poets summit
-
ఏప్రిల్ 10,11 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం
ఉగాది సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 10,11 తేదీలలో తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం-21ను ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని అంతర్జాల దృశ్య సమావేశం ద్వారా నిర్వహించనున్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు, 21 దేశాలలోని 21 సంస్థల అధ్యక్షులు పాల్గొంటారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ జి. చంద్రయ్య (తెలంగాణ మానవ హక్కు కమిషన్ చైర్మన్), విశిష్ట అతిథిగా బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కృతివెంటి శ్రీనివాసరావు (కేంద్ర సాహిత్య అకాడమి కార్యదర్శి) హాజరుకానున్నారు. 21 గంటలపాటు కొనసాగే ఈ కార్యకమ ముగింపు వేడకకు పద్మభూషణ్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, ప్రఖ్యాత రచయిత తనికెళ్ల భరణి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి, ఈనాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సబ్ఎడిటర్ విష్ణు జాస్తి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, మనతెలంగాణ ఎడిటోరియల్ అడ్వైజర్ గార శ్రీరామ మూర్తి హాజరవుతారు. -
గర్భంలోనే కత్తులు పెట్టుకొని పుట్టాలేమో?
ఒంగోలు టౌన్: ఆడపిల్ల బతకాలంటే తల్లి గర్భంలోనే కత్తులు పెట్టుకొని పుట్టాలి అన్నట్లుగా సమాజంలో ప్రస్తుత పరిస్థితులు ఉంటున్నాయని పలువురు కవులు వాపోయారు. ప్రజానాట్యమండలి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక ఎల్బీజీ భవన్లో ‘నన్ను బతకనివ్వరా’ అంటూ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కవితా గోష్ఠిని నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న దురాగతాలను కవులు, కవయిత్రులు తమ కవితల ద్వారా చదివి వినిపించారు. ప్రజానాట్యమండలి జిల్లా గౌరవాధ్యక్షుడు బీ దశర««ధ్ అధ్యక్షతన జరిగిన కవితా గోష్ఠిలో ప్రముఖ మహిళా కవి సింహాద్రి జ్యోతిర్మయి, నన్నపనేని రవి, కే లక్ష్మి, ఉన్నం జ్యోవాసు, ఎం. వెంకటఅప్పారావు, మూర్తి, ఎన్. రాధికారత్న, చింతపల్లి ఉదయజానకిలక్ష్మి, పాలూరి ప్రసాద్, కుర్రా ప్రసాద్, చాపల భాస్కర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి గదవల్ల బాలకృష్ణ, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర నాయకుడు ఉబ్బా కోటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్, నగర కార్యదర్శి కే చిన్నపరెడ్డి, డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండలో కవుల సమ్మేళనం
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ పట్టణం కేంద్రంలో కవుల సమ్మేళనం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో డ్వామా (జిల్లా నీటి యాజమాన్య సంస్థ) పీడీ (ప్రాజెక్ట్ డైరక్టర్) దామోదర్రెడ్డి పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు కవులను ఆయన సన్మానించారు. అంతేకాకుండా ఎన్టీ కాలేజీ అవరణలో తెలంగాణ యూత్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.