Practical tests
-
జోరుగా భారత్ ప్రాక్టీస్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన భారత జట్టు కోలుకునే ప్రయత్నంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. జట్టు ఆటగాళ్లంతా గురువారం కూడా తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. ‘కన్కషన్’నుంచి కోలుకుంటున్న రవీంద్ర జడేజా బ్యాట్ పట్టుకొని వికెట్ల మధ్య పరుగు తీస్తూ ఫిట్నెస్ను నిరూపించుకునే ప్రయత్నంలో పడగా...యువ బౌలర్ నటరాజన్ తన పదునైన బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు. రహానే, పుజారాలు అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. రాహుల్, పంత్ కూడా ఎక్కువ సమయం నెట్స్‌లో చెమటోడ్చారు. చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ భారత ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించారు. అనంతరం రాహుల్, పృథ్వీషాలకు తగు సూచనలిచ్చిన రవిశాస్త్రి... కెప్టెన్ రహానేతో సుదీర్ఘ సమయం పాటు చర్చించాడు. మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు? టెస్టు సిరీస్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు జనవరి 7నుంచి సిడ్నీలో జరగాల్సి ఉంది. అయితే నగరంలో కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ సందేహంలో పడింది. ఇలాంటి స్థితిలో అవసరమైతే మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టును నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాల్సి వచ్చిందని... మెల్‌బోర్న్‌లోనే రెండో టెస్టు ముగిసేలోపు తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,27,761 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు నాలుగు దశల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1,733 ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోని (జనరల్ కాలేజీలు 1,561, ఒకేషనల్ 172 కాలేజీలు) ఎంపీసీ విద్యార్థులు 1,59,429 మంది, బైపీసీ విద్యార్థులు 89,496 మంది, జాగ్రఫీ విద్యార్థులు 261 మంది, ఒకేషనల్‌లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 42,749 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35,925 మందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం 6,314 మంది అనుభవం కలిగిన జూనియర్ లెక్చరర్లను నియమించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. గతేడాది నుంచే ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపించే చర్యలను బోర్డు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ సారి కూడా అరగంట ముందుగా ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపిస్తామని తెలిపింది. ఎగ్జామినర్ మొబైల్ నంబరుకు వన్‌టైం పాస్వర్డ్ పంపిస్తామని దాని ఆధారంగా ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు నిర్వహించాలని సూచించింది. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల మార్కులను కూడా ఆ రోజు సాయంత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని బోర్డు స్పష్టంచేసింది. ఎగ్జామినర్ల జంబ్లింగ్‌లో పొరపాట్లు ప్రాక్టికల్ పరీక్షల విధులను అప్పగించిన ఎగ్జామినర్ల జంబ్లింగ్‌లో పొరపాట్లు దొర్లినట్లు తెలిసింది. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు చెందిన లెక్చరర్లను ప్రాక్టికల్ ఎగ్జామినర్లుగా జంబ్లింగ్ చేసినప్పటికీ వారివారి కాలేజీల్లోనే సెంటర్లు పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన బోర్డు అధికారులు గురువారం సాయంత్రం దాన్ని సవరించే పనిలో పడినట్లు తెలిసింది. మరోవైపు ఈ నెల 28న జరిగిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు ఇంకా ఇంటర్ బోర్డుకు అందలేదు. ఆన్లైన్లో మార్కులను అదే రోజు అప్లోడ్ చేయాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల వల్ల కుదరలేదు. -
లక్ష్యం 30/30
