persia
-
అదో ‘మాయాద్వీపం’.. మట్టితో చేసిన వంటలు భలే రుచి.. ఇంకా ఉప్పు దేవత, బ్లడ్ సీ కూడా
Iran Rainbow Valley Unknown Facts In Telugu: మట్టి వాసన బాగుందంటాం కానీ..దానిని రుచి చూడం. కానీ, మట్టినే మసాల దినుసులుగా, సాస్‌గా తీసుకుంటారంటే నమ్ముతారా? తినే పర్వతం ఒకటి ఉందంటే ఊహించగలరా? ఎగిసిపడుతున్న రక్తపు సముద్రాన్ని చూస్తే భయపడకుండా ఉండగలరా? చిటికెడు ఉప్పు అనేవాళ్లకు ఉప్పు కొండలు కనిపిస్తే అచ్చెరువొందరా? పర్వతాలే ఇంద్రధనస్సులై మెరిస్తే మైమరిచిపోరా? ఇదంతా ఏదో హాలీవుడ్ సినిమా గ్రాఫిక్స్ కాదు.. ఈ భూమి మీదే! ప్రపంచ పర్యాటకానికి దూరంగా..ఓ మాయా ద్వీపంలా ఉన్న ‘రెయిన్బో ఐలాండ్’ విశేషాలు తెలుసుకుందామా? ఇరాన్–పర్షియన్ గల్ఫ్‌లోని హార్ముజ్ ద్వీపం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 7,000 జనాభా. ఇది శాస్త్రవేత్తలకు ఓ పెద్ద డిస్నీల్యాండ్. ఎటుచూసినా సహజసిద్ధంగా ఏర్పడిన రంగురంగుల పర్వతాలు..అడుగడుగునా ఖనిజ నిక్షేపాలు..నాపరాయి, మట్టి, ఇనుము అధికంగా ఉండే అగ్నిపర్వత శిలలతో ఏర్పడిన తెలుపు, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ, లేత గోధుమరంగు, గోధుమ, లేత మణి, బంగారపు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. అందుకే దీనిని ‘రెయిన్బో ఐలాండ్’ అని పిలుస్తారు. ఈ దీవిలో దాదాపు 70 వరకు ఖనిజాలను గుర్తించారు. కోట్ల ఏళ్ల కిందట పర్షియన్ గల్ఫ్ అంచుల చుట్టూ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఉప్పు భారీగా పేరుకుపోయిందని, ఖనిజ, అగ్ని పర్వతాలతో కలిసి రంగురంగుల ఉప్పు దిబ్బలుగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. చదవండి: 1485 ఎకరాల్లో అతి పేద్ద శ్మశానం.. ఇప్పటివరకు 50 లక్షల మృతదేహాలు.. – సాక్షి, అమరావతి ఉప్పు దేవత.. స్థానికులు ఇక్కడి ఉప్పు పర్వతాన్ని దేవతగా పిలుస్తారు. ఇది కిలోమీటరకుపైగా విస్తరించి ఉంది. దీనికి ఔషధ గుణాలున్నాయని నమ్ముతారు. రాతి ఉప్పు గాలి పీల్చుకోవడంతో అనారోగ్య సమస్యలను నయమవుతాయని విశ్వసిస్తారు. అందుకే దీనిని పాజిటివ్ ఎనర్జీ వ్యాలీ అని కూడా అంటారు. బ్లడ్ సీ.. ఈ ద్వీపంలోని సముద్రం ఎర్రటి అలలతో ఎగిసిపడుతుంది. అందుకే దీనిని బ్లడ్ బీచ్, బ్లడీ సీ అని పిలుస్తారు. ఐరన్ ఆక్సైడ్ అధికంగా ఉండే ఎర్రటి మట్టి వల్ల నీరు ఎరుపుగా ఉంటుంది. ఇక్కడ అతిపెద్ద రంగురంగుల మట్టి కార్పెట్ కనిపిస్తుంది. సైలెంట్ వ్యాలీ, రెయిన్బో గుహలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. 