PNV Prasad
-
వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శిగా విజయ సాయిరెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజయ సాయిరెడ్డి నియమితులయ్యారు. ఆయనకు గ్రామ కమిటీలు, యువత, మహిళ, విద్యార్థి, సామాజిక అనుసంధాన బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నియమించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ప్రధాన కార్యదర్శులు గొల్ల బాబూరావు, సుజయకృష్ణ రంగారావు(ఉత్తరాంధ్ర), ధర్మాన ప్రసాదరావు(తూర్పు, పశ్చిమగోదావరి), మోపిదేవి వెంకటరమణ(కృష్ణా, గుంటూరు), జంగా కృష్ణమూర్తి(చిత్తూరు, వైఎస్సార్), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(ప్రకాశం), భూమన కరుణాకర్‌రెడ్డి(అనంతపురం, కర్నూలు), పీఎన్వీ ప్రసాద్(పరిపాలన). కార్యదర్శులు మేడపాటి వెంకట్, రాజీవ్ కృష్ణ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తలశిల రఘురాం, జక్కంపూడి రాజా, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ముదునూరి ప్రసాద్ రాజు, అనిల్ యాదవ్, మేకతోటి సుచరిత, వై నాగిరెడ్డి. -
తొలి సంతకంలోనే మాట తప్పిన చంద్రబాబు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజం రైతుల రుణాలు మాఫీ చేయాలిగానీ కమిటీ ఎందుకు? ఇది రైతులను నిలువునా మోసం చేయడమే హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేస్తూ తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట తప్పారని, ప్రజలకు అబద్ధాలు చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ విమర్శించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు.. ఆ పని చేయకుండా విధివిధానాలంటూ కమిటీ వేయడంలోని ఔచిత్యమేంటని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రుణాలు మాఫీ అయి ఖరీఫ్ సీజన్లో కొత్తగా పంట రుణాలకోసం రైతులు ఎదురుచూస్తుంటే ఇలాంటి కుంటిసాకులు ఎందుకు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రుణాల మాఫీపై తొలి సంతకం అంటే కమిటీ నియామకంపై సంతకమా? అని ప్రశ్నిస్తూ.. ఇది రైతులను నిలువునా మోసం చేయడమేనని దుయ్యబట్టారు. ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజునే, తొలి సంతకంతోనే చంద్రబాబు నిజస్వరూపం బయట పడిందని, ఆయన్ను ప్రజలు నమ్మబోరని ప్రసాద్ అన్నారు. అధికారంలో ఉన్నపుడు ఒకమాట, లేనపుడు ఇంకొక మాట మాట్లాడే చంద్రబాబు తన నైజాన్ని మళ్లీ చాటుకున్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో బంగారం తాకట్టుతోసహా అన్ని రకాల రుణాలు రద్దు చేస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు తన ప్రసంగంలో ఆ ఊసే ఎత్తలేదని ఆయన తప్పుపట్టారు. -
అవసరం లేకున్నా రీపోలింగ్: వైసీపీ
-
వైఎస్ఆర్సిపి సమన్వయ కమిటీ
హైదరాబాద్: ఎన్నికలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడానికి వీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి అవసరమైన న్యాయ సలహాలు, ఇతరత్రా సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు పార్టీ కార్యాలయ సమన్వయ కర్త పిఎన్‌వి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విభాగంలో చల్లా మధుసూదన్‌రెడ్డి- (ఫోన్ నంబర్ 76800 22445), వై.నాగిరెడ్డి (76800 22446), ఎల్.శ్రీధర్ (76800 22447) జి.వి.సుధాకర్, నారాయణరెడ్డిలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. అలాగే పార్టీ కార్యాలయం ఫోన్: 040- 2360 7899, ఫాక్స్: 040- 2360 9191 లను కూడా సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.