అడుగడుగునా ఆంక్షలు
అడుగడుగునా ఆంక్షలు
Published Tue, Aug 23 2016 9:25 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
కాలినడకనే కిలోమీటర్ల నడక
ఇబ్రహీంపట్నం:
కృష్ణానది పుష్కరాలు 12వ రోజు ముగింపు వేడుకల అట్టహాసాలు యాత్రికులు, ప్రజల సహనానికి తీవ్ర పరీక్ష పెట్టాయి. ఈ వేడుకలను మహా ఆడంబరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగానే ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ సంగమం ఘాట్ వరకు పోలీసు ఆంక్షలు మరింతగా విధించారు. ప్రతిరోజు సాయంత్రం జరిగే నదీమతల్లి నవహారతులకు భారీఎత్తున భక్తులు హాజరవుతుండడం తెలిసిందే. ముగింపు ఉత్సవాల్లో హారతి ఇచ్చే సమయంలో వెయ్యిమంది కళాకారులతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నందును పుష్కర ఘాట్లలో కూడా బారికేడ్ల ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టెంట్లు, పిండప్రదానాల షెడ్లు, డ్వాక్రా స్టాల్స్‌ను మధ్యాహ్నానికే పీకిపడేశారు. క్రీడాకారిణి పీవీ సిధూ, ఇతర ముఖ్య అతిథులు ముగింపు వేడుకులక హాజరవుతున్నందున ఇబ్రహీంపట్నం రింగ్‌సెంటర్ నుంచి ఆర్టీసీ ఉచిత బస్సులను కూడా సాయంత్రానికి బంద్ చేశారు. ప్రైవేట్ కార్లు, ఇతర వాహనాలూ ఇంతే. దీంతో చివరిరోజు వేడుకలు తిలకించాలని ఆశపడిన వేలాదిమంది భక్తులు రింగ్‌సెంటర్ నుంచి 1.7 కిలోమీటర్ల దూరంలోని పవిత్రసంగమం ఘాట్ వద్దకు కాళ్లీడ్చుకుంటూ వెళ్లారు.
రక్షణ లేని బాణాసంచా ప్రదర్శన
భారీ బాణాసంచా ప్రదర్శనకు సినీదర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వంలో పెద్దసంఖ్యలో పడవల్లో టపాసుల సామగ్రి సిద్ధం చేశారు. ప్రారంభోత్సవ వేడుకల్లో కాల్చిన బాణాసంచా భక్తులను ఆకట్టుకున్నప్పటికీ ఆ చెత్తతో ఘాట్ నిండిపోయింది. ప్రస్తుతం అంతకంటె ఎక్కవ సంఖ్యలో భాణాసంచా తీసుకొచ్చారు.lసంగమం వద్ద నవహారతుల వెనుక బాగంలో అతిథులు కూర్చునే ఘాట్‌కు సమీపంలో బాణాసంచా కాల్చే ఏర్పాట్లు చేశారు. భక్తులు, అతిథులకు అతిసమీపంగా బాణాసంచా కాల్చటం వలన జరగరాని సంఘటన చోటుచేసుకుంటే కనీసం భక్తులు బయటకు వెల్లేందుకు కూడా ఖాళీ లేకుండా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రశాంత పుష్కరాల్లో అట్టహాసాల పేరుతో నానా ఇబ్బందులు పెట్టారని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు.
Advertisement