2019 ఇరాన్ లెక్కల ప్రకారం 18 వేల మంది మాత్రమే ఈ ప్రదేశాన్ని సందర్శించారు. ఇక్కడ పెద్ద వాహనాలు ఉండవు. స్థానికుల రిక్షాల్లో ద్వీపాన్ని చుట్టిరావచ్చు. చదవండి: Viral Video: ‘వాట్ ఏ టైమింగ్.. ఇక్కడ విసిరితే అక్కడ ల్యాండ్ అయ్యింది’ తినే పర్వతం.. హార్ముజ్‌లోని ఓ పర్వతపు ఎర్ర మట్టిని సుగంధ ద్రవ్యంగా స్థానికులు వంటల్లో వినియోగిస్తుంటారు. ఇక్కడి పర్వతాల ఎర్రటి మట్టిని గెలాక్ అని పిలుస్తారు. ఇది అగ్నిపర్వత శిలల నుంచి ఉద్భవించిన హెమటైట్ ఐరన్ ఆక్సైడ్ వల్ల ఏర్పడింది. ఈ ఖనిజానికి ఎన్నో పారిశ్రామిక ఉపయోగాలున్నాయి. దీని మట్టి కూరలకు మంచి రుచి ఇస్తుంది. స్థానికులు దీనిని రొట్టెతో నంజుకుని తింటారు. తాజాగా పట్టిన సార్డినెస్, కిల్కా, మోమాగ్ చేపలను శుభ్రం చేసి వాటిని మట్టితో చేసి సాస్‌లో పెద్ద కంటైనర్‌లో వేసి 2 రోజులు ఎండలో ఉంచడంతో ‘సురఘ్’అనే రుచికరమైన భోజనం అవుతుంది. ఈ మట్టినే స్థానిక కళాకారులు పెయింటింగ్, సిరామిక్స్, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు -
1,200 ఏళ్ల క్రితమే భారత్‌కు పార్శీల వలస
నిర్ధారించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సాక్షి, హైదరాబాద్: పర్షియా (నేటి ఇరాన్) నుంచి వలస వచ్చిన వారు పార్శీలని, వారు జొరాష్ట్రియన్ మతాన్ని అనుసరిస్తారని మనకు చరిత్ర చెబుతుంది. క్రీస్తు శకం 8–10 శతకంలో తొలి పార్శీ గుజరాత్‌కు వచ్చి, ఆ తరువాత దేశమంతా విస్తరించారని మనకు తెలుసు. జన్యువుల పరంగానూ ఇది నిజమేనని నిరూపించింది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలో ఈస్టోనియా, యూకే, పాకిస్తాన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు. భారత్, పాకిస్తాన్లలో స్థిరపడ్డ పార్శీలు, గుజరాత్‌లోని సంజన్ ప్రాంతంలో బయటపడ్డ పార్శీల అవశేషాల నుంచి సేకరించిన జన్యువులను పరిశీలించడం ద్వారా వారు సుమారు 1,200 ఏళ్ల క్రితం భారత్‌కు వలస వచ్చినట్లు నిర్ధారించామని శుక్రవారం ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. జన్యుపరంగా పార్శీలు నియోలిథిక్ ఇరానియన్లకు దగ్గరి వారని ఆయన చెప్పారు. మైటోకాండ్రియల్, వై–క్రోమోసోమల్, ఆటోసోమల్ డీఎన్ఏ మార్కర్లను ఈ పరిశోధనలో పరిశీలించామని, ఈ ఫలితాలు చరిత్ర పుస్తకాలతో సరిపోలుతున్నాయని సాంగర్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త ఖాసీం అయూబ్ పేర్కొన్నారు. భారత్‌పై ముస్లిం రాజుల దండయాత్రల ప్రభావం పార్శీలపై ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని ఈస్టోనియా బయోసెంటర్ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. పార్శీల గురించి ఇప్పటికే జరిగిన అధ్యయనాలు ఈ విషయాలనే చెబుతున్నప్పటికీ తాము తొలిసారి అత్యాధునిక పద్ధతుల ద్వారా నిర్ధారించడం గమనార్హమని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె.మిశ్రా తెలిపారు. పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక జీనోమ్ బయాలజీ మేగజైన్లో ప్రచురితమయ్యాయి. -
టూకీగా ప్రపంచ చరిత్ర 80
