Phogat sisters
-
2 వేల కోట్లు వసూలు చేస్తే.. మాకిచ్చింది కోటే..!
-
పెళ్లిపీటలెక్కనున్న రెజ్లింగ్ జంట
చండీగఢ్: రెజ్లింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరల్డ్ నెంబర్‌వన్ రెజ్లర్‌గా కొనసాగుతున్న భజరంగ్ పూనియా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. తన రంగానికే చెందిన సంగీతా ఫొగట్‌ను వివాహమాడనున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఇరువురి కుటుంబసభ్యులు దృవీకరించారు. ఫొగట్ సిస్టర్స్‌లో సంగీత అందరికంటే చిన్నవారన్న సంగతి తెలిసిందే. కాగా, 2020 టోక్యో ఒలింపిక్స్ తర్వాతే వీరి వివాహం జరగనుంది. 'ఇది వారిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమని, పిల్లల అభిప్రాయాలను గౌరవించడమే మా కర్తవ్యమని' సంగీత తండ్రి మహావీర్ సింగ్ ఫొగట్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా 65 కేజీల విభాగంలో, సంగీతా ఫొగట్ 59 కేజీల విభాగంలో పోటీ పడుతున్నారు. -
‘దంగల్’ సిస్టర్స్‌పై వేటు
న్యూఢిల్లీ : నేషనల్ క్యాంప్‌కు హజరుకానందుకుగాను జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఫోగట్ సిస్టర్స్‌పై వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే డబ్ల్యూఎఫ్ఐ ఫోగట్ సిస్టర్స్‌కు మరో అవకాశం ఇచ్చింది. నేషనల్ కాంప్‌కు హాజరుకానందుకు కల కారణాన్ని వివరిస్తే వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించడమే కాక వారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోగట్ సిస్టర్స్ గీత, బబితలతో పాటు వీరి చెల్లెళ్లు రీతు, సంగీత కూడా ప్రస్తుతం లక్నోలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాంప్‌కు హాజరుకాలేదు. ఈ కారణం వల్ల డబ్ల్యూఎఫ్ఐ వీరి మీద వేటు వేసింది. ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేషనల్ క్యాంప్‌కు ఎంపికైన ఏ రెజ్లర్ అయిన మూడురోజుల్లోగా తన శారీరక దృఢత్వం గురించి క్యాంప్‌లో తెలియచేయాలి. ఒకవేళ వారికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి గురించి కోచ్‌తో చెప్పి పరిష్కరించుకోవాలి. అయితే గీతా, బబిత వారి ఇద్దరు సోదరీమణులు రీతూ, సంగీత కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కనీసం వారితో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. డబ్ల్యూఎఫ్ఐ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, వారిపై క్రమశిక్షణా రహిత్యం కింద చర్యలు తీసుకుంది. ఇక వారు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చ’ని అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ చర్యల వల్ల ఫోగట్ సిస్టర్స్ ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరగబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోనున్నట్లు సమాచారం. అయితే డబ్ల్యూఎఫ్ఐ వీరికి ఒక ఊరట కల్పించింది. ఒకవేళ ఫోగట్ సిస్టర్స్ కనుక వారి గైర్హాజరుకు సరైన కారణాన్ని చెప్తే వారికి మరో అవకాశం ఇస్తామని శరణ్ సింగ్ తెలిపారు. ఫోగట్ సిస్టర్స్‌తో పాటు రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ భర్త సత్యవర్త్ కడియాన్పైనా కూడా డబ్ల్యూఎఫ్ఐ నిషేధం విధించింది. నిషేధం గురించి నాకేం తెలియదు : బబిత అయితే ఈ విషయం గురించి బబిత స్పందిస్తూ.. ‘డబ్ల్యూఎఫ్ఐ నాపై వేటు వేసిన సంగతి నాకు తెలియదు. దీనికి సంబంధించి ఎటువంటి నోటీసు నాకు రాలేదు. నేను నేషనల్ కాంప్‌కు హాజరుకాని మాట వాస్తవం. ఎందుకంటే నేను మోకాలి గాయాలతో బాధపడుతున్నాను. అయితే ఈ విషయం గురించి నేను డబ్ల్యూఎఫ్ఐకి సమాచారం ఇవ్వలేదు. ఈరోజే దీని గురించి వారికి తెలియజేస్తాను. అలానే రీతూ, సంగీత రష్యాలో నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్యాంప్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ వారికి ఇంకా వీసాలు రాలేదు. ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్ఐను సంప్రదించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం గీత బెంగుళూరులో శిక్షణ తీసుకుంటోంది. ఆమె నేషనల్ క్యంప్కు ఎందుకు గైర్హాజరయ్యిందో నాకు తెలియద’ని చెప్పారు. గీతా ఫోగట్ 2010 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడమే కాక 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి మల్లయుద్ధంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఆమె సోదరి బబిత 2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించింది. -
'దంగల్' సిస్టర్స్‌కు ఏమైంది..?
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా దంగల్ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అందరి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. హరియాణాకు చెందిన కుస్తీవీరుడు మహావీర్ పొగట్ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పొగట్ కుమార్తెలు గీతా పొగట్, బబితా పొగట్ చాంపియన్లుగా ఎదిగిన తీరు ఈ సినిమా కథ. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పతకాలు అందించిన గీత, బబితలు క్రీడాభిమానులకు సుపరిచితమే. కాగా దంగల్ సినిమా తర్వాత ఈ సిస్టర్స్‌కు మరింత క్రేజ్ పెరిగింది. అసలు విషయం ఏంటంటే ప్రో రెజ్లింగ్ లీగ్‌లో పొగట్ సిస్టర్స్ యూపీ దంగల్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఈ సీజన్లో వీరిద్దరూ కొనసాగేది సందేహంగా మారింది. గీత జ్వరంతో, బబిత గాయంతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో వీరిద్దరూ టోర్నీకి అందుబాటులో ఉండేది కష్టమని యూపీ దంగల్ టీమ్ వర్గాలు తెలిపాయి. వీరి స్థానాల్లో ఇతరులను తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్యను కోరినట్టు తెలుస్తోంది. మహిళల 53 కిలోల విభాగంలో బబిత స్థానంలో పింకి, 58 కిలోల విభాగంలో గీత స్థానంలో మనీషా పేర్లను సూచించారు. కాగా జట్టు నుంచి గీత, బబిత వైదొలగరని, టోర్నీలో వారు జట్టుతో కలసి ఉంటారని, అయితే తదుపరి పోటీలలో పాల్గొనకపోవచ్చని ఓ అధికారి చెప్పారు.