Pawan Kumar Bansal
-
‘కేజ్రీవాల్ ఒక అడాల్ఫ్ హిట్లర్’
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్‌సింగ్‌ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్‌కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చదవండి: Flight Delays: శశి థరూర్‌కు సింధియా కౌంటర్ -
చారిత్రాత్మక 'హస్తం' గుర్తుకు ఎన్నికల కష్టాలు!
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒకరిపై కారాలు మిరియాలు నూరుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం సహజమే. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో చంఢీఘడ్ లోని 'ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్'పై ప్రత్యర్ధి పార్టీలు ఫిర్యాదు చేశాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పోలి వుండే ఈ చారిత్రాత్మక కట్టడం ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో వివాదస్పదమైంది. 'చంఢీఘడ్ అందర్ని అక్కున చేర్చుకుంటుంది' (ఓపెన్ టు గివింగ్, రిసీవింగ్) అనే సందేశంతో ఈ కట్టడం చంఢీఘడ్ వాసుల్నే కాకుండా ఇతర అనేకమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చంఢీఘడ్ వారసత్వ సంపదగా నిలిచిన కట్టడంపై రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదును ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రముఖ ఫ్రెంచ్ అర్కిటెక్ట్ లీ కర్పూసియర్ డిజైన్ చేసిన ఈ కట్టడం చంఢీఘఢ్ కాపిటల్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 1లో ఉంది. 26 మీటర్ల ఎత్తు, బరువు 50 టన్నులు ఉన్న ఈ కట్టడం ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎన్నికల కమీషన్ కు రాజకీయ నేతలు ఫిర్యాదు చేశారు. 'ఓపెన్ హ్యాండ్..'పై ఫిర్యాదు చేయడాన్ని కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ భన్సల్ నిరసన తెలుపుతున్నారు. గత నాలుగు ఎన్నికల్లో చంఢీఘడ్ లో తాను విజయం సాధించానని.. ఎన్నడూ, ఏ రాజకీయ పార్టీ కూడా చారిత్రాత్మక కట్టడంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని భన్సల్ వెల్లడించారు. శాంతి, సమన్వయానికి సూచికగా నిలిచిన 'ఓపెన్ హ్యాండ్'కు రాజకీయ రంగు పులమడాన్ని భన్సల్ తప్పుపట్టారు. చంఢీఘడ్ పట్టణంలో అందర్ని ఆకర్షించే హ్యాండ్ సింబల్ పై చేసిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. చారిత్రాత్మక కట్టడంపై ఎన్నికల కమీషన్ తీవ్రంగా స్పందిస్తే.. ఎన్నికలు ముగిసే వరకు కనపడనీయకుండా జాగ్రత్త తీసుకోవడమో.. లేదా ముసుగు వేసి కనిపీయకుండా చేయడమో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ పార్టీల ఒత్తిడి, ఫిర్యాదు మేరకు 'ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్'పై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై చంఢీఘడ్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ చారిత్రాత్మక కట్టడం ఓటర్లను ప్రభావం చూపే విధంగా ఉందని ఎన్నికల కమీషన్ భావిస్తే ఈ ఎన్నికల్లో 'ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్' ముసుగు తొడగాల్సిన పరిస్థితి ఎర్పడవచ్చు. చారిత్రాత్మక కట్టడాల కారణంగా కూడా రాజకీయ పార్టీలు అభద్రతాభావానికి గురైతే, మున్ముందు మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున మాజీ కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సల్, బీజేపీ తరపున బాలీవుడ్ నటి కిరణ్ ఖేర్, మరో సినీతార గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రంగంలో ఉన్నారు. -
బాలీవుడ్ భామల చేతిలో పవన్ భన్సల్ భవితవ్యం!