ఏలుబడి కూకట్లు పర్షియా సువిశాలమైన ప్రదేశమేగానీ, రాతిగుట్టల మూలంగా పచ్చిక బయళ్లు తక్కువ. ఇక్కడి నుండి పడమటికి సాగాలంటే, జాగ్రోస్ పర్వతపంక్తి అడ్డగిస్తుంది. దాన్ని దాటుకున్నా అప్పటికే బలమైన రాజ్యాధికారంగా ఎదిగిన సుమేరియన్లను అక్కడ ఎదుర్కోవాలి. దానికంటే, తూర్పు దిశగా ఉన్న సింధుస్థాన్ (ఇప్పటి ఆఫ్గనిస్థాన్, పడమటి పాకిస్థాన్‌లు) అనువైనదిగా ఆర్యులు ఎంచుకున్నారు. క్రీ.పూ. 1500 ప్రాంతంలో ఆ దిశగా సాగిన ఆర్యులు, స్థానిక ప్రజలతో యధేచ్ఛగా మమేకమౌతూ సింధూనదిని చేరుకున్నారు. నడుమ నడుమ నాగరికతకు ఎదగని ఆటవికులతో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురైవుండొచ్చు. మహాభారతంలో భీమసేనుడు రాక్షసకన్య హిండిబిని పెళ్లాడిన రీతిలో కయ్యము, వియ్యాలతో ఆర్యులు ఆ సమస్యలు ఎదుర్కొంటూ సింధూనది వరకు వేగంగా విస్తరించారు. ఈ పరిణామం గమనిస్తే, సింధూనాగరికత అంతరించిపోయేందుకు కారణం వాతావరణంలో వచ్చిన మార్పువల్ల భూములు బీడుపడటంగా కొందరు చేస్తున్న వాదనగూడా వాస్తవం కాదని తెలుస్తుంది. అదే నిజమైతే, పచ్చికబయళ్లకోసం పాకులాడే ఆర్యులు ఇటువైపుగా విస్తరించే అవసరమే ఉండేదిగాదు. వేదంలో తొలుత సూచనప్రాయంగా కనిపించే వ్యవసాయానికి తరువాతి కాలంలో ప్రాముఖ్యత పెరగడం గమనిస్తే, సింధూపీఠభూమికి చేరిన ఆర్యులు వ్యవసాయంలో దిగినట్టు అర్థమౌతుంది. అప్పుడుగాని వాళ్లకు సేవకులతోనూ బానిసలతోనూ అవసరం ఏర్పడలేదు. పరిమితమైన వ్యాపారం, వ్యవసాయాలతో ఆర్యన్ భారతీయుల్లో వర్ణవ్యవస్థ సంపూర్ణంగా చోటుచేసుకుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు గోత్రాలుగా విభజించబడిన ఆర్యులుగానూ, సేవకులుగా వినియోగించుకునే శూద్రులు కులాలవారీగా విభజింపబడిన అనార్యులుగానూ కాలక్రమంలో స్థిరపడినట్టు అర్థమౌతుంది. వ్యవసాయం అనగానే స్థిరనివాసం తప్పనిసరి. ఆ అవసరం ఏర్పడినప్పుడు కూడా ఆర్యులు అదివరకటి వాళ్లు వదిలిపోయిన గృహాలను ఆక్రమించలేదు. వాళ్లు ఏ కారణంగా వాటిని బహిష్కరించారో ఊహించడం కష్టం. గ్రామాలుగా స్థిరపడిన ఆర్యులు మట్టిగుడిసెలతోనే గడుపుకున్నారు. యమునా, గంగా తీరాలకు విస్తరించిన తరువాత కూడా, పౌరాణిక గాథల్లో వినిపించే నగరాలూ, చక్రవర్తులు మినహా, ఆర్యులకు నగరాలున్నట్టు నిరూపించే ఆధారాలు కనిపించవు. ఒకప్పుడు సింధూనదికి తూర్పున మొదలై, ఉత్తరావర్తమంతా విస్తరించిన ‘ద్రవిడ నాగరికత’ ఒకటుండేదనీ, ఆర్యులు వాళ్లను దక్షిణాదికి తరిమేసి ఉత్తరాపథం ఆక్రమించారనీ, ఒక కొత్త వాదన ఇటీవల ముమ్మరంగా ప్రచారమైంది. క్రీ.పూ. 8వ శతాబ్దం దాకా ఉత్తరావర్తంలో నగరాల ఆనవాళ్లే చరిత్రకు అందనప్పుడు, ఏదో నాగరికత అక్కడ గొప్పదశలో ఉండేదని వాదించడం ఊహకు అతీతమైన తర్కం. పురాణాల్లో కనిపించే ‘హస్తినాపురం’, ‘ఇంద్రప్రస్థం’ వంటి పట్టణాలను వదిలేస్తే, క్రీ.పూ. 6వ శతాబ్దంలో అక్కడ మగధ, కోసల, కాశీ, వత్స, అంగ, పాంచాల, అవంతి, విదర్భ, గాంధార, కాంభోజ వంటి కొన్ని రాజ్యాలూ, శాక్య, మల్ల, వృజి, లిచ్ఛవి వంటి కొన్ని గణతంత్రాలూ ఏర్పడివున్నట్టు సమకాలీన సాహిత్యం ద్వారా తెలుస్తూంది. పేరుకు రాజ్యాలేగానీ, చెప్పుకోదగ్గ వైశాల్యం కలిగినవిగా ఇవి కనిపించవు. ఆ శతాబ్దం చివరిలో (బహువా క్రీ.