pavitra sangamam
-
కుంభమేళాతో రూ 1.2 లక్షల కోట్ల రాబడి
లక్నో : జనవరి 15న ప్రారంభమై మార్చి 4న ముగిసే మహా కుంభమేళా యూపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించనుంది. ఈ చారిత్రక అతిపెద్ద ఆథ్యాత్మిక మేళా ద్వారా యూపీ సర్కార్‌కు రూ 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రముఖ పరిశ్రమ సంస్థ సీఐఐ అంచనా వేసింది. పలు రంగాలకు చెందిన ఆరు లక్షల మందికి పైగా ఈ ఉత్సవాలతో ఉపాధి లభిస్తుందని పేర్కొంది. మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం రూ 4200 కోట్లు కేటాయించి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇక సీఐఐ అంచనా ప్రకారం దేశ, విదేశీ టూరిస్టుల రాకతో ఆతిథ్య రంగంలో కొత్తగా 2,50,000 మందికి, టూర్ ఆపరేటర్లుగా 45,000 మంది ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్స్‌లో దాదాపు 1,50,000 మందికి ఉపాధి సమకూరుతుందని, మెడికల్, ఎకో టూరిజంలో 85,000 మందికి ఉపాధి లభిస్తుందని సీఐఐ అథ్యయనం అంచనా వేసింది. వీటితో పాటు టూర్ గైడ్స్, ట్యాక్సీ డ్రైవర్లు, వాలంటీర్లు వంటి అసంఘటిత ఉద్యోగాలు పెద్దసంఖ్యలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కుంభమేళాకు ఆస్ర్టేలియా, బ్రిటన్, కెనడా, మలేషియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, మారిషస్, జింబాబ్వే, శ్రీలంక సహా పలు దేశాలకు చెందిన టూరిస్టులు తరలిరానున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కుంభమేళాను నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా మార్చి 4న మహాశివరాత్రి రోజున ముగిసే మహా కుంభమేళాకు దాదాపు 12 కోట్ల మంది హాజరై ప్రయాగరాజ్‌లో పవిత్ర నదీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. -
ప్రమాదకరంగా మారిన పవిత్ర సంగమం
-
నేత్రపర్వం
ఇబ్రహీంపట్నం: దీపావళి వేడుకలు ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద శనివారం రాత్రి కనుల పండుగగా జరిగాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు హారతి ముగిసిన అనంతరం నరకాసుర వధ ఘట్టాన్ని నిర్వహించారు. బాణం ఎక్కుపెట్టి వదిలారు. నది ఒడ్డున బాణసంచా పేలుళ్లు నదీజలాల్లో కాంతులీనాయి. విద్యార్థులు వదిలిన ఆకాశ దీపాలు ఆకట్టుకున్నాయి. ఆకట్టుకున్న నృత్యాలు.. షోలు దీపావళి వేడుకల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నృత్య కళాకారులు నృత్య ప్రదర్శనులు ఇచ్చారు. రాజమండ్రి కళాకారులు ప్రదర్శించిన నరకాసురవధ కూచిపూడి నృత్యరూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. సినీగాయకుడు హేమచంద్ర, హారిక బృందం సభ్యుల గానం తన్మయుల్ని చేసింది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన హాస్యపు జల్లులతో కడుపుబ్బా నవ్వించారు. తగ్గిన జనసందడి ఈ కార్యక్రమానికి ప్రచారం కొరవడడమో లేక, శుక్రవారం అమరావతి శంకుస్థాపన అనుభవమో గానీ ప్రజలు పెద్దగా హాజరుకాలేదు. చివరి నిమిషంలో గ్రామానికి ఒక బస్సు ఏర్పాటుచేసి ప్రజలను తరలించేందుకు అధికారులు యత్నించారు. మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, కలెక్టర్బాబు.ఎ, సీపీ గౌతమ్ సవాంగ్, నటుడు సుధీర్ పాల్గొన్నారు. -
అడుగడుగునా ఆంక్షలు
