peace way
-
ఓం శాంతిః శాంతిః శాంతిః
మీరు ఎన్నిక్రతువులు చేయండి, ఎన్ని పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి... చివరకు మీరు కోరుకునేది ఏది... కేవలం ప్రశాంతత. నేను రాజభవనంలో ఉన్నా, నేనెంత అందగాడినయినా, ఎంత విద్వాంసుడినయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా... మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, తీవ్ర అశాంతితో ఉన్నప్పుడు ఇవేవీ మీకు శాంతినివ్వలేవు. ఒక పచ్చటి చెట్టు, రంగురంగుల పూలతో, కాయలతో, పళ్ళతో ఉన్నప్పటికీ తొర్రలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు అది లోపల.. లోపల ఎంత దహించుకు పోతుంటుందో... మనసులో అశాంతి ఉన్న వ్యక్తికూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అందుకే శాంతి కావాలి. మన సంప్రదాయం మనకు ఒక శాంతి మంత్రాన్నే ఇచ్చింది...ఓం శాంతిః శాంతిః శాంతిః ఇది కేవలం ప్రాణులు మాత్రమే కాదు, అంతరిక్షం శాంతి పొందాలి, పృథివి శాంతి పొందాలి, వాయువు శాంతిపొందాలి. జలం శాంతి పొందాలి. ఏదీ కూడా వ్యగ్రతను పొందకూడదు. భూమికి అచల అని పేరు. అంటే కదలనిది..అని. భూమికి కోపం వచ్చి తన కట్టుతప్పి కదిలిందనుకోండి.. ఎంత ప్రాణ నష్టం? ఎంత ఆస్తి నష్టం ? అందుకే భూమి ప్రశాంతంగా ఉండాలి. వాయుః శాంతిః వాయువు తన కట్టుతప్పి తీవ్రతను చూపిందనుకోండి.. ప్రభంజనం అంటాం. అన్నీ నేలకొరుగుతాయి. అదే వాయువు తాను ఉండాల్సిన కట్టుబాటులో ఉంటే... వాయుః ప్రాణః, సుఖం వాయుః. అప్పుడు ప్రాణమూ వాయువే, సుఖమూ వాయువే. చల్లగాలి చక్కగా వీస్తుందనుకోండి. సుఖంగా అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఊపిరిని ఒకే వేగంతో తీసి, ఒకే వేగంతో విడిచిపెడుతూ ఉన్నప్పుడు.. అంతకన్నా ఆయుర్దాయం మరేముంది! వాయువు ఎంతకాలం శరీరంలో తిరుగుతూ ఉంటుందో అంతకాలమే సంధిబంధాలు.. కాళ్ళు, చేతులు, మణికట్టు అన్నీ వంగుతాయి. అది ప్రసరించనప్పుడు శరీరం ఒక కర్రయిపోతుంది. అందుచేత వాయువు అత్యంత ప్రధానమైనది. దాని చేత ప్రాణులన్నీ చలనశీలంగా ఉంటాయి. వడిబాయక తిరితే ప్రాణబంధుడా !.. అంటారు అన్నమాచార్యులవారు. ఒకే వేగంతో ఊపిరిని శరీరం లోపలికి, బయటికి పంపుతున్నాడే..ఆయనే వేంకటేశ్వరుడు. ఇక అంతకన్నా నాకు దగ్గరగా ఎవరున్నార్రా!!! అని అడిగాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. అని పిలిచాడు ఆయన వేంకటేశ్వరుడిని. అదే.. వాయుఃప్రాణః సుఖం వాయుః. ఊపిరిని తీసి విడిచి పెడుతున్న శరీరం ఆచంద్రార్కం.. శాశ్వతంగా ఉండదు. పడిపోతుంది. ఇప్పుడు వాయువుకున్న గొప్పదనం ఏమిటంటే.. అదే వాక్కుగా మారుతుంది. ఆ వాయువు చేత ప్రాణాలను నిలబెట్టుకున్నవాడు వాటిని సార్ధక్యం చేసుకున్నప్పుడు శరీరం పడిపోయినా ఆ వ్యక్తి.. కాలంలో శతాబ్దాలు నిలబడిపోతాడు.. ఎలా! అది వాక్కుగా మారినందువల్ల...! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బీజేపీ పవర్ ప్లే..ఎలా పట్టు సాధించింది ?
