Pradhan Mantri Jan-Dhan Yojana
-
403.5 మిలియన్ ఖాతాలు.. 1.30 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలని, ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ద్వారా ఇప్పటి వరకు 403.5 మిలియన్ ఖాతాలు తెరచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ అకౌంట్లలో ఇప్పటి వరకు లక్షా ముప్పై వేల కోట్లకు పైగా డబ్బు డిపాజిట్ అయినట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కాగా సంక్షేమ పథకాల లబ్దిదారులు, పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రసంగంలో భాగంగా 2014లో ఈ పథకం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. (చదవండి: ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్ధులు బాధ్యులా?) ఈ క్రమంలో ఆగష్టు 28న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నేటితో ఈ కార్యక్రమానికి ఆరేళ్లు పూర్తైన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ‘‘బ్యాంకు అకౌంట్లు లేని వాళ్లకు ఖాతాలు తెరిచే లక్ష్యంతో.. ఇదే రోజు, ఆరు సంవత్సరాల క్రితం ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించాము. ఇదొక గేమ్‌ఛేంజర్ వంటిది. కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చింది. ఎంతో మందికి భద్రతతో కూడిన భవిష్యత్తును అందించింది. ఈ పథకంలో ఎక్కువ మంది లబ్దిదారులు గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్విరామంగా కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ( చదవండి: స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!) బీమా సౌకర్యం పీఎంజేడీవై ఖాతాదారులందరికీ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన తదితర పథకాల కింద ఇన్పూరెన్స్ సౌకర్యం కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే వివిధ బ్యాంకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, రూపే డెబిట్ కార్డు వినియోగాన్ని పెంచడం, మైక్రో క్రెడిట్ కార్డు, మైక్రో ఇన్వెస్ట్మెంట్ సౌకర్యం కల్పించడం తదితర కార్యకలాపాలను ముమ్మరం చేయనుంది. మహిళా ఖాతాదారులు 55.2 శాతం ఇక ఆగష్టు 19న విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం, పీఎండీజేడీవై అకౌంట్లలో 63.6 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కాగా, 55. 2 శాతం ఖాతాలు మహిళలవే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో సంక్షేమ పథకాల ఫలాలను అందించడం సులభతరమైందని ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా తమ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా జన్ ధన్ ఖాతా అనేది జీరో అకౌంట్. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఓపెన్ చేయొచ్చు. కార్పొరేషన్ బ్యాంకులతో పాటు.. పోస్టాఫీస్‌లో కూడా ఈ అకౌంట్‌ను తెరవచ్చు. ఇందుకోసం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, నివాస పత్రం, రెండు ఫోటోలు ఉంటే చాలు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండేళ్ల పాటు ఈ ఖాతా ద్వారా ఎలాంటి లావాదేవీలు జరగనట్లయితే ఇది పనిచేయకుండా పోతుంది. ఇక అకౌంట్ నిర్వహణకు సంబంధించిన వివరాలకై ‘‘జన్ ధన్ దర్శక్ యాప్’’అనే మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే సమీపంలోని బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, బ్యాంకు మిత్రలు, పోస్ట్ ఆఫీసు వివరాలు తెలుసుకోవచ్చు. Thanks to the Pradhan Mantri Jan Dhan Yojana, the future of several families has become secure. A high proportion of beneficiaries are from rural areas and are women. I also applaud all those who have worked tirelessly to make PM-JDY a success. #6YearsOfJanDhanYojana pic.twitter.com/XqvCxop7AS — Narendra Modi (@narendramodi) August 28, 2020 -
హెల్త్‌కు వెల్త్
న్యూఢిల్లీ: ‘‘ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. పౌరుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నాం’’ అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరచడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రుల సంఖ్యను పెంచనున్నారు. ఆరోగ్యం అంటే వ్యాధులు సోకితే ఆస్పత్రుల్లో చికిత్స చేయడమే కాదు, ప్రజలు రోగాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌గా ఉండేలా చూడడం కూడా. ఇందుకోసం ఈ సారి ప్రజారోగ్యమే అంతిమ లక్ష్యంగా కేంద్రం కొనసాగిస్తున్న ఎన్నో పథకాలను విస్తరించాల్సిన అవసరం గురించి సీతారామన్ వివరించారు. గత బడ్జెట్‌తో పోల్చి చూస్తే ఆరోగ్య రంగ నిధుల్ని 8శాతం పెంచారు. ఆయుష్మాన్ భారత్ విస్తరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల పథకం ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) విస్తరించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఆస్పత్రుల ఏర్పాటు ప్రైవేటు వ్యక్తులకి లాభదాయం కాకపోతే వయబిలిటీ గ్యాప్ కింద ప్రభుత్వమే నిధుల్ని సమకూరుస్తుంది. దీని కోసం దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చే ఆస్పత్రులు లేని చోట కొత్త ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా యువతకు ఎన్నో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌కి గత బడ్జెట్లో రూ.6,400 కోట్లు కేటాయిస్తే, ఈ సారీ అంతే మొత్తాన్ని కేటాయించారు. 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత్ జనాభాలో దాదాపుగా 40శాతం మందికి లబ్ధి చేకూరేలా, నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపుగా 50 కోట్ల మంది ఈ పథకం లబ్ధి దారులుగా ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019, నవంబర్ 25 నాటికి ఆయుష్మాన్ భారత్ కింద 11.4 కోట్ల మందికి ఇ–కార్డుల్ని జారీ చేశారు. ప్రతీ జిల్లాలో ఓ మెడికల్ కాలేజ్ దేశంలోని ప్రతీ జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని, దీన్ని అధిగమించడానికి ప్రైవేటు–ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతీ జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి మెడికల్ కాలేజీని అనుంబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. భూమి, మౌలిక సదుపాయాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రాష్ట్రాల్లో వీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రోగులు– వైద్యుల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ పథకం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సరిపడినంత స్థాయిలో రెసిడెంట్ డాక్టర్స్ డిప్లొమా/ ఫెలో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోర్సులను ఆఫర్ చేసే ఆసుపత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యాంశాలు.. ► మిషన్ ఇంద్ర ధనుష్ (ప్రభుత్వ వాక్సినేషన్ కార్యక్రమం) కింద అయిదు వైరస్లు సహా 12 కొత్త తరహా వ్యాధుల్ని తీసుకువచ్చారు. ► ప్రజల జీవన విధానంలో వచ్చే మార్పుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఫిట్ ఇండియా ఉద్యమం, అందరికీ సురక్షిత మంచినీరు అందించడం కోసం జలజీవన్ మిషన్ , దేశంలో పారిశుద్ధ్య వ్యవస్థని మెరుగుపరిచి పరిశుభ్రంగా ఉండడం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిరుపేదలకు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. ► ఆయుష్మాన్ భారత్ కిందకి వచ్చే ఆసుపత్రుల సంఖ్యను టైర్ 2, టైర్ 3 నగరాల్లో పెంచాలని నిర్ణయం. ప్రస్తుతం ఈ పథకం కింద 20 వేలకుపైగా