patroling zeep
-
ఫుల్లుగా తాగి.. పోలీసు బండినే గుద్దాడు
న్యూఢిల్లీ: తాగిన మైకంలో కారు నడుపుతూ ఓ కాలేజీ విద్యార్థి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మరణించగా.. మరో వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఖల్సా కళాశాల సమీపంలో సోమవారం తెల్లవారుజూమున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. (ఎఫ్బీ అలర్ట్.. ప్రాణాలు కాపాడిన పోలీసులు) ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ వజీర్ సింగ్(ఫైల్ ఫోటో) వివరాలు.. మోడల్ సిటీ ప్రాంతానికి చెందిన తుషార్ గుప్తా(19) సింగపూర్‌లో చదవుకొంటున్నాడు. లాక్డౌన్ విధించడంతో ఇండియా వచ్చాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి స్నేహితులను కలిసి తిరిగి తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాడు. వేగంగా కారును నడుపుతూ వచ్చి ‘ప్రకార్ పెట్రోలింగ్ వెహికల్’ని ఢీ కొట్టాడు. ప్రమాద ధాటికి పెట్రోలింగ్ వాహనం 10 అడుగుల మేర గాలిలో ఎగిరి కింద పడింది. అందులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వజీర్ సింగ్ అక్కడిక్కడే మరణించగా.. డ్రైవర్ అమిత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితుడు తుషార్‌పై ఐపీసీ 279, 337,304 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల ఢిల్లీ పోలీసులు వీధుల్లో నేరాలను అరికట్టడం కోసం రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేశారు. దీనికోసం ‘ప్రకార్ పెట్రోలింగ్ వెహికల్స్’తో నిఘా ఏర్పాటు చేశారు. -
కాపాడండయ్యా!.. కనికరం చూపని ఖాకీలు
సహరన్పూర్ : రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రెండు ప్రాణాలు.. తమను కాపాడాలంటూ వేడుకోలు... స్థానికులు కూడా బతిమిలాడారు. అయినా కనికారం చూపని ఖాకీలు. సాయం కోరితే దారుణమైన సమాధానాలు ఇచ్చారు. వెరసి వారి ఉదాసీనత మూలంగా కళ్ల ముందే ఆ యువకులు ప్రాణాలు కోల్పోయారు. యూపీలో ఈ హేయనీయమైన ఘటన చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి సహరన్‌పూర్‌లో అర్పిత్ ఖాన్, సన్నీ అనే ఇద్దరు యువకులు మోటర్ బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్‌కి గురయ్యారు. అర్ధరాత్రి కావటంతో జన సందోహం పెద్దగా లేదు. అటుగా వెళ్తున్న కొందరు యువకులు అది గమనించి 100 కి డయల్ చేశారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ వాహనం అక్కడికి వచ్చింది. కానీ, వారిని వాహనంలోకి ఎక్కించుకునేందుకు అందులో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు నిరాకరించారు. ‘‘వారిని వాహనంలోకి ఎక్కిస్తే సీట్లకు రక్తపు మరకలు అంటుకుంటాయి’’ ... ఇది ఆ కానిస్టేబుళ్లు ఇచ్చిన సమాధానం. దీంతో కంగుతిన్న స్థానికులు అటుగా వెళ్తున మరికొన్ని వాహనాలను ఆపేందుకు యత్నించారు. అయితే ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘ ఏ తల్లి కన్న పిల్లలో... కాపాడండి. అవసరమైతే ఆ రక్తపు మరకలను నేను శుభ్రచేస్తా.. సాయం పట్టండి అని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కారు కడిగితే.. రాత్రంతా తాము ఎక్కడ పడుకోవాలని? వారు సమాధానం ఇవ్వటంతో మళ్లీ అవాక్కవ్వటం ప్రజల వంతు అయ్యింది. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కూడా ఆ ఇద్దరు యువకులు తమను కాపాడంటూ అక్కడున్నవారిని వేడుకోవటం కదిలించి వేసింది. ఇంతలో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మరో వాహనం అక్కడికి చేరుకుంది. కానీ, అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. యువకులను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్పందించిన ఉన్నతాధికారులు... పోలీసులు సాయానికి నిరాకరించిన ఎపిసోడ్ అంతా ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదలటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం అన్ని మీడియా ఛానెళ్లలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో సహరన్పూర్ పోలీస్ ఉన్నతాధికారి ప్రబల్ ప్రతాప్ సింగ్ ఘటనపై స్పందించారు. ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌చేసినట్లు ఆయన వెల్లడించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు తర్వాత వారిపై మరిన్ని చర్యలు ఉంటాయని ప్రకటించారు. "Don't want blood stains in car": 2 teens die as UP cops refuse help Read more here: https://t.co/qkcaRJtwkj pic.twitter.com/M3LuZnYnqd — NDTV (@ndtv) 20 January 2018 -
పెట్రోలింగ్ జీప్ బోల్తా.. ముగ్గురికి గాయాలు
గుంటూరు: వేగంగా వెళ్తున్న పోలీస్ జీప్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏఎస్సై సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. దాచేపల్లి నుంచి రామాపురం వెళ్తున్న పెట్రోలింగ్జీప్ క్రాస్‌రోడ్డు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో జీపులో ముందు కూర్చున్న ఏఎస్సై సాంబశివరావుకు తీవ్ర గాయాలవ్వగా.. మరో కానిస్టేబుల్, హోంగార్డులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు 108 సాయంతో వారిని గుంటూరులోని లలిత ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం ఏఎస్సై పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.