Pending bills ..
-
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో పూర్తయిన విచారణ
-
ఏపీలో భళా.. దేశంలో డీలా!
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తమ బకాయిలను రాబట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన బకాయిలను కఠిన నిబంధనల ద్వారానైనా వసూలయ్యేలా చూడాలని కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ కొనుగోళ్ల కోసం 2019–21 మధ్య విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దేశవ్యాప్తంగా రూ.95,104.9 కోట్లు దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు డిస్కంల మొత్తం బకాయిలు ఇప్పటివరకు రూ.95,104.9 కోట్లుగా ఉన్నాయి. డిస్కంలు ఆలస్యంగా చెల్లించడం వల్ల ఉత్పత్తి సంస్థలు తాము తీసుకున్న రుణాలను సకాలంలో తీర్చలేకపోతున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి సంస్థలు బొగ్గు కోసం ముందస్తు చెల్లింపులు చేస్తాయి. నిర్వహణ కోసం ఉంచిన నిధులను బొగ్గు కొనుగోలుకు ఉపయోగించేయడం వల్ల క్రెడిట్ రేటింగ్ పడిపోతోంది. తర్వాత అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం (ఏపీపీ) ఆవేదన వ్యక్తం చేస్తోంది. బకాయిలు ఉన్నవారికి ప్లాంట్లు విద్యుత్ సరఫరాను నిలిపివేసినప్పుడు వారు ఇతర వనరుల నుంచి విద్యుత్‌ను సేకరించుకుంటున్నారు. ఇది కష్టతరమయ్యేలా కఠిన నిబంధనలను విధించాలని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులు (ఐపీపీ) కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పరిస్థితి వేరు ఏపీ డిస్కంలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం, సబ్సిడీలు సకాలంలో అందడం వల్లే ఇది సాధ్యమైంది. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇచ్చేసింది. ఇలా ఇప్పటివరకు దాదాపు రూ.33,639.11 కోట్ల ఆర్థిక సాయం అందించి డిస్కంలను ఆదుకుంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం వడ్డీలతో కలిపి సుమారు రూ.15 వేల కోట్లు ఏపీ జెన్కోకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.6,283.88 కోట్లు తెలంగాణ డిస్కంల నుంచే రావాల్సి ఉందని ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
పెండింగ్ బిల్లులు రూ. 440 కోట్లు..
నీటి పారుదల శాఖలో బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులు సుమారు రూ.440 కోట్లలో పేరుకుపోయాయి. నెలల తరబడి బిల్లులు రావడం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు కూడా బిల్లులు రాకపోవడంతో వాటి ప్రగతి కుంటుపడింది. ఇప్పటికే పూర్తయిన పనులకు కూడా చెల్లింపులు ఆగిపోయాయి. చిన్న నీటిపారుదల విభాగంతో పాటు, ప్రాజెక్టుల విభాగంలో బిల్లులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు, నాబార్డు వంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల బిల్లుల పరిస్థితి కూడా ఇలాగే ఉండటం గమనార్హం. సాక్షి. నిజామాబాద్: నీటి పారుదల శాఖలో కొత్త పనుల మంజూరును ప్రభుత్వం నిలిపేసింది. దీనికి తోడు బిల్లుల చెల్లింపులు కూడా జాప్యం జరుగుతోంది. జిల్లా నీటి పారుదలశాఖ నిజామాబాద్ ఐబీ డివిజన్ పరిధిలో సుమారు రూ.253.46 కోట్ల మేరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. ప్రధానంగా మిషన్‌కాకతీయ పథకం కింద చేపట్టిన చెరువుల మరమ్మతు పనుల బిల్లు లు ఆగిపోయాయి. ఎక్కువగా మూడో విడ త, నాలుగో విడతల్లో చేపట్టిన చెరువుల పనులకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇలా ఒక్క మిషన్‌కాకతీయకు సంబంధించి 192 పనులకు గాను రూ.101.23 కోట్ల మేరకు బిల్లులు నిలిచిపోయాయి. అలాగే ట్రిపుల్ ఆర్ (రిపేర్స్, రిస్టోరేషన్, రెనోవేషన్) పథ కం కింద మంజూరైన పనులకు సంబంధిం చి కూడా రూ.8.90 కోట్లు, చెక్‌డ్యాం నిర్మాణాలకు సంబంధించి మరో రూ.6.12 కో ట్లు చెల్లించాల్సి ఉంది. నాబార్డు ఆర్థిక సహాయంతో చేపట్టిన పనులు, పీఎంకేఎస్‌వై పనులకు కూడా నిధులు ఆగిపోయాయి. చిన్న నీటి వనరుల అభివృద్ధి పనులన్నీ ఈ ఐబీ డివిజన్ పరిధిలో కొనసాగుతున్నాయి. ఎత్తిపోతల పథకాల బిల్లులు సైతం.. బోధన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రాజెక్టు డివిజన్ పరిధిలో జరిగిన పనులదీ ఇదే పరిస్థితి. ఇందులో సుమారు రూ.186.86 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిర్వహణ నిధులు రావాల్సి ఉంది. ఈ లిఫ్టు పరిధిలోని పనులకు మొత్తం రూ.95.51 కోట్లు రావాల్సి ఉంది. అర్గుల్ రాజారాం ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి రూ.56.06 కోట్లు, నిజాంసాగర్ ప్రాజెక్టు, ప్రధాన కాలువ ఆధునీకరణ బిల్లులు సుమారు రూ.ఏడు కోట్లున్నాయి. కౌలాస్‌నాలా ప్రాజెక్టుతో పాటు, ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలి. ఇందులో ఇప్పటికే పూర్తయిన పనులు కొన్ని కాగా, కొన్ని ప్రస్తుతం ప్రగతిలో ఉన్న పనులు ఉన్నాయి. గత ఆరు ఆరు నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ విషమయమై ‘సాక్షి’ నీటి పారుదల ఓ ఉన్నతాధికారిని సంప్రదించగా ఈ అంశంపై తాను స్పందించలేనని దాటవేశారు. -
పోలవరం: బకాయిలు చెల్లించకుంటే అత్మహత్యలే శరణ్యం
-
బిల్లుల మంజూరు ఎప్పుడో..!
