power exchanges
-
ఎక్స్ఛేంజీల్లో ‘కరెంట్’పై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: పవర్ ఎక్స్ఛేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాల ట్రేడింగ్ జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఆంక్షలు విధించింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల కోసం గతంలో బుక్ చేసుకున్న 1,000 మెగావాట్ల కారిడార్‌ను వదులుకున్నందుకు రూ.261.31 కోట్ల చార్జీలను టీజీఎస్పీడీసీఎల్ చెల్లించడం లేదంటూ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) చేసిన ఫిర్యాదుతో ఈ మేరకు తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర విద్యుత్ శాఖ 2022 మార్చి 10న ప్రకటించిన లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్ కింద విద్యుదుత్పత్తి, ట్రాన్స్మిషన్ సంస్థలకు చెల్లింపులను ఇన్వాయిస్ల జారీ నుంచి 75 రోజుల్లోగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా బకాయిలను చెల్లించడంలో విఫలమైన దేశంలోని 16 డిస్కంలను బ్లాక్ లిస్టులో పెడుతూ ‘ప్రాప్తి’పోర్టల్‌లో గ్రిడ్ కంట్రోలర్ గురువారం ప్రకటన చేయగా, ఆ జాబితాలో టీజీఎస్పీడీసీఎల్ సైతం ఉండటం గమనార్హం. 2,000 మెగావాట్ల కారిడార్ బుక్ చేసిన గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండటంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగో లు చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్‌ను సరఫరా చేసుకోవడం కోసం అప్పట్లో పీజీసీఐఎల్ నిర్మిస్తున్న వార్ధా–డిచ్పల్లి 765/400 కేవీ కారిడార్‌లో ముందస్తుగా 2,000 మెగావాట్ల కారిడార్‌ను బుక్ చేసుకోవడానికి దర ఖాస్తు చేసుకుంది. అయితే, ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్‌ను 12 ఏళ్ల పాటు కొనుగోలు చేసుకునేందుకు మాత్రమే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ విద్యుత్ ధరలు అధికంగా ఉంటాయని విమర్శలు రావడంతో మరో 1,000 మెగావాట్లను కొనుగోలు చేసే ఆలోచనను విరమించుకుంది.ఈ నేపథ్యంలో 1000 మెగావాట్ల కారిడార్‌ను మాత్రమే కేటాయించాలని పీజీసీఐఎల్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో పీజీసీఐఎల్ ఆ కారిడార్ కేటాయింపులను రద్దు చేసింది. కారిడార్‌ను వదు లుకున్నందుకు రూ.261.31 కోట్ల రిలింక్వి‹Ùమెంట్ చార్జీలను చెల్లించాలని టీజీఎస్పీడీసీఎల్కు డిమాండ్ నోటీసులు చేసింది. టీజీఎస్పీడీసీఎల్ ఈ చార్జీల ను చెల్లించకపోవడంతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సీఈఆర్సీని ఆశ్రయించింది. టీజీఎస్పీడీసీఎల్ తర హాలోనే దేశంలో కారిడార్ వదులుకున్న మిగిలిన అన్ని డిస్కంల వివరాలను సమరి్పంచాలని పీజీసీఐఎల్‌ను అప్పట్లో సీఈఆర్సీ ఆదేశించింది.ఈ వివరాలేవీ అందించకుండా పీజీసీఐఎల్ రూ.261.31 కోట్ల చార్జీలను ఎలా లెక్కించిందని టీజీఎస్పీడీసీఎల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు టీజీఎస్పీడీసీఎల్ డిపాజిట్ చేసిన రూ.కోటి బ్యాంకు గ్యారంటీని పీజీసీఐఎల్ ఏకపక్షంగా జప్తు చేసుకుంది. చార్జీలు అడగకుండా పీజీసీఐఎల్‌ను నిలువరించాలని కోరుతూ 2021 జూన్ 25న సీఈఆర్సీని టీజీఎస్పీడీసీఎల్ సంప్రదించగా, కేసు విచారణ తుది దశకు చేరింది. కేసు పెండింగ్‌లో ఉండగానే టీజీఎస్పీడీసీఎల్ను బ్లాక్ లిస్టులో పెట్టడం గమనార్హం. -
డిస్కంలకు సీఈఆర్సీ షాక్!
సాక్షి, అమరావతి : విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు నిజంగా ఇది పిడుగులాంటి వార్తే. ఖర్చుకు వెనుకాడకుండా అవసరమై నప్పుడు బహిరంగ మార్కెట్ (పవర్ ఎక్సేంజ్)లో అధిక ధర వెచ్చించైనా సరే విద్యుత్‌ను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే డిస్కంలపై ఆర్థిక భారం పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. పవర్ ఎక్స్చేంజి లో ప్రస్తుతం యూనిట్ విద్యుత్ గరిష్ట ధర రూ.12గా ఉన్న సీలింగ్‌లో మార్పులు చేస్తూ కొన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరేలా యూనిట్ ధరను రూ.50గా నిర్ణయిస్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) తాజాగా ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతానికి దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్‌లకు మాత్రమే ఈ రేటు వర్తిస్తుందని చెబుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో బొగ్గు కొరత, విద్యుత్ డిమాండ్వల్ల అన్ని జెన్కోలు ఇదే ధరకు విద్యుత్ అమ్ముతామని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఇంధనరంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు అనేది డిస్కంలకు పెనుభారంగా మారుతుంది. ట్రూ అప్ ఛార్జీలుగా అంతిమంగా ఈ భారం ప్రజలపైనే పడుతుంది. అప్పుడే భారమనుకుంటే.. 2021 అక్టోబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డ బొగ్గు కొరతతో భారత్‌లోనూ తీవ్ర విద్యుత్ సంక్షోభం వచ్చింది. ఆ సమయంలో బొగ్గు నిల్వలు కూడా నిండుకోవడంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తిస్థాయి లో నడపలేక బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్‌ను గరిష్టంగా రూ.20 పెట్టి కొని వినియోగదారులకు అందించారు. గతేడాది వేసవిలోనూ ఇదే పరిస్థితి రావడంతో యూని ట్ ధర రూ.20 దాటింది. దీంతో దేశ వ్యాప్తంగా డిస్కంలు ఆందోళన వ్యక్తంచేయడంతో సీఈఆర్సీ రంగంలోకి దిగి విద్యుత్ అమ్మకం గరిష్ట ధర రూ.12 మించకూడదని ఆదేశాలు (సీలింగ్) జారీచేసింది. తాజాగా.. ఆ ఆదేశాలను సవరించి యూనిట్ రూ.50 రూపాయల వరకు విక్రయించుకోవడానికి అనుమతిచ్చింది. రాష్ట్రంలో రోజుకు 220 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంటే ఇందులో దాదాపు 30 మిలియన్ యూనిట్లు బయటి నుంచే కొంటున్నారు. ఇందుకోసం రోజూ రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ ఖర్చుచేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ అమ్మకం ధర యూనిట్ రూ.9 వరకూ ఉంది. ఈ నెలలో డిమాండ్ 240 మిలియన్ యూనిట్లు, వచ్చే నెలలో 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ఇంధన శాఖ ఇప్పటికే అంచనాకు వచ్చింది. ఈ లెక్కన బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను అధిక ధరకు అదనంగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇలా అయితే కష్టమే.. కొన్నేళ్లుగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆధునిక సాంకేతికత(ఎనర్జీ ఫోర్కాస్ట్)ను ఉపయోగించుకుని బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభించే సమయాన్ని ముందుగానే అంచనా వేసి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ విధంగా 2021లో రూ.4,925 కోట్లు ఆదా చేశాయి. ఈ మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు వీలుగా 2021–22లో రూ.3,373 కోట్లను ట్రూ డౌన్ చేస్తూ ఆంధ్ర్ర పదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. కానీ, బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల కారణంగా రాష్ట్రంలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత వి ద్యుత్ పంపిణీ సంస్థలు 2022 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అనుకున్న దానికి మించి మూడు డిస్కంలు కలిపి రూ.9,029 కోట్లను విద్యుత్ కొనుగోలుకు ఖర్చుచేశాయి. నిజానికి అప్పుడు కొన్న విద్యుత్ యూనిట్ ధర సరాసరిన రూ.5.22–రూ.5.35 మాత్రమే. దానికే రూ.1,048 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాంటిది రూ.20ని దాటి రూ.50కు కొనాల్సి వస్తే డిస్కంలు ఆర్థికంగా కుదేలవుతాయి. -
విద్యుత్ డిస్కంలకు షాక్! కరెంట్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం?
సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం మొదలవుతూనే విద్యుత్ డిస్కంలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పెరుగుతున్న డిమాండ్ ఓవైపు, అవసరానికి తగినంత సరఫరా చేయలేక మరోవైపు కిందామీదా పడుతున్న డిస్కంలపై విద్యుత్ కొనుగోళ్ల భారం మీద పడుతోంది. ‘దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల’ విద్యుత్‌ను గరిష్టంగా యూనిట్‌కు రూ.50 ధరతో అమ్ముకోడానికి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)కు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) అనుమతి ఇవ్వడమే దీనికి కారణం. ఈ అంశంలో ఐఈఎక్స్ వేసిన పిటిషన్‌పై సీఈఆర్సీ శుక్రవారం తీర్పు ఇచ్చింది. దీని ప్రభావంతో ఈ వేసవిలో విద్యుత్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని.. ఎక్కువగా విద్యుత్ కొనుగోలు చేసే రాష్ట్రాలపై భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిమితితో నష్టాల పేరిట.. గతేడాది వేసవిలో దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. సరిపడా అందుబాటులో లేక తీవ్ర కొరత ఏర్పడింది. ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్ ధర యూనిట్‌కు రూ.20కు మించిపోయాయి. అత్యధిక ధరతో కొనుగోళ్లతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన సీఈఆర్సీ.. విద్యుత్ ధర యూనిట్‌కు రూ.12 మించరాదని పరిమితి విధిస్తూ 2022 మే 6న సుమోటోగా ఆదేశాలు జారీ చేసింది. అయితే దిగుమతి చేసుకున్న బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల విద్యుత్ ధరలు సాధారణంగానే ఇంతకన్నా అధికంగా ఉంటాయి. పరిమితి కారణంగా అవి ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్ విక్రయించలేక నష్టపోతున్నట్టు కేంద్రం గుర్తించింది. అలాంటి ప్లాంట్లు ఎనర్జీ ఎక్స్చేంజీల్లో అధిక ధరతో విద్యుత్ విక్రయించుకోవడానికి వీలుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గతేడాది అక్టోబర్ 11న ‘హై ప్రైస్ డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ‘ఎన్రాన్’ విద్యుత్ ధర ఆధారంగా.. కొత్త విధానానికి అనుగుణంగా.. దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్ ఆధారిత ప్లాంట్ల విద్యుత్‌ను గరిష్టంగా యూనిట్‌కు రూ.50 ధరతో విక్రయించేందుకు అనుమతి కోరుతూ ఇండియన్ ఎనర్జీ ఎక్ఛ్సేంజీ గతేడాది చివరిలో సీఈఆర్సీలో పిటిషన్ వేసింది. తర్వాత ఈ ధరను రూ.99 వరకు పెంచాలని అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసింది. మహారాష్ట్రలోని రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రైవేటు లిమిటెడ్ (పూర్వపు ఎన్రాన్ సంస్థ)కు చెందిన విద్యుత్‌ను ఇటీవల యూనిట్‌కు రూ.58.98 భారీ ధరతో విక్రయించినట్టు వివరించింది. ఆ ప్లాంట్ విద్యుత్ వేరియబుల్ కాస్ట్(గ్యాస్/ఇంధన వ్యయం) యూనిట్ రూ.58.48గా ఉందని.. దానికి అనుగుణంగా అధిక ధరను నిర్ణయించాలని కోరింది. దీనిపై సీఈఆర్సీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) అధిక ధరను సమర్థించింది. సీఈఆర్సీ దీనిని పరిగణనలోకి తీసుకుంది. మొత్తం 100 శాతం దిగుమతి చేసిన బొగ్గు, గ్యాస్‌తో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను మాత్రమే ‘హైప్రైస్ డే అహెడ్ మార్కెట్’ సెగ్మెంట్ కింద, అదీ యూనిట్‌కు గరిష్టంగా రూ.50 ధరతో విక్రయించడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానంపై కొంతకాలం పరిశీలన జరిపిన తర్వాత పునః సమీక్షిస్తామని తెలిపింది. అయితే రెండు దశాబ్దాల కింద ఎన్రాన్ విద్యుత్ కుంభకోణం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ప్లాంటు విద్యుత్ ధరను పరిగణనలోకి తీసుకుని గరిష్ట ధరను ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడో ఆప్షన్‌గానే.. అధిక ధర విద్యుత్! ఎనర్జీ ఎక్స్చేంజీలో ఈ అధిక ధర (హైప్రైస్ సెగ్మెంట్) విద్యుత్ విక్రయాన్ని మూడో ఆప్షన్‌గా చేర్చారు. ‘డే అహెడ్ మార్కెట్ సెగ్మెంట్’ విధానం కింద ఎనర్జీ ఎక్ఛ్సేంజీల్లో తొలుత సౌర, పవన విద్యుత్ వంటి గ్రీన్ విద్యుత్‌ను అమ్మకానికి పెడతారు. వాటి విక్రయాలు పూర్తయ్యాక థర్మల్ విద్యుత్‌ను విక్రయిస్తారు. ఈ రెండు సందర్భాల్లో బిడ్డింగ్‌లో పాల్గొని విద్యుత్‌ను పొందలేకపోయిన డిస్కంలు.. ‘హైప్రైస్’ విద్యుత్ కోసం బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో కనీస ధర సున్నా నుంచి గరిష్ట ధర రూ.50కి మధ్య కోట్ చేయవచ్చు. ఎక్కువ ధరను కోట్ చేసిన డిస్కంలకు విద్యుత్‌ను విక్రయిస్తారు. ఎనర్జీ ఎక్ఛ్సేంజీల్లో కొనుగోళ్లు ఎందుకు? రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సాధారణంగా దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా ప్లాంట్ల నుంచి నేరుగా విద్యుత్ కొనుగోళ్లు చేస్తుంటాయి. వీటి విద్యుత్ ధర ఒప్పందాలను బట్టి యూనిట్‌కు రూ.4.5 నుంచి రూ.6 వరకు ఉంటుంది. ఇలాంటి ఒప్పందాలు కాకుండా వివిధ ప్లాంట్లు, విద్యుత్ సంస్థల నుంచి బహిరంగ మార్కెట్లో ‘ఎనర్జీ ఎక్స్చేంజీ’ల ద్వారా విద్యుత్ విక్రయాలు కూడా జరుగుతుంటాయి. డిస్కంలు విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు ‘డే ఎహెడ్ మార్కెట్ (డీఏఎం)’ సెగ్మెంట్ కింద ఎనర్జీ ఎక్స్చేంజీల ద్వారా అవసరమైన మేర కరెంటు కొని వినియోగదారులకు సరఫరా చేస్తుంటాయి. ఈ కొనుగోళ్ల కోసం ఆన్లైన్లో బిడ్లు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ధర కోట్ చేసిన డిస్కంలకు విద్యుత్ లభిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రాల డిస్కంలు పోటాపోటీగా బిడ్డింగ్‌లో పాల్గొంటుండటంతో విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోతుంటాయి. ‘కొనే’ రాష్ట్రాలకు భారమే గత ఏడాది వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగిఎక్ఛ్సేంజీల్లో విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోయాయి. అయినా యాసంగి కోసం రైతులకు, ఇతర వినియోగదారులకు సరఫరా సాగించడానికి తెలంగాణ డిస్కంలు రోజుకు రూ.100 కోట్ల నుంచి రూ.165 కోట్లు ఖర్చుచేసి ఎనర్జీ ఎక్ఛ్సేంజీల నుంచి విద్యుత్ కొనుగోలు చేశాయి. పలు ఇతర రాష్ట్రాలూ అత్యధిక ధరతో విద్యుత్ కొన్నాయి. ఇప్పుడు ‘దిగుమతి’ ప్లాంట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.50 వరకు అమ్ముకునే అవకాశం రావడంతో.. ప్రస్తుత వేసవి లో విద్యుత్ కొనుగోళ్ల భారం పెరిగిపోతుందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో 17,600 మెగావాట్ల మేర ‘దిగుమతి’ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయని.. వాటి విద్యుత్ ధరలు అమాంతం పెరిగిపోనున్నా యని చెప్తున్నారు. విద్యుత్‌ను ఎక్కువగా కొనే రాష్ట్రాలపై భారం పడుతుందని వివరిస్తున్నారు. -
గ్యాస్ ఆధారిత ప్లాంట్లు వద్దు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఇకపై గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లు నెలకొల్పవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్లు గ్యాస్ లభ్యత లేక కుంటుపడ్డాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీడీపీ ఎంపీ రవీంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తొలుత ఎంపీ కొండా మాట్లాడుతూ ‘తెలంగాణలో విద్యుత్ కొరత ఉంది. అయితే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో ఈ విషయంలో వివాదం ఉన్నప్పటికీ గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో ఏప్రిల్‌లో కరెంటు కోతలు లేవు. ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఎక్స్ఛేంజీలో కరెంటు కొన్నది. ఈ విధానంలో అక్కడ ప్రతి 15 నిమిషాలకు ధర మారుతోంది. ఒక్కోసారి మేం యూనిట్‌కు రూ. 8 నుంచి 9 వరకు చెల్లిం చాల్సి వచ్చింది. అయితే ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది. శంకరపల్లిలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంటు కోసం 2000 సంవత్సరంలో 200 ఎకరాల భూమి సేకరించాం. కానీ ఇప్పటివరకు ప్లాంటు ఏర్పాటుకాలేదు’ అని అన్నారు. దీనికి పీయూష్ గోయల్ సమాధానమిస్తూ.. ‘తెలంగాణ ప్రజలకు నిరంతరాయ విద్యుత్ ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. అన్ని రాష్ట్రాలు దీన్ని అవలంబించవచ్చు. దేశంలో అనేక రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉంది. విద్యుత్ ఎక్స్ఛేంజీలోగానీ, దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా గానీ దీనిని పొందవచ్చు. విద్యుత్ ఎక్స్ఛేంజీ విధానంలో యూనిట్‌కు రూ. 8 వెచ్చించామని సభ్యుడు చెబుతున్నారు. నేను నిన్న పవర్ గ్రిడ్ మాని టరింగ్ కార్యాలయంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 3.30 గంటలకు పవర్ ఎక్స్ఛేంజీ రేటు యూనిట్‌కు సున్నా ధర ఉంది. ఆ సమయం లో విద్యుత్ అవసరానికి మించి అందుబాటులో ఉంది. అందువల్ల దానిని ఉచితంగా ఇవ్వడం కంటే వేరే దారి లేదు. ఇక శంకరపల్లి విషయానికి వస్తే.. దేశంలో గ్యాస్ కొరత ఉంది. 14 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ప్రస్తుతం గ్యాస్ కొరతతో పనిచేయ డంలేదు. రాష్ట్రాలు ఇకపై గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పవద్దని కోరుతున్నా. దానికి బదులు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేసుకోవాల’ని స్పష్టం చేశారు.