Peanut seeds
-
20 నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం నాణ్యమైన, ధ్రువీకరించిన వేరుశనగ విత్తనాలను ఈ నెల 20వ తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కె–6, నారాయణి, కదిరి లేపాక్షి (కె–1812) రకాల విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను కిలో రూ.51.48కి రైతులకు ఇచ్చేందుకు సిద్ధం చేసింది. గత సీజన్లో మాదిరిగానే ఈ విత్తనాల్లో మూడోవంతును సొంతంగా అభివృద్ధి చేసిన వాటినే పంపిణీ చేయనుంది. ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగువిస్తీర్ణం 17.90 లక్షల ఎకరాలు కాగా గతేడాది 18.50 లక్షల ఎకరాల్లో సాగైంది. 5.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. వేరుశనగ కనీస మద్దతు ధర రూ.5,550 కాగా గతేడాది రూ.6,500 వరకు పలికింది. ఈ ఏడాది రూ.6,800 నుంచి రూ.7 వేల వరకు పలుకుతోంది. ఈ ఏడాది సాగు లక్ష్యం 18.40 లక్షల ఎకరాలు కాగా, మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధర లభిస్తుండడంతో ఈసారి కూడా లక్ష్యానికి మించే సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలతో పాటు వేరుశనగ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సర్టిఫై చేసిన సొంత విత్తనం సబ్సిడీ విత్తనం కోసం గతంలో పూర్తిగా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడే వాళ్లు. కంపెనీలు ఏ విత్తనం ఇస్తే దాన్నే సబ్సిడీపై పంపిణీ చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ కనీసం మూడోవంతు విత్తనమైనా సొంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత సీజన్ నుంచి సొంత విత్తన తయారీకి శ్రీకారం చుట్టారు. రబీ 2020–21లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, ఆ తర్వాత సర్టిఫై చేసి ఖరీఫ్–2021లో పంపిణీ చేశారు. గడిచిన రబీ 2021–22లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లలో సర్టిఫై చేసి ఖరీఫ్ సీజన్ కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పంపిణీ చేయనున్న 3,95,761 క్వింటాళ్ల విత్తనాల్లో.. లక్ష క్వింటాళ్లు రబీలో రైతులు ఉత్పత్తి చేసినవే. టెండర్ల ద్వారా ప్రైవేటు కంపెనీల నుంచి సమీకరించే మిగిలిన విత్తనాన్ని సైతం ర్యాండమ్‌గా అగ్రి ల్యాబ్స్‌లో సర్టిఫై చేసిన తర్వాతే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. అదేరోజు నుంచి కిలో రూ.85.80 ధర ఉన్న విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను రూ.51.48కి రైతులకు పంపిణీ చేయనున్నారు. రైతుకు నాణ్యమైన విత్తనం విత్తనోత్పత్తి చేసే రైతు నుంచి నేరుగా విత్తనాలు సేకరిస్తున్నాం. ప్రతి పైసా వారి ఖాతాకే జమచేస్తున్నాం. ఈ విధానం వల్ల విత్తనోత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సాగుచేసే రైతుకు నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం అందించేందుకు పోటీపడుతున్నాయి. సర్టిఫై చేసిన విత్తనాన్ని ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
శనగ విత్తనం సిద్ధం
సాక్షి, అమరావతి: రబీలో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట శనగ. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 56 లక్షల ఎకరాలు కాగా.. దాంట్లో 11.50 లక్షల ఎకరాల్లో శనగ సాగవుతుంది. 90 శాతానికి పైగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే ఈ పంట వేస్తారు. ఈ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాల్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నాణ్యత పరీక్షించి మరీ.. ఆర్బీకేల ద్వారా 2,32,577 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న వర జేజీ–11 రకం విత్తనం 2,16,880 క్వింటాళ్లు, వర కేఏకే–2 విత్తనం 15,697 క్వింటాళ్లను సిద్ధం చేశారు. సబ్సిడీ పోగా క్వింటాల్ ధర వర జేజీ–11 విత్తనం మొదటి రకం (ïసీ/ఎస్) ధర రూ.5,250, రెండో రకం (టీ/ఎల్) క్వింటా రూ.5175, వర కేఏకే–1 మొదటి రకం (సీ/ఎస్) రూ.6,660, రెండో రకం (టీ/ఎల్) రూ.6,585లుగా నిర్ణయించారు. ఎకరంలోపు భూమిగల రైతుకు బస్తా (25 కేజీలు), ఆ తర్వాత ఎకరానికి ఒకటి చొప్పున ఐదెకరాల్లోపు రైతులకు ఐదు బస్తాల చొప్పున విత్తనాలు పంపిణీ చేస్తారు. సేకరించిన విత్తనాల నాణ్యతను పరీక్షించి ధ్రువీకరించిన అనంతరమే రైతులకు అందజేస్తారు. పంట వేయకపోతే ‘భరోసా’కు అనర్హులు శనగ విత్తనం కోసం ఆర్బీకేల్లో ఈ నెల 3వ తేదీన అనంతపురం, 4న వైఎస్సార్, కర్నూలు, 5న ప్రకాశం, 10న కృష్ణా, 15న నెల్లూరు, అక్టోబర్ చివరి వారంలో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో రైతుల వివరాల నమోదుకు శ్రీకారం చుడతారు. డి.క్రిష్ యాప్ ద్వారా ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు, కౌలు రైతులను వ్యవసాయ సహాయకులు గుర్తిస్తారు. వారికి కావాల్సిన విత్తనం కోసం సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని ఆన్లైన్లో కట్టించుకుంటారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ఈ నెల 4 నుంచి విత్తన పంపిణీకి శ్రీకారం చుడతారు. సబ్సిడీపై విత్తనం పొందిన రైతు సాగు చేసిన పంట వివరాలను విధిగా ఈ క్రాప్‌లో నమోదు చేయాలి. ఒక వేళ విత్తనం తీసుకుని పంట వేయకపోతే ‘వైఎస్సార్ రైతు భరోసా’ వంటి ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తారు. పకడ్బందీగా విత్తన పంపిణీ రానున్న రబీ సీజన్లో సొంతంగా అభివృద్ధి చేసిన శనగ విత్తనాన్ని సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేని రీతిలో పూర్తి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు నాణ్యత ధ్రువీకరించిన విత్తనం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి -
వేరుశనగ విత్తన పంపిణీకి శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తన పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డి.శేఖర్‌బాబు పర్యవేక్షణలో సోమవారం ఆయా జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో 40 శాతం సబ్సిడీకి విత్తనాన్ని పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తొలిరోజు 868 మంది రైతులకు 611 క్వింటాళ్ల విత్తనాన్ని అందించారు. రాష్ట్రంలో వేరుశనగ ఖరీఫ్‌లో 7.03 లక్షల హెక్టార్లు, రబీలో 82,605 హెక్టార్లలో సాగవుతోంది. వేరుశనగ విత్తనం కోసం గతంలో ప్రైవేటు కంపెనీలపై ఆధారపడేవారు. దీంతో సాగువేళ నాణ్యతాపరమైన సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ఈ దుస్థితికి చెక్ పెడుతూ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద చరిత్రలో తొలిసారిగా సొంతంగా రైతులే వేరుశనగ విత్తనోత్పత్తి చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహమందించింది. గత రబీ సీజన్లో 39 వేల ఎకరాల్లో రైతులను ప్రోత్సహించడం ద్వారా 4,48,185 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేశారు. వీటిలో అనంతపురం జిల్లాకు 2,90,035, చిత్తూరు జిల్లాకు 76,000, కర్నూలు జిల్లాకు 47,000, వైఎస్సార్ జిల్లాకు 34,000, శ్రీకాకుళం జిల్లాకు 300, విజయనగరం జిల్లాకు 650, విశాఖ జిల్లాకు 200 క్వింటాళ్ల చొప్పున కేటాయించారు. ఇప్పటివరకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 1,65,659 మంది రైతులు 1,07,704 క్వింటాళ్ల విత్తనం కోసం ఆర్బీకేల్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సోమవారం అనంతపురం జిల్లాల్లో 503 మంది రైతులకు 446.4 క్వింటాళ్లు, చిత్తూరు జిల్లాలో 281 మంది రైతులకు 89.7 క్వింటాళ్లు, కర్నూలు జిల్లాలో 84 మంది రైతులకు 75 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు. సొంతూరులో విత్తనం దొరకడం ఆనందంగా ఉంది.. నాకున్న ఆరెకరాల్లో ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేస్తా. గతంలో విత్తనాల కోసం మద్దికెర, పత్తికొండ వెళ్లాల్సి వచ్చేది. నాణ్యమైన విత్తనం దొరక్క చాలా ఇబ్బందులు పడేవాళ్లం. తొలిసారి మా గ్రామంలోనే నాణ్యమైన విత్తనం లభించింది. – ఎం.వెంకట్రామప్ప, ఎం.అగ్రహారం, మద్దికెర మండలం, కర్నూలు జిల్లా -
విపత్తులోనూ విత్తనాలు సిద్ధం