తూర్పుగోదావరి , రాయవరం (మండపేట): విద్యార్థి దశలో అత్యంత కీలకమైనది ఇంటర్మీడియట్. కోరుకున్న కళాశాలలో, కోర్సులో సీటు దక్కించుకోవాలంటే ఇక్కడ సాధించే మార్కులు అత్యంత కీలకం. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు వేసే మార్కులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏ చిన్న తప్పిదం చేసినా మార్కులు కోల్పోయే ప్రమాదముంది. ఆసక్తి చూపితే 30కి 30 మార్కులు సాధించవచ్చని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఇక మిగిలింది వారం రోజులు మాత్రమే. ఈ క్రమంలో ప్రాక్టికల్స్‌లో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు.. వాటిని ఎలా అధిగమించాలి.. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులు ఇచ్చే సూచనలు.. మెళకువలు విద్యార్థుల కోసం.. ప్రయోగ పరీక్షల షెడ్యూల్.. ‘ప్రయోగ’ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9–12 గంటల వరకు, మధ్యాహ్నం 2–5 గంటల వరకు జరగనున్నాయి. ప్రయోగ పరీక్షల్లో ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు కేటాయిస్తారు. మంచి మార్కులు సాధించవచ్చు.. భౌతిక శాస్త్రానికి మూడు గంటల సమయానికి 30 మార్కులు కేటాయిస్తారు. మొత్తంగా 20 ప్రయోగాల్లో ఆరు విభాగాల నుంచి 38 ప్రశ్నలుంటాయి. ప్రతి బ్యాచ్‌కు 12 ప్రశ్నల వంతున ఇస్తారు. ప్రయోగ సూత్రానికి రెండు మార్కులు, ప్రయోగ విధానానికి మూడు పట్టికలు, పరిశీలనలు, గ్రాఫ్‌లకు ఎనిమిది, గణనకు నాలుగు, జాగ్రత్తలకు రెండు, ఫలితం, ప్రమాణాలకు రెండు మార్కులు, రికార్డులకు నాలుగు, వైవాకు ఐదు మొత్తంగా 30 మార్కులుంటాయి. గణన అనే శీర్షిక కింద రఫ్‌గా చేసినదంతా రాయాలి. దానికి నాలుగు మార్కులు వస్తాయి. అన్ని ప్రయోగాలకు జాగ్రత్తలు తప్పనిసరిగా రాయాలి. అన్ని ప్రయోగ విలువలు ఒకే ప్రమాణ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. ప్రమాణాలు ప్రతి విలువకు ఉన్నాయో లేదో చూసుకోవాలి. పట్టికల్లో ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ప్రశ్నలకు ఒకే శీర్షికలుంటాయి. విద్యుత్ ప్రయోగాలకు సర్క్యూట్ డయాగ్రామ్ (వలయ చిత్రం) తప్పనిసరిగా వేయాలి.– టేకుమూడి రామ్‌కుమార్, ఫిజిక్స్ అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాజులూరు సూటిగా సమాధానాలు చెప్పాలి.. వృక్షశాస్త్రం ప్రయోగ పరీక్ష 30 మార్కుల ప్రశ్న పత్రంలో ఐదు విభాగాలు ఉంటాయి. ఒకటో ప్రశ్నకు వృక్ష వర్గీకరణ శాస్త్రంలో మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం వస్తుంది. వర్ణణ క్రమపద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా రాయాలి. అడిగిన చిత్రపటాలు, లక్షణాలు, బాగా సాధన చేసి తప్పులు లేకుండా రాయాలి. ఇచ్చిన మొక్కను బట్టి పుష్పచిత్రం, సమీకరణం, కుటుంబం గుర్తింపు తప్పనిసరి. రెండో ప్రశ్న వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి వస్తుంది. ఇచ్చిన మెటీరియల్‌ను బట్టి స్లైడ్ తయారీని చాలా శ్రద్ధగా, శుభ్రంగా చేయాలి. విస్తరించిన భాగం పటం గీసి, గుర్తింపు రాయడం ముఖ్యం. మూడో ప్రశ్న వృక్ష శరీర ధర్మశాస్త్రం (లైవ్ ప్రయోగాలు) లాటరీ పద్ధతిలో విద్యార్థికి వచ్చిన ప్రయోగానికి అనుగుణంగా పరికరాల అమరిక చేయాలి. ఉద్దేశం, సూత్రం, పరిశీలన ఫలితం మాత్రమే రాయాలి. ఇవి చాలా సులభమైన ప్రశ్నలు. నాలుగో ప్రశ్నకు ఐదు మార్కులు పొందవచ్చు. స్పాటరు లేదా స్లైడును గుర్తించి దాని లక్షణాలు రాయాలి. రికార్డు, హెర్బేరియాలలో హెర్బేరియాను నీట్‌గా తయారు చేసి కవర్లో ఉంచి కవర్‌పై నంబరు వేయాలి. – కట్టు వినుతకుమారి, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కిర్లంపూడి ఫలితం తప్పనిసరి... రసాయనశాస్త్రం ప్రయోగ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. మూడు గంటల సమయం ఇస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఇచ్చిన లవణం రంగు భౌతిక స్థితి, జ్వాలా వర్ణ పరీక్ష, వేడి చేయడం తర్వాత ఆనయాన్, కాటయాన్లను గుర్తించడం, వాటి నిర్ధారణ పరీక్షలు ముఖ్యమైనవి. చివరగా ఫలితం తప్పనిసరిగా రాయాలి. ఈ విభాగానికి పది మార్కులుంటాయి. రెండో విభాగంలో ఘన పరిమాణాత్మక విశ్లేషణకు 8 మార్కులు. అందులో మొదటి పది నిమిషాల్లో ప్రయోగ విధానం రాయాలి. బ్యూరెట్ రీడింగులు, ఎటువంటి కొట్టివేతలు లేకుండా పట్టికలు రాసి, లెక్కింపు విధానం, ఫలితం రాయాలి. మూడో విభాగంలో ఎ నుంచి డి వరకు ప్రశ్నల్లో ఒకటి మాత్రమే చేయాలి. ఈ విభాగానికి ఆరు మార్కులు. ‘ఎ’లో ఇచ్చిన కర్బన పదార్ధం నుంచి ప్రమేయ సమూహాన్ని గుర్తించాలి. ‘బి’లో కొల్లాయిడల్ ద్రావణాలను తయారు చేయడం, ‘సి’లో క్రొమోటోగ్రఫీలో కార్బోహైడ్రేట్ల చర్యలు, ప్రొటీన్ల చర్యలు ఉంటాయి. – ఎ.దుర్గాప్రసాద్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు,ప్రభుత్వ జూనియర్ కళాశాల, దేవిపట్నం -
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
అర్బన్ జిల్లాలో 23,138 మంది విద్యార్థులు.. 66 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు ఆన్లైన్లో ప్రశ్నపత్రాలు పరీక్ష జరిగిన రోజే మార్కుల పోస్టింగ్ విద్యారణ్యపురి : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు శుక్రవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు నాలుగు దశల్లో పరీక్షలు జరగనుండగా ఇంటర్ విద్య అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆన్లైన్లో ప్రశ్నపత్రాలు పంపించే విధానం ఈ ఏడాది నుంచి అమలులోకి వస్తోంది. ఇక బ్యాచ్‌లవారీగా విద్యార్థుల ప్రాక్టికల్స్‌పై వాల్యుయేషన్ నిర్వహించి వెంటనే మార్కులు ఆన్లైన్లోనే పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అర గంట ముందే.. ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో పంపిస్తారు. అలా వచ్చిన ప్రశ్నాపత్రాలను పరీక్షకు అరగంట ముందుగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం కోడ్, ఎగ్జామినర్‌కు వన్‌టైం పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్‌వర్డ్‌తో కోడ్ ద్వారా ప్రశ్నాపత్రం డౌన్లోడ్ చేసుకుని పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఏదైనా పరిస్థితుల్లో ఎగ్జామినర్ విధులకు రాకపోతే ప్రత్యామ్నాయంగా మరో ఎగ్జామినర్‌కు కూడా వన్‌టైం పాస్వర్డ్ కేటాయిస్తారు. గతంలో పరీక్షలకు కొద్దిరోజుల ముందుగానే ప్రశ్నపత్రాలు పంపించే విధానం ఉండడంతో ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ఏదో మొక్కుబడిగా పరీక్ష నిర్వహించి తమ విద్యార్థులకు మంచి మార్కులు వేయించుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీని నివారణకు ఆన్లైన్లో ప్రశ్నపత్రం పంపిస్తూ అర గంట ముందే డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని తీసుకురావడమే కాకుండా బ్యాచ్‌ల వారీగా పరీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు మార్కులను ఆన్లైన్లో పోస్టింగ్ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. తద్వారా ఒకసారి మార్కులు పోస్టింగ్ చేశాక మళ్లీ మార్చేందుకు కుదరకపోవడంతో అక్రమాలు జరగవని భావిస్తున్నారు. సౌకర్యాల లేమితో.. ప్రతి ఏడాది జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ అమలులోకి రాలేదు. ప్రభుత్వ కళాశాలలతో పాటు కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ల్యాబ్‌లు కూడా సరిగాలేవు. ఉన్నచోట పరికరాలు, కెమికల్స్ సరిపోను ఉండకపోవడంతో పూర్తిస్థాయిలో జంబ్లింగ్ విధానం అమలు చేయడం సాధ్యం కావడం లేదు. ఈ మేరకు అన్ని సౌకర్యాలు ఉన్న కొన్ని కళాశాలలు ఎంపిక చేసి వాటిల్లోనే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అర్బన్ జిల్లాలో 66 కేంద్రాలు వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 23,138 మంది విద్యార్థులు సైన్స్, ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఈ మేరకు ప్రాక్టికల్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వరంగల్ రూరల్ జిల్లా ఇన్చార్జి ఇంటర్ విద్యాధికారి కే.వీ.ఆజాద్ తెలిపారు. -
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
