దిశగానే ముందుకు నడిపించాలి’’ అని కాంత్ చెప్పారు. -
ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో జపాన్ ఇండ్రస్టియల్ టౌన్‌షిప్‌కు శ్రీకారం చుడుతున్నట్లు పరిశ్రమలు, ఐటి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. డీపీఐఐటీ, సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన జపాన్ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భాగస్వామ్య సదస్సులో కేంద్ర డీపీఐఐటీ శాఖ కార్యదర్శి గురు ప్రసాద్ మోహపాతర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ రవీన్, ఈడీ ప్రతాప్ రెడ్డి, జపాన్‌కు చెందిన ఎకనమీ, ట్రేడ్, పరిశ్రమల శాఖ (ఎంఈటీఐ) వైస్ మంత్రి సన్ షిగెహిరో టనక, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్( జేఈటీఆర్‌వో సీఐఐ వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్, జపాన్ భారత అంబాసిడర్ సంజయ్ కె వర్మ, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. (చదవండి: విదేశాల్లోనూ యువతకు ఉపాధి కల్పన) ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, ఎప్పటి నుంచో జపాన్‌తో ఆంధ్రప్రదేశ్‌కు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు. విశాఖలో 10 లక్షల చదరపు అడుగుల్లో జపనీస్ ఎన్క్లేవ్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. చైనా నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా 'జపాన్ డెస్క్ ఏర్పాటు' చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో ఏటీసీ టైర్స్, యొకొహొమా గ్రూప్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఒక్క వాహనాల టైర్ల తయారీలోనే రెండువేల మందికి ఉపాధి, యువతకు శిక్షణ అందించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్) శ్రీసిటీలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ భారీ స్థాయిలో ఏర్పాటయ్యిందన్నారు. వైజాగ్- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధిలో భాగంగా మరో జపాన్ పారిశ్రామిక టౌన్ షిష్‌కు ప్రతిపాదించామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 25కిపైగా జపాన్ కంపెనీల పెట్టుబడులు పెట్టాయన్నారు. కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు వున్న 2,500 కి.మీ తూర్పు తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఈస్ట్‌కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌ను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని,అందులో భాగంగా తొలి దశలో విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధి జరగనుందని వెల్లడించారు. జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజన్సీ నేతృత్వంలో కృష్ణపట్నం కేంద్రంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ , ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ) భాగస్వామ్యం ద్వారా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ) అభివృద్ధికి 1300 కోట్ల నిధులు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో పరిశ్రమలను ఆదుకోవడం కోసం కోవిడ్-19 సమయంలో ఆత్మనిర్భర్ సహా పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో జపాన్ పాత్ర ఎంతో కీలకమని, రాష్ట్రంతో జపాన్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏడాదిన్నర ప్రభుత్వంతో మరింత అనుబంధం ఏర్పడిందని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. -
బాబు చెబుతున్న పెట్టుబడుల అసలు బాగోతం ఇదీ..
విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని, రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాల స్థాయిని ఏటా పెంచుకుంటూ పోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా కేంద్రానికి సీఎం సంకేతాలు ఇస్తున్నారు. 2016 జనవరిలో జరిగిన సదస్సులో రూ.4.67 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. అందులో రూ.2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదిరిన తర్వాత.. ఆయా పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి ‘ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్ మెమొరాండం’ (ఐఈఎం) సమర్పించాల్సి ఉంటుంది. పారిశ్రామిక ఒప్పందాలు తదుపరి దశకు చేరడానికి ఇది తప్పనిసరి. అయితే ఐఈఎం దాఖలు చేసినంత మాత్రాన కూడా పరిశ్రమలు పెడతారని చెప్పలేం. 2016లో రూ.34,464 కోట్ల మేర ‘ఐఈఎం’ దాఖలు చేశారు. అందులో రూ.7 వేల కోట్ల మేర మాత్రమే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. 2017 జనవరి భాగస్వామ్య సదస్సులో రూ.10.54 లక్షల కోట్లకు ఒప్పందాలు కుదిరాయని అబద్దాల స్థాయిని మరింత పెంచారు. పెట్టుబడులు వస్తే అందరికీ సంతోషమే. కానీ.. ఎవరికి పడితే వారికి సూటు, బూటు వేసి రూ.లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలని సంతకాలు చేయించి ప్రజలను మోసం చేస్తేనే అందరికీ ప్రమాదం. ఎంవోయూల పేరుతో చంద్రబాబు చేసిన మోసానికి సంబంధించి ప్రస్తుతం రెండు ఉదాహరణలు చెబుతాను. త్రిలోక్ కుమార్ అనే ఆయన ఎంవోయూ కుదుర్చుకున్నారని చూపించారు. ఆయన అనకాపల్లికి చెందిన గంధం నందగోపాల్ పారిశ్రామికవేత్త తరపున ప్రెస్నోట్లు తెచ్చి విలేకరులకు ఇస్తుంటారు. అంటే పీఆర్వో అన్నమాట. ఆయనకు సొంత వాహనం కూడా లేదు. మరి ఆయన కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఎంవోయూ కుదుర్చుకున్నాడో చంద్రబాబుకే తెలియాలి. మరొకరు దొడ్డల సుధీర్. గుంటూరు జిల్లా సంతగుడిపాడుకు చెందిన ఈయన రియల్ ఎస్టేట్ ఏజంట్‌గా పనిచేస్తారు. ఆయన భార్య అంగన్వాడీ టీచర్. ఈయన కూడా కోట్ల పెట్టుబడులు ఎలా పెడతాడో చంద్రబాబే చెప్పాలి. ఇలా కనిపించిన వారికి సూటు, బూటు వేసి ఎంవోయూలపై సంతకాలు చేయించేశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆలోక్యరాజ్ చంద్రబాబు దెబ్బకు భయపడి ఆ ఫైళ్లపై సంతకాలు పెట్టను అని అన్నారు. ఎంవోయూల పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలకు ఇదీ నిదర్శనం. -
భాగస్వామ్య సమ్మిళితం
-
భాగస్వామ్యం ఇలా...
విశాఖపట్నం : నూతన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తితో ఉన్నట్టు భాగస్వామ్య సదస్సుల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదర్చుకోకపోయినా పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చినట్టు కొంతమంది తెలిపారు. అన్నీ అనుకూలంగా ఉంటే ప్రభుత్వం చర్చించాక ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. ఆదివారం నాటి భాగస్వామ్య సదస్సుకు హాజరైన వారిలో ఇప్పటికే ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న వారు కూడా ఉన్నారు. సదస్సుకు వచ్చిన వారిలో కొందరు ప్రతినిధులు సాక్షితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే.. ఏపీ విశిష్టతలెన్నో... విశాఖపట్నం : భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రంలోని భౌగోళిక ప్రాధాన్యతలు, పరిశ్రమల ప్రాశస్త్యాన్ని తెలిపే ఏపీ పెవిలియన్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. ఈ పెవిలియన్‌లో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రాధాన్యతా అంశాలను సీఎం చంద్రబాబు జైట్లీకి వివరించారు. దేశ తూర్పుతీర ప్రధాన ఆర్థిక కారిడార్‌గా విశాఖను అభివర్ణిస్తూ జిల్లాలోని ప్రముఖ పర్యాటక, పారిశ్రామిక, ఆధ్యాత్మిక కేంద్రాలను, ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా విశిష్టతతో పాటు ఇతర జిల్లాల్లోని ప్రత్యేకతలను తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో సమృద్ధిగా ఉన్న ఖనిజ సంపద, విజయనగరంలో జిల్లాలోని వృక్ష, జంతుజాలం, కృష్ణా జిల్లాలోని బుద్ధిజం, తూర్పు గోదావరి జిల్లాలోని పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాలు, గుంటూరు జిల్లాలోని టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమల గురించి వివరించారు. అలాగే ప్రకాశం జిల్లాలోని గ్రానైట్, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, కడపలోని గండికోట, ఇండస్ట్రియల్ కారిడార్, నెల్లూరులోని ఆటోమొబైల్ పరిశ్రమ, అనంతపురంలోని ఏరోస్పేస్, రక్షణరంగ సంస్థలు, కర్నూలు జిల్లాలోని ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, చిత్తూరు జిల్లాలోని ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమల ప్రాధాన్యతలను డిస్ప్లే బోర్డులు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా పెవిలియన్‌లో ప్రదర్శనకు ఉంచారు. పర్యాటక రంగ ఒప్పందానికి వచ్చాం.. కృష్ణాజిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో వనరులున్నాయి. పర్యాటక రంగంలో ఏపీ పటంలో కృష్ణా జిల్లాను చేర్చాలన్నది మా తపన. అందుకోసం ఇక్కడకు వచ్చాం. టూరిజంలో భాగంగా ఫోర్స్టార్ హోటల్ కూడా నిర్మించాలనుకుంటున్నాం. ప్రభుత్వంతో రేపు ఎంఓయూ కుదుర్చుకుంటున్నాం. - వై.ఎన్.రావు, కృష్ణా జిల్లా గార్మెంట్స్ పరిశ్రమపై ఆసక్తి మేం మా దేశం (జోర్డాన్)లో దుస్తుల తయారీ పరిశ్రమను నడుపుతున్నాం. మా ఉత్పత్తులను అమెరికా దేశానికి ఎగుమతి చేస్తున్నాం. భారత్‌కు కూడా ఎగుమతులు ప్రారంభించాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ భాగస్వామ్య సదస్సుకు వచ్చాం. ఇక్కడ (రాష్ట్రంలో) కొన్ని గార్మెంట్స్ తయారీ ఫ్యాక్టరీలను సంద ర్శిస్తాం. అన్నీ అనుకూలంగా ఉంటే గార్మెంట్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. - జీనా ఖయ్యద్, జోర్డాన్ మైనింగ్‌పై ఎంఓయూ కుదుర్చుకున్నాం కర్నూలు మండలం పత్తికొండ సమీపంలో గోల్డ్ మైనింగ్‌పై ఆదివారం ఇక్కడ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాం. దీని విలువ రూ.300 కోట్లు. అనుకూలతను పరిశీలించాక ప్రాసెసింగ్ ప్లాంట్ నెలకొల్పుతాం. ఇది లాభదాయకంగా ఉంటుందనుకుంటున్నాం. - జె.డెవినిష్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, జియో మైసూర్ సర్వీసెస్ పరిశ్రమల ఏర్పాటుకు ఊతం ఇలాంటి సదస్సుల వల్ల పరిశ్రమల ఏర్పాటుకు వీలవుతుంది. అనీల్ అంబానీల్లాంటి వారు ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తే పరోక్షంగా ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలకు, ఐటీ రంగానికి ఎలాంటి సపోర్టు ఇస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను. అన్నీ బాగుంటే మేం కూడా ఎంఓయుకు ప్రయత్నిస్తాం. - విద్యాసాగర్, టెక్ ఐటీ సొల్యూషన్స్, విశాఖ బయోటిక్స్‌లో... మేం పదేళ్లుగా బయోటిక్స్ రంగంలో ఉన్నాం. మా ఉత్పత్తుల సరఫరాకు అరబ్ దేశాలు ముందుకొస్తున్నాయి. అయితే మాకు ఎవరితో లాభదాయకమో ఆలోచిస్తున్నాం. ఇటలీ నుంచి వచ్చే వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నాం. -ఎం.ఎల్.ప్రసాద్, సుజయ బయోటిక్స్ బీమాపై ఎంఓయూ బీమా రంగంలో ఉన్నాం. డ్వాక్రా, ఎన్జీవోల్లో సభ్యులకు బీమా సదుపాయం కల్పించడంపై అవగాహన కల్పిస్తున్నాం. సీఐఐలో తొలి సభ్యత్వం మాది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే బీమాపై మరింతగా అవగాహన కలిగించడానికి వీలవుతుంది. అందుకోసం ఎంఓయూ కుదుర్చుకోవడానికి వచ్చాం. -డి.జార్జి ప్రసాద్, ఇన్‌టెక్ ఇన్స్యూరెన్స్ సంస్థ అరకు కాఫీకి విస్తృత ప్రచారం అరకు వేలీ కాఫీకి ఇప్పటికే అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. రుచిలో దీనికిదే సాటి. జీసీసీ తయారు చేస్తున్న అరకు వేలీ కాఫీ స్టాల్, కాఫీ చాక్లెట్లు వంటి 17 రకాల ఉత్పత్తులను భాగస్వామ్య సదస్సులో ఏర్పాటు చేశాం. దేశ, విదేశాల ప్రతినిధులు వచ్చి ఈ కాఫీ రుచి చూసి మెచ్చుకుంటున్నారు. సదస్సు ద్వారా అరకు కాఫీ మార్కెట్ మరింత విస్తృతం అవుతుందన్న నమ్మకం ఉంది. -రవిప్రకాష్, జీసీసీ ఎండి -
భాగస్వామ్య సమ్మిళితం
అట్టహాసంగా ప్రారంభం తరలివచ్చిన పాలనా యంత్రాంగం తొలిరోజు 32 ఒప్పందాలు వేదికపై ఆశీనులైన అతిథులు విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం సీఐఐతో కలిసి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు ఆదివారం సాయంత్రం హార్బర్ పార్కు వద్ద ఏపీఐఐసీ స్థలంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడులను ఆహ్వానిస్తూ విశాఖలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి తొలి భాగస్వామ్య సదస్సు ఇది. ఈ సదస్సులో కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, పీయూష్ గోయ ల్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీ, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్, ఫోర్బ్స్ మార్షల్ డెరైక్టర్ నౌషద్ ఫోర్బ్స్, జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి, సీఐఐ ప్రెసిడెంట్, టీఐఎల్ లిమిటెడ్ ఎండీ సుమిత్ మజుందార్, కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ కార్యదర్శి అమితాబ్‌కాంత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 41 దేశాల నుంచి 350 మంది, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మరో 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అధికారులు ముందుగా చెప్పినట్టు తొలిరోజు సదస్సుకు విదేశీ మంత్రులు హాజరు కాలేదు. ఆధునిక టెంట్లతో నాలుగు హాళ్లను ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లో ఎనిమిది ప్లీనరీ సెషన్లు నిర్వహిస్తున్నారు. సదస్సు జరిగే ప్రాంతంలో తారురోడ్లు వేశారు. వేదిక ప్రవేశ మార్గంలో ప్రతినిధులను ఆకట్టుకునేందుకు సంక్రాంతి ముగ్గులు వేయించారు. సదస్సు ప్రారంభంలో వివిధ ప్రాంతాల సంస్కృతిని, ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని తెలియజేసే నృత్యాలను ప్రదర్శించారు. బీచ్‌రోడ్డులోనూ, వేదిక వద్దకు వెళ్లే రోడ్ల మార్గాల్లోనూ విద్యుత్ లైట్లతో అలంకరించారు. సదస్సు ప్రాంగణంలో జీసీసీ ఉత్పత్తులు, అరకు కాఫీ, హస్తకళలు, ఉప్పాడ జమదానీ తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సదస్సు ప్రారంభానికి ముందు అరకు కాఫీ స్టాల్ వద్దకు వెళ్లి కాఫీ రుచి చూశారు. బాబు పొగడ్తలకే ప్రాధాన్యం భాగస్వామ్య సదస్సులో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికే వక్తలు ప్రాధాన్యమిచ్చారు. అనిల్ అంబానీ చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ మధ్యలో లోకేష్ ప్రస్తావన కూడా తెచ్చారు. రక్షణరంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. జీఎంఆర్ అధినేత మల్లికార్జునరావు మాట్లాడుతూ తన చదువు, కెరీర్ విశాఖలోనే ప్రారంభమైందన్నారు. చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలున్నాయని, పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. వక్తల ప్రసంగం ముగిశాక వచ్చే ఏడాది కూడా ఇలాంటి సదస్సును విశాఖలోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తొలుత అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి వేదికపైకి వెళుతూ.. అదుపుతప్పి కింద పడిపోబోయారు. అక్కడున్న వారు పట్టుకోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.