భారతీయ జనతా పార్టీ దేశాన్ని చుట్టేస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ ఇమేజ్‌ని పెట్టుబడిగా పెట్టి, డబుల్ ఇంజిన్ నినాదంతో రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు కమలం దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అభివృద్ధి, శాంతి స్థాపన లక్ష్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల్ని ఎదుర్కొని, అధికార వ్యతిరేకతను ఎదురొడ్డి త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా ఒకప్పటి మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడం ద్వారా 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు బలమైన పునాదులు వేసుకుంటోంది. ఎలా పట్టు సాధించింది ? ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, త్రిపురలో హిందూ జనాభా ఎక్కువ. మిగి లిన రాష్ట్రాల్లో గిరిజనులు, క్రిస్టియన్లదే పట్టు. ఆయా రాష్ట్రాల్లో అత్యధికులు బీఫ్ తింటారు. ఇంగ్లిష్ మాట్లాడతారు. దీంతో ఇతర పార్టీలు బీజేపీ హిందూత్వ, హిందీ ఎజెండాను పదే పదే ఎత్తి చూపుతూ కాషాయ దళాన్ని ఇరుకున పెట్టాలని చూశాయి. అయినప్పటికీ ఈశాన్యంలో కాషాయ జెండా రెపరెపలాడింది. త్రిపుర లో శాంతి స్థాపన, అభివృద్ధికే బీజేపీ మొదట నుంచి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. మౌలిక సదుపాయాలు, హైవేల నిర్మాణం, సురక్షిత మంచి నీరు, ఉచిత రేషన్ , విద్యుత్ సౌకర్యం వంటివన్నీ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణాలే. ఎన్నికలకు కాస్త ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 12% డీఏ ప్రకటించి వారిని తమ వైపు తిప్పుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో నాగాలాండ్‌లో కూడా శాంతి చర్చలు చేసి వారి సమస్య పరిష్కారానికి హా మీలు ఇచ్చింది. ఎన్డీపీపీతో పొత్తుతో అధికారా న్ని మళ్లీ నిలబెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ బీఫ్ తినడం రాష్ట్ర ప్రజల జీవనశైలిలో ఒక భాగమంటూ వ్యాఖ్యానించి ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ తినడాన్ని బీజేపీ అడ్డుకోదన్న సందేశాన్ని ఇచ్చారు. మైనార్టీ వ్యతిరేక పార్టీ అని విపక్షాలు ప్రచారం చేసినప్పటికీ నాగాలాండ్‌లో 15% నుంచి 19 శాతానికి ఓటు షేర్‌ను పెంచుకోగలిగింది. మేఘాలయలో 9% ఓట్లను రాబట్టింది. నాగాలో శాంతి మంత్రం.. నాగాలాండ్‌లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం చేస్తున్న నాగాలతో శాంతి చర్చలు జరుపుతూ వారి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంలో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) పరిమితమైన సీట్లలో పోటీ చేశాయి. 60 అసెంబ్లీ స్థానాల్లో ఎన్పీఎఫ్ 22 స్థానాల్లో పోటీ చేస్తే, కాంగ్రెస్ 23 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. నాగా సమస్యని ఎన్డీపీపీతో కలిసి సమష్టిగా పరిష్కరిస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు తిరిగి ఆ కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేలా చేశాయి. పక్కా వ్యూహంతో సీఎంల మార్పు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల జరగడానికి ఏడాది ముందు ముఖ్యమంత్రుల్ని హఠాత్తుగా మార్చి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో బీజేపీ విజయం సాధిస్తోంది. త్రిపురలో కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి, తిప్రా మోథాలను దీటుగా ఎదుర్కొని అధికార వ్యతిరేకతను ఎదు రొడ్డడానికి ముఖ్య కారణం నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న విప్లవ్‌దేవ్‌ను పది నెలల క్రితం మార్చడమే. ఆయన స్థానంలో మిస్టర్ క్లీన్‌గా పేరున్న మాణిక్ సాహాను సీఎంను చేయడంతో అధికార వ్యతిరేకత తుడిచిపెట్టుకుపోయింది. గతంలో ఉత్తరాఖండ్‌లో ఇద్దరు సీఎంలను, గుజరాత్లో సీఎంను మార్చి నెగ్గింది. హిమాచల్‌లోనూ సీఎంను మార్చాలని ఎన్నో గళాలు