అనంతపురం (అగ్రికల్చర్): వేరుశనగ రైతులకు ఖరీఫ్ వేరుశనగ విత్తనాలను ఈ నెల 17 నుంచి రాయితీపై పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతపురం జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ కావడంతో 2.90 లక్షల క్వింటాళ్ల విత్తనాలను కేటాయించారు. కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు 1.60 లక్షల క్వింటాళ్లు వెరసి 4.50 లక్షల క్వింటాళ్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించారు. క్వింటాల్ విత్తనాల ధర రూ.8,680గా నిర్ణయించగా.. అందులో 40 శాతం అంటే రూ.3,472 రాయితీ ఇస్తున్నారు. రైతులకు క్వింటా విత్తనాలను రూ.5,208కే అందజేస్తారు. సోమవారం నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అవసరమైన రైతుల రిజి్రస్టేషన్ మొదలు పెట్టారు. ఈ నెల 17 నుంచి వేరుశనగ పంపిణీ చేపట్టనున్నారు. ముందుగానే మద్దతు ధర ప్రకటించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలోనే వేరుశనగకు మద్దతు ధర ప్రకటించడంతో రైతులకు గిట్టుబాటు అయింది. అనంతపురం జిల్లాలో ఏపీ సీడ్స్ ఎండీ శేఖర్‌బాబు, వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ వేర్వేరుగా రెండు మూడు రోజులు పర్యటించి వేరుశనగ సేకరణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అనంతపురం జిల్లాలో 2.90 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించి.. రూ.193 కోట్ల వరకు వెచ్చించి 20వేల మంది రైతుల నుంచి 3 లక్షల క్వింటాళ్లకు పైగా కొనుగోలు చేశారు. చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో కూడా ఇదేవిధంగా సేకరించి విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17నుంచి మూడు విడతలుగా విత్తనాలు పంపిణీ చేసేలా మండలాల వారీగా షెడ్యూల్ ప్రకటించారు. ‘అనంత’లో 4.70 లక్షలహెక్టార్లలో సాగు అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 4.70 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు అవుతుందని అంచనా వేశాం. అందుకోసం రైతులకు 40 శాతం రాయితీపై 2.90 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం. కరోనా నేపథ్యంలో రైతులు, అధికారులు ఇబ్బంది పడకుండా మూడు దశల్లో సాఫీగా పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఆర్బీకే వేదికగా విత్తనం కోసం రిజి్రస్టేషన్ చేసుకున్న రైతులకు గ్రామాల్లోనే పంపిణీ చేస్తాం. విత్తనాలు తీసుకున్న రైతులు తప్పనిసరిగా పంట సాగు చేసి ఈ–క్రాప్‌లో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలు వర్తిస్తాయి. – వై.రామకృష్ణ, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ -
శనగ, వేరుశనగకు 'ఇక సొంత విత్తనం'
సాక్షి, అమరావతి: శనగ, వేరుశనగ.. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే పంటలు. ఈ రెండింటి విత్తనాల తయారీ దశాబ్దాలుగా ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉండడంతో సకాలంలో నాణ్యమైన విత్తనం దొరక్క రైతులు ఏటా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. రాయితీపై సరఫరా చేసే విత్తనం కోసం ప్రభుత్వం కూడా ఈ కంపెనీలపై ఆధారపడుతోంది. ఆ కంపెనీలు ఎప్పుడు సరఫరా చేస్తే అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా అవి నిర్దేశించిన ధరలకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి ఉండటంతో సాగువేళ నాణ్యత పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నాసిరకం విత్తనాల బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొలకశాతం లేక, ఆశించిన దిగుబడులు రాక అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వాదేశాలతో సొంత విత్తన తయారీ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాలని వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. రాయితీ విత్తనం కోసం.. వేరుశనగ ఖరీఫ్‌లో 7.03 లక్షల హెక్టార్లు, రబీలో 82,605 హెక్టార్లలో సాగవుతుండగా శనగ రబీలో 4.60 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. సాధారణంగా 30 శాతం