poor family .
-
అమ్మా.. నేనూ బడికి పోతా!
సాక్షి, హిందూపురం: ‘అమ్మా... నేనూ బడికి పోతానమ్మా.. నాన్నకు చెప్పు.. నన్ను బడికి పిలుచుకెళ్లమని’ అంటూ ప్రాధేయపడుతున్న ఆ బాలుడి మాటలు విన్న కన్నతల్లికి కంట నీరు ఆగలేదు. అందరిలా తాను కూడా ఆడుకోవాలని, చదువుకోవాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్న కుమారుడిని చూస్తూ నిరుపేద తల్లిదండ్రులు అసహాయ స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు. ఏం జరిగింది?.. హిందూపురంలోని మేళాపురం ప్రాంతానికి చెందిన షేక్ రఫీక్, నూర్జహాన్ దంపతుల ఏకైక కుమారుడు హర్షాద్ ఏడో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం ఇంటిపైన కోతులు చేరుకుని అపరిశుభ్రం చేస్తున్నాయంటూ వాటిని అదిలించేందుకు కర్ర తీసుకుని మిద్దెపైకి హర్షాద్ వెళ్లాడు. ఆ సమయంలో కోతులను అదలిస్తూ ఇంటి పైభాగంలో వెళుతున్న హైటెన్షన్ (33కేవీ) విద్యుత్ వైర్ల ప్రభావం కారణంగా షాక్‌కు గురయ్యాడు. దీంతో మెడ నుంచి కుడి వైపు శరీరం మొత్తం కాలిపోయింది. ఉన్నదంతా అమ్మి.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రఫీక్ పెద్ద ఆస్తి పరుడేమీ కాదు. వృత్తిలో భాగంగా వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అడపాదడపా కొంత మొత్తం పొదుపు చేసుకున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురైన కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వైద్య చికిత్సకు పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు ఉన్న కొద్దిపాటి బంగారు నగలూ కర్పూరంలా కరిగిపోయాయి. దాదాపు రూ. 5లక్షలకు పైగా ఖర్చు పెట్టి కుమారుడి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే మెడ నుంచి నడుము వరకూ కుడివైపు శరీరం పూర్తిగా కాలిపోయి ముడతలు పడింది. కుడి చేతిలోని నాలుగు వేళ్లూ తొలగించారు. శరీరంలో నీటి శాతం తగ్గింది. గొంతు వద్ద నరాలు గట్టిపడ్డాయి. శరీరంలో రక్తప్రసరణతో పాటు నరాల వ్యవస్థ మెరుగు పడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారు. ఇందు కోసం రూ. 30 లక్షల వరకూ ఖర్చు వస్తుందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇప్పటికే వారానికి ఒకసారి బెంగళూరుకు చికిత్స కోసం వెళ్లి వచ్చేందుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ ఖర్చు వస్తోంది. ఈ క్రమంలో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తం సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమవుతోందని, ఎవరైనా మానవతావాదులు స్పందించి తమ బిడ్డను మామూలు మనిషిని చేయాలని వేడుకుంటున్నారు. దాతలు సాయం చేయదలిస్తే... పేరు: షేక్ మహమ్మద్ రఫీక్ బ్యాంక్ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నంబర్ : 3878 101 6511 ఐఎఫ్ఎస్సీ కోడ్ : టఆఐN 0004696 ఫోన్ పే నంబర్ : 76709 34214 (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
విశాఖలో వివాహితకు, దంపతులకు సీఎం జగన్ భరోసా
-
CM YS Jagan: కాన్వాయ్ ఆపి.. గోడు విని..
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం నగరానికి వచ్చిన ఆయన.. సిరిపురం ఏయూ కాన్వొకేషన్ హాల్లో జరిగిన మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి మ.1.10 గంటలకు విమానాశ్రయానికి బయల్దేరారు. కాన్వాయ్ సిరిపురం జంక్షన్ దాటుతుండగా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు చంటిపిల్లలతో ముందుకు వచ్చి.. జగనన్నా, జగనన్నా అంటూ బిగ్గరగా అరిచారు. వెంటనే సీఎం జగన్ తన కాన్వాయ్‌ని ఆపి బయటకు దిగి వారిని రమ్మని పిలిచారు. వారంతా సీఎం వద్దకు చేరుకున్నారు. తన పేరు ధర్మాల త్రివేణి అని.. తన భర్త అప్పలరెడ్డిని నెలన్నర క్రితం పెదవాల్తేరులో రూ.500 కోసం చంపేశారని.. పెద్ద దిక్కు కోల్పోయామన్నారు. పిల్లలతో కుటుంబ పోషణ కష్టమవుతోందని.. ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. సీఎం దానిని తీసుకుని తప్పనిసరిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తమ విన్నపాన్ని సానుకూలంగా విన్నారంటూ వారు ఉద్వేగానికి లోనయ్యారు. చిన్నారులకు వైద్యంపై కలెక్టర్‌కు ఆదేశం అదే సమయంలో.. శ్రీకాకుళం జిల్లా డీఆర్ వలస గ్రామానికి చెందిన కూలీలు పాండ్రంగి రామారావు, సుబ్బలక్ష్మి దంపతులు కూడా తమ ఇద్దరి కుమారుల కష్టాన్నీ సీఎంకు విన్నవించుకున్నారు. వారిద్దరూ సికిల్‌సెల్ థలసేమియాతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీంతో సీఎం జగన్ స్పందిస్తూ.. చిన్నారులకు సరైన వైద్యం చేయించాలంటూ అక్కడికక్కడే కలెక్టర్‌ను ఆదేశించారు. ఇది కూడా చదవండి: బాబు ‘అప్పు’డే లెక్క తప్పారు -
భళా.. బాల కార్మికా
‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయంచేసే చేతులు మిన్న’.. ఓ అధికారి ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆ యువకులను ఉన్నతస్థాయికి చేర్చింది. జిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న బాలకార్మికులకు ఒక అధికారి ఇచ్చిన చేయూత వారి జీవితాలను మార్చేసింది. ఒకరు డాక్టరు అయితే మరో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా.. ఇంకొకరు íసీఏ ఫైనల్ చదువుతున్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన ఈ పేద విద్యార్థుల విజయగాథ ఏమిటంటే.. బీవీ రాఘవరెడ్డి 1998లో కర్నూలుకు చెందిన నిరుపేద తల్లిదండ్రులు తమ కుమారుడు శివప్రసాద్‌ను 8వ తరగతిలోనే చదువు మాన్పించి స్థానిక జిన్నింగ్ మిల్లులో సంచులు కుట్టే పనిలో పెట్టారు. తనిఖీ నిమిత్తం ఆ మిల్లుకు వెళ్లిన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి ఆ కుర్రాడితో కాసేపు మాట్లాడాక అతనికి చదువుపై ఉన్న ఇష్టాన్ని గుర్తించారు. శివప్రసాద్ తండ్రిని ఒప్పించి.. తానే స్కూలులో చేర్పించి ఆర్థికసాయం అందిస్తూ వచ్చాడు. టెన్త్, ఇంటర్లో మంచి మార్కులు సంపాదించిన శివప్రసాద్ ఆ తర్వాత మెడిసిన్ సీటు సాధించాడు. అనంతరం జనరల్ మెడిసిన్‌లో పీజీ, క్లినికల్ ఆంకాలజీలో స్పెషలైజేషన్ చేసి ఇప్పుడు కర్నూలు విశ్వభారతి మెడికల్ కళాశాలలో మెడికల్ ఆంకాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన జనార్థన్దీ ఇలాంటి కథే. చదువుకుంటూనే జిన్నింగు మిల్లులో పనికి వెళ్తున్న ఆ కుర్రాణ్ణి శివకుమార్‌రెడ్డి చేరదీసి ఇంటర్లో చేర్పించారు. ఆ తర్వాత ఇంజనీరింగ్‌లో సీటొచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని కోర్సు పూర్తయ్యాక ఫోన్‌పేలో ఉద్యోగం సంపాదించాడు. ఇక ఏటుకూరుకు చెందిన యలవర్తి శివకుమార్ కూడా వీరిలాగే గుంటూరులోనే బాలకార్మికుడిగా పనిచేస్తుండగా శివకుమార్‌రెడ్డికి తారసపడ్డాడు. అతనికి చదువుపై ఆసక్తి ఉందని తెలిసి సీఏ ఇంటర్లో చేర్పించారు. అతను ఇప్పుడు సీఏ ఫైనల్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. శివకుమార్ అన్న విజయకుమార్‌కు సైతం చేయూతనివ్వటంతో అతనూ ఫీజు రీయింబర్స్‌మెంటుతో బీటెక్ పూర్తిచేసి టీసీఎస్‌లో రూ.22 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. పేద పిల్లల చదువుకు చేయూత వివిధ కారణాలతో కొందరు పిల్లలు చిన్న వయసులోనే చదువుకు దూరమవుతున్నారు. నా విధి నిర్వహణలో భాగంగా ఫ్యాక్టరీల్లో బాల కార్మికులను గుర్తించి వారిని ఇంటికి పంపడంతో సరిపెట్టకుండా చదువు వైపు మళ్లిస్తున్నాను. నాలుగు కుటుంబాల్లో వెలుగు రావటం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అదే స్ఫూర్తితో నంద్యాలలోని నా చిన్ననాటి స్నేహితులతో కలిసి ‘ఆపద్బంధు సేవాసమితి’ని ప్రారంభించి పేద పిల్లల చదువుకు చేయూతనిస్తున్నాం. – ఎంవీ శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విజయ్‌కుమార్‌కు వచ్చిన టీసీఎస్ ఆఫర్ లెటర్ నేను సైతం.. నేను టెన్త్ చదువుతున్నప్పుడు గుంటూరులోనే ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేసేవాడ్ని. అప్పుడు తనిఖీకొచ్చిన ఇన్స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి నన్ను ప్రోత్సహించి సాయంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు తోడ్పాటుతో ఇంజనీరింగ్ పూర్తిచేశా. ప్రస్తుతం ఫోన్‌పేలో పనిచేస్తున్నాను. సార్ చూపిన బాటలో విద్యార్థులకు సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. – గుంజి జనార్థన్‌రావు, బిజినెస్ డెవలెప్మెంట్ అసోసియేట్, ఫోన్‌పే ఆ స్ఫూర్తి మరువలేనిది.. పేద కుటుంబం కావటంతో చదువుకుంటూనే జిన్నింగు మిల్లులో పనిచేసేవాణ్ని. 2008లో సార్ తనిఖీకి వచ్చినపుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. పనిమానేసి చదువుపై శ్రద్ధపెట్టాలని చెప్పి ఆర్థికసాయం చేశారు. టెన్త్‌లో మంచి మార్కులొస్తే కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ ఘటన మర్చిపోలేను. నేను ఈస్థాయికి చేరుకోవడానికి సార్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. – యలవర్తి శివకుమార్, సీఏ ఫైనల్ -
అన్నార్తులకు అండగా..
పుత్తూరు: తాను పేద కుటుంబానికి చెందిన వాడే అయినా.. నిర్భాగ్యుల ఆకలి తీరుస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు సచివాలయ వలంటీర్ బాలాజీ. వీఎస్ఎస్ పురం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన వేలాయుధం, లక్ష్మీకాంతమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు బాలాజీ. తల్లిదండ్రులు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బాలాజీ ఇంటర్ చదువుతుండగానే తండ్రి వేలాయుధం మరణించాడు. అప్పటినుంచి తల్లి కూలి పనులు చేస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించింది. తల్లికి చేయూతగా ఉండాలన్న ఉద్దేశంతో బాలాజీ క్యాటరింగ్ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఊళ్లోనే వలంటీర్‌గా అతడికి అవకాశం లభించింది. ఓ వైపు గ్రామస్తులకు ‘సచివాలయ’ సేవలు అందిస్తూనే.. మరోవైపు రాత్రి వేళల్లో క్యాటరింగ్ పనులతోపాటు వాటర్ ఫ్యూరిఫైయర్ యంత్రాల మరమ్మతులు, ఎలక్ట్రీషియన్‌గా చిన్నపాటి పనులు చేసుకుంటూ అమ్మకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఆకలి బాధలు దూరం చేస్తూ.. యాచకులు.. అనాథలు.. నిరుపేదలను ఆకలి బాధలను గమనించిన బాలాజీ వారికి అందించాలన్న తపనతో ‘సేవామిత్ర రూరల్ ఫౌండేషన్’ పేరుతో గత ఏడాది మార్చిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. వారికి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించాలని నిశ్చయించుకున్నాడు. రోజూ 30 నుంచి 40 మందికి అన్నదానం చేస్తూ వచ్చాడు. అలా ప్రారంభమైన ఈ యజ్ఞం నేటికి 370 రోజులకు పైగా నిరాటంకంగా కొనసాగుతోంది. అలాగే కరోనా కాలంలో గొల్లపల్లె, వీఎస్ఎస్ పురం, టీఆర్ కండ్రిగ, తడుకు ప్రాంతాల్లోని నిరుపేద గిరిజన కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, వంట సామగ్రిని అందించాడు. బాలాజీ ప్రతినెలా తనకు అందే గౌరవ వేతనం రూ.5 వేలను సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాడు. గత ఏడాది ప్రభుత్వం వలంటీర్ల సేవలకు కానుకగా సేవామిత్ర అవార్డుతో పాటు అందించిన రూ.10 వేలను, ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం అందించిన రూ.10 వేలు సైతం సేవా కార్యక్రమాలకే వినియోగించాడు. అతడి సేవలు స్థానికంగా అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ఆకలి చావును ప్రత్యక్షంగా చూశా నిరుపేద కుటుంబంలో పుట్టాను. పేదరికం చూశాను. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. అన్నం కోసం కల్యాణ మండపాల వద్ద ఎగబడే వారిని చూశాను. తిరుచానూరులో ఆకలి చావు చూశాను. అప్పుడే పదిమందికీ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మను పోషించుకుంటునే రోజూ నా సాయం కోసం ఎదురు చూసే 30 నుంచి 40 మంది యాచకులకు అన్నం పొట్లాలు అందిస్తున్నాను. – బాలాజీ, వలంటీర్, వీఎస్ఎస్ పురం, తడుకు పంచాయతీ -
"ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో
పశ్చిమబెంగాల్: ఇటీవల కాలంలో మతాల పేర్లుతో కోట్లాడుకోవడాలు చూసి ఉంటాం. అలాగే మాట వరసకు ఏదైనా చిన్న మాట అంటే చాలు మా మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఘర్షణకి దిగిపోతారు. అంతేందుకు ఒక ప్రాంతం లేదా గల్లీ మొత్తం ఒక మతంగా నివశిస్తారు. కానీ వాటిన్నింటకి విరుద్ధంగా ఒక ముస్లీం కుటుంబం హిందూ దేవుళ్ల విగ్రహాలను తయారు చేయడమే కాక అన్ని మతాలు ఒకటే భావనను కలిగిస్తున్నారు. (చదవండి: సార్ నా గర్ల్‌ఫ్రెండ్ సాక్స్ ఉతక లేదు.... కాబట్టి ఆఫీస్‌కి రాలేను) అసలు విషయంలోకి వెళ్లితే....పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్‌లో దాస్పూర్ గ్రామంలోనే ఇస్మాయిల్ కుటుంబం నలభై సంవత్సారాలుగా నివాసం ఉంటున్నారు. ఈ 61 ఏళ్ల ఇస్మాయిల్ వృత్తి రీత్యా విగ్రహాలు తయారు చేస్తాడు. అందులోనూ కాళీ విగ్రహాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. అక్కడున్న గ్రామస్తులకు కాళివిగ్రహాలు కావాలంటే ఇస్మాయిల్కే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఈ కాళిమాత విగ్రహాలను అతని భార్య , ఐదుగురు కుమార్తెలు కలిసి తయారు చేస్తారు. పైగా ఇస్మాయిల్‌కి తన తన కూతుళ్లను చదివించడం తనకు భారమే అయినప్పటికీ నా పిల్లలకి "ఈశ్వర్" "అల్లా" అనే ఇద్దరి దేవుళ్ల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి వాళ్లు బాగా చదువుకుని మంచి జీవితాన్ని గడుపుతారని నమ్మకంగా చెబుతాడు. ఈ మేరకు ఇస్మాయిల్ మాట్లాడుతూ..." “నేను చిన్నప్పటి నుండి ఇదే చేస్తున్నాను. మా ఊరి గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల నుండి సైతం ప్రజలు విగ్రహాల కోసం నా వద్దకే వస్తారు. నేను పేదవాడిని కానీ అందరి దీవెనలతో నా కుటుంబాన్ని చక్కగా నడపగలుగుతున్నాను. అంతేకాదు నాకు విగ్రహాలు సిద్ధమైనప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది." అని అన్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని బీరేంద్ర రాయ్ అనే స్థానికుడు మాట్లాడుతూ....ఈ గ్రామంలోని ప్రతి హిందువు దేవతా విగ్రహన్ని ఇస్మాయిల్ తయారు చేస్తాడు. ఇది మాకు కొత్తేమి కాదు. అయినా మనమందరం కలిసి పెరిగాం, కలిసి ఉంటున్నాం, ఇదే మన సంస్కృతి" అని అన్నాడు. కానీ ఈ చిన్న గ్రామం నిజంగా మత సామరస్యాంగా ఎలా జీవించాలో ఎలా కొనసాగించాలో ఐక్యతగా జీవిస్తూ చూపించింది. ఈ మేరకు ఇస్మాయిల్ ప్రజలు ఐక్యత గురించి తెలుసుకునేలా ప్రపంచంలో ఇలాంటి దస్పూర్ గ్రామాలు మరిన్ని ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నాడు. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) -
పేద కుటుంబానికి ఉచిత రేషన్
గాజువాక: ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో ఓ పేద కుటుంబానికి ఉచిత రేషన్ సరుకులు అందాయి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులే ఆ పేద కుటుంబం ఇంటికెళ్లి మరీ సోమవారం సరుకులను అందించారు. వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నం జిల్లా గాజువాక కొండ ప్రాంతంలో ముగ్గురు పిల్లలతో తాను పేదరికంలో మగ్గుతున్నానని పెంటయ్యనగర్‌కు చెందిన బొడ్డటి పూజ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. తాపీ మేస్త్రి వద్ద కూలీగా పనిచేస్తున్న తన భర్తకు లాక్డౌన్ కారణంగా పనులు దొరకడం లేదని, దీంతో ఆకలిబాధలు తప్పడం లేదని లేఖలో పేర్కొంది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం కార్యాలయ అధికారులు ఆ కుటుంబానికి ఉచిత రేషన్ సరుకులు అందజేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)ని ఆదేశించారు. జేసీ ఆదేశాలతో తక్షణం స్పందించిన పౌర సరఫరాల శాఖ సహాయ పంపిణీ అధికారి పి.వి.రమణ, గాజువాక తహసీల్దార్ చిన్నికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది స్వయంగా ఉచిత రేషన్ సరుకులను ఆమె ఇంటికి తీసుకెళ్లి అందజేశారు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర కిలో పంచదారను అందజేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పూజ సీఎం కార్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. -
చినుకు పడితే కునుకు లేనట్టే..
చిత్తూరు, రేణిగుంట: ‘అది రేణిగుంట మండలం కృష్ణాపురం ఎస్టీ కాలనీ. అందులో చిన్నగాలికే ఎగిరిపోయిన పైకప్పు ఉన్న ఓ పూరిపాక.. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో చినుకు బయటపడితే ఒట్టు... అందులో మునె మ్మ, సుబ్రమణ్యం దంపతులు విరిగి పోయి అతుకుల బొంతను తలపించే ఓ మంచంపై కూర్చుని తడుస్తూనే ఉన్నారు. కంటి మీద కునుకు లేకుండా పస్తులతో మంచానికి అతుక్కుపోయి కనిపించారు. వీరొక్కరే కాదు... కాలనీ లోని అధికశాతం మంది పరిస్థితి ఇదే స్థాయిలో కనిపిస్తోంది. గుడిసెలు లేని నవ్యాంధ్రను నిర్మిస్తానని చెప్పుకునే పా లకులకు వీరి దుర్గతి ఓ చెంపపెట్టు.’ వానొస్తే రైతులకు ఆనందమే కానీ తమకు మాత్రం భయాందోళన కలుగుతుందని వీరు చెప్పుకొస్తున్నారు. పేదరికంలో పుట్టడమే పాపంగా జీవితాంతం కష్టాలను అనుభవిస్తున్నామని బో రుమంటున్నారు. చిన్నపాటి ఇల్లు కట్టుకుందామని ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించున్న వారే లేరని ఆవేదన చెందారు. ఓట్లు వేసుకునేందుకు వచ్చే నాయకులు కష్టసమయాల్లో కనిపించరని వాపోయారు. పలుకుబడి, అధికా రులకు ఇచ్చుకునేంత డబ్బు తమ వద్ద లేకపోవడం వల్లే తమ అర్జీలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బతుకుల్లోకి తొంగిచూస్తే కష్టాల కడలి లోతెంతో తెలుస్తుందన్నారు. -
నిరుపేద గూటిలో పరుగుల ధీరుడు
కర్ణాటక, చెళ్లకెరె రూరల్: చెళ్లకెరె తాలూకాలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈ.నాగరాజ్ అనే యువకుడు పేద కుటుంబంలో జన్మించినా ఆటల్లో మేటి. పరుగు పందెంలో రాణించి తాలూకాకు, జిల్లాకు, రాష్ట్రానికే పేరుప్రతిష్టలు సంపాదించాడు. నాగరాజ్ కుటుంబానికి చిన్న పూరి గుడిసే ఆధారం. చిన్న వయస్సు నుంచి పేదరికాన్ని అధిగమించి క్రీడా రంగంలో ఆసక్తి పెంచుకున్నాడు. నేపాల్‌లో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో 5 కిలోమీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని అందుకుని గ్రామీణ ప్రాంత యువతలో ఉత్సాహాన్ని నింపాడు. అతడు ఇప్పుడు నేపాల్‌లో ఆటలపోటీల్లో ఉన్నాడు. చినిగిన చెప్పులతో ఎయిర్‌పోర్టుకు నేపాల్‌కు వెళ్లడానికి చిత్రదుర్గం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చినిగి పోయిన చెప్పులతోనే నాగరాజు వెళ్లాడు. దీనిని గమనించిన తమ గ్రామానికి చెందిన న్యాయవాది అశోక్ నాగరాజ్‌కు షూ ఇప్పించాడు. గతనెల 26న నేపాల్ వెళ్లి రావడానికి స్నేహితులు, ఇతరులు రూ.2 వేలు ధనసహాయం చేశారు. అక్కడ గత నెల 29వ తేదీన