►హాజరుకానున్న 21,743 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ►122 కేంద్రాల ఏర్పాటు నెల్లూరు (విద్య): ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఈనెల 12వ తేదీ (గురువారం) నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మార్చి 4వ తేదీ వరకు ఇవి 4 దశల్లో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే డీఈసీ, హైపవర్ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ప్రాక్టికల్స్ నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 23 ప్రభుత్వ కాలేజీలు, 2 ఆదర్శపాఠశాలలు, 8 ఎయిడెడ్ కళాశాలలు, 2 ఏపీటీడబ్ల్యూ రెసిడెన్షియల్ కళాశాలలు, ఏపీఆర్జేసీ కళాశాల-1, ఏపీఎస్‌డబ్ల్యూ కాలేజీలు-9, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలు-77 ఉన్నాయి. మొత్తం 21,743 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఒకేషనల్ కోర్సులుండే కళాశాలల్లో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు సమాంతరంగా ప్రాకిక్టల్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయి. కమిటీల ఏర్పాటు పరీక్షల కోసం ఆర్ఐఓ (రీజనల్ ఇంటర్మీడియట్ అధికారి) ఆధ్వర్యంలో పలు కమిటీలను వేశారు. పరీక్షల నిర్వహణకు, పర్యవేక్షణ కోసం డీఈసీ (జిల్లా నిర్వహక కమిటీ) వేశారు. దీనికి ఆర్ఐఓ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రైవేటు కళాశాలలు కేంద్రాలుగా ఉన్నచోట పరీక్షలు సజావుగా జరిపేందుకు లెక్చరర్స్‌ను డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌చే హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. పరీక్షల గురించి కలెక్టర్‌తో సంప్రదింపులు చేసేందుకు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా ఏజేసీని నియమించారు. రీవెరిఫికేషన్‌కు అవకాశం ప్రాక్టికల్స్‌లో 27 నుంచి 30 మార్కులు పొందిన విద్యార్థులు రీవెరిఫికేషన్ చేసుకొనేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అవకాశం కల్పించారు. కంట్రోల్ రూం ఏర్పాటు నెల్లూరులోని ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటుచేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కంట్రోల్ రూం నంబర్: 0861-2320312. -
పకడ్బందీగా ప్రాక్టికల్స్
ఈనెల 12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 148 కేంద్రాలు, 27,438 మంది విద్యార్థులు పరీక్ష కేంద్రాలు జీపీఎస్‌తో అనుసంధానం మాస్ కాపీయింగ్‌ను ఉపేక్షించేది లేదు హాల్‌టికెట్లు ఇవ్వని కళాశాలలపై చర్యలు ఆర్ఐవో ఎల్.సుహాసిని కరీంనగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు గురువారం నుంచి నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఐఓ ఎల్.సుహాసిని వెల్లడించారు. సోమవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలు, ఎక్స్టర్నల్ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. జిల్లాలో 148 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందులో 50 ప్రభుత్వ కళాశాలలు, ఎనిమిది సాంఘిక కళాశాలలు, ఒక గిరిజన సంక్షేమ కళాశాల, 89 ప్రైవేట్, ఆన్ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 27,438 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవనుండగా, ఇందులో వొకేషనల్ విద్యార్థులు 5044 మంది ఉన్నారని చెప్పారు. ఫీజు బకాయిల పేరుతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హల్‌టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణ విషయంలో డిపార్టుమెంటల్ అధికారులకు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలకు, కళాశాలల యాజమాన్యాలకు ఇదివరకే శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. నిర్ణయించిన తేదీల్లో విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయితే ఇంటర్ బోర్డు కార్యదర్శి అనుమతి తీసుకొని చివరి విడతలో పరీక్ష రాసేందుకు ఆవకాశం ఉంటుందని తెలిపారు. బ్యాచ్‌కు 25 మంది విద్యార్థులకు పరీక్ష ఉంటుందని, 25 శాతం మార్కులు అందరికీ వస్తే మళ్లీ రివేరిఫికేషన్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ప్రైవేట్ పరీక్ష కేంద్రంలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకులను డిపార్టుమెంటల్ అధికారులుగా నియమించామన్నారు. ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు బోర్డు నుంచి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జీపీఎస్‌తో అనుసంధానం.. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, వార్షిక పరీక్షల కేంద్రాలపై నిఘా ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టిన గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)లో జిల్లాలోని 148 పరీక్ష కేంద్రాలను అనుసంధానం చేసినట్టు ఆర్ఐవో తెలిపారు. ఈ విధానం ద్వారా పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాడే సెల్‌ఫోన్, ల్యాండ్‌ఫోన్ల సమాచారం పూర్తిగా రికార్డు అవుతుందన్నారు. సంక్షిప్త సందేశాల సమాచారం కూడా కంట్రోల్ రూంలో ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయిలో పనిచేసే బృందం పరిశీలన చేస్తుంటుందని చెప్పారు. ప్రశ్నపత్రాలు తరిలించే వాహనాలకు సైతం ట్రాలీట్యాగ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటి ద్వారా వాహనం ఎప్పుడు బయలుదేరింది, ఎక్కడ ఎంతసేపు ఆగింది, వాహనంలో ఏఏ విషయాలు మాట్లాడారనే పూర్తి సమాచారం నమోదై నియంత్రణ విభాగానికి చేరేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ సిబ్బందికి సంబంధించిన అన్ని సెల్‌ఫోన్, ల్యాండ్‌ఫోన్ నంబర్లను ఇంటర్ విద్యామండలికి పంపించామని తెలిపారు. -
12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
జిల్లాలో 158 పరీక్ష కేంద్రాలు విద్యారణ్యపురి : జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బీపీసీ, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ నెల 17న మహాశివరాత్రి సందర్భంగా పరీక్ష ఉండదని ఇంటర్ విద్య ఆర్ఐఓ మలహల్రావు గురువారం వెల్లడించారు. మిగతా రోజుల్లో యథావిధిగా ఆదివారం, రెండో శనివారం కలిపి పరీక్షలు జరుగుతాయన్నారు. కళాశాలల వారిగా టైం టేబుల్, హాల్‌టికెట్లు, ఓఎం ఆర్ మార్కుల జాబితాలను పంపిస్తున్నామన్నారు. జిల్లాలో సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు 158 పరీక్షా కేంద్రాలు కేటాయించారన్నారు. పరీక్షలకు మొత్తం 16,183 మంది ఎంపీసీ, 8,690 మంది బీపీసీ విద్యార్థులు మొత్తంగా 24,873మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఒకేషనల్ ఫస్టియర్‌లో 4,576 మంది, సెకండియర్‌లో 3,817 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ప్రతి రోజు టైంబేబుల్‌ప్రకారం ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. -
సబ్జెక్టును ‘ప్రాక్టికల్’గా నేర్చుకుందాం...
ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర రంగాల్లో సుస్థిర వృత్తి జీవితం లక్ష్యంగా ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులు ఎంసెట్, జేఈఈ, బిట్‌శాట్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నారు. మంచి ర్యాంకు సాధించేందుకు పక్కా ప్రణాళికలతో చదువుతున్నారు. అయితే వీరు కేవలం పోటీపరీక్షలపై దృష్టిసారిస్తే సరిపోదు. సమాంతరంగా ఇంటర్‌లోనూ అధిక మార్కుల సాధనకు కృషిచేయాలి. ఎందుకంటే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం, జేఈఈ మెయిన్‌లో 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఐఐటీ సీటు పొందాలంటే టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. అందుకే థియరీతో పాటు ప్రాక్టికల్ పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించాలి. మరికొద్ది రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎక్కువ మార్కుల సాధనకు సబ్జెక్టు నిపుణుల సూచనలు.. చేయడం ద్వారా నేర్చుకునే విజ్ఞానానికి విలువెక్కువ. ఈ పరిజ్ఞానం ఎక్కువ కాలం గుర్తుండటమే కాకుండా శాస్త్రీయ ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. శాస్త్రీయ విశ్లేషణ నైపుణ్యాలను సొంతం చేస్తుంది. అందుకే విద్యార్థులు ప్రాక్టికల్స్‌ను కేవలం మార్కుల కోణంలోనే కాకుండా భవిష్యత్‌లో చేరబోయే కోర్సులను విజయవంతంగా పూర్తిచేసేందుకు అవసరమైన పునాదులు వేసేవిగా గుర్తించాలి.