విస్తీర్ణంలో సాగుకు అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్స్ సరఫరా చేస్తోంది. గడిచిన ఖరీఫ్‌లో 4.39 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో పంపిణీ చేశారు. దీన్లో 1.43 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో) నుంచి సేకరించగా మిగిలినది ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుత రబీలో శనగ రైతులకు 1.41 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ప్రైవేటు కంపెనీల నుంచి సేకరించి 30 శాతం సబ్సిడీతో పంపిణీ చేశారు. వచ్చే రబీలో మరింత విత్తనోత్పత్తి శనగ, వేరుశనగ విత్తనాల కోసం ఇన్నాళ్లు ఇటు రైతులు, రాయితీ మీద ఇచ్చేందుకు అటు ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలన్న సంకల్పంతో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా సొంతంగా విత్తనం అభివృద్ధిపై దృష్టిపెట్టాం. ప్రస్తుత రబీ సీజన్లో తయారవుతున్న విత్తనం రానున్న ఖరీఫ్ సీజన్ అవసరాలను కొంతమేర తీరుస్తుంది. 2022–23 సీజన్ నాటికి రాయితీపై ఇచ్చే మొత్తం వేరుశనగ, శనగ విత్తనాన్ని సొంతంగా సమకూర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందుకోసం వచ్చే రబీ సీజన్లో విత్తనోత్పత్తి కోసం నిర్దేశించే విస్తీర్ణాన్ని మరింత పెంచబోతున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా.. ప్రతి సీజన్లోను ముందుగా పరీక్షించిన నాణ్యమైన విత్తనాన్ని రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతుకు అందించాలన్న ప్రభుత్వాశయానికి అనుగుణంగా వ్యవసాయశాఖ సొంత విత్తనంపై దృష్టిపెట్టింది. ఇందుకోసం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ప్రస్తు్త రబీ సీజన్లో ఎంపికచేసిన గ్రామాల్లో 39 వేల ఎకరాల్లో వేరుశనగ, 4,687 ఎకరాల్లో శనగ విత్తన తయారీకి శ్రీకారం చుట్టారు. 10 హెక్టార్లు ఒక యూనిట్‌గా కనిష్టంగా 50 మంది రైతులు, గరిష్టంగా 150 మంది రైతులను ఎంపికచేసి విత్తన తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరికి 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని సరఫరా చేశారు. ప్రస్తుతం వేసిన పంట ద్వారా కనీసం 3 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 26 వేల క్వింటాళ్ల శనగ విత్తనం అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. పండించిన రైతుకు గిట్టుబాటు ఈ విత్తనాలను రైతుల నుంచి ఏపీసీడ్స్ ద్వారా సేకరించి వచ్చే ఖరీఫ్ నుంచి రాయితీపై సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల విత్తనోత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర లభించడంతోపాటు రాయితీపై పొందిన రైతుకు నాణ్యమైన విత్తనం లభిస్తుంది. సొంత విత్తన తయారీ వల్ల పోటీ పెరగడం ద్వారా ప్రైవేటు కంపెనీలు కూడా నాణ్యతపై దృష్టిపెడతాయి. గతంతో పోలిస్తే తక్కువ ధరకే ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనం అందుబాటులోకి వస్తుంది. -
శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం
సాక్షి, అమరావతి: రబీలో అత్యధికంగా సాగు చేసే పంటల్లో ఒకటైన శనగ (బెంగాల్ గ్రామ్) విత్తనాల పంపిణీ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 30 శాతం సబ్సిడీపై అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో విత్తనాల పంపిణీని వ్యవసాయ శాఖ చేపట్టింది. రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాలను రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయిస్తున్నారు. ► రబీలో శనగ సుమారు 4.30 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. పైన పేర్కొన్న నాలుగు జిల్లాల్లో అధికంగా శనగను సాగుచేస్తుంటారు. 2019–20కి ఈ నాలుగు జిల్లాల నుంచి 5.04 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ► ఈ ఏడాది రబీలో శనగ సాగును తగ్గించాలని వ్యవసాయ శాఖ ప్రచారం నిర్వహించినప్పటికీ రైతులు మాత్రం శనగ వైపే మొగ్గుచూపుతున్నారు. దీనికనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రణాళికలు ఖరారు చేసి విత్తనాల పంపిణీ ప్రారంభించింది. ► శనగకు మార్కెట్ లేక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శనగ కన్నా తక్కువ సాగు వ్యయంతో అత్యధిక ఆదాయాన్ని సాధించే పప్పుధాన్యాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది. -
