Policy change
-
ఇన్స్టాల్ చేసిన రోజు నుంచే వారంటీ
న్యూఢిల్లీ: వినియోగదారులు కొనుగోలు చేసిన ఉత్పత్తిని ఇన్స్టాల్ (ఏర్పాటు చేయడం/పనిచేయించడం) చేసిన రోజు నుంచే వారంటీని అమలు చేయాలని వైట్‌గూడ్స్ (కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు) తయారీ సంస్థలు, విక్రేతలను కేంద్రం కోరింది. అంతే కానీ కొనుగోలు చేసిన తేదీని వారంటీ/గ్యారంటీకి పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి వారంటీ విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి పరిశ్రమల సంఘాలు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, పీహెచ్‌డీసీసీఐ, శామ్సంగ్, ఎల్జీ, ప్యానాసోనిక్, బ్లూస్టార్, కెంట్, వర్ల్‌పూల్, వోల్టాస్, బాష్, హావెల్స్, ఫిలిప్స్, తోషిబా, డైకిన్, సోనీ, హిటాచి, ఐఎఫ్బీ, గోద్రేజ్, హయర్, యూరేకా ఫోర్బ్స్, లైడ్ సంస్థలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ లేఖ రాశారు. ఉత్పత్తిని వినియోగించని కాలానికి వారంటీని అమలు చేయడం అనుచిత వాణిజ్య విధానంగా ‘వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019’ స్పష్టం చేస్తున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. పండుగల సీజన్లో పెద్ద ఎత్తున అమ్మకాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ విషయమై ప్రధానమంత్రి సందేశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
హెచ్1బీ వీసా సమస్యలు పరిష్కరిస్తాం
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ టెక్కీలు అత్యధికంగా వినియోగించే హెచ్–1బీ తదితర వీసాలపై గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన త్రీ పాలసీ మెమొస్ విధానం కారణంగా ఏర్పడిన ప్రతికూలతను పరిష్కరిస్తామని జో బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేసినప్పటికీ దాని వల్ల ఏర్పడిన వ్యతిరేక ప్రభావాల్ని సవరించే అంశాలను పునఃపరిశీలిస్తామని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం ప్రకటించింది. జో బైడెన్ ప్రభుత్వ నిర్ణయంతో భారత్ సహా విదేశీ టెక్కీలకు భారీగా ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో విధిం చిన ఆంక్షలతో భారతీయ వృత్తి నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసా చెల్లుబాటు కాలం, యాజమాన్యానికి, ఉద్యోగులకి మధ్య ఉన్న సంబంధాలు, విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఆంక్షలు విధించింది. విదేశీయులకు కనీస వేతనం అమలు వాయిదా హెచ్1–బీ వీసా వినియోగదారులకు కూడా అమెరికన్లతో సమానంగా అధిక వేతనాన్ని చెల్లించాలంటూ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయం అమలును బైడెన్ సర్కార్ మే 14వరకు వాయిదా వేసింది. తక్కువ వేతనానికి భారతీయులు సహా ఇతర విదేశీయుల్ని పనిలోకి తీసుకోవడం వల్ల అమెరికన్లకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయన్న ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. అయితే బైడెన్ నిర్ణయం అమలును వాయిదా వేయడంతో భారతీయ టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. -
పింఛన్ ఠంఛన్‌గా అందేనా?
గజపతినగరం: పాత సీసాలో కొత్త సారాలా ఉంది పింఛన్ల పంపిణీ విధానం మార్పు పరిస్థితి! పోస్టాఫీసుల ద్వారా సామాజిక పింఛన్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం దీనికి తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు లేకుండా పోస్టాఫీసులకు బదలాయిస్తోంది. జిల్లాలో ఎంతో మంది సిబ్బంది, అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డేటా ఎంట్రీ సిబ్బంది పనిచేస్తున్నప్పటికీ పింఛన్ల పంపిణీలో నిత్యం సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనీస సౌకర్యాలు కానీ, వసతులు, సిబ్బంది కానీ లేని పోస్టాఫీసులకు ఈ భారీ కార్యక్రమాన్ని అప్పగించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.41లక్షల పింఛన్ల పంపిణీని ఇక నుంచి పోస్టల్ శాఖ చేస్తుందని సెర్ఫ్ కార్యదర్శి హెచ్ అరుణ్‌కుమార్, జిల్లా మంత్రి కిమిడి మృణాళినితో పాటు కలెక్టర్ కూడా ప్రకటించి సిబ్బందికి అప్పగించేశారు. జిల్లాలో 921 పంచాయతీలుండగా వీటి పరిధిలో కేవలం 600 పోస్టల్ కార్యాలయాలున్నాయి. ఇందులో సబ్ పోస్టు కార్యాలయాలతో పాటు బ్రాంచి కార్యాలయాలు, హెడ్‌పోస్టాఫీసులున్నాయి. అయితే జిల్లాలో బ్రాంచి పోస్టాఫీసులే ఎక్కువ. వాటిలో సిబ్బంది చాలా తక్కువ ఉంటారు. అలాగే ఇరుకైన అద్దెగదుల్లో ఈ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలు చాలా తక్కువ! ఇటువంటి కార్యాలయాల్లో పింఛన్ల పంపిణీ ఎలా చేస్తారని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సిబ్బందికి పింఛన్ల పంపిణీపై కనీసం అవగాహన లేదు. ఎంతో అనుభవం ఉన్న జిల్లా యంత్రాంగం పింఛన్ల పంపిణీకి తలమునకలై నానా అగచాట్లూ పడిన సందర్భాలున్నాయి.ప్రస్తుతం 19 మండలాల్లో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ అవుతున్నప్పటికీ ఎక్కువగా పోస్టాఫీసులు లేని చోట్ల సీఎస్పీల ద్వారా పంపిణీ చేసేవారు. జిల్లావ్యాప్తంగా ఉన్న దాదాపు 400 మంది సీఎస్పీలను ఇటీవలే తొలగించిన యంత్రాంగం వారికి వేతనాలు కూడా ఇవ్వలేదు. అలాగే ఇంకా బయోమెట్రిక్ ప్రింట్లు పింఛనర్ల నుంచి ఇప్పటికీ తీసుకోవట్లేదు. దీంతో బయోమెట్రిక్ ద్వారా పంపిణీ ఎలా సాధ్యమన్న విషయం అధికారులకే తెలియాలి. ఇందుకోసం జిల్లాలో జనవరిలో మాన్యువల్‌గా కొన్నిచోట్ల పింఛన్లు పంపిణీ చేసి వచ్చే ఫిబ్రవరి నుంచి అన్ని పింఛన్లనూ బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయంలో సడలింపు ఇచ్చారు. దేశంలోనే అత్యంత పెద్ద నెట్వర్క్ కలిగిన భారత తపాలాశాఖ తమ కార్యాలయాలకు మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం బాగా వెనక బడింది. ఇటీవల ఉపాధి కూలీల వేతనాల చెల్లింపు తప్ప పెద్దగా పనుల్లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు వెనుకాడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసులను బ్రాంచ్ పోస్టాఫీసులుగా మార్చారు. ఇవి సబ్ పోస్టాఫీస్ కంట్రోల్లో ఉంటాయి. బ్రాంచ్ పోస్టాఫీస్ పని3గంటలు మాత్రమే.అయితే ఇప్పు డు పింఛన్ల పేమెంట్ బయోమెట్రిక్ పద్ధతిలో జరుపుతారు. పీఓటీడీ(పాయింట్ ఆఫ్ ట్రాంజాక్షన్ డివైస్) మిషన్లద్వారా పింఛనుదారుల వేలిముద్రలను తీసుకుని పేమెంట్ చేయాలి. ఈ విధంగా ఆయితే 3గంటల సమయంలో ఎంత మందికి పింఛన్ల పంపిణీ జరుగుతుందనేది ప్రశ్న. దీనికి తోడు గ్రామా ల్లో విపరీతంగా కరెంట్ కోతలు ఉన్నాయి. మిషన్లు చార్జింగ్లేకపోతే అవి మొరాయిం చే పరిస్థితి ఉంది. ఇక సబ్ పోస్టాఫీసుల్లో సాధారణ లావాదేవీలతో పాటు ఈపిం ఛన్ల పంపిణీ చేయాలంటే కష్టసాధ్యమే. చాలా గ్రామాల్లో సిగ్నల్స్ సరిగ్గా ఉండ వు. దీని కోసం సిగ్నల్ ఉన్న చోటుకు పీఓటీడీని తీసుకువెళ్లాలి. అక్కడికే వృద్ధు లు, వికలాంగులు రావాల్సి ఉంటుంది. వీటిని అధిగమించి తపాలాశాఖ విజయవంతంగా ఈ పింఛన్లను సక్రమంగా పంపిణీ చేస్తుందో లేక పిం ఛనుదారులను ఇబ్బందులకు గురిచేస్తుందో మరికొద్ది రోజుల్లో స్పష్టం కానుంది.