కాలినడకనే కిలోమీటర్ల నడక ఇబ్రహీంపట్నం: కృష్ణానది పుష్కరాలు 12వ రోజు ముగింపు వేడుకల అట్టహాసాలు యాత్రికులు, ప్రజల సహనానికి తీవ్ర పరీక్ష పెట్టాయి. ఈ వేడుకలను మహా ఆడంబరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ సంగమం ఘాట్ వరకు పోలీసు ఆంక్షలు మరింతగా విధించారు. ప్రతిరోజు సాయంత్రం జరిగే నదీమతల్లి నవహారతులకు భారీఎత్తున భక్తులు హాజరవుతుండడం తెలిసిందే. ముగింపు ఉత్సవాల్లో హారతి ఇచ్చే సమయంలో వెయ్యిమంది కళాకారులతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నందును పుష్కర ఘాట్లలో కూడా బారికేడ్ల ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టెంట్లు, పిండప్రదానాల షెడ్లు, డ్వాక్రా స్టాల్స్‌ను మధ్యాహ్నానికే పీకిపడేశారు. క్రీడాకారిణి పీవీ సిధూ, ఇతర ముఖ్య అతిథులు ముగింపు వేడుకులక హాజరవుతున్నందున ఇబ్రహీంపట్నం రింగ్‌సెంటర్ నుంచి ఆర్టీసీ ఉచిత బస్సులను కూడా సాయంత్రానికి బంద్ చేశారు. ప్రైవేట్ కార్లు, ఇతర వాహనాలూ ఇంతే. దీంతో చివరిరోజు వేడుకలు తిలకించాలని ఆశపడిన వేలాదిమంది భక్తులు రింగ్‌సెంటర్ నుంచి 1.7 కిలోమీటర్ల దూరంలోని పవిత్రసంగమం ఘాట్ వద్దకు కాళ్లీడ్చుకుంటూ వెళ్లారు. రక్షణ లేని బాణాసంచా ప్రదర్శన భారీ బాణాసంచా ప్రదర్శనకు సినీదర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వంలో పెద్దసంఖ్యలో పడవల్లో టపాసుల సామగ్రి సిద్ధం చేశారు. ప్రారంభోత్సవ వేడుకల్లో కాల్చిన బాణాసంచా భక్తులను ఆకట్టుకున్నప్పటికీ ఆ చెత్తతో ఘాట్ నిండిపోయింది. ప్రస్తుతం అంతకంటె ఎక్కవ సంఖ్యలో భాణాసంచా తీసుకొచ్చారు.lసంగమం వద్ద నవహారతుల వెనుక బాగంలో అతిథులు కూర్చునే ఘాట్‌కు సమీపంలో బాణాసంచా కాల్చే ఏర్పాట్లు చేశారు. భక్తులు, అతిథులకు అతిసమీపంగా బాణాసంచా కాల్చటం వలన జరగరాని సంఘటన చోటుచేసుకుంటే కనీసం భక్తులు బయటకు వెల్లేందుకు కూడా ఖాళీ లేకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రశాంత పుష్కరాల్లో అట్టహాసాల పేరుతో నానా ఇబ్బందులు పెట్టారని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు. -
ఆకట్టుకున్న ఐటీ ఎక్స్పో –2016
విజయవాడ (గాంధీనగర్) : కృష్ణా పుష్కరాల సంద ర్భంగా పవిత్ర సం గమం ఘాట్ వద్ద రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐటీ ఎక్స్పో –2016 ఆకట్టుకుంటోంది. ఔత్సాహికులు ప్రదర్శించిన వినూత్న సాంకేతికాంశాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు విశేషంగా ఆకర్షించాయి. కేఎల్ యూనివర్శిటీ విద్యార్థులు రూపొందించిన పురుగుమందులు చల్లే డ్రోన్, అంబులెన్స్ చేరుకోలేని ప్రదేశాల్లో ప్రమాదాల బారిన పడిన వారికి ప్రథమ చికిత్స కిట్‌ను అందించే డ్రోన్ ప్రదర్శన యాత్రికులను అబ్బురపరిచాయి. ఆన్లైన్ కడియం నర్సరీ మొక్కల విక్రయం, వాటి నిర్వాహణపై సూచనలు అందుబాటులోకి తెస్తూ ప్లాన్్టషిప్ సంస్థ రూపొందించిన అప్లికేషన్, సైబర్‌సెక్యూరిటీ ఆండ్రాయిడ్ అప్లికేషన్, సామ్ ఎస్బీసీ సంస్థ ప్రదర్శించిన సిస్టమ్ మాడ్యూల్స్, ఎఫ్రా్టనిక్స్ సంస్థ ప్రదర్శించిన వాటర్ స్టేడా తాగునీటి వ్యవస్థ నియంత్రణ తదితర అంశాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
ఘనంగా లక్ష్మీనరసింహాస్వామి కల్యాణం
ఇబ్రహీంపట్నం : కదిరి లక్ష్మీనరసింహాస్వామి కల్యాణ మహోత్సవం పవిత్ర సంగమం నమూనా ఆలయాల వద్ద మంగళవారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామికి విశేష పూజలు చేశారు. శాంతిహోమాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నమూనా ఆలయాల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, భక్తులు పాల్గొన్నారు. -
పవిత్ర సంగమం..పనులు సందిగ్ధం..
పవిత్ర సంగమం వద్ద జరుగుతున్న పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు ప్రారంభించి రెండు నెలలు అవుతున్నా ఇంకా పూర్తికాలేదనే విమర్శలు వస్తున్నాయి. నేడు (సోమవారం) సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పుష్కరాల నాటికి పనులు ఓ కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాలి.సందిగ్ధం.. ఇబ్రహీంపట్నం : పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు 275 మీటర్ల పొడవున నిర్మించే పుష్కరఘాట్ పనులు ఓ కొలిక్కి రాలేదు. పీపీసీ స్థాయి గ్రౌండ్ లెవెల్ కాంక్రీట్ పనులే జరుగుతున్నాయి. మొదటి దశ పనులే పూర్తికాలేదు. ఆర్సీసీ పనులు పూర్తిచేసి ఆ తర్వాత మెట్లు నిర్మించాలి. టైల్స్ అతికించాలి. ఈ ఘాట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో నెలరోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. అసంపూర్తిగా కృష్ణా పుష్కర ఘాట్ కృష్ణా జలాలతో పుణ్యస్నానాలు చేసేందుకు కృష్ణానది ఒడ్డున నిర్మిస్తున్న 750 మీటర్ల ఘాట్ నిర్మాణ పనులూ అసంపూర్తిగానే నిలిచాయి. కొంతమేర పీసీసీ, ఆర్సీసీ కాంక్రీట్ పనులు నిర్వహించినప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. నదికి దిగువ వరుసలో ఆర్సీసీ పనులు ఇప్పడిప్పుడే ప్రారంభిస్తున్నారు. ఓ భాగంలో మెట్లు నిర్మించే పనులు ప్రారంభించారు. నది దిగువlభాగం నుంచి పైఅంచు వరకూ ఘాట్లను నాలుగు సోపులు, నాలుగు ప్లాట్‌ఫాంలుగా నిర్మించారు. ఒక్కో భాగంలో 8 వరుసల చొప్పున 32 మెట్లను 750 మీటర్ల పొడవున నిర్మించాల్సి ఉంది. అంతే పొడవుతో ప్లాట్‌ఫాంలకు టైల్స్ ఏర్పాటు చేయాలి. ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభం పుష్కరఘాట్ వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎనిమిది పుణ్యక్షేత్రాల నమూనా ఆలయాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు అవసరైమన మెటీరియల్‌ను ఇప్పటికే తెప్పించారు. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి, బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జునస్వామి, శ్రీకాకుళం శ్రీకూర్మనాభస్వామి, బిక్కవోలు శ్రీసుబ్రహ్మణేశ్వరస్వామి, రామతీర్థం శ్రీరామనాథస్వామి, కదిరి లక్ష్మీనరసింహస్వామి, మచిలీపట్నం శ్రీపాండురంగస్వామి నమూనా ఆలయాలు ఇక్కడ నిర్మిస్తున్నారు. నేడు సీఎం రాక పవిత్ర సంగమం వద్ద జరిగే పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు పరిశీలించేందుకు సోమవారం సీఎం చంద్రబాబు ఇక్కడకు రానున్నారు. ఈ మేరకు అధికారులు ఘాట్ల వద్ద హడావుడి చేస్తున్నారు. ఘాట్ల పరిశీలన అనంతరం బహిరంగ సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలోకి గోదావరి జలాలు వచ్చి చేరినందునే సీఎం పర్యటన ఖరారు అయ్యిందని తెలుస్తోంది. గతంలో రెండుసార్లు పుష్కర ఘాట్లు సందర్శించేందుకు వస్తున్నట్లు ప్రకటించినా రాలేదు. అయినప్పటికీ ఇక్కడ పనులు అసంపూర్తిగానే నిలిచాయి.