లోకసభ ఎన్నికల్లో ఫ్రెంచ్ అర్కిటెక్ట్ లీ కర్బూసియర్ రూపొందించిన చంఢీఘడ్ నగరంలో ఎన్నికల పోరు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తోంది. చంఢీఘడ్ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు సార్లు గెలుపొందిన పవన్ కుమార్ భన్సల్, బాలీవుడ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నటి గుల్ పనాగ్, బీజేపీ అభ్యర్థిగా కిరణ్ ఖేర్ లు పోటి చేయడమే అందుకు కారణం. ఇదే నియోజకవర్గంలో బీఎస్పీ తరపున జన్నత్ జహన్ అనే మహిళ కూడా పోటిలో ఉన్నారు. రైల్వేశాఖలో ఉద్యోగ కుంభకోణంలో మేనల్లుడు అరెస్ట్ కావడంతో పవన్ కుమార్ భన్సల్ పై కూడా ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం నుండి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే చంఢీఘడ్ నియోజకవర్గంలో మంచి పలుకుబడి, గట్టి పట్టున్న భన్సల్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్న గుల్ పనాగ్ ఓటర్లను ఆకర్షించేందుకు బుల్లెట్ పై ప్రచారం చేయడం, ఉదయమే పార్కుల్లో తిరగడం, వీధుల్లో తిరుగుతూ సమస్యలను సావధానంగా వినడం లాంటి అంశాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల కేజ్రీవాల్ రోడ్ షోకు మంచి స్పందన రావడంతో గెలుపుపై గుల్ పనాగ్ లో విశ్వాసం పెరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి, అనుపమ్ ఖేర్ సతీమణి, కిరణ్ ఖేర్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, కుంభకోణాలు బీజేపీకి విజయాన్ని అందిస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అవినీతితో దేశాన్ని భ్రష్టుపట్టించిందని.. ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిన పడాలంటే మోడీ సేవలు ఎంతో అవసరం ఉందని.. అందుకే ఈసారి కమలానికి ఓటు వేయాల్సిందేనని ఓటర్లకు విజ్క్షప్తి చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో 50 శాతానికి పైగా 45 ఏళ్ల వయస్సు లోపువారే ఉండటంతో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలు యువ ఓటర్లపై కన్నేశారు. చంఢీఘడ్ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య 23 వేల పైగానే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళా, యువ ఓటర్లతోపాటు, తొలిసారి ఓటు వినియోగించుకునే వారు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఇలాంటి పరిస్థితుల మధ్య, ముగ్గురు మహిళా అభ్యర్థులతో సీనియర్ నేత భన్సల్ పోటి పడుతున్నారు. 45 శాతానికి పైగా చంఢీఘడ్ నియోజకవర్గంలో మహిళలుండటం గుల్ పనాగ్, కిరణ్ ఖేర్, జన్నత్ జహన్ లు తమ విజయంపై ఆశలు పెంచుకున్నారు. మహిళా అభ్యర్థులను ఓడించి భన్సాల్ ఐదోసారి విజయం సాధిస్తారా అనేది ఏప్రిల్ 10 తేదిన జరిగే ఎన్నికల్లో స్పష్టమవుతుంది. -
చంఢీఘడ్ బరిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్!
చండీఘడ్ లోకసభ ఎన్నికల బరిలో ఈ సారి ఆసక్తికరమైన పోరు నెలకొంది. త్వరలోనే జరుగనున్న లోకసభ ఎన్నికల్లో చండీఘడ్ లోకసభ నియోజకవర్గంలో ఇద్దరు హీరోయిన్లు, ఒక విలన్ బరిలోకి దిగారు. బాలీవుడ్ తారలు గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీకి సిద్ధమవ్వగా, అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్ ఖేర్ భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గుల్ పనాగ్, కిరణ్ ఖేర్ లను ఎదుర్కోనేందుకు ఈ స్థానం నుంచే నాలుగు సార్లు ఎంపికైన కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సల్ కాంగ్రెస్ తరపున పోటీలో నిలిచారు. రైల్వేశాఖలో ఉద్యోగాల కుంభకోణంలో 90 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ తన మేనల్లుడు పట్టుపడటంతో అప్పడు రైల్వేశాఖ మంత్రిగా ఉన్న పవన్ కుమార్ భన్సాల్ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న పవన్ కుమార్ భన్సాల్ కు గుల్ పనాగ్, కిరణ్ ఖేర్ నుంచి గట్టి పోటి ఎదురవుతోంది. అయితే ఈ స్థానం నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా స్థానిక మున్సిపల్ మహిళా కౌన్సిలర్ జన్నత్ జహన్ బరిలోకి దిగడం విశేషం. 1991, 1999, 2004, 2009 లోకసభలకు చండీఘడ్ లోకసభ స్థానం నుంచి గెలిచిన పవన్ కుమార్ భన్సాల్ ఈసారి ముగ్గురు మహిళల నుంచి గట్టిపోటి ఎదుర్కొంటున్నారు.