Pratyusha case
-
నా కూతురి కేసులో అసలు తీర్పే రాలేదు
ప్రత్యూష ఉదంతం 2002, ఫిబ్రవరిలో జరిగింది. పదిహేడేళ్లు పూర్తయ్యాయి. న్యాయం కోసం పోరాటం సాగుతూనే ఉంది. న్యాయం ఎప్పటికి వస్తుందో తెలియదు. కేసు సుప్రీం కోర్టులో డబుల్ బెంచ్‌లో ఉంది. ఈ ఏడాది మేలో ఒకసారి బెంచ్ మీదకు వచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి తరఫు న్యాయవాది మరణించడంతో మరికొంత జాప్యం చోటు చేసుకుంది. మళ్లీ టేబుల్ మీదకు ఎప్పుడు వస్తుందోనని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి ఎదురు చూస్తున్నారు. ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ‘సాక్షి’ ఆమెను పలకరించింది. ‘‘దిశ సంఘటనలో చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు కడుపుకోతకు గురైన మాలాంటి తల్లులకు మాత్రం ఇదే సరైంది... అనిపిస్తుంది. ‘దుష్ట శిక్షణ జరిగింది’ అనే భావన మహిళలకు మనోనిబ్బరాన్నిచ్చింది కూడా. కానీ శిక్ష ఎప్పుడూ న్యాయపరిధిలోనే ఉండాలి. ఇలాంటి కేసుల్లో శిక్ష ఎప్పుడూ కఠినంగానే ఉండాలి. మరొకరు నేరానికి పాల్పడేటప్పుడు శిక్ష గుర్తుకు వచ్చి భయపడేలా ఉండాలి. దిశ సంఘటన జరిగిన ఈ కొద్ది రోజుల్లోనే నిందితులు సమాధి అవుతున్నారు. ఆమె ఆత్మ శాంతించి ఉంటుంది. అలాంటి శాంతి ప్రత్యూష ఆత్మకు ఎప్పుడు కలుగుతుందో ఏమో? నిర్భయ కేసులో న్యాయస్థానం సత్వరం స్పందించి తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పును అమలు చేయడంలో జాప్యం చేస్తోంది. ప్రత్యూష కేసులో ఇంకా తుది తీర్పు వెలువడనే లేదు. ఎప్పుడైనా సరే... ఒక ఆడపిల్ల విషయంలో... అది కూడా అత్యాచారం హత్య జరిగినప్పుడు న్యాయస్థానాలు వీలయినంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పునివ్వాలి. ఆలస్యం జరిగే కొద్దీ కేసు తీవ్రత తగ్గిపోతుంటుంది. కేసు పలుచబడిపోతుంటుంది. అవకాశవాదుల చేతుల్లో సాక్ష్యాలు తారుమారయిపోతుంటాయి. దాంతో శిక్షలు నామమాత్రంగా మారిపోతుంటాయి. సిద్ధార్థ కేసులో కూడా ఒక కోర్టు విధించిన శిక్షను∙మరొక కోర్టు తగ్గించింది. విచారణ ఆలస్యం జరగడం కూడా ఇందుకు ఒక కారణమే. తొమ్మిది నెలల పాపాయి మీద అత్యాచారం చేసిన నిందితుడికి ఒక కోర్టు మరణ శిక్ష విధిస్తే, పై కోర్టు ఆ శిక్షను సవరించి జీవితఖైదుగా మార్చింది. ఈ సందర్భంగా నాది మరొక విన్నపం. ఆడపిల్లలకు అన్యాయం జరిగిన కేసుల విషయంలో న్యాయవాదులు స్వీయ నియంత్రణ పాటించాలి. అమ్మాయి మీద అత్యాచారం జరిగిందనేది వాస్తవం, హత్య జరిగిందనేది వాస్తవం. నిందితుల తరఫున వాదిస్తూ రెండు వాస్తవాలను అవాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేసే ముందు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. న్యాయవాదులందరూ కలిసి మన చట్టాలను పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మాలాంటి బాధిత కుటుంబాలకు న్యాయపోరాటంలో ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. బలవంతులతో న్యాయపోరాటం చేయాల్సి వచ్చినప్పుడు బలహీనులు అడుగడుగునా ఎదురీదాల్సి వస్తోంది. అందుకు నేనే ఉదాహరణ’’. -
బాబు హయాంలో మహిళలకు అన్యాయం: ప్రత్యూష తల్లి
సాక్షి, హైదరాబాద్: ‘మహిళోద్ధారణ చేస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీలు చేయటం విచిత్రంగా ఉంది. 2002లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన సన్నిహితులు నా బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేశారు. న్యాయం కోసం మేం పోరాటం చేస్తే అధికార బలంతో ఏ ఒక్క ఆధారం లేకుండా చేశారు. అయినా సుప్రీంకోర్టులో ఒంటరి పోరాటం చేస్తున్నాను’అని 2002లో మరణించిన సినీ నటి ప్రత్యూష తల్లి పాదరాజు సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి దాచేపల్లి, రిషితేశ్వరి ఘటనలు, విజయవాడలో కాల్‌మనీ గ్యాంగ్‌లు మహిళలపై అరాచకాల అనంతరం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, ర్యాలీలు చూసి కడుపు మండి మీడియాతో మాట్లాడాల్సి వస్తోందని, చంద్రబాబు హయాం అంతా మహిళలకు వ్యతిరేకమేనని సరోజినీదేవి చెప్పారు. తన బిడ్డపై అత్యాచారం, హత్య జరిగిందని ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబును కలసి ఆధారాలు ఇచ్చినా.. వాటన్నింటినీ తారుమారు చేశారని ఆరోపించారు. ఆనాటి హత్య కేసును తిరిగి విచారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టి తన కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని సరోజినీదేవి చెప్పారు. -
మేం పెళ్లి చేసుకుంటాం!
♦ ప్రత్యూష కేసులో మరో ట్విస్ట్ ♦ మేజర్‌నని, పెళ్లికి అనుమతించాలని కోర్టుకు విన్నపం సాక్షి, హైదరాబాద్: కన్నతండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ప్రత్యూష త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా..? ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి వచ్చిన యువకుడితో చిగురించిన ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లబోతోందా..? ఇందుకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సొంత తల్లి మరణంతో సవతి తల్లి పెంపకంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న సమయంలో గతేడాది మీడియా, బాలల హక్కుల సంఘం చొరవతో ప్రత్యూష ఆస్పత్రిలో చేరటం, ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు స్పందనతో ప్రభుత్వ అధీనంలోని ఓ సంరక్షణ కేంద్రంలో చేర్పించి ఆమె యోగక్షేమాలు చూస్తూ వస్తున్నారు. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వొకేషనల్ పరీక్ష కూడా పాసైంది. బీఎస్సీ నర్సింగ్ చేయటమే తన లక్ష్యంగా చెప్పిన ఆమె.. తాజాగా తాను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకట మద్దిలేటిరెడ్డిని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకున్నాకే చదువుకుంటానంటూ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించింది. ఈ విషయాన్ని మహిళా సంక్షేమ శాఖ డెరైక్టర్ విజయేంద్రకు కూడా తెలిపింది. ఈ విషయమై ఆమె న్యాయవాది ప్రత్యూషకు పలుమార్లు కౌన్సెలింగ్ చేసే యత్నం చేస్తున్నా.. ప్రస్తుతం తాను ఇరవై ఏళ్ల మేజర్న ని, తన ఇష్టప్రకారం చేయాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఎవరీ మద్దిలేటిరెడ్డి? కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఆచారి కాలనీకి చెందిన మద్దిలేటిరెడ్డి(27) బీఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ఆటోమొబైల్ షాపులో స్టోర్ కీపర్‌గా పని చేస్తున్నాడు. గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్న తన మిత్రుడి పరామర్శకు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను పలకరించేందుకు వెళ్లి, ఏ ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయాలంటూ ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఇలా వరుసగా రెండ్రోజులు వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకుని ఆళ్లగడ్డకు వెళ్లాడు. ప్రభుత్వ సంరక్షణలో చేరిన తర్వాత మద్దిలేటికి ప్ర త్యూష ఫోన్ చేయటం, అతను కూడా ఆమెకు ఫోన్లు చేయటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ, పెళ్లి ప్రస్తావన వరకు వెళ్లింది. హాస్టల్లో ఉండలేను.. పెళ్లి చేసుకుంటా నేను హాస్టల్లో ఉండలేను. మద్దిలేటిరెడ్డిని పెళ్లి చేసుకున్నాకే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేస్తా. హాస్టల్లో అన్నంలో సోడా వేస్తున్నారు. ఉడకని బియ్యంతో కూడిన అన్నం తినలేక పోతున్నా. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెడుతోంది. - ప్రత్యూష ఆమెనే పెళ్లి చేసుకుంటా ప్రత్యూషను ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటా. ఈ విషయాన్ని మా ఇంట్లో కూడా చెప్పి అమ్మను ఒప్పించాను. నేను పేదవాడినైనా, మాట తప్పేవాడిని కాదు. ఆమే తొలుత నాకు ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటా. - మద్దిలేటిరెడ్డి కౌన్సెలింగ్ ఇప్పించాలి ప్రత్యూషను ఆస్పత్రి నుంచి తీసుకువెళ్లి సంరక్షణ కేంద్రంలో పెట్టిన తర్వాత.. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించలేదు. ఆమె వెంటనే అక్కడ్నుంచి బయటపడాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆమెకు మానసిక వైద్యులతో శిక్షణ ఇప్పించాలి. - అచ్యుతరావు,బాలల హక్కుల కమిషన్ సభ్యులు -
చనిపోతున్నానని బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పిందా?
న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ నటి, 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో సరికొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో సోమవారం బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మృదుల భట్కర్ వాదనలు విన్నారు. చనిపోయేరోజున ప్రత్యూష తన ప్రియుడు రాహుల్ రాజ్ కు చేసిన చివరి ఫోన్‌కాల్ రికార్డింగ్‌ను వినాలని న్యాయమూర్తి నిర్ణయించారు. చివరి ఫోన్‌కాల్ రికార్డింగ్‌లో పలు కీలకమైన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని ఈ ఫోన్‌కాల్‌లోనే ప్రత్యూష రాహుల్‌కు చెప్పిందని ఆమె లాయర్ చెప్తున్నారు. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న బాంగుర్ నగర్ పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను అందుకున్నారు. ఈ నివేదికలో కీలక అంశాలు వెలుగుచూశాయి. చనిపోయేరోజున 24 ఏళ్ల ప్రత్యూష మద్యం మత్తులో ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్టు సమాచారం. ప్రత్యూష చాలా అప్పులు చేసిందని, అప్పులవారి బాధ నుంచి తప్పించుకునేందుకు తరచూ మద్యం తాగేదని సన్నిహితులు చెప్తున్నారు. ప్రియుడు రాహుల్ రాజ్‌తోనూ తనకు సత్సంబంధాలు లేకపోవడం, తరచూ గొడవలు జరుగుతుండటంతో ఆమె ఆత్మహత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు. తన ఆత్మహత్యకు ముందురోజు రాహుల్, ప్రత్యూష తన స్నేహితులకు పార్టీ ఇచ్చారని, ఈ పార్టీకి వారి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా చనిపోయేరోజున మధ్యాహ్నం బాగా మద్యం తాగుతుండటంతో ప్రత్యూషను రాహుల్ తిట్టాడని, సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రత్యూష మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహుల్‌రాజ్‌కు బొంబాయి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యూష మృతి వ్యవహారంలో తాను అమాయకుడినని రాహుల్ చెప్తున్నాడు. -
విపత్కర పరిస్థితుల్లో బాలికలు
♦ వారి సంక్షేమానికి ఏదో ఒకటి చేయాలి ♦ పుట్టిన వెంటనే ప్రతి బాలికకూ యూనిక్ నంబర్ ఇవ్వండి ♦ ‘బేటీ పఢావో.. బేటీ బచావో’ అమలుపై వివరాలివ్వండి ♦ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: సమాజంలో ప్రస్తుతం బాలికలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమం కోసం నిర్దిష్టంగా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. బాలికల పరిస్థితి దారుణంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలిక పుట్టిన వెంటనే ఓ యూనిక్ నంబర్ కేటాయించాలని, 15-16 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ యూనిక్ నంబర్ ద్వారా ఆమె పురోగతిని పర్యవేక్షిస్తూ ఉండాలని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాలికలకు అందుతున్నాయో లేదో కూడా యూనిక్ నంబర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా బాలికలకు సముచిత న్యాయం అందించడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. గ్రామస్థాయి నుంచి ఇది అమలైతే ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉంటాయంది. దీనిపై లోతుగా ఆలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. అదే విధంగా బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ పఢావో-బేటీ బచావో పథకం అమలు తీరుపై అధ్యయనం చేసి, వివరాలను కోర్టు ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్, ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూష కేసు మరోసారి విచారణ.. ప్రత్యూషను ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల తీవ్రంగా హింసించి, ఆమె చేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా హైకోర్టు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం ఇటీవల దాన్ని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా స్పెషల్ జీపీ శరత్‌కుమార్ స్పందిస్తూ, ప్రత్యూష తల్లికి చెందిన ఫ్లాట్‌ను ప్రత్యూషకు గిఫ్ట్‌డీడ్ కింద రిజిస్టర్ చేశారని కోర్టుకు నివేదించారు. అయితే అద్దెకుంటున్న వారికి, ప్రత్యూషకు మధ్య అద్దె ఒప్పందం కుదిరేలా చూసి, అద్దె మొత్తం ప్రతినెలా ప్రత్యూష బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చూడాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యూషలాగే ఇబ్బందులు పడుతున్న బాలికల సంగతేమిటని, వారి సంక్షేమం కోసం ఏం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఏపీ ఏజీ వేణుగోపాల్ స్పందిస్తూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు ఉన్నాయని చెప్పగా, అవి గ్రామస్థాయిలో అమలు కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పథకాలు టీవీలు, పేపర్లలో కనిపిస్తే చాలదని, అవి క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించింది. -
ఫ్లాట్ ప్రత్యూషకిస్తా
అభ్యంతరం లేదంటూ హైకోర్టుకు తెలిపిన తండ్రి సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి హింసకు గురైన ప్రత్యూష కేసు మరింత పురోగతి సాధించింది. తన పేరు మీదున్న ఫ్లాట్‌ను ప్రత్యూష పేరున రిజిస్టర్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తండ్రి రమేష్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... రిజిస్ట్రేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల తీవ్రంగా హింసించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) శరత్‌కుమార్ తన వాదనలు వినిపించారు. తన పేరు మీదనున్న ఫ్లాట్‌ను ప్రత్యూష పేరున రిజిస్టర్ చేసేందుకు అంగీకరించినట్టు శరత్‌కుమార్ విన్నవించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... వెంటనే అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫ్లాట్‌పై వచ్చే అద్దె ప్రత్యూషకు అందేలా చూడాలని సూచించింది. సంక్రాంతి సెలవుల లోపు ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని శరత్‌కుమార్ ధర్మాసనానికి తెలిపారు. -
డిశ్చార్జ్ అయ్యాక హాజరుపరచండి
♦ ప్రత్యూష కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ ♦ ప్రత్యూష విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాం: ప్రభుత్వం ♦ అయితే ఆమె బాగోగులపై ఆందోళనకు బదులు దొరికినట్లే: ధర్మాసనం ♦ ఆమె తరహా బాధిత బాలికలుంటే చెప్పాలని ఏపీ సర్కారుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆస్తి కోసం సవతి తల్లి, కన్నతండ్రి హింసించడంతో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను వైద్యులు డిశ్చార్జ్ చేసిన వెంటనే తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రత్యూష తరహా బాధిత బాలికలు, యువతుల ఉదంతాలేమైనా ఉంటే తమ దృష్టికి తేవాలని, వారి విషయంలోనూ తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ వ్యాజ్యంలో ఏపీ సర్కారును కూడా ప్రతివాదిగా చేర్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ ప్రత్యూషను మరో వారంపాటు ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు చెప్పారని, అందువల్ల ఆమెను కోర్టులో హాజరుపరచలేకపోతున్నామని తెలిపారు. ప్రత్యూష విషయంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోందని, సీఎం కేసీఆర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషను పరామర్శించారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ పరామర్శ సందర్భంగా ప్రత్యూషతో సీఎం కొన్ని విషయాలు చెప్పినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని, అవన్నీ వాస్తవమని నమ్ముతున్నామని వ్యాఖ్యానించింది. పత్రికా కథనాలు నిజమేనని శరత్ చెప్పగా అయితే ప్రత్యూషను ఎక్కడికి పంపాలి.. ఆమె బాగోగులు ఎవరు చూస్తారు తదితర అంశాల్లో తమ ఆందోళనకు సమాధానం దొరికినట్లేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రత్యూష నర్సింగ్ కోర్స్ చేయాలని ఆసక్తి వెలిబుచ్చిందని...కానీ ఆమె ఇంటర్ పాస్ కానందున ఇప్పుడు నర్సింగ్ కోర్సులో చేర్చడం సాధ్యం కాదని శరత్ తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ తగిన శ్రద్ధ తీసుకుని ఇంటర్ పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంటి నుంచే ఆర్టికల్ 14 ఉల్లంఘన.. ప్రత్యూష లానే ఎవరైనా బాలికలు, యువతులు తల్లిదండ్రులు, ఇతరుల చేత హింసకు గురవుతున్న ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు మీ దృష్టికేమైనా వచ్చాయా.. అంటూ ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ‘రాజ్యాం గం ప్రసాదించిన సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14) ఉల్లంఘన ఆడపిల్లల విషయంలో మన ఇంటి నుంచే జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలపై తీవ్ర వివక్ష చూపుతున్నారు.. ఈ పరిస్థితుల్లో వారు ప్రభుత్వ హాస్టళ్లలో తలదాచుకుంటున్నారు. అయితే మీరు (ప్రభుత్వాలు) హాస్టళ్ల బాగు కోసం నిధులు ఖర్చు చేయకపోవడంతో వారు అక్కడి నుంచీ వెళ్లిపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనికి ఏజీ వేణుగోపాల్ స్పందిస్తూ ధర్మాసనం కోరిననట్లుగా వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. కాగా, ప్రత్యూష ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందంటూ ఆమెకు చికిత్స అందిస్తున్న అవేర్ గ్లోబల్ ఆసుపత్రి వైద్య బృందం సోమవారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. మరోవైపు ప్రత్యూషకు ఇప్పటివరకు దాతల నుంచి వచ్చిన రూ.1,63,650 విరాళాలను ఆమె పేరిట చెక్కు రూపంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు అందజేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. -
నేడు హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణ