PG students
-
వారిని ప్రమోట్ చేసేద్దామా!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులను పరీక్షల్లేకుండానే ప్రమోట్ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, సాంకేతిక విద్య, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, వివిధ వర్సిటీల ఇన్‌ఛార్జి వీసీలు జయేశ్ రంజన్, అరవింద్‌కుమార్, జనార్దన్‌రెడ్డి తదితరులతో సమావేశం గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. డిగ్రీ, పీజీ (ఇంజనీరింగ్ సహా) ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నిర్వహించాలా? వద్దా? అనే దానిపై చర్చించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ కష్టమనే భావన వ్యక్తమైనట్లు తెలిసింది.(ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్) కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ వల్ల మరిన్ని సమస్యలు వస్తాయనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఒక్కో పరీక్ష కేంద్రానికి వందల మంది విద్యా ర్థులు రావడం, ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు చేతులు మారడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు పరీక్షలు నిర్వహించకుండా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా, లేదా కిందటి సెమిస్టర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా పాస్‌చేస్తే ఎలా ఉంటుందనే దానిపైనా చర్చించారు. మొత్తానికి పరీక్షలను రద్దుచేసి, ఇంటర్నల్ మార్కుల ఆధారంగానే ప్రమోట్ చేయాలనే అభిప్రాయాన్ని ఎక్కువ మం ది అధికారులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో చివరకు పరీక్ష ల రద్దుకు సమావేశం మొగ్గు చూపినట్లు సమాచారం. సీఎంకు నివేదిక.. ఆపై నిర్ణయం పరీక్షలు నిర్వహిస్తే లేదా నిర్వహించకపోతే తలెత్తే సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించి సీఎం కేసీఆర్‌కు అందజేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. దానిపై సీఎం తుది నిర్ణయం తీసుకుంటారనే భావనకు ఉన్నతాధికారులు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు రద్దుచేస్తే ఏ ప్రాతిపదికన విద్యార్థులను ప్రమోట్ చేయాలి?, మార్కులెలా ఇవ్వాలనే మార్గదర్శకాలను నివేదికలో పొందుపరచాలని నిర్ణయించారు. ఇప్ప టికే డిటెన్షన్‌ను ఎత్తివేసి, ప్రమోట్ చేసి నందున పరీక్షల సంగతి తరువాత చూసుకోవచ్చని, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీఎంకు విన్నవించాలని నిర్ణ యించినట్లు తెలిసింది. ఫైనల్ సెమిస్టర్ లో ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను చేసినా, ఆయా విద్యార్థులకు సంబంధించిన బ్యాక్‌లాగ్స్ విషయంపైనా చర్చించారు. -
అలరించిన ‘భావన–2016’
-
ఎడ్యుకేషన్ & జాబ్స్
హాజరు లేకుంటే పరీక్షలు రాయనివ్వం * త్వరలో పీహెచ్డీ ప్రవేశాలు: ఓయూ రిజిస్ట్రార్ హైదరాబాద్: యూజీసీ నిబంధనల ప్రకారం హాజరు శాతాన్ని కట్టుదిట్టం చేశామని, హాజరు 75 శాతం లేని పీజీ విద్యార్థులను పరీక్షలను రాయనివ్వబోమని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ అన్నారు. మంగళవారం క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, ఆర్ట్స్ కాలేజీలను సందర్శించి తరగతి గదుల్లో విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ మాట్లాడుతూ హాజరుశాతం ఇంత కాలం నిబంధనలకు మాత్రమే పరిమితమైందని, ఇక నుంచి ఖచ్చిత అమలుకు గట్టి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇక నుంచి విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించేందుకు వారానికి రెండు రోజులు ఓయూ పరిధిలోని వివిధ కళాశాలలను సందర్శించనున్నట్లు చెప్పారు. ఈ విద్యా సంవత్సరానికి అర్హత గల ప్రతి పీజీ విద్యార్థి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పీహెచ్డీ అర్హత మార్కులను ఇదివరకే 10వరకు తగ్గించామని, రెండోసారి మార్కులు తగ్గించేందుకు ఇన్చార్జి వీసీ ఆర్ఆర్ ఆచార్య అంగీకరించలేదన్నారు. పీహెచ్‌డీలో ప్రవేశాలకు త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ చెప్పారు. రూసా నిధులు అందిన వెంటనే హాస్టళ్ల మరమ్మతు పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 23న ‘నిమ్స్’ రెండో విడత కౌన్సెలింగ్ హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 23న నిర్వహించనున్నట్లు నిమ్స్ సమాచార శాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. బీఎస్సీ నర్సింగ్ ఒక సీటుకు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ కోర్సుకు రెండు సీట్ల కోసం ఇప్పటికే మొదటి కౌన్సెలింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. 23 ఉదయం 9:30కి నిమ్స్ పాత భవనం మొదటి అంతస్థులోని లెర్నింగ్ సెంటర్లో అభ్యర్థులు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.nims.edu.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. బీడీఎస్ ద్వితీయ ఫలితాలు విడుదల విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జులై/ఆగస్టులో నిర్వహించిన బీడీఎస్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల రీ టోటలింగ్ కోసం ఈ నెల 30లోగా సబ్జెక్టుకు రూ.2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.విజయకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలు వర్సిటీ వెబ్సైట్(http://ntruhs.ap.nic.in) లో పొందవచ్చు. ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఎంబీఏ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. క్యాట్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పింనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 30వ తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలను www.uohyd.ac.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. రేపు బీఈడీ అభ్యర్థుల జాబితా విడుదల హైదరాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా బీఈడీ కోర్సులో సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేయనునట్లు ఎడ్‌సెట్-2015 కన్వీనర్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 26 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు మంగళవారం పేర్కొన్నారు. సీటు సాధించిన అభ్యర్థులు ఈ నెల 26 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేసి ఫీజు చెల్లించాలన్నారు. భర్తీ కాని బీఈడీ సీట్లకు త్వరలో రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టనునట్లు వెల్లడించారు. మెరిట్ స్కాలర్షిప్ ఫీజు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: వచ్చే నవంబర్ 8 న జరిగే రాష్ట్రస్థాయి ఎన్టీఎస్ఈ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షల ఫీజు గడువును ఈనెల 16కు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో కాని, ప్రభుత్వ పరీక్షల వెబ్సైట్ www.bsetelangana.org లో గానీ సంప్రదించవచ్చని తెలిపారు. వొకేషనల్ కోర్సుల గుర్తింపునకు కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఇంటర్మీడియట్ వొకేషనల్ కరస్పాండింగ్ కోర్సులకు గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కోసం నిర్వహించే పారా మెడికల్ తదితర కోర్సులకు గుర్తింపునిచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి కన్వీనర్‌గా ఇంటర్ విద్య కమిషనర్ వ్యవహరిస్తారు. సాంకేతిక విద్య కమిషనర్, ఎస్బీటీఈటీ కార్యదర్శి, లేబర్, ఎంప్లాయిమెంట్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఎన్ఎస్ఎస్ అవార్డుల ఎంపికకు కమిటీ సాక్షి, హైదరాబాద్: నేషనల్ సర్వీసు స్కీంలో (ఎన్ఎస్ఎస్) రాష్ట్ర స్థాయి అవార్డులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఒక బెస్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, 6 బెస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్, 9 బెస్ట్ వాలంటీర్ అవార్డులకు అర్హత కలిగిన వారిని ఎంపిక చేసేందుకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఈ కమిటీ రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. ‘ఓపెన్’ ఫీజు గడువు నేటితో పూర్తి సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు ఫీజు చెల్లింపునకు ఈనెల 16 వరకు గడువు పొడిగించినట్లు సొసైటీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. -
తప్పనిసరి ప్రభుత్వసేవల వైద్యులపై నిర్లక్ష్యం
* ఐదు నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకుండా సర్కారు జాప్యం * పీజీ విద్యార్థుల స్టైపెండ్ పెంపులోనూ నిర్లిప్తత * 2012 నాటి హామీలకూ అతీగతీ లేదు సాక్షి, హైదరాబాద్: జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిపాటు తప్పనిసరి వైద్య సేవల నిబంధన కింద వైద్యం అందిస్తున్న పీజీ పూర్తయిన డాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గతేడాది అక్టోబర్ నుంచి వారికి గౌరవ వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ పరిణామం వారిని మానసిక వేదనకు గురిస్తోంది. గత నెల నుంచి పెరిగిన గౌరవ వేతనం ప్రకారం పీజీ పూర్తయిన డాక్టర్లకు నెలకు రూ. 40 వేలు, పీజీ డిప్లొమా పూర్తయిన వారికి రూ. 38 వేలు, పీజీ సూపర్ స్పెషాలిటీ పూర్తయిన వారికి రూ.45 వేలు స్టైపెండ్ ఇవ్వాలి. ప్రతి నెలా ఐదో తేదీలోపు గౌరవ వేతనం చెల్లించాలని జీవో 107 స్పష్టంగా చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతోంది. సర్కారు నిర్లక్ష్యానికితోడు ప్రణాళికేతర బడ్జెట్లో ఈ చెల్లింపులు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీన్ని చక్కదిద్ది గ్రీన్‌చానల్ పద్ధతిలో ప్రతి నెలా గౌరవవేతనమిచ్చే ప్రయత్నాలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. పెరగని పీజీ విద్యార్థుల స్టైపెండ్... నిత్యావసర ధరలకు అనుగుణంగా పీజీ వైద్య విద్యార్థుల స్టైపెండ్‌ను రెండేళ్లకోసారి 15 శాతం పెంచాలి. 2012 జనవరిలో చివరిసారిగా ఇది 15 శాతం పెరిగింది. ఆ తర్వాత 2014 జనవరి నుంచి పెరగాల్సి ఉంది. కానీ గడువు దాటి 13 నెలలు కావస్తున్నా వీరి స్టైపెండ్‌ను ప్రభుత్వం పెంచలేదు. అప్పటి నుంచి ఎరియర్స్ ఇవ్వాలి. ఇటీవల 62 రోజులపాటు జరిగిన జూడాల సమ్మె సందర్భంగా స్టైపెండ్ పెంచుతామని సర్కారు హామీ ఇచ్చింది. కానీ సీఎం వద్దకు పెంపు ఫైలు వెళ్లినా ఇంకా ఆమోదం లభించలేదని అధికారులే చెబుతున్నారు. మరోవైపు స్టైపెండ్ చెల్లింపులో సర్కారు మెలిక పెట్టింది. గత ఏడాది జనవరి నుంచి కాకుండా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే పెంపును వర్తింప చేస్తామంటోంది. అయితే ఇది అన్యాయమంటూ జూడాలు మండిపడుతున్నారు. ప్రభుత్వ జాప్యం కారణంగా దాదాపు వెయ్యి మంది పీజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెసిడెన్షియల్ వైద్యులుగా పీజీలకు హోదా కల్పించాలి... పీజీ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్టైపెండ్ అఖిల భారత స్థాయి స్టైపెండ్‌తో పోలిస్తే అత్యంత తక్కువ. రాష్ట్రంలో మొదటి సంవత్సరం పీజీ విద్యార్థులకు రూ. 20,700, రెండో సంవత్సరం వారికి రూ. 21,700, మూడో సంవత్సరం వారికి రూ. 23 వేలు స్టైపెండ్ ఇస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ పీజీలకు అదే వరుసలో రూ. 26 వేలు, రూ. 27 వేలు, రూ. 28 వేలు ఇస్తున్నారు. అదే అఖిల భారత స్థాయి స్టైపెండ్ ఇస్తున్న నిమ్స్‌లో పీజీలకు రూ. 50 వేల వరకు, సూపర్ స్పెషాలిటీ వారికి రూ. 60 వేల వరకు ఆయా కేటగిరీల్లో ఇస్తున్నారు. నిమ్స్ స్వయం ప్రతిపత్తి సంస్థ కావడంతో అక్కడ కేంద్ర సంస్థల స్థాయిలో ఇస్తున్నారు. ఎయిమ్స్‌లోనూ ఆ స్థాయిలోనే స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే నిమ్స్, ఎయిమ్స్‌లలో పీజీ విద్యార్థులకు రెసిడెన్షియల్ వసతి కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీజీ వైద్యుల సేవలను బోధనాసుపత్రుల్లో కేవలం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉపయోగించుకుంటున్నారు. అదే ఎయిమ్స్, నిమ్స్‌ల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి సేవలను వినియోగించుకుంటున్నారు. అంతేకాదు విడతల వారీగా 24 గంటలూ వారి సేవలు అందుతాయి. అందువల్ల వారికి స్టైపెండ్ ఎక్కువ ఇస్తూనే రెసిడెన్షియల్ వసతి ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ పీజీలకు అటువంటి వసతి సౌకర్యం కల్పించి స్టైపెండ్ పెంచాలని పీజీ విద్యార్థులు కోరుతున్నారు. దానివల్ల నిరంతరం రోగులకు సేవలు అందుతాయంటున్నారు. 2012లో జూడాలు సమ్మె చేసినప్పుడు ఈ డిమాండ్ చర్చకు వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం రెసిడెన్షియల్ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ అది అమలులోకి రాలేదు. కాగా, ఈ అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా తప్పనిసరి ప్రభుత్వ వైద్య సేవల్లో ఉన్న పీజీ పూర్తయిన డాక్టర్లకు ఐదు నెలలుగా గౌరవ వేతనం ఎందుకు అందడంలేదో పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఇప్పటివరకు కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఇకముందు జరగకుండా తగు చర్యలు తీసుకుంటానన్నారు.