జరిగిన అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో 24 దేశాల క్రీడాకారులను వెనక్కి నెట్టి ప్రథమ స్థానం సాధించాడు. పేద విద్యార్థి సాధనను తెలుసుకున్న నేపాల్ సైన్యం కూడా అభినందనలు తెలిపింది. చిత్రదుర్గ ప్రభుత్వం కళాశాలలో బీఏ చదువుకున్న నాగరాజు బీసీఎం హాస్టల్లో ఉండి డిగ్రీ చదువుతున్నాడు. చదువుకుంటూ కూలి పని తాలూకాలోని ఓబళాపుర గ్రామ పంచాయితీలోని పాతప్పనగుడి గ్రామానికి చెందిన ఈరణ్ణ, చంద్రమ్మ దంపతుల కుమారుడు నాగరాజ్. గతంలో గోవాలో జరిగిన రాష్ట్రస్థాయి నాలుగవ అఖిల భారత చాంపియన్ షిప్లో పాల్గొని 10 వేల మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో బంగారు పతకం కొట్టేశాడు. నాగరాజ్ తన చదువులు, ఖర్చుల కోసం తల్లిదండ్రుల కష్టం మీద ఆధారపడక, శని, ఆదివారాలలో కళ్యాణ మంటపాల్లో జరిగే వేడుకల్లో భోజనాలు వడ్డించే పని చేస్తాడు. ఆ డబ్బులో కొంత తల్లిదండ్రులకూ పంపుతాడు. మంగళవారం నేపాల్ నుంచి బెంగళూరులో దిగి, అటు నుంచి చెళ్లకెరెకు వస్తున్న నాగరాజ్‌కు స్థానిక ఎమ్మెల్యే టి.రఘుమూర్తి స్వాగతం పలికి సన్మానిస్తానని తెలిపారు. -
కష్టాలకే కన్నీళ్లొచ్చె!
ఆటపాటలతో తోటి యువకుల మధ్య సరదాగా గడపాల్సిన వారికి నాలుగు గోడలే ప్రపంచమయ్యాయి. అందరిలాగా ఉన్నత చదువులు చదవాల్సిన వారు మంచానికే పరిమితమయ్యారు. రెండు పదుల వయసు దాటినా అమ్మ చేతిముద్ద లేకపోతే ఆ రోజు కడుపు నిండని దుస్థితి. కనీసం సొంతంగా కాలకృత్యాలు కూడా తీర్చకోలేని దయనీయ పరిస్థితి. ఇలాంటి ఇద్దరి పిల్లలను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఆ తల్లికి భర్త మృతి కోలుకోలేని దెబ్బ. ఈక్రమంలో తల్లిదండ్రులకు వద్దకు చేరినా అక్కడా కష్టాలే ఆహ్వానం పలికాయి. ఆమె దయనీయ పరిస్థితికి కష్టాలకు కూడా కన్నీళ్లొస్తున్నాయి.. తుగ్గలి(కర్నూలు): విధి పగపట్టడం అంటే ఇదేనేమో.. పుట్టిన ఇద్దరు పిల్లలు మానసిక వికలాంగులు కావడం, పెళ్లయిన కొన్నేళ్లకే భర్త మృతి.. ఆ ఇల్లాలని కష్టాల్లోకి నెట్టాయి. దీనికి తోడు తల్లిదండ్రుల అనారోగ్యం, కడు పేదరికం ఆమెను దయనీయ స్థితికి చేర్చాయి. వివరాల్లోకెళితే.. మండలంలో గిరిగెట్ల గ్రామానికి చెందిన రసూల్‌బీ, రాజాసాహెబ్ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కూతురు ఇమాంబీని 25 ఏళ్ల క్రితం డోన్‌కు చెందిన ఖలీల్‌తో వివాహం జరిపించారు. వీరికి ఖాదర్‌బాషా(23), చాంద్‌బాషా(21) ఉన్నారు. వీరికి పుట్టుకతో నరాల బలహీనత, మానసిక వికలత్వం ఉంది. ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉంటారు. ఆకలేస్తే అన్నం పెట్టమని ఆడగలేని దుస్థితి వీరి అవసరాలన్నీ తల్లి చూసుకోవాల్సిందే. వీరిని ఎలాగైనా బాగు చేసుకోవాలని కర్నూలు, తిరుపతి, పుట్టపర్తి, బళ్లారి, మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలు ఖర్చు పెట్టినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో పెళ్లయిన ఐదేళ్లకే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో తల్లిదండ్రుల వద్దకు చేరింది. చుట్టుమట్టిన కష్టాలు కష్టాలకు కుంగిపోకుండా పుట్టిన పిల్లలతో ఎలాగైనా బతకాలని ఆత్మస్థైర్యంతో ముందుకుసాగింది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకున్నా కూలీనాలీ చేసుకుంటూ కుమారులను పోషించింది. తల్లి దగ్గర పిల్లలను ఉంచి తండ్రితో పాటు కూలీ పనులకు వెళ్లేది. అయితే 6 నెలల క్రితం తల్లి రసూల్‌బీ పక్షవాతానికి గురై లేవలేని స్థితికి చేరుకుంది. కష్టాలు చాలవన్నట్లు రెండు నెలల క్రితం తండ్రి రాజాసాహెబ్ కూడా కింద పడి కాలు విరిగింది. కష్టాల మీద కష్టాలు రావడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈక్రమంలో పనులు మానేసి ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలతో పాటు తల్లిదండ్రులను బాగోగులు చూసుకుంటోంది. దాతలూ స్పందించండి.. ఇమాంబీ, పిల్లలకు వచ్చే పింఛన్ సొమ్ము వారికి వైద్యానికే సరిపోవడం లేదు. రేషన్ బియ్యం, అక్కడక్కడ కొంత అప్పు చేస్తూ బతుకు బండిని నడిపిస్తోంది. దాతలు స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. సాయం చేయాల్సి వారు ‘ఇమాంబీ షేక్– 91067294654–4(ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు– తుగ్గలి)లో నగదు జమ చేయాలని లేదా 8499067538 నంబరుకు ఫోన్ చేయాలని వేడుకుంటోంది. -
రాజీవ్‌కాలనీలో ఉద్రిక్తత
