
సాక్షి, హైదరాబాద్: ‘మహిళోద్ధారణ చేస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీలు చేయటం విచిత్రంగా ఉంది. 2002లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆయన సన్నిహితులు నా బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేశారు. న్యాయం కోసం మేం పోరాటం చేస్తే అధికార బలంతో ఏ ఒక్క ఆధారం లేకుండా చేశారు. అయినా సుప్రీంకోర్టులో ఒంటరి పోరాటం చేస్తున్నాను’అని 2002లో మరణించిన సినీ నటి ప్రత్యూష తల్లి పాదరాజు సరోజినీదేవి అన్నారు.
ఆమె మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి దాచేపల్లి, రిషితేశ్వరి ఘటనలు, విజయవాడలో కాల్‌మనీ గ్యాంగ్‌లు మహిళలపై అరాచకాల అనంతరం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, ర్యాలీలు చూసి కడుపు మండి మీడియాతో మాట్లాడాల్సి వస్తోందని, చంద్రబాబు హయాం అంతా మహిళలకు వ్యతిరేకమేనని సరోజినీదేవి చెప్పారు.
తన బిడ్డపై అత్యాచారం, హత్య జరిగిందని ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబును కలసి ఆధారాలు ఇచ్చినా.. వాటన్నింటినీ తారుమారు చేశారని ఆరోపించారు. ఆనాటి హత్య కేసును తిరిగి విచారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టి తన కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని సరోజినీదేవి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment