pcc post
-
పీసీసీ పీఠం... పరీక్షై వచ్చిన ఓ అవకాశం!
నెలల నిరీక్షణ తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడొచ్చారు. పీసీసీ పీఠ మెక్కనున్న మహేశ్‌కుమార్ గౌడ్ పాత నాయకుడే! కాకపోతే, పాత కొత్త నాయకుల నడుమ సమ న్వయ సాధన అవసరంతో పాటు పలు సవాళ్లు ఎదురవుతున్న కాలంలో ఆయనకు పీసీసీ పీఠం దక్కింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు ముంచుకురాను న్నాయి. కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ఆధిపత్యం సాధించాలని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ పొంచి చూస్తున్నాయి. ఈ ఎన్నికలు పార్టీగా కాంగ్రెస్‌కు, పీసీసీ అధినేతగా మహేశ్ గౌడ్‌కు ప్రతిష్ఠాత్మకమే!తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిభ, వ్యూహం, శ్రమలను మేళవించి స్వయంగా ఎదిగారు. అతి తక్కువ కాలంలో ఆశించిన లక్ష్యం చేరుకున్న సాహసి! ఆయన ఆశీస్సులుండటం పీసీసీ కొత్త నేత మహేశ్‌కు కలిసివచ్చే అంశం. అదే సమయంలో, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీని సమన్వయపరచి విజయవంతంగా నడపటమ న్నది పరీక్షే! ఏ కోణంలో చూసినా, మహాశక్తిమంతుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సయోధ్య నెరపుతూ, పార్టీ సీనియర్లు నొచ్చుకోకుండా శ్రేణుల్ని పీసీసీ నేత నడపాలి. ఉభయుల సహాయ సహకారాలు పొందాలి. అందు లోనూ, సమయం, సందర్భం బట్టి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్త నాయకులకు, సుదీర్ఘ కాలంగా పార్టీనే నమ్ముకొని సేవలందిస్తున్న పాతతరం నాయకు లకు మధ్య సమన్వయం కుదుర్చాలి. పంతాలు, తప్పుడు అహా (ఇగో)ల వల్ల వచ్చే నష్టాల్ని ముందే పసిగట్టి, సయో ధ్యతో నివారించాలి. కీలక ప్రభుత్వ నిర్ణయాలప్పుడు, మేనిఫెస్టో అమలులో... ఎంత వరకు పార్టీ నాయకత్వానికి ప్రాతినిధ్యం కల్పిస్తారన్నది ప్రశ్నార్థకమే! డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, కాంగ్రెస్ ఎన్ని కల హామీల అమలు పర్యవేక్షణకు ప్రభుత్వం–పార్టీ ముఖ్యులతో ఒక కమిటీ ఉండేది. అందులో ఏఐసీసీ నాయకుడొకరు సభ్యులుగా ఉండేది. అటువంటి ఏర్పాటు ఇప్పుడేమైనా ఉంటుందా అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటివరకైతే... ముఖ్యమంత్రే జోడు పదవుల్లోఉండటం వల్ల ప్రభుత్వమైనా, పార్టీ అయినా ఆయనే అన్నట్టు సాగింది. సమన్వయంలో ఏ ఇబ్బందీ రాలేదు. ఢిల్లీ అధిష్టానం ఆదేశాలయితేనేం, సీఎం స్వయంగా ఏర్ప రచుకున్న వైఖరి అయితేనేం.... కీలక నిర్ణయాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మల్లు, పీసీసీ మాజీ నేత ఉత్తవ్‌ు కుమార్‌రెడ్డి, మరో సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు వంటి సీనియర్లతో విధిగా ఆయన సంప్రదిస్తున్నారు. మీడియాలో వచ్చే ప్రకటనల్లో ఫోటోల నుంచి ముఖ్య నిర్ణయాల్లో సమాలోచనల వరకు వారికి తప్పనిసరిగా స్థానం లభిస్తోంది. పార్టీకి, పీసీసీ నేతకు, ఇతర ముఖ్య కార్యవర్గ ప్రతినిధులకు ఇటువంటి చర్చలు, సంప్రదింపుల్లో రేపు ఏ మేరకు స్థానం లభిస్తుంది? అన్నది వేచి చూడాలి! పదేళ్ల విపక్ష స్థానంలో ఉండి పోరాటాలు చేసిన తర్వాత లభించిన అధికారం కావడంతో పదవులు, హోదాలు, సేవా అవకాశాలంటూ పార్టీ ఆశావహులు నిరీక్షి స్తున్నారు. ముఖ్యమంత్రి కూడా వారి పట్ల ఉదారంగాఉండి, సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇప్పటికే కొంత మందికి నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్లు, రాజకీయ అవకాశాలు లభించినా, ఇంకా ఎదురుచూస్తున్న వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిలో అత్యధికులకు న్యాయం చేయడం ఎలా? ఈ విషయంలో పార్టీ నాయకత్వం ఏ మేర చొరవ తీసుకుంటుంది? అన్నది కూడా కీలకాంశమే! ఇప్పటిదాకా పార్టీ విధేయత మహేశ్‌కు పనికొచ్చింది. ఇక ముందు, విధేయతకు తోడు సమయస్ఫూర్తి, సామర్థ్యం కూడా అవసరమే! ఓపికతో అందరినీ కలుపుకు పోయే తత్వం కావాలి. నాయకత్వం విషయంలో మహేశ్ గౌడ్‌కు ఇది, తనను తాను నిరూపించుకోవాల్సిన అవ కాశం! ఓ పరీక్షా కాలం కూడా! సుదీర్ఘ కాలంగా పార్టీని నమ్ముకొని ఎదిగిన నాయకుడాయన. దాదాపు పదేళ్లు పార్టీ విద్యార్థి విభాగం (ఎన్ఎస్యూఐ) అధినేతగా ఉన్నారు. ఆ తర్వాత యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా పని చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సహా పార్టీ పలు పదవుల్లో ఉన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన గౌడ సామాజిక వర్గానికి ప్రతినిధి. 1994 (డిచ్పల్లి), 2014 (నిజామాబాద్ అర్బన్) నియోజక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయారు. 2018, 2023లో అవకాశాలు వచ్చినా, ఏ కారణంచేతో పోటీ చేయలేదు. మిగతా సందర్భాల్లో రాజకీయ కారణాల వల్ల ఆయనకు అవకాశాలు లభించలేదు. సీనియర్ నాయ కుడు, మాజీ మంత్రి, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో స్పర్థల వల్ల పలు అవకాశాలు తనకు రాకుండా పోయా యనే భావన ఆయనకుంది. పార్టీలో ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారనే కోపంతో, ఓ ఆరు మాసాలు పార్టీని వీడి తెలుగుదేశంలోకి వెళ్లినా, వెంటనే తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ‘తానొవ్వక నొప్పించక...’ అన్నట్టు, అందరితో సఖ్యతగా ఉండే మంచివాడని పేరున్నా... ప్రభావవంత మైన నాయకుడిగా ముద్ర స్థిరపడలేదు. ఇప్పుడిదొక అవకాశం. సరిగ్గా ఎన్నికలప్పుడు ఇతర పార్టీల నుంచికాంగ్రెస్లో చేరి, కనీసం గాంధీ భవన్ మెట్లు ఎక్కకుండానే ఎమ్మెల్యేలు అయిన వారూ ఉన్నారు. ఏ పదవీ రాక పోయినా, ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకొని సేవలు అంది స్తున్న వారూ ఉన్నారు. ఈ రెండు రకాలవారి మధ్య సమన్వయం, సయోధ్య కాంగ్రెస్‌కు ఒక పెద్ద కార్యభారమే!వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ -
హస్తినలో కాంగ్రెస్ నేతల చక్కర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కీలక పదవుల భర్తీపై దేశ రాజధానిలో హైకమాండ్ పెద్దల కసరత్తు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర నేతలంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. అత్యంత ప్రాధాన్య మైన పీసీసీ అధ్యక్ష పదవి సహా మంత్రి పదవుల భర్తీ, ఇతర నామినేటెడ్ పదవుల నియామకానికి సంబంధించి హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండ్రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. దీంతో నేతలంతా ఆయనను, పార్టీ ఇతర పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఐదుగురు రాష్ట్ర మంత్రులతోపాటు సుమారు పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీలో తిష్టవేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.పీసీసీ పదవికి తీవ్ర పోటీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ స్థానంలో కొత్తవారిని నియమించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ పదవిని ఆశిస్తున్న ముఖ్యనేతంతా ఢిల్లీలోనే మకాం వేశారు. పీసీసీని ఆశిస్తున్న మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు రెండ్రోజులుగా హస్తిన లోనే ఉన్నారు. మధుయాష్కీ ఢిల్లీలో తనకున్న పరిచయాలను వాడుకుంటూ పెద్దల దృష్టిలో పడేందుకు యత్నిస్తుండగా, ఇతర నేతలు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి తమ అభ్యర్థిత్వంపై వినతులు ఇచ్చారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ వీరు భేటీ అయ్యారు. మరోపక్క ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న జాబితాలో ఉన్న ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్‌లు సైతం రోజంతా సీఎం చుట్టూతే ఉన్నారు. హైకమాండ్ పెద్దలను సీఎం కలిసిన సమయంలోనూ ఈ ఇద్దరు ఆయనతో పాటు నేతలను కలిశారు. ఇక్కడే ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోనూ పీసీసీ ఆశావహులు భేటీ అయ్యి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం మరికొందరుమరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో పలవురు ఆశావహులు పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. మంత్రి పదవి దక్కుతుందని గంపెడాశతో ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈసారి విస్తరణలో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు జి.వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం కేసీ వేణుగోపాల్ సహాæ ఇతర నేతలను కలిశారు.ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వచ్చిన ముఖ్యమంత్రితో కలిసి రాష్ట్ర నాయకులు అగ్రనేతలైన సోనియాగాంధీ, ప్రియాంకగాంధీలతో ముచ్చటిస్తూ కనిపించారు. ఇక సోమవారం ఖర్గే, రాహుల్‌లను కలిసిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డిలు రేవంత్‌తో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యి, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మాట్లాడినట్లు తెలిసింది. ఇక వీరితోపాటు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు సైతం ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ పెద్దలకు తమ వినతులు అందజేశారు. ఢిల్లీలో గూడెం మహిపాల్సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సైతం ఢిల్లీలో కనిపించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకే ఢిల్లీకి వచ్చారని ప్రచారం జరిగినా, సుప్రీంకోర్టులో ఓ కేసు విషయమై వచ్చినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇక పటాన్‌చెరుకే చెందిన కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు సైతం ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలను కలవడం గమనార్హం.