కంచరపాలెం(విశాఖ ఉత్తర): జీవీఎంసీ 43వ వార్డు కంచరపాలెం పరిధి రాజీవ్‌కాలనీ వద్ద మంగళవారం వేకువజామున తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు రేకుల షెడ్లు తొలగించేందుకు యత్నించగా స్థానిక నివాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. జేసీబీతో ఇళ్లు తొలగిస్తున్న సమయంలో వాహనాలను తమపై నుంచి పోనివ్వాలని బైఠాయించారు. అయినప్పటికీ అధికారులు వెనక్కు తగ్గలేదు. రంగంలోకి దిగిన కంచరపాలెం, ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు బాధితులను చెదరగొట్టారు. ఇళ్ల తొలగింపును అడ్డుకునే క్రమంలో ఓ మహిళకు ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు హుటాహుటిన అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... రాజీవ్‌కాలనీ ప్రాంతంలో ఉన్న సుమారు నాలుగు ఎకరాల రైల్వే స్థలంలో 275 కుటుంబాల వారు సిమెంటు రేకుల షెడ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. మురికివాడల అభివృద్ధిలో భాగంగా కాలనీలోని నివాసితులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. కాలనీ స్థలం రైల్వేకు సంబంధించినది కావడంతో స్థల మార్పిడిలో భాగంగా రాజీవ్‌కాలనీలో నివాసం ఉంటున్న సుమారు 65మందికి కొమ్మాది వద్ద నిర్మించే జేఎన్‌ఎన్‌ఆర్‌యూఎం హౌసింగ్ స్కీమ్‌లో కేటాయించారు. మిగిలిన 210 కుటుంబాల ప్రజలకు రాజీవ్‌కాలనీ వద్ద జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇళ్లు నిర్మించేందుకు ఇటీవలే ఏపీ టీడ్కో సంస్థకు నిర్మాణ పనులు జీవీఎంసీ అప్పగించింది. ఇందులో భాగంగా వారం రోజుల నుంచి రాజీవ్‌కాలనీ ప్రాంతవాసులకు ఇక్కడి ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో షెడ్లు తొలగించామని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు. టీడీపీ నాయకుల వల్లే తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇళ్లను తొలగించారని, దీని వెనుక స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల హస్తం ఉంద ని, వారే తమకు అన్యాయం చేశారని నివాసితులు ఆరోపించారు. స్థానిక టీడీపీ నాయకులు ఇళ్ల కేటాయింపులో చేతివాటం ప్రదర్శిం చారని స్థానికురాలు పాడి కాంచన ఆరోపించింది. సక్రమంగా ఇంటి పన్నుతోపాటుగా కరెంటు బిల్లు చెల్లిస్తున్నామని.. అయినప్పటి కీ తమకు చెప్పకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసి ఇళ్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు రోడ్డున పడ్డామని వాపోయారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తొలగింపు చర్యల్లో అర్బన్ తహసీల్దార్ నాగభూషణ్, పశ్చిమ జోన్ ఏసీపీ లంక అర్జున్, జీవీఎంసీ డీసీపీ రాంబాబు, వివిధ జోన్ల టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు మధుసూదనరావు, సత్యనారాయణ, నాయుడు, టీపీవోలు విజయ్‌కుమార్, శ్రీలక్ష్మి, ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు సూర్యనారాయణ, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు యువకుల ఘాతుకం
సాక్షి, కోటవురట్ల(పాయకరావుపేట) : వావివరుసలు మరచి ఇద్దరు యువకులు చెల్లి వరుస అయిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా ఉరివేసి హత్యచేసేందుకు యత్నించిన సంఘటన ఆలస్యంగా బీకే పల్లిలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన ఆమె కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. బాలిక తల్లి లక్ష్మి వివరాలు ఇలా ఉన్నాయి. తమ పక్క ఇంటిలో ఉంటున్న పైల గోపి, పైల సునీల్ తన కుమార్తెకు అన్నదమ్ముల వరుస అవుతారని, దానిని మరిచి ఇద్దరూ ఆమెపై లైంగికదాడికి యత్నించి, ఆపై చంపడానికి ప్రయత్నించారని తెలిపింది. పథకం ప్రకారం ఆదివారం పాకలోకి పిలిచి లైంగికదాడికి యత్నించారని తెలిపింది. బాలిక అడ్డుకోవడంతో వెలుగులోకి వస్తే ప్రమాదమని భావించి ఉరి వేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. చనిపోయిందనుకుని ఏమీ తెలియనట్టుగా తమ పెద్ద కూతురు ఉమాదేవి వద్దకు వచ్చి మీ చెల్లిపై సిమెంట్ బస్తాలు పడిపోయాయని గోపి చెప్పాడని, అక్కడకు వెళ్లేసరికి కొనఊపిరితో ఉన్న కుమార్తెను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వైద్య సిబ్బంది కూడా జరిగిన సంఘటనపై అనుమానం వ్యక్తం చేశారని, సిమెంట్ బస్తాలు పడితే పెనుగులాడినట్టు తల, వీపుపై మట్టి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారని తెలిపింది. పరిస్థితి ఆందోళనగా ఉండడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా మెడ నరాలు తెగిపోవడంతో పాటు చిన్న మెదడు దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారన్నారు. జరిగిన అన్యాయంపై మంగళవారం కోటవురట్లలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ స్పందించలేదని, కేసు పెడితే ఆ ఇద్దరు ఏమైనా చేసుకుంటే బాధ్యత మీదేనని నిందితుల తరఫున మాట్లాడుతూ బెదిరించారన్నారు. మొదటి నుంచి గోపి, సునీల్ తమ రెండో కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫొటోలను అసభ్యంగా తయారు చేసి వాట్సప్‌లో పెడతామని బెదిరించేవారని, ప్రతీసారీ రూ.1000, రూ.2 వేలు తెమ్మని డిమాండ్ చేసేవారని చెప్పింది. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని తెలిపింది. ఈ విషయాన్ని నిలదీసినందుకే తన మూడో కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించింది. కఠినంగా శిక్షించాలి ఆ యువకులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఎస్ఐ మధుసూదనరావును సస్పెండ్ చేయాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. సమాచారం తెలుసుకున్న ఐద్వా సభ్యులు గురువారం విశాఖలో బాధితురాలిని పరామర్శించారు. శుక్రవారం బి.కె.పల్లి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు సూర్యప్రభ మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలను బ్లాక్మెయిల్ చేస్తూ వేధించిన పైల గోపి, పైల సునీల్‌లను తక్షణం అరెస్టు చేసి, విచారించాలన్నారు. హత్యచేసుందుకు యత్నించిడంతో బాధితురాలు కోలుకోలేని స్థితిలో కేజీహెచ్‌లో వైద్యం పొందుతోందని చెప్పారు. కేజీహెచ్‌లో వైద్యం చేస్తే ఆమె పూర్తిగా కోలుకోలేదని, అందువల్ల కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించాలన్నారు. వైద్యానికి రోజుకు రూ.45 వేలు వరకు ఖర్చు అవుతుందని, 90 రోజుల పాటు వైద్యం అందించాలని, ఇందుకు రూ.90 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మద్దతుగా జన విజ్ఞాన వేదిక నక్కపల్లి మండల కన్వీనర్ బి.రాము, సీపీఎం మండల కన్వీనర్ జి.డేవిడ్ నిలిచారు. గ్రామంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. దీనిపై ఎస్ఐ మధుసూదనరావును వివరణ కోరగా తాను ఇటీవల కోటవురట్ల ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్నానని, మండలంపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు. ఓ బాలికకు అన్యాయం జరిగితే నిందితులను కాపాడే నీచమైన వ్యక్తిత్వం తనది కాదన్నారు. బాధితురాలు నోరు విప్పితే అన్ని విషయాలు బయటకు వస్తాయని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నామని, పైల గోపిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధితురాలికి వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడినట్టు తెలిపారు. -
తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది
సూర్యాపేట : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం.. ఆ కుటుంబానికి ఒక్కసారిగా పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంట్లోని తమ కూతురు ఏడాది నుంచి పొట్టలోపలి భాగంలోని ఫ్రాంక్టాటిస్లో గడ్డ కావడంతో బాధపడుతూ.. రోజురోజుకూ క్షీణిస్తున్న బిడ్డ ఆరోగ్యాన్ని చూసి ఆ తల్లిదండ్రి తల్లడిల్లిపోతున్నారు. తమ గారాలపట్టికి ఎలాగైనా వైద్యమందించి బతికించుకునేందుకు సూర్యాపేట పట్టణానికి చెందిన నిమ్మ బింధు తల్లిదండ్రులు నిమ్మ శ్రీనివాస్–రాజేశ్వరి సాయం కోసం వేడుకుంటున్నారు. పట్టణానికి చెందిన శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ పట్టణంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలను ప్రభుత్వ పాఠశాలలో చదవిస్తున్నాడు. వారిలో చిన్న కుమార్తె బిందు ఇమాంపేట గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బిందు ఏడాది కాలంగా కడుపులోనొప్పితో బాధపడుతోంది. దీంతో పలు ప్రైవేట్ ఆస్పత్రులో వైద్యం చేయించాడు. ఇటీవల తీవ్రమైన కడుపులో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని నక్షత్ర హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించగా.. కడుపులోని ఫ్రాంక్టాటిస్లో పెద్దగడ్డ ఉందని.. దానిని ఆపరేషన్ చేసి తీయాలని.. దీని కోసం సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇలాంటి జబ్బు వెయ్యిలో ఒకరికి వస్తుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ఆ పేద తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు 20 రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో గల నక్షత్ర కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు చిన్నారి బిందును చేర్పించారు. వారి చేతిలో ఉన్న రూ.2 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆపరేషన్ కోసం మరో రూ.5 లక్షల మేర ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో చేతిలో చిల్లిగవ్వలేని ఆ తల్లిదండ్రులు దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం కోసం ఎదురుచూపు పేద తల్లిదండ్రులు తమ బిడ్డ బింధు ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం ఎవరైనా సాయం చేస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. దయఉంచి సహాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేయదలిచిన వారు 99123 69343, 90107 50593, 99487 64487 సెల్ నంబర్లను సంప్రదించవచ్చు. అకౌంట్ నంబర్ ఎస్బీహెచ్ సూర్యాపేట 62259021457.ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి తన కుమార్తె బింధు వైద్యానికి మనసున్న దాతలు సాయం చేసి ఆదుకోవాలి. ఇప్పటికే వైద్యం కోసం సంవత్సర కాలంలో రూ.2 లక్షలకు పైగా ఖర్చుచేశాం. అయినా తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నాం. వైద్యం కోసం రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతాయని వైద్యులు చెబుతున్నారు. నా బిడ్డ ఆపరేషన్ కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నా. -
నాలుగేళ్లుగా మరుగుదొడ్డే ఆ కుటుంబం నివాసం
-
‘పసి’డి వెన్నెలకు పేద గ్రహణం
ప్రేమకు తలవంచడం సరే... పేదరికానికి ఎలా తలదించాలో ఆటో డ్రైవర్‌ను హనుమంతును అడిగితే తెలుస్తుంది. కడుపు తీపికి కట్టుబడాలా.. కఠిన దారిద్య్రానికి పట్టుబడాలా.. అతని భార్య అనిత గుండెలోతుల్ని అడిగితే తెలుస్తుంది. పేదరికం ఎలా ఉంటుందో దరిద్రం చేసే దారుణ దాడిలో గుండె ఎలా బీటలు వారుతుందో.. మనుషులు ఎలా నిస్సహాయులుగా.. మారుతారో తెలుస్తుంది. అనుబంధాలు.. ఆప్యాయతలు పేదల బతుకు నిఘంటువుల్లోంచి ఎలా చెదిరిపోతున్నాయో ఆ దంపతుల బతుకును చదివితే అక్షరాలా అర్థమవుతుంది. ఆకాశాన పున్నమి వెన్నెల్లా.. ఇంటిముందు వెలిగే రెండు దీపాల్లా బోసినవ్వులతో ఈ లోకంలో అడుగుపెట్టిన ఆ కవలలకి అప్పుడే చేదు రుచి ఏంటో చూపడానికి పేదరికం సిద్ధమైంది. పాలుగారే పసికందుల్ని బతుకుపోరులో తలపడమంటూ శాసిస్తోంది. విధిలేక.. కన్నతల్లి అనిత మనసు రాయి చేసుకుని ఒక బిడ్డను దూరం చేసుకోవడానికి సిద్ధమైంది. కడ్తాల్ మండలం వాసుదేవ్పూర్కు చెందిన హనుమంతు, అనిత దంపతులు ఈ నెల 6న పుట్టిన ఆడ కవల పిల్లల్ని పోషించే శక్తి లేదంటూ ఆమనగల్లు ఐసీడీఎస్ కార్యాలయానికి గురువారం వచ్చి ఒకబిడ్డను సీడీపీఓ సుగుణకు అప్పగించారు. చిన్నారిని అమీర్‌పేటలోని శిశుగృహకు తరలిస్తామని సీడీపీఓ చెప్పారు. చెట్టుకు కాయ భారమా.. తల్లికి పిల్ల భారమా.. అందామా..! లేదా పేదరికంతో బతుకులే భారమని నిట్టూరుద్దామా! – ఆమనగల్లు -
పేద కుటుంబం.. పెద్ద రోగం
కిడ్నీలు పాడై అవస్థలు పడుతున్న తాపీమేస్త్రీ రెండేళ్లుగా మంచానికే పరిమితమైన నర్సయ్య మందులు కొనుగోలు చేయలేక మనోవేదన ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే యజమానికి పెద్ద జబ్బు వచ్చింది. రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంచానికే పరిమితమయ్యాడు. తన రెండు కిడ్నీలు పాడైపోవడంతో మనోవేదనకు గురవు తున్నాడు. కనీసం మందులు కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో తల్లడిల్లుతున్నాడు. మానవతావాదులు సాయం అందించి తనను ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. కిడ్నీలు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న తాపీమేస్త్రీ గుర్రం నర్సయ్యపై కథనం. జనగామరూరల్ : మండలంలోని గానుగుపహాడ్ గ్రామానికి చెందిన గుర్రం నర్సయ్య–ఎలిశమ్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు సుభాషిణి, సంపూర్ణ, కుమారుడు సుధాకర్ ఉన్నారు. వీరికి ఎలాంటి ఆస్తులు లేవు. నర్సయ్య 25 ఏళ్లుగా తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబా న్ని పోషించుకుంటున్నాడు. కూలి పనులు చేయగా వచ్చిన డబ్బులతో కొన్ని నెలల క్రితం పెద్ద కూతురు వివాహం చేశాడు. అయితే సాఫీగా సాగిపోతుందనుకున్న నర్సయ్య జీవితంలో ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. రెండేళ్ల క్రితం నర్సయ్య అనారోగ్యానికి గురయ్యాడు. ఈ సమయంలో ఆయన కాళ్లు, చేతులు, శరీర అవయవాలు బాగా వాపు రావడంతో కుటుంబసభ్యులు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు చేయించారు. కాగా, వైద్యం కోసం నర్సయ్య భార్య ఎలిశమ్మ దొరికినకాడల్లా అప్పు తీసుకురావడంతోపాటు తన ఒంటిపై ఉన్న బంగారు నగలను కూడా అమ్మి సుమారు రూ.1.20 లక్షల వరకు ఖర్చు చేసింది. అయితే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత నర్సయ్య ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. అంతా బాగుందనుకుంటున్న క్రమంలో మూడు నెలల తర్వాత మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. వారానికి రెండుసార్లు డయాలసిస్ మెుదటిసారిలాగే అనారోగ్యంతో బాధపడుతున్న నర్సయ్యను కుటుంబసభ్యులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్ చికిత్సలు అందిస్తేనే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పారు. దీంతో నర్సయ్య భార్య, కుమారుడు, కూతుర్లు బోరున విలపించారు. ఈ క్రమంలో నర్సయ్య కుమారుడు సుధాకర్ కూలీ పనులకు వెళ్తుండగా.. భార్య ఎలిశమ్మ ఆయనకు నిత్యం సపర్యలు చేస్తోంది. ఆరోగ్యశ్రీపై వైద్యం అందుతున్నప్పటికీ మందులను కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన ఇబ్బందులకు గురవుతున్నాడు. నర్సయ్యకు వారంలో రెండు, మూడు సార్లు డయాలసిస్ చేయించేందుకు హైదరాబాద్ వెళ్లి వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు, అవసరమయ్యే మందుల డబ్బులు లేక ఆయన కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.