పూ. 580 ప్రాంతంలో) కాశీ, కోసల రాజ్యాలనూ, వృజి గణతంత్రాన్నీ హస్తగతం చేసుకుని, విశాలంగా విస్తరించిన మొట్టమొదటి సామ్రాజ్యం మగధ. కట్టుకథలను దాటిన వాస్తవచరిత్ర భారతదేశానికి ఇక్కడ మొదలౌతుంది. ‘రాజగృహ’ పట్టణం రాజధానిగా, ‘హర్యాంక’ వంశానికి చెందిన ‘బింబిసారుడు’ మొదటి చక్రవర్తిగా మగధ సింహాసనం అధిరోహించాడు. చైనా చరిత్ర గూడా మనదానికి మల్లే పురాణ చక్రవర్తులతో మొదలౌతుంది. ఆధారాలులేని ఐదుగురు చక్రవర్తులూ, గ్జియా వంశాలను వదిలేస్తే, ‘షాంగ్’ వంశంతో వాస్తవ చరిత్ర మొదలౌతుంది. క్రీ.పూ. 1750 ప్రాంతంలో వీళ్ల పాలన మొదలైన తరువాత, పోగు తెగకుండా చైనా రాచరికచరిత్ర ఆనవాళ్లతో కొనసాగుతుంది. కనీసం క్రీ.పూ. 200 వరకూ ఆ రాజులు పాలించినవి ఒక మోస్తరు భూ భాగాలే తప్ప, సామ్రాజ్యాలని పిలిచేందుకు వీలుపడేది కాదు. ఒకప్పుడు సింధూనదికి తూర్పున మొదలై, ఉత్తరావర్తమంతా విస్తరించిన ‘ద్రవిడ నాగరికత’ ఒకటుండేదనీ, ఆర్యులు వాళ్లను దక్షిణాదికి తరిమేసి ఉత్తరాపథం ఆక్రమించారనీ, ఒక కొత్త వాదన ఇటీవల ముమ్మరంగా ప్రచారమైంది. క్రీ.పూ. 8వ శతాబ్దం దాకా ఉత్తరావర్తంలో నగరాల ఆనవాళ్లే చరిత్రకు అందనప్పుడు, ఏదో నాగరికత అక్కడ గొప్పదశలో ఉండేదని వాదించడం ఊహకు అతీతమైన తర్కం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
దువ్వడం కొత్తేం కాదు
ఆవిష్కరణం మానవ నాగరికతను తెలిపే ప్రధాన చిహ్నాల కచ్చితంగా ఉండేది ‘దువ్వెన’. ఐదు వేల సంవత్సరాల క్రితమే ఇది పర్షియాలో బయటపడింది. ఇంకా చెప్పాలంటే అసలు మానవ నాగరికతకు సంబంధించి దొరికిన మొదటి వస్తువు కూడా అదే. దువ్వెనలోని గొప్పదనం ఏంటంటే... ఇందులో అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా కనపడుదు. అప్పుడూ ఒక పిడి లాంటి వస్తువుకు పొడవైన పళ్లు ఉండేవి. ఇపుడూ అంతే... కాకపోతే రంగులు, డిజైన్లు, సైజులు మాత్రమే తేడా. ఆకారాలు ఎన్ని మారినా దువ్వెన అన్నాక పళ్లు ఉండాల్సిందే. అందులో మార్పు చేయదగినది కూడా ఏమీ లేదు. మనిషి రూపురేఖలకు, అందానికి జుట్టు ఎంత అవసరమో ఈ దువ్వెన చరిత్ర చెబుతోంది. మనల్ని మనం అందంగా చూపుకోవడంలో జుట్టును మేనేజ్ చేయడం అన్నది వేల సంవత్సరాల క్రితమే మనిషి నేర్చుకున్న నాగరికత. ప్రతిదాంట్లో వేలుపెట్టే అమెరికన్ల వల్ల ఇది కూడా పేటెంట్ బారిన పడింది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు చెందిన వాల్టర్ సమన్స్ దువ్వెనకు కొన్ని మార్పులు చేసి 1920లో పేటెంట్ సంపాదించారు. అయితే అందులో ఆయన కొంత టెక్నాలజీ కూడా వాడారట. దాని ద్వారా జుట్టుకు వేడిని పంపి వాటిని సుడులు లేకుండా మార్చొచ్చట. ఇపుడు దీనికి అనేక రకాల వస్తువులు వచ్చాయి అది వేరే విషయం. కానీ దువ్వెన మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది... వజ్రం లాగా!