వినిపించినా జైరామ్ ఠాకూర్‌నే కొనసాగించి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది. చిన్న నియోజకవర్గాలున్న త్రిపురలో అభివృద్ధిని చేసి చూపించడంతో పాటు సీఎంను మార్చడం కూడా బీజేపీకి కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం కూడా ఒక కారణం. అసోం నుంచి త్రిపుర వరకు ► 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ 15 ఏళ్ల పరిపాలనకు తెర దించింది. ► 2017లో మణిపూర్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ మాజీ సభ్యుడు ఎన్. బైరాన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ► 2018లో త్రిపుర ఎన్నికల్లో బీజేపీ 25ఏళ్ల లెఫ్ట్ పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చింది ► అదే ఏడాది బీజేపీ మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. ► 2019లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలను కైవశం చేసుకొని విజయ ఢంకా మోగించింది. ► 2021లో అసోంలో మళ్లీ అధికారాన్ని కాపాడుకుంది. ► 2022లో బీజేపీ మణిపూర్‌లో కూడా తిరిగి అధికారంలోకి వచ్చింది. ► 2023లో త్రిపుర, నాగాలాండ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా అధికారంలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. వాజ్‌పేయి హయాంలోనే అభివృద్ధికి బీజం ► 2016లో అసోంతో మొదలైన బీజేపీ జైత్రయాత్ర 2023 వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం వాజ్‌పేయి హయాంలో తొలి బీజం పడింది. కేంద్రంలో మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్టులకు రూప కల్పన చేశారు. అప్పుడు మొదలైన అభివృద్ధి పథం 2014లో నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయ్యాక పరుగులు తీసింది. అభివృద్ధి కంటికి కనిపించేలా సాగింది.ప్రజల్లో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్ నాయకుడు హిమాంత బిశ్వ శర్మ 2015లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళానికి పట్టు పెరిగింది. ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రి అయిన శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటైన నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలయెన్స్(ఎన్‌డీపీఏ)తో కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ జత కట్టాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే బిశ్వ శర్మ మూడు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ తమకు అనుకూలంగా ఉండే చిన్న పార్టీలను ఎన్‌డీపీఏ గూటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ తనకు అనుకూలంగా ఉండే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతూ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కొల్లగొడుతూ వచ్చింది. ఎన్. బైరాన్ సింగ్, ప్రేమ ఖాండూ వంటి నాయకులు కాంగ్రెస్‌ను వీడడంతో ఆ పార్టీ ఉనికి కూడా కోల్పోసాగింది. ఎన్‌డీపీఏ కంటే ముందే ఆరెస్సెస్ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తండాల్లో పని చేస్తూ పట్టు పెంచుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉగ్ర పంథా వీడితేనే చర్చలు
-
ఉగ్ర పంథా వీడితేనే చర్చలు
శాంతి మార్గంలో పాక్ కూడా నడవాల్సిందే • కీలక విషయాల్లో చైనా, భారత్‌లు సున్నితంగా వ్యవహరించాలి • రైసినా చర్చల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ • అమెరికా, రష్యా, గల్ఫ్ దేశాలతో సంబంధాల్ని ప్రస్తావించిన మోదీ న్యూఢిల్లీ: చర్చల ప్రక్రియ తిరిగి మొదలవ్వాలంటే... పాకిస్తాన్ ఉగ్ర పంథాను వీడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పొరుగు దేశాలతో సత్ససంబంధాలనే భారత్ కొరుకుంటోందని, దక్షిణాసియాలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలన్నదే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మూడు రోజులపాటు జరిగే ‘రైసినా చర్చల’ ప్రారంభోత్సవంలో మోదీ మంగళవారం ప్రసంగించారు. ఈ శతాబ్దం ఆసియాదేనని ఆయన పేర్కొన్నారు. భారత్ విదేశాంగ ప్రాధమ్యాలు, హిందూ మహాసముద్రంలో భద్రతా ప్రయోజనాలు, పొరుగు దేశాలతో పాటు గల్ఫ్, అమెరికా, చైనా, రష్యాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మాట్లాడారు. ‘భారత్ ఒక్కటే ఒంటరిగా శాంతి మార్గంలో పయనించలేదు. పాకిస్తాన్ సైతం కలిసి నడవాలి. భారత్‌తో చర్చల దిశగా పాకిస్తాన్ సాగాలనుకుంటే ఉగ్రబాటను విడిచిపెట్టాలి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునేందుకు తాను తీసుకున్న చొరవను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. శాంతి నెలకొల్పే ఉద్దేశంతోనే లాహోర్‌కు వెళ్లానని చెప్పారు. మంచి, చెడు ఉగ్రవాదాలంటూ కృత్రిమ భేదాలు చూపడం సరికాదని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఎగుమతి చేస్తూ, విద్వేషాల్ని రెచ్చగొడుతూ మన పొరుగు దేశం ప్రపంచంలో ఏకాకి అయ్యింది’ అని అన్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య సత్ససంబంధాలు నెలకొనాలనే ఉద్దేశంతో తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధిపతులను ఆహ్వానించానని వెల్లడించారు. ఇరుగుపొరుగు మధ్య విభేదాలు సహజం చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ.. రెండు పెద్ద పొరుగు దేశాల మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు ఉండడం సహజమేనని, అయితే ఇరు వర్గాలు కీలక అంశాల్లో సున్నితంగా వ్యహరించాలని, ఒకరి ఆందోళనలు, ప్రయోజనాల్ని మరొకరు గౌరవించుకోవాలన్నారు. ‘భారత్, చైనాలు అభివృద్ధి చెందడం ఇరు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికే అపూర్వమైన అవకాశంగా నేను భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంలో భాగంగా విస్తృతమైన వాణిజ్య, వ్యాపార అవకాశాల్ని వినియోగించుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, తాను విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అఫ్గాన్‌కు అండగా.. అఫ్గానిస్తాన్ భౌగోళికంగా భారత్‌కు దూరంగా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ దేశ పునర్నిర్మాణంలో భారత్ భాగస్వామిగా వ్యవహరించిన అంశాల్ని మోదీ ప్రస్తావించారు. అఫ్గానిస్తాన్ పార్లమెంట్ భవనం, భారత్–అఫ్గానిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యాంల నిర్మాణంలో సాయం... ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంలో అంకితభావానికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఇరాన్, అఫ్గానిస్తాన్‌లతో చాబహర్ పోర్టు ఒప్పందం, అంతర్జాతీయ నార్త్ సౌత్ కారిడార్ల నిర్మాణాలు కూడా పొరుగు దేశాలతో సత్సంబంధాలుగా నిదర్శనమన్నారు. అమెరికాతో సంబంధాల గురించి మాట్లాడుతూ... కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల జరిపిన సంభాషణను ప్రస్తావించారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించేందుకు తామిద్దరం అంగీకరించామని చెప్పారు. రష్యా శాశ్వత మిత్ర దేశం దేశ సముద్ర వాణిజ్యం వ్యూహాత్మకమే కాకుండా ఎంతో ప్రాముఖ్యమైందని, పసిఫిక్ మహాసముద్రంలో శాంతి, సామరస్యం, భద్రతకు ఆ ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా బాధ్యత ఉందని మోదీ అన్నారు. గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇరాన్ దేశాలతో సంబంధాల్ని అతి తక్కువ సమయంలో తమ ప్రభుత్వం పునర్నిర్వచించిందని పేర్కొన్నారు. భారత్‌కు రష్యా శాశ్వత మిత్ర దేశమని, ఆ దేశంతో రక్షణ రంగంతో సహా ఇతర అంశాల్లో నమ్మకం, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత దృఢమైందన్నారు.ఈ కార్యక్రమంలో నేపాల్ మంత్రి ప్రకాశ్ శరణ్ మహత్, అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు కర్జాయ్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రుడ్తో పాటు 65 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.