ఆసుపత్రులు ఉన్నాయి. మరో వెయ్యి ఆస్పత్రులు పెంచడానికి చర్యలు ► ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో మెడికల్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం. ► ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు దొరికేలా అన్ని జిల్లాల్లో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు. జనరిక్ మెడిసిన్స్‌ని విక్రయించే ఈ దుకాణాలను నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు. ► వైద్య పరికరాల దిగుమతులు, విక్రయం ద్వారా వచ్చే పన్నుల్ని ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగం. కొన్ని నిర్దిష్ట వైద్య పరికరాల దిగుమతులపై 5శాతం ఆరోగ్య సెస్ విధింపు . ప్రస్తుతం భారత వైద్య పరికరాల రంగం 80 నుంచి 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడింది. ఈ నిర్ణయంతో రెండు రకాలుగా ప్రయోజనాలున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీకి చెందిన సమన్వయకర్త రాజీవ్ నాథ్ అన్నారు. వైద్య పరికరాల రంగం మేకిన్ ఇండియాకు ఊతమిస్తుందని, మౌలిక సదుపాయాలకు ఈ నిధుల్ని వినియోగించడం వల్ల జాతీయ ఆరోగ్య రంగ భద్రతపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోయే అవకాశాలున్నాయని అన్నారు. ► ఆరోగ్య రంగ అధికారులు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వ్యాధులపై పోరాటం చేయాలి. ► క్షయ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అన్న నినాదంతో ట్యూబర్ కొలాసిస్ (టీబీ)పై పోరుబాట. 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం అడుగులు. -
జన్‌ధన్ ఓవర్–డ్రాఫ్ట్ రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటుగా మరింత మంది బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించింది. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మంచి ఆదరణ లభిస్తున్నందున.. పథకాన్ని కొనసాగించడంతోపాటు ప్రస్తుతమున్న రూ.5వేల ఓవర్ డ్రాఫ్ట్‌ను రూ.10వేలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. రూ.2వేల వరకు ఓవర్–డ్రాఫ్ట్ ఎలాంటి షరతులు ఉండవని.. ఈ సదుపాయాన్ని పొందేందుకు గరిష్ట వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటుగా ఆగస్టు 28 నుంచి జన్‌ధన్ అకౌంట్లపై ఉన్న ఉచిత ప్రమాదబీమా మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.2లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 32.41కోట్ల జన్‌ధన్ అకౌంట్లు తెరవగా.. వీటిలో రూ.81,200కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో 30 లక్షల మంది ఓవర్–డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారన్నారు. ఆగస్టు 2014లో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజనను మొదట నాలుగేళ్లు మాత్రమే అమలుచేయాలనుకున్నా.. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ కారణంగా కొనసాగించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. అటు, దేశవ్యాప్తంగా పులులు, ఏనుగుల సంరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రభుత్వ నిధులతో నడిచే ‘వన్యప్రాణి నివాస సమగ్రాభివృద్ధి’ పథకాన్ని 2019–20 వరకు కొనసాగించాలని కూడా కేబినెట్ నిర్ణయిచింది. -
పది రోజులాగితే ఖాతాలోకి రూ.15 లక్షలు వస్తాయా?
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకొని నేటికి దాదాపు 40 రోజులవుతోంది. తన నిర్ణయం వల్ల తలెత్తిన ఇబ్బందులను ఒక్క యాభై రోజులు భరించమని దేశ ప్రజలు మోదీ చేసిన విజ్ఞప్తిలో కూడా మిగిలింది ఇంకా పది రోజులే. నేటికి బ్యాంకుల ముందు ప్రజల క్యూలూ తగ్గలేదు. ఏటీఎంలు పనిచేయడం లేదు. బ్యాంకుల వద్ద అసహనం భరించలేక ఖాతాదారులు బ్యాంకు సిబ్బందిని చితకబాదుతున్న సంఘటనలు కూడా వింటున్నాం. పింఛను డబ్బుల కోసం ముగ్గుబుట్ట ముసలవ్వలు బ్యాంకుల వద్దే తెల్లార్లు పడిగాపులు పడుతున్నా దృశ్యాలను చూస్తున్నాం. ఇన్ని బాధలు, కష్టాలు భరిస్తూ కూడా నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని పేదలు, బడుగువర్గాలు, సగటు జీవులు ఎందుకు విమర్శంచడం లేదు? రాబిడ్ హుడ్లాగా మోదీ పెద్దోళ్లను దోచి పేదోళ్లకు పెడతారని ఆశిస్తున్నారా? ఆయన హామీ ఇచ్చినట్లుగా జన్‌ధన్ యోజన పథకం కింద బ్యాంక్‌ల ఖాతాల్లోకి 15 లక్షల రూపాయలు వచ్చి పడతాయని భ్రమ పడుతున్నారా? మోదీ చెప్పినట్లుగా ఇంకా పది రోజులే కాదు, మరో పాతిక రోజులు కష్టనష్టాలను భరించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నా బడుగు జీవులు కూడా దేశంలో ఎంతమందో ఉన్నారు. ఎందుకు? మొదట దేశభక్తి, జాతీయవాద ప్రభావమని భావించారు. అదంతా రాజకీయ వాదమే. వివిధ మీడియాల ముందు పేదలు, బడుగు జీవులు, సగటు భారతీయులు, మధ్యతరగతి ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలను పరిశీలిస్తే ఇది ఒకరకమైన మానసిక పరిస్థితిని సూచిస్తోంది. ధనవంతుల మీద పేదవాళ్లకున్న ఆక్రోశంగా కనిపిస్తోంది. తామింత కాలం పడిన ఇబ్బందులకు కనీసం ఒక్కసారైనా ధనవంతుడు ఇబ్బంది పడాలన్న ఆక్రందన అనిపిస్తోంది. తమ కష్టాలకు ఫలితం తమకు దక్కకపోయినా మిద్దెల్లో నివసించే పెద్దలకు కొంతైన బుద్ధి చెప్పాలనే గద్దింపు గోచరిస్తోంది. ఎప్పుడూ హిందూ, ముస్లింలు అనే అంశంపై చర్చ జరిగే ఈ దేశంలో మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల మొట్టమొదటిసారిగా ప్రజల మధ్య పేద, ధనిక అనే చర్చ జరుగుతోంది. ధనిక, పేద మధ్య వ్యత్యాసం బాగా పెరిగి పోవడమే ఈ చర్చకు దారి తీసిందేమో? ఓ సగటు జీవి వెయ్యి సంవత్సరాలు కష్టపడితే వచ్చే ఆదాయానికి సమానమైన మొత్తాన్ని ఓ ధనవంతుడు నేడు ఓ కారు కొనడానికి ఖర్చు పెడుతున్నారు. అంటే ధనవంతుల పట్ల వారికి ఎంత ఆక్రోశం పెరుగుతుండాలి. ‘మేము 15, 20 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాం. రోజంతా కష్టపడితే వచ్చే డబ్బు కుటుంబం ఆ రోజు అవసరాలకే సరిపోతుంది. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు. ఇకముందు వస్తుందన్న ఆశలేదు. మోదీ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలివ్వాలి. ముఖ్యంగా నల్ల డబ్బున్న వారిని జైలుకు పంపాలన్న కసి మాలో ఎంతో ఉంది. రేపు ఇందులో మోదీ విఫలమైనా మాకొచ్చే నష్టమేమి లేదు. మా జీవితాలు ఇలాగే కొనసాగుతాయి’ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఢిల్లీలోని కొంత మంది ఆటో డ్రైవర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ‘నేను 15 ఏళ్లుగా ఓ పెద్ద మనిషి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ఇన్నేళ్లకు నా జీతం 15 వేల రూపాయలకు చేరుకుంది. డబ్బులు పెంచుమని అడిగే ధైర్యం కూడా నాకు లేదు. అడిగిన రోజున ఇంటికెళ్లిపో, మరోకడు వస్తాడని బెదిరిస్తారు. అది కూడా నిజమే. కార్లలో వాళ్ల కులుకులను, షికార్లను చూస్తుంటే కడుపు మండిపోతోంది. మోదీ నిర్ణయం వల్ల వాళ్లకు ఏదైనా కావాలి’ ఇది మరో మీడియా ముందు కారు డ్రైవర్ ఆవేదన. పేదల్లో ఉండే ఇలాంటి సైక్‌ను ‘ష్రేడన్ ఫియూడ్’ అనే జర్మనీ పదంతో పోల్చవచ్చు. మరో వ్యక్తి సొమ్ము కోల్పోతే ఒక వ్యక్తి ఆనందించం ఈ పదానికి అర్థం. దీన్ని మన భారతీయ మానసిన శాస్త్రవేత్తలు ‘మూమెంటరసీ ఫ్లెజర్’ అని పిలుస్తారు. అది అప్పటికప్పుడు కలిగే క్షణికానందం లాంటిది. ఇలాంటి వారితో పాటు తమకేదో మేలు జరుగుతుందన్న ఆశిస్తున్నవారు, రాజకీయంగా మోదీని సమర్పిస్తున్నవారు కూడా ఎక్కువే ఉన్నారు. మోదీ నిర్ణయం ‘మిస్‌ఫైర్’ అయితే అది మళ్లీ పేద, బడుగువర్గాల వారినే బలి తీసుకుంటుందా? అన్నదే బాధంతా. ––ఓ సెక్యులరిస్ట్ కామెంట్