Phone Number
-
సిగ్నల్‌లో ఖాతా, మార్క్ జూకర్బర్గ్ ఫోన్ నెంబర్ లీక్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో మరోసారి హ్యాకింగ్‌కు గురి కావడం ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. అయితే అతిపెద్ద డేటా బ్రీచ్‌గా చెబుతున్న తాజా కేసులో ఏకంగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నంబర్ కూడా లీక్ కావడం గమనార్హం. మార్క్ జుకర్‌బర్గ్ సిగ్నల్ యాప్‌ను వినియోగిస్తున్నారనీ, ఆయన ఫోన్ నంబర్ ఆన్లైన్లో లీక్ అయిందని భద్రతా పరిశోధకుడు వెల్లడించారు. అలాగే 533 మిలియన్ల ఫేస్బుక్ వినియోగుదారుల వ్యక్తిగత వివరాలు లీకైనట్టు తెలిపారు. ఈ 533 మిలియన్ల మందిలో 60లక్షలమంది భారతీయ వినియోగదారులున్నారు. అమెరికాకు చెందిన వారు 32 మిలియన్లు, 11 మిలియన్ల యూజర్లు యూకేకు చెందినవారున్నారు. ఈ ఫోన్ నంబర్ల డేటాబేస్ హ్యాకర్ల ఫోరమ్‌లో పోస్ట్ చేసినట్టు నివేదించిన సంగతి తెలిసిందే. డేటా లీక్‌కు ప్రభావితమైన వారిలో ఫేస్బుక్ సహ వ్యవస్థాపకులు డస్టిన్ మోస్కోవిట్జ్ , క్రిస్ హ్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భద్రతా నిపుణుడు డేవ్ వాకర్ అందించిన సమాచారం ప్రకారం జుకర్ పేరు, పుట్టిన తేదీ, వివాహం, ఫేస్బుక్ యూజర్ ఐడీ తదితర వివరాలన్నీ లీక్ అయ్యాయి. అలాగే జుకర్‌బర్గ్ లీకైన ఫోన్ నంబర్ స్క్రీన్ షాట్‌తో పాటు" మార్క్ జుకర్‌బర్గ్ సిగ్నల్లోఖాతా ఉందంటూ ట్విట్ చేశారు. మరొక భద్రతా నిపుణుడు అలోన్ గాల్ ప్రకారం, ఫేస్బుక్ ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ల ద్వారా ఈ హ్యాకింగ్ గత జనవరిలోనే జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఫేస్బుక్ ఇదంతా పాత డేటా అని కొట్టిపారేసింది. 2019 ఆగస్టులో ఈ లోపాన్ని సరిదిద్దామని పేర్కొంది. In another turn of events, Mark Zuckerberg also respects his own privacy, by using a chat app that has end-to-end encryption and isn't owned by @facebook This is the number associated with his account from the recent facebook leak. https://t.co/AXbXrF4ZxE — Dave Walker (@Daviey) April 4, 2021 -
బదిలీ తర్వాతా అధికారిక నంబర్..!
నెల్లూరు సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లు గత నెల 29వ తేదీన బదిలీ అయిన విషయం తెలిసిందే. వారం రోజుల పాటు రాజకీయ హైడ్రామా నేపథ్యంలో చివరికి రిలీవయ్యారు. బదిలీ అయి 15 రోజులు గడుస్తున్నా కమిషనర్ అధికారిక నంబర్‌నే వినియోగించడం కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు బదిలీ తర్వాత ఒకట్రెండు రోజుల్లో అధికారిక నంబర్‌ను కార్పొరేషన్ మేనేజర్‌కు అప్పగించేవారు. అయితే దీన్ని భిన్నంగా వెంకటేశ్వర్లు వ్యవహరిస్తుండటం విశేషం. ఫైల్స్‌పై సంతకాలు కొనసాగుతున్నాయా..? కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన కొన్ని ఫైళ్లపై కమిషనర్ సంతకాల అవసరం ఉండటంతో పాత తేదీలతో కమిషనర్ వెంకటేశ్వర్లు సంతకాలు చేస్తున్నారనే ప్రచారం కార్పొరేషన్లో జరుగుతుంది. ముఖ్యంగా రొట్టెల పండగకు సంబంధించి మేయర్ వర్గానికి చెందిన అనుచరుల ఫైళ్లపై కమిషనర్ సంతకాలు అవసరం ఉండటంతో పాత తేదీలతో ఇప్పటికే సంతకాలను పూర్తి చేశారు. ఈ క్రమంలో మరికొందరు కాంట్రాక్టర్లు తమ ఫైళ్లపై కూడా సంతకాల కోసం కమిషనర్‌ను కలుస్తున్నట్లు తెలుస్తోది. వీరి మధ్య కార్యాలయంలోని ఓ ఉద్యోగి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని సమాచారం. -
జస్ట్ మీ ఫోన్ నంబర్ ఉంటే చాలు..