నేడు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్ అధిష్టానం పిలుపుతోనే ఇద్దరు నేతల హస్తిన పయనం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో స్పష్టమైన కదలికలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండగా, అధిష్టానం పిలుపు మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం ఈ ఇద్దరు నేతలు హస్తినకు పయనమవుతున్నారు.పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలోనే ఉండటంతో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవితోపాటు నామినేటెడ్ పదవుల కసరత్తును ఓ కొలిక్కి తెచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతోందని, అందుకే రేవంత్‌కు తోడు ఆ ఇద్దరికీ ఢిల్లీ నుంచి పిలుపు వచి్చందని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయలుదేరతారని తెలుస్తోంది. ఈలోపే ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరిగే అవకాశముంది. -
పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం : ఎమ్మెల్యే సీతక్క
-
సోనియాకు అశోక్ చవాన్ లేఖాస్త్రం
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవి తనకే కట్టబెట్టాలని ప్రజా పనుల శాఖ మంత్రి అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాత్ పనితీరు సక్రమంగా లేదని చవాన్ లేఖలో ఆరోపించారు. థోరాత్ కారణంగానే గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చాయని ఆరోపిస్తూ నేరుగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అందులో పీసీసీ పదవీ బాధ్యతలు తనకే కట్టబెట్టాలని కోరారు. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అశోక్ చవాన్‌ను తొలగించారు. ఆ తర్వాత ఆ పదవిలో థోరాత్‌ను నియమించారు. కానీ, మళ్లీ ఆ పదవిలో కొనసాగాలని చవాన్ ఉవ్వీళ్లూరుతున్నారు. దీంతో ఆ పదవి తనకే కట్టబెట్టాలని సోనియాకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. ముంబై రీజియన్‌లో కూడా... రాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఆఘాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని మరింత పటిష్టంగా ముందుకు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి మండలిలో మంత్రుల పదవులు పంపకం తర్వాత తమ పార్టీలు మరింత సంఘటితం చేసే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నాయి. అందులో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్ ముంబై రీజియన్ అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఆ పార్టీలో పోటీ తీవ్రమైంది. వచ్చే బీఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముంబై అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి పోటీ మొదలైంది. అందుకు పార్టీ సీనియర్ నేతలతో పైరవీలు, సిఫార్సులు చేయడం ప్రారంభించారు. ముంబై అధ్యక్ష పదవి తమకే కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అమర్జిత్ సింగ్ మన్హాస్, మాజీ అధ్యక్షుడు మిలింద్ దేవరా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మాజీ మంత్రి సురేశ్ వెట్టి, నసీం ఖాన్, ఎమ్మెల్యే భాయి జగ్తాప్, చరణ్‌జీత్ సింగ్ సప్రా తదితరులు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పైరవీలు షురూ! అత్యంత కీలకమైన ముంబై రీజియన్ అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల మద్ధతుదారులు పార్టీ సీనియర్ నాయకులతో పైరవీలు చేస్తున్నారు. మరోపక్క పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ తరచూ చర్చల్లోకి వస్తున్న అమర్జిత్ సింగ్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని కొందరు పట్టుబడుతున్నారు. గతంలో కూడా అమర్జిత్ సింగ్‌కు ముంబై రీజియన్ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మల్లికార్జున్ ఖర్గేతో సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఆ పదవికి అమర్జిత్ సమర్ధుడని, దీంతో ఆ పదవి ఆయనకే కట్టబెట్టాలని ఈ భేటీలో డిమాండ్ చేశారు. అయితే, ఇప్పుడు అమర్‌జిత్‌కు పోటీగా మిలింద్ దేవరాతో పాటు మరో అరడజను పేర్లు తెరమీదకు రావడంతో పేచీ మొదలయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఇద్దరిలో ఎవరికి ఈ పదవి దక్కుతుందనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అందరి సమ్మతితోనే ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించి ఒకరికి ఈ పదవి బాధ్యతలు కట్టబెట్టనున్నారు. -
చక్రం తిప్పుదాం
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగేందుకు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పార్టీలో ప్రత్యర్థులపై అంతర్గతంగా పైచేయి సాధిస్తూనే రాష్ట్రస్థాయిలో ముఖ్య పదవుల కోసం పోటీ పడుతున్నారు. మంత్రి పదవి దక్కితేనే రాష్ట్రంలో చక్రం తిప్పొచ్చని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు. పీసీసీ పదవిపై మాజీ మంత్రి డీకే అరుణ, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వంపై రేవంత్‌రెడ్డి కన్నేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా కీలక స్థానాలకు ఎగబాకేందుకు జిల్లాకు చెందిన నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో తాము కొనసాగుతున్న పార్టీల్లో గుర్తింపు తెచ్చుకున్న నేతలు ప్రస్తుతం, రాష్ట్ర రాజకీయాలపై కన్నేశారు. టీఆర్ఎస్కు జిల్లా నుంచి ఏడుగురు శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్నా ఒక్కరికీ కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ముగ్గురు నేతలు మంత్రి పదవిని ఆశిస్తున్నా, ఇందులో ఇద్ద రు మాత్రం పదవిని ఆలంబనగా చేసుకుని రాష్ట్రస్థాయిలో బలమైన నేతలుగా ఎదగాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్ర స్థాయిలో తమ రాజకీయ భవిష్యత్తుపై లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన జూపల్లి కృష్ణా రావు జిల్లా రాజకీయాల్లో పైచేయి సాధిం చేందుకు మంత్రి పదవి తోడ్పడుతుందనే సమీకరణాలు వేసుకుంటున్నారు. ఉద్యోగ సం ఘం నేతగా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన శ్రీనివాస్‌గౌడ్ మంత్రివర్గంలో చోటు దక్కితే మరింత బలమైన నేతగా ఎదగవచ్చని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నిరంజన్‌రెడ్డి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కీలక పదవి దక్కేదని పార్టీ నేతలు చెప్తుంటారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న నిరంజన్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో రాష్ట్రస్థాయిలో కీలక పదవి దక్కుతుందనే భరోసాతో ఉన్నారు. పీసీసీ పదవిపై డీకే కన్ను జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన డీకే అరుణ ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంత్రిగా పనిచేసిన కాలంలో జిల్లాలో పార్టీపై పట్టు సాధించడమే కాకుండా మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి ధీటుగా పావులు కదిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన డీకే అరుణ ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. కుటుంబ నేపథ్యం, వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, సామాజికవర్గం కోణంలోనూ తనకు అవకాశం దక్కుతుందనే కోణంలో డీకే అరుణ ఎత్తుగడలు వేస్తున్నారు. తెలంగాణలో జిల్లాలవారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు, వాని పనితీరును విశ్లేషించిన తర్వాత రాబోయే రోజుల్లో తాను కీలక నేతగా ఎదగడం ఖాయమనే అభిప్రాయంతో డీకే అరుణ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ కోతలపై ‘మహాధర్నా’ నిర్వహించడం ద్వారా జిల్లాలో పార్టీపై తనకున్న పట్టు, తన ప్రాధాన్యతను కూడా వెల్లడించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎల్పీ నేతగా రేవంత్? తెలంగాణలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాత్రం తెలుగుదేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే అంచనాలో ఉన్నారు. ఇప్పటికే పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన రేవంత్‌రెడ్డి శాసనసభలో తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వం చేపట్టాలనే భావనలో ఉన్నారు. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్, ఎర్రబెల్లిది ఒకే సామాజికవర్గం కావడంతో తనకు అవకాశం దక్కుతుందనే అంచనాలో ఉన్నారు. శాసనసభ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా పైచేయి సాధించి తెలంగాణ టీడీపీకి భవిష్యత్తులో తానే పెద్ద దిక్కు అనే భావన కలిగించే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటీ సౌమ్యుడిగా ముద్ర పడడం కూడా తనకు అనుకూలిస్తుందని రేవంత్ అంచనా వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జిల్లాకు చెందిన నేతలు రాష్ట్రస్థాయిలో కీలక నేతలుగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తి రేపుతున్నాయి.