► పనులు పూర్తయినా మంజూరు కాని బిల్లులు ► పెండింగ్‌లో పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు ► రెండు సంవత్సరాలుగా విడుదల కాని వైనం తిర్యాణి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడానికి స్వచ్ఛభారత్ కార్యక్రమం కింద మరుగుదొడ్ల నిర్మాణాలు చేయాలని విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 1.25 లక్షల నిధులు మంజూరు చేశారు. తిర్యాణి మండలానికి 90 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను 2015 మే లో ప్రారంభించారు. ఈ నిర్మాణాలను జూన్‌లోగా పూర్తి చేయాలని హడావుడిగా పనులు ప్రారంభించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు గుత్తేదారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో మండలంలోని అన్ని గ్రామాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి గుత్తేదారులు నానా తంటాలు పడ్డారు. అధిక రేట్లకు ఇసుక, సిమెంట్, ఇటుక కొనుగోలు చేసి పనులు పూర్తి చేసి అప్పగించారు. ఎలాగోలాగ కష్టాలు పడి మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు. అప్పటి వరకు బాగానే ఉంది. అయితే మరుగు దొడ్ల నిర్మాణాలకు మొదటి విడతగా రూ. 25 వేలు, రెండో విడతగా రూ. 50వేలు చెల్లించారు. మిగతా డబ్బులు పెండింగ్‌లో ఉంచారు. కొన్ని పాఠశాలకు రూ. 25 వేలు మాత్రమే చెల్లించి మిగతావి పెండింగ్‌లో ఉంచారు. గుత్తేదారులు ఇంజ నీరింగ్ అధికారులు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి అధికారులకు అప్పగించ డం కూడ జరిగింది. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులు మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. కాని గుత్తేదారులకు రావాల్సిన బిల్లులు చెల్లించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారో తెలియడంలేదు. రికార్డులు అందలేదనే సాకుతో బిల్లులు పెండింగ్.. ఇంతకాలం మరుగుదొడ్డి నిర్మాణాలకు సంబంధించిన ఎంబీ రికార్డులను సకాలంలో అందించలేదనే కారణంతో బిల్లులు ఆగిపోయి ఉండవచ్చని అధికారులు చెప్పుకొచ్చారు. కాని సంబందిత ఏఈ శ్రీధర్‌ను అడిడితే ఎంబీ రికార్డులు సకాలంలోనే ఆదిలాబాద్‌లో విద్యాశాఖ ఈఈ కార్యాలయంలో అందించామని తెలిపారు. పనులకు సంబంధించిన రికార్డులు సకాలంలో అందించినా అధికారులు బిల్లులు విడుదల చేయడంలో అశ్రద్ధ చేస్తున్నారని గుత్తేదారులు వాపోతున్నారు. కాగ మండలంలో 76 పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు మొత్తం రూ. 28.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ విద్యా సవత్సరం ప్రారంభానికి ముందే బిల్లులు వచ్చేలా చూడాలని గుత్తేదారులు కోరుతున్నారు. వారంలో వచ్చే అవకాశం ఉంది తిర్యాణి మండలంలోని పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణ పెండింగ్ బిల్లుల విషయమై అధికారులకు నివేదికలు ఇస్తున్నాం. ఇటీవలే జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో ప్రస్తావించాం. అధికారులు స్పందించారు. రికార్డుల ఆధారంగా పెండింగ్ బిల్లులు చెల్లించడారికి చర్యలు తీసుకుంటామన్నారు. – ఎన్.శంకర్, మండల విద్యాశాఖ అధికారి, తిర్యాణి