జస్ట్ మీ ఫోన్ నంబర్ ఒక్కటి తెలిస్తే చాలు.. మీ మొబైల్ ఫోన్ ఆధారంగా మీరు ఎక్కడ ఉన్నారు? ఎవరెవరికీ ఎస్సెమ్మెస్‌లు పంపారు? ఎవరెవరి నుంచి మీకు ఎస్సెమ్మెస్‌లు అందాయి? అన్నది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఫోన్లో మాట్లాడిన విషయాలూ వినొచ్చు. వాటిని రికార్డ్ చేయవచ్చు. ఇలా కేవలం ఒక్క ఫోన్ నంబర్ తెలుసుకోవడంతో పౌరుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడి హ్యాకర్లు బీభత్సం సృష్టించే అవకాశముందని తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. పౌరుల ప్రైవసీపై హ్యాకర్ల నీలినీడలు ఎంత బలంగా ఉన్నాయో ఈ నివేదిక చాటింది. ప్రజాహితమనే ముసుగుతోనే ఇప్పటికే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు తమ దేశ పౌరుల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టిన అంశాన్ని బహిర్గతం చేయడం ద్వారా విజిల్ బ్లోయర్ ఎడ్వర్ స్నోడన్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంత భారీస్థాయిలో హ్యాకింగ్ జరిగే అవకాశమున్నా వినియోగదారులు ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి పెద్దగా రక్షణ చర్యలు లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉన్నా.. నెట్వర్క్ వైపు నుంచి హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే అవకాశముంది. 1975లో అభివృద్ధి చేసిన ప్రోటోకాల్ సిగ్నలింగ్ సిస్టమ్ నంబర్ 7 (ఎస్ఎస్7) ఈ విషయంలో హ్యాకర్లకు సహాయపడుతోంది. దీనితో సులువుగా రాబట్టే అంశాలైన ఫోన్ నంబర్‌తో కూడా హ్యాకింగ్‌కు పాల్పడి.. కాల్స్, లోకేషన్లు, మెసేజ్‌లు వంటి సమాచారాన్ని సంగ్రహించవచ్చు. ఈ ఎస్ఎస్7 పద్ధతి ద్వారానే బ్రిటన్ పెద్ద ఎత్తున తమ పౌరుల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టిందనే అంశం వెలుగులోకి వచ్చింది. 2015లో జరిగిన ఓ హ్యాకర్ల కాన్ఫరెన్స్‌లో ఈ పద్ధతి ఎలా పనిచేస్తోందో తొలిసారిగా వెల్లడించాయి. అయినప్పటికీ ఈ విధానం యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోందని తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల నడుమ ప్రైవసీని కాపాడుకోవడం కోసం టెలిగ్రామ్, వాట్సాప్, ఐ మెసేజ్స్, ఫేస్‌టైమ్ వంటి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించడం ఉత్తమమని, వీటి ద్వారా మీ కమ్యూనికేషన్స్ ప్రైవేటుగా ఉండే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనివల్ల ఓ ముప్పు లేకపోలేదు. ఈ యాప్‌ల వల్ల ఉగ్రవాదులు సోషల్ మీడియాలో జరిపే కార్యకలాపాలపై నిఘా పెట్టే అవకాశం ఉండదని భద్రతా వర్గాలు అంటున్నాయి. తాజాగా ఓ ఉగ్రవాది ఐఫోన్ అన్‌లాక్ వివాదంపై ఎఫ్‌బీఐ, యాపిల్ కంపెనీ ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. దీంతో పౌరుల ప్రైవసీ అంశంపై ఎడతెగని చర్చ కొనసాగుతూనే ఉంది.