విత్తనాలను నల్ల బజారుకు తరలిస్తే అరెస్టులే
‘సాక్షి’ కథనంపై స్పందించిన మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: శనగ విత్తనాలను ఎవరైనా నల్ల బజారుకు తరలిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో విత్తనాలను పక్కదారి పట్టించిన ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశామని వెల్లడించారు. ‘సాక్షి’లో శుక్రవారం ‘సబ్సిడీ శనగకు.. అవినీతి చీడ’ శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఆయన ఎక్కడైనా, ఎవరైనా విత్తనాలను నల్ల బజారుకు తరలిస్తే ఊరుకోబోమని అన్నారు. విత్తనాలకు కొరత లేదని స్పష్టం చేశారు. తాజా లెక్కల ప్రకారం 77,703 క్వింటాళ్ల శనగ విత్తనాలను జిల్లాలకు పంపిణీ చేశామని తెలిపారు. అందులో 57 వేల క్వింటాళ్లు రైతులకు సరఫరా చేశామని, ఇంకా 20 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో శనగ విత్తనాల సరఫరాకు సంబంధించి ‘సాక్షి’ కథనం నేపథ్యంలో ఆ జిల్లా వ్యవసాయాధికారి నుంచి నివేదిక కోరినట్లు ఆ శాఖ కమిషనర్ జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
విత్తు లేదు..రుణం రాదు
- వేరుశెనగ విత్తనాలు అవసరం 2.10 లక్షల క్వింటాళ్లు - ప్రభుత్వం చెప్పింది 83 వేలు, ఇచ్చింది 55వేల క్వింటాళ్లు - బ్యాంకుల రుణ పంపిణీ లక్ష్యం రూ.2,808 కోట్లు - మూడు నెలల్లో ఇచ్చింది రూ.300 కోట్లే సాక్షి, చిత్తూరు: ప్రభుత్వం మాటమీద నిలబడే పరిస్థితి లేకపోవడంతో జిల్లాలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రైతులకు అవసరమైనన్ని విత్తనాలతో పాటు బ్యాంకు రుణాలను పెద్ద ఎత్తున ఇస్తామన్న ప్రభుత్వం మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.7,493.94 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. ఇందులో ఒక్క పంట రుణాలే రూ 2,808 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఏప్రిల్ నుంచి రుణ పంపిణీని ప్రారంభించినా మూడు నెలల కాలంలో కేవలం రూ.300 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.7,100 కోట్లు ఎప్పుడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు సృష్టించిన రుణమాఫీ గందరగోళంలో గత ఏడాది రైతులకు 51 శాతం రుణాలు కూడా అందే పరిస్థితి లేకుండా పోయింది. 2014-15కు గాను రూ.3,573.52 కోట్ల పంట రుణాలు ఇవ్వాలన్నది బ్యాంకుల లక్ష్యం కాగా కేవలం రూ.1,831.02 కోట్లు (51.24శాతం) మాత్రమే ఇచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి కనీసం ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. విత్తన పంపిణీదీ అదేదారి.. విత్తన పంపిణీలోనూ ప్రభుత్వం అన్నదాతలను వంచించింది. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.36 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ పంటను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. అందరికీ తగినన్ని విత్తనాలు సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ లెక్కన 2.10లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు అవసరమవుతాయి. 40 శాతం మందికే సబ్సిడీ విత్తనాలు అన్నట్లు వ్యవసాయాధికారులు 1.05 లక్షల క్వింటాళ్ల విత్తనాలకే ప్రతిపాదనలు పంపారు. ఇందులో 83వేల క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సరఫరా చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జూన్ 1 నుంచి 7వ తేదీ నాటికి 55వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేసి అధికారులు చేతులెత్తేశారు. ఈ విత్తనాలు కేవలం 35వేల హెక్టార్లకు మాత్రమే సరిపోతాయి. మిగిలిన లక్ష హెక్టార్లకు సబ్సిడీ విత్తనాలు లేవు. ప్రయివేటు సంస్థలను ఆశ్రయిస్తున్న రైతన్నలను అవి నిలువుదోపిడీ చేస్తున్నాయి.