చాలా మంది ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ అంటే భయపడతారు. సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. పరీక్ష స్వరూపాన్ని అర్థం చేసుకొని, తగిన నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. బోటనీ విద్యార్థి సబ్జెక్టు పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అంచనా వేసేలా ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. దీన్ని 30 మార్కులకు, మూడు గంటల వ్యవధితో నిర్వహిస్తారు. కచ్చితమైన సమాచారాన్ని ఇస్తే మంచి మార్కులు సొంతమైనట్లే. ప్రశ్నపత్రంలో మొత్తం అయిదు ప్రశ్నలుంటాయి. మొదటి ప్రశ్నలో ఇచ్చిన కొమ్మ తాలూకు శాఖీయ, పుష్ప లక్షణాలను సాంకేతిక పదాలతో వర్ణించాలి. పుష్ప విన్యాసంతో ఉన్న కొమ్మ, పుష్పం నిలువుకోత పటాలు గీసి, భాగాలు గుర్తించాలి. పుష్ప చిత్రంతో పాటు సంకేతం ఇవ్వాలి. కుటుంబాన్ని గుర్తించాలి. దీనికి ఆరు మార్కులు. స్పష్టంగా పటాలను గీయడం, భాగాలను గుర్తించడంలో పట్టు సాధించాలి. దీనికి ప్రాక్టీస్ ప్రధానం. రెండో ప్రశ్నలో ఇచ్చిన మెటీరియల్ నుంచి అడ్డుకోత తీయాలి. స్లైడ్ రూపకల్పనకు మూడు మార్కులు, గుర్తించినందుకు 1 మార్కు, పటానికి రెండు మార్కులు ఉంటాయి. Dicot and Monocot stems, Dicot and Monocot rootsను అధ్యయనం చేయాలి. మూడో ప్రశ్నలో ప్రయోగానికి ఆరు మార్కులుంటాయి. నాలుగు ప్రయోగాల్లో విద్యార్థికి ఒకటి ఇస్తారు. ఈ ప్రయోగాలకు సిద్ధమయ్యేందుకు లేబొరేటరీ మాన్యువల్‌ను ఉపయోగించుకోవాలి. ప్రయోగం 1: Osmosis by potato Osmoscope ప్రయోగం 2: Study of Plasmolysis in epidermal peel of leaf. ప్రయోగం 3: Transpiration by Cobalt Chloride method ప్రయోగం 4: Separation of leaf pigments or Chloroplast pigments' by paper chromatographic technique.నాలుగో ప్రశ్నలో సరైన కారణాలతో స్పెసిమన్‌ను గుర్తించాలి. దీనికి అయిదు మార్కులు. ఇందులో డి నుంచి హెచ్ వరకు ప్రశ్నలుంటాయి. ప్రతి దానికి ఒక మార్కు. రికార్డుకు అయిదు మార్కులు, హెర్బేరియంకు రెండు మార్కులుంటాయి. సిలబస్‌లో పేర్కొన్న కుటుంబాలకు సంబంధించి కనీసం 15 హెర్బేరియం షీట్లు ఉండేలా చూసుకోవాలి. ఆకులు, పుష్పాలు ఉండే కొమ్మలను సేకరించాలి. ఫిజిక్స్ ప్రశ్నపత్రం 30 మార్కులకు ఉంటుంది. మూడు గంటల్లో పూర్తిచేయాలి. 20 ప్రయోగాల నుంచి నుంచి 38 ప్రశ్నలుంటాయి. వీటిలో ఒక ప్రశ్నను లాటరీ ద్వారా ఎంపిక చేసి, విద్యార్థికి ఇస్తారు. మార్కుల విభజన: ఫార్ములా, పద్ధతికి 5 (2+3) మార్కు లు. పట్టిక, పరిశీలన, గ్రాఫ్‌లకు 8 (2+4+2) మార్కు లు. క్యాలిక్యులేషన్స్, ఫలితాలు, ప్రమాణాలకు 6 (4+1+1) మార్కులు. జాగ్రత్తలకు రెండు మార్కులు, వైవాకు 5 మార్కులు, రికార్డుకు 4 మార్కులు కేటాయించారు. ప్రయోగానికి సంబంధించిన ఫార్ములాను ప్రమాణాలతో సహా రాసి, అందులోని పదాలను వివరించాలి. ప్రయోగ విధానాన్ని సొంత వాక్యాల్లో క్లుప్తంగా రాయొచ్చు. నమూనా పట్టికను గీయాలి. అవసరమైన గ్రాఫ్ నమూనాను పెన్సిల్‌తో సూచించాలి. విద్యుత్ ప్రయోగాలకు అవసరమైన వలయాలను గీయాలి. ప్రయోగానికి సంబంధించి కనీసం రెండు జాగ్రత్తలు రాయాలి. ఈ ప్రక్రియనంతా 20 నిమిషాల్లో పూర్తిచేసి, ప్రయోగం ప్రారంభించాలి. మళ్లీ పట్టికలను గీసి, వాటిలో ప్రయోగం చేసేటప్పుడు వచ్చే కొలతలను పొందుపర్చాలి. గణనలను స్పష్టంగా చూపాలి. కొలతల ప్రకారం గ్రాఫ్ గీయాలి. చివర్లో వచ్చి న ఫలితాన్ని ప్రమాణాలతో సహా స్పష్టంగా రాయాలి. వైవాపై ఆందోళన అనవసరం. దాదాపు అన్ని ప్రయోగాలు ఇంటర్ పాఠ్యాంశాలకు సంబంధించినవే కాబట్టి వాటి ప్రాథమిక, సైద్ధాంతిక అంశాలపై పట్టు సాధిస్తే సరిపోతుంది. రికార్డుకు సంబంధించి మొత్తం 20 ప్రయోగాల్లో అయిదు ప్రయోగాలకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. కాబట్టి కనీసం 20 ప్రయోగాలు రికార్డులో ఉండేలా చూసుకోవాలి. జువాలజీ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం చాలా ముఖ్యం. జంతుశాస్త్రంలోని వివిధ అంశాలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మూడు గంటల వ్యవధి ఉండే పరీక్షపత్రంలో నాలుగు భాగాలుంటాయి. వానపాము, బొద్దింక, మానవుడు.. వీటిలోని వివిధ వ్యవస్థల పటాలు/నమూనాలను విద్యార్థులకు ఇస్తారు. వీటిలో వివిధ వ్యవస్థలను గుర్తించి, వాటి పటాన్ని గీయాలి. కనీసం నాలుగు భాగాలు గుర్తించాలి. వీటికి ఆరు మార్కులు కేటాయించారు. గుర్తింపునకు ఒక మార్కు, పటానికి మూడు మార్కులు, భాగాల గుర్తింపునకు రెండు మార్కులు ఉంటాయి. వానపాములోని మూడు వ్యవస్థలకు సంబంధించి జీవి ఖండితాలను గుర్తించాలి. ఆయా వ్యవస్థల్లోని భాగాలను, అవి విస్తరించి ఉండే ఖండితాలను జాగ్రత్తగా పరిశీలించాలి. బొద్దింక ముఖ భాగాలు, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ పటాలను కూడా సాధన చేయాలి. మానవునికి సంబంధించి జీర్ణ, ధమని, సిర, పురుష-స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు సిలబస్‌లో ఉన్నాయి. రెండో భాగానికి అయిదు మార్కులు కేటాయించారు. ఇచ్చిన శాంపిల్స్‌లో పిండిపదార్థాలు, గ్లూకోజ్, కొవ్వు పదార్థాలను, ఆల్బుమిన్‌ను గుర్తించాలి. అదే విధంగా పిండి పదార్థాల జీర్ణక్రియలో లాలాజల అమైలేజ్ పాత్రను నిరూపించాలి. మూడో భాగంలో ఏ, బీ, సీ, డీ, ఈ.. క్రమంలో అమర్చిన స్పాటర్స్‌ను గుర్తించి, పటాన్ని గీయాలి. గుర్తింపు లక్షణాలను రాయాలి. ఈ భాగానికి 14 మార్కులు కేటాయించారు. వీటిలో అకశేరుకాల స్లైడ్లు, నమూనాలు, కణజాల స్లైడ్లు, సకశేరుకాల స్లైడ్లు, సకశేరుకాల నమూనాలు, కీళ్లు వంటి వాటిని ఇచ్చారు. సిలబస్‌లోని అంశాలను విపులంగా సాధన చేయాలి. అధ్యాపకుల సలహాలు తీసుకొని, వేటిని గుర్తింపు లక్షణాలుగా రాయాలో తెలుసుకోవాలి. నాలుగో భాగం రికార్డుకు సంబంధించినది. దీనికి అయిదు మార్కులు. కెమిస్ట్రీ పోటీపరీక్షల్లోని ప్రస్తుత ర్యాంకింగ్ విధానంలో ఇంటర్లో సాధించిన ప్రతి మార్కూ కీలకమే. అందువల్ల ప్రాక్టికల్స్‌ను అశ్రద్ధ చేయకూడదు. కెమిస్ట్రీకి సంబంధించి కాలేజీలో క్షుణ్నంగా చదువుకున్న అంశాల నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలో ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఆందోళన అనవసరం. ప్రాక్టికల్స్‌కు సిద్ధంకావడంలో భాగంగా మాన్యువల్‌ను క్షుణ్నంగా చదవాలి. విధి సెక్షన్ 1కు ఎనిమిది మార్కులు కేటాయించారు. ఇది సంబంధించినది. ప్రయోగ విధానానికి రెండు మార్కులు, ఫార్ములాకు 1 మార్కు, క్యాలిక్యులేషన్‌కు 1 మార్కు, టైట్రేషన్కు 4 మార్కులుంటాయి. సెక్షన్ 2కు 10 మార్కులు కేటాయించారు. ఇది గుణాత్మక విశ్లేషణ (ఖఠ్చజ్ట్చ్టీజీఠ్ఛి అ్చడటజీట)కు సంబంధినది. ప్రాథమిక పరీక్షలకు రెండు మార్కులు, ఆనయాన్ గుర్తింపునకు 4 మార్కులు, కేటయాన్ గుర్తింపునకు మూడు మార్కులు, సాల్ట్ రిపోర్టుకు 1 మార్కు ఉంటుంది. సెక్షన్ 3కు ఆరు మార్కులుంటాయి. ఇందులో నాలుగు భాగాలుంటాయి. అవి ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్, ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్, క్రమటోగ్రఫీ, కార్బోహైడ్రేట్స్/ప్రొటీన్స్. ఒక విభాగం నుంచి మాత్రమే ప్రశ్న ఇస్తారు. సెక్షన్-4కు ఆరు మార్కులు కేటాయించారు. ఇందులో రికార్డు, వైవా, ప్రాజెక్టు ఉంటాయి. ఒక్కో దానికి రెండు మార్కులు. రికార్డుకు రెండు మార్కులు కేటాయించారు. దీంతో పాటు ఇంటర్ బోర్డు నిర్దేశించిన విధానంలో ల్యాబ్ ఇన్చార్జ్ ధ్రువీకరించిన ప్రాజెక్టు నివేదికను సమర్పించాలి. వైవాలో ఎగ్జామినర్ సాధారణంగా ప్రాథమిక భావనలు, ప్రాక్టికల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల ప్రశ్నను క్షుణ్నంగా అర్థం చేసుకొని, స్పష్టంగా సమాధానమివ్వాలి. సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పాలి. అంతేకానీ ఏదో ఒకటి చెప్పకూడదు. పరీక్ష సమయంలో.. విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షకు పెన్సిల్, రబ్బరు, స్కేలు, రికార్డును తీసుకెళ్లాలి. పరీక్ష గదిలో ఎగ్జామినర్ సూచనలను కచ్చితంగా పాటించాలి. హుందాగా ప్రవర్తించాలి. ఎగ్జామినర్ అడిగే ప్రశ్నలకు స్పష్టంగా, నెమ్మదిగా, మర్యాదపూర్వకంగా సమాధానాలు చెప్పాలి. ఇతరులతో మాట్లాడకుండా క్రమశిక్షణ పాటించాలి. Prepared by: ఫిజిక్స్: పి.కనకసుందర్ రావు కెమిస్ట్రీ: టి.కృష్ణ బోటనీ: బి.రాజేంద్ర జువాలజీ: కె.శ్రీనివాసులు -
వంట వండి.. ఇస్త్రీ చేసి..!
కల్లూరు రూరల్ (కర్నూలు), న్యూస్‌లైన్ : ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా కర్నూలు నగరం ఏపీఎస్పీ క్యాంప్‌లో ట్రేడ్మన్ అభ్యర్థుల ఎంపికకు సోమవారం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వృత్తి నైపుణ్యాన్ని పరిశీలించారు. వంట మాస్టారు, హౌస్ కీపింగ్, కుకింగ్ హెల్పర్ పనులతో పాటు వడ్రంగి, కమ్మరి, రజక, క్షౌర వృత్తుల నిర్వహణలో వీరికి ప్రవేశం ఉందా.. లేదా..? అని పరీక్షించారు. మొత్తం 428 మంది అభ్యర్థులు హాజరుకాగా జూలై 27వ తేదీ వీరికి రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు కల్నల్ జాఫ్రి తెలిపారు. సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్మన్, టెక్నికల్,నర్సింగ్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని, కొందరి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిందని చెప్పారు. అయితే, ఈ నెల 1న సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన క్లర్క్, స్టోర్‌కీపర్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగలేదని, వాటిని మంగళవారం నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. రోజుకు 240 మంది అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్నారని, మంగళవారంతో ముగుస్తుందని జాఫ్రి పేర్కొన్నారు. -
వంట వండి.. ఇస్త్రీ చేసి..!
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా సోమవారం కర్నూలు నగరం ఏపీఎస్పీ క్యాంప్‌లో ట్రేడ్‌మెన్ అభ్యర్థుల ఎంపికకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వృత్తి నిపుణతను పరిశీలించారు. వంట మాస్టారు, హౌస్ కీపింగ్, కుకింగ్ హెల్పర్ పనులతో పాటు వడ్రంగి, కమ్మరి, రజక, క్షౌర వృత్తుల నిర్వహణలో వీరికి ప్రవేశం ఉందా లేదా అనేది పరీక్షించారు. మొత్తం 428 మంది అభ్యర్థులు హాజరవగా వీరికి జులై 27వ తేదీన రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కల్నల్ జాఫ్రి తెలియజేశారు. సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్‌మెన్, టెక్నికల్,నర్సింగ్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని, కొందరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని చెప్పారు. అయితే ఈనెల 1న సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన క్లర్క్, స్టోర్‌కీపర్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగలేదని, మంగళవారం నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రోజుకు 240 మంది అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్నారని, మంగళవారంతో ఇది ముగుస్తుందన్నారు. -
16 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ :ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష లు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రాక్టికల్ పరీక్షలు 26 నుంచి జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 2,146 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 3,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం పది, ఇంటర్ విద్యార్థుల కోసం తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈఓ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత స్టడీ సెంటర్ ద్వారా గానీ, ఏపీఓపెన్ స్కూల్ వెబ్సైట్ ద్వారా గానీ ఈ నెల 10 వరకు హాల్‌టికెట్లు పొందవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, విద్యాశాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లా స్థాయిలో ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలనూ నియమించామన్నారు. ఈ ఏడాది జిల్లా స్థాయి పరిశీలకులను కూడా నియమించామన్నారు. పరీ క్షలు మొదలైన తర్వాత కేవలం 15 నిముషాల వరకే అభ్యర్థులను అనుమతిస్